ఆరోప్రాణం

ఆరోప్రాణం – నా మూడో కథ. జులైలో కౌముదిలో వచ్చిన గడియారం నేను రాసిన మొదటి కథ. మరి రెండో కథ ఏమయ్యిందంటారా? ఎక్కడో పూడుకుపోయింది. తవ్వకాలు జరిపి బయటికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆలోగా ఈ మూడో కథ చదివి మీ అభిప్రాయం చెబితే ఆనందిస్తాను.

చదవబోయే ముందు నాలుగు ముక్కలు. నేను పెద్దగా ప్రతిభావంతుడినైన కథకుడిని కాను. కథా రచన నాకు కూసు విద్య కాదు. వ్యాసంగమూ, వ్యాపకమూ సైతం కాదు. సాహితీ సేవ కోసం నేను కథలు రాయటం లేదు. మరెందుకు రాస్తున్నాను? రాసేవాడికి చదివేవాడు లోకువన్న ఉద్దేశంతోనైతే మాత్రం కాదు. నేను కథలు రాయటం మొదలు పెట్టిన కారణం ఆ మధ్యెప్పుడో టెల్గూ స్టోరీ పేరుతో తెలుగు కథల్లో లోపించిన వైవిధ్యమ్మీద నే రువ్విన విమర్శ. దానికి కొనసాగింపుగా పర్ణశాలలో జరిగిన చర్చలో ‘ఎప్పుడూ జీవితానుభవాల్లోనుండి మాత్రమే కథలు రాయటం కాకుండా పూర్తిగా కల్పనాధారిత కథలూ రాయొచ్చుగా’ అని నేననటం, దానికి ఒకరిద్దరు వ్యాఖ్యాతలు ‘అనుభవాల్లోనుండి కాకుండా ఊహల్లోనుండీ, గాల్లోనుండీ కథలెలా ఊడిపడతాయండీ’ అంటూ సంశయం వ్యక్తం చెయ్యటం, దానికి బదులుగా నేను ‘ఐతే నేనే అలాంటిదొకటి రాసి చూపిస్తానుండండి’ అనటం .. ఇలా సరదా సవాళ్లు నడిచాయి. నా మొదటి కథ ‘గడియారం’, త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్న రెండో కథ, మరియూ ఈ ‘ఆరోప్రాణం’ మూడూ ఓ రకంగా ఆ నా సవాల్‌లోనుండి పుట్టుకొచ్చిన ప్యూర్ ఫిక్షన్ కథలే. ఇవి తెలుగు కథల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే స్థాయి రచనలనో, మరోటనో అనుకునేంత అమాయకుడిని కాను. విభిన్నత లేదంటూ ఊకదంపుడు విమర్శలతో సరిపెట్టకుండా నేను కోరుకునే తరహా విభిన్నత ఎలా ఉంటుందో నలుగురికీ తెలియజెప్పటానికి నాకు చేతనైన రీతిలో చేస్తున్న చిరు ప్రయత్నాలివి. అంతే.

చివరగా – ఈ ఆరోప్రాణం, ముందే చెప్పినట్లు పూర్తిగా ఊహాత్మక కథనం. సున్నితమైన భావావేశాలూ, సందేశాలూ, సెంటిమెంట్లూ, గుండె చెమర్చే ఫీలింగ్ .. ఇలాంటివేమీ ఉండవు. ఉంటేగింటే, వాటికి వ్యతిరేకంగానే ఉండొచ్చు. దానికి సిద్ధపడితేనే ఇది చదవండి.

కథ పిడిఎఫ్ ఫైల్ కోసం ఇక్కడ నొక్కండి.

Note: Please do not read the comments before reading the story

39 Responses to “ఆరోప్రాణం”


 1. 1 నేస్తం 8:41 సా. వద్ద అక్టోబర్ 26, 2009

  అమ్మా నేనొప్పుకోను నేనొప్పుకోను ..ఇలాంటి సినిమా ఎక్కడో చూసాను..అందులో ఒక అమ్మాయి ఇలాగే చంపేస్తుంది..రాం గోపాల్ వర్మ సినిమా అనుకుంటా..
  పోయింట్ ఒక్కటే అయినా శైలి అదిరింది ..చాలా బాగారాసారు 🙂

 2. 3 సుజాత 9:56 సా. వద్ద అక్టోబర్ 26, 2009

  ఈ సినిమా నేను చూడలేదు కానీ, ——— ఒక్క చిన్న హింటు లేకపొతే ఊహించడం కష్టమయ్యేదే! గడియారం కంటే ఈ కథే బావుంది. కథనం గడియారంకంటే మెరుగ్గా ఉంది. రెండో కథ ని త్వరగా కనిపెట్టాల్సిందిగా కోరుతున్నాం!

  ” లెదర్ పౌచ్ లో ఏముంది? తుపాకినా?” …!….

  “తుపాకా?” అంటే చాలు కదండీ! మీరేం హైద్రాబాదులో లేరుగా “వచ్చిందారా?”(వచ్చిందట్రా అనడానికి) “చేశావారా? ” టైపులో రాయడానికి!

 3. 4 VenkataRamana 10:27 సా. వద్ద అక్టోబర్ 26, 2009

  సాధారణంగానే ఉంది. పెద్ద ఆసక్తి ఏమీ కలిగించలేదు. బహుశా ‘ఎవరు’ అనే సినిమా చూసి ఉండటం వల్ల కాబోలు. కధలు వ్రాయటం నా దృష్టిలో అంత సులభం కాదు కాబట్టి , నాకు రాదు కాబట్టి రచనకు మార్కులు.

 4. 5 chavakiran 11:09 సా. వద్ద అక్టోబర్ 26, 2009

  బాగుంది.

  ఆ సినిమా నేను చూడలేదు.

 5. 7 నేస్తం 11:45 సా. వద్ద అక్టోబర్ 26, 2009

  ఒక్కోసారి మన కొచ్చిన అయిడియాలు ఎదుటివాళ్ళకు కూడా వస్తాయిలెండీ.నేనో మారు ఒక కధ రాసాను కష్టపడి.. ఒక రెండేళ్ళ తరువాత అదేమాదిరి కధ స్వాతిలో నో ప్రభలోనో పడింది ..పైగా స్టార్టింగ్ అచ్చం నా కధ మాదిరే .. 🙂 అలా మీ కధకు కూడా జరిగింది అనుకుంటా ..:)

 6. 8 వేణూ శ్రీకాంత్ 11:48 సా. వద్ద అక్టోబర్ 26, 2009

  వైవిధ్యమైన కథనం తో బాగుంది. రెండవ కథ కూడా త్వరలో వెతికి పట్టుకోండి.

  ఆ సినిమా ఏంటో మరి నాకూ తెలీదు.

 7. 9 rayraj 12:07 ఉద. వద్ద అక్టోబర్ 27, 2009

  🙂 బావుంది. చాలా సున్నితమైన స్వగతం అనిపించింది.

  మీ సవాళ్ళుకి సంబంధంగా కాదు. నాకు రాయటం చేతకాక, మీ చేత ట్రై చేయించి ఆనంద పడదామని ఉంది:) ఇటీవల జరిగిన ఓ సంఘటన గురించి నా పోస్టులో చెప్తాను. మీరు కధగా మల్చగలరేమో చూడండి.

 8. 10 కె.మహేష్ కుమార్ 12:28 ఉద. వద్ద అక్టోబర్ 27, 2009

  ఎందుకో తెలీదుగానీ,రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘డర్నా మనాహై/జరూరీహై’లోని కథలు గుర్తొచ్చాయి.

  కథలు ఎప్పటికీ గాల్లోంచీ పుట్టవు. అనుభవాల్లోంచీనే పుడతాయి. కల్పన కూడా ఆలోచనల్లోంచీ,knowledge of known నుంచే extensions గా పుడతాయి. కాబట్టి the argument stays on…

  ఈ మాట చెబుతుంటే “అంధయుగ్” అనే ధరమ్ వీర్ భారతి రాసిన హిందీ నాటకంలోని దృతరాష్ట్రుడి మాటలు గుర్తొస్తున్నాయి.
  18 రోజుల మహాభారత సంగ్రామం తరువాత నలువైపులా చావు-చీకటి-దు:ఖం తప్ప మరేమీ మిగలదు. అప్పుడు విదురుడు దృతరాష్ట్రుడితో “ఓ రాజా,ప్రపంచం తెలిసినవాడివి. ఇంత ఘోరమైన తప్పుడు నిర్ణయం ఎలా తీసుకున్నావు?” అని అడుగుతాడు.
  దానికి దృతరాష్టృడు “విదురా, నా ప్రపంచం యొక్క జ్ఞానం నా అంధత్వంలోంచీ వచ్చించి. అంధంత్వంలోంచీ వచ్చిన జ్ఞానం ప్రపంచానికి అంధకారం తప్ప మరేది తీసుకొస్తుందనుకున్నావు?” అని సమాధానం ఇస్తాడు. దానికి కొనసాగింపుగా చెబుతూ,”ఈ ప్రపంచం,వస్తువులు,మనుషులు,సత్యం,ధర్మం,న్యాయం అనేవన్నీ మీ మాటలద్వారా నాకు కలిగిన రూపంలేని చీకటి ఆలోచనలు.వాటికన్నా, భౌతికంగా నాకు తెలిసిన సత్యం నాకు అత్యంత ముఖ్యం. అదే కౌరవులు నా బిడ్డలనే పరమసత్యం.అందుకే వారికోసం ఈ చీకటి ఆలోచనల్ని త్యజించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను.” అంటాడు.

  If knowledge is born out of blindness,that will only lead to darkness. అందుకే,మన ఊహలూ ఆలోచనలు కూడా మన అనుభవానికి సంబంధించిన జ్ఞానాలు అన్నాను. You cannot imagine them out of nowhere, they are part of your previous experience of something else. You are only extending it…creatively.

 9. 11 నేనే 1:37 ఉద. వద్ద అక్టోబర్ 27, 2009

  ఇది కౌన్ సినిమా కథ. దీనికే అంత బిల్డప్పా?
  తోడుగా పది మంది భట్రాజులు జేరి చేసే భజన ఒకటి.

 10. 13 Praveen 1:57 ఉద. వద్ద అక్టోబర్ 27, 2009

  ఇంతకు ముందు నేను వ్రాసిన చెరసాల కథ గురించి మీ అభిప్రాయం చెప్పారు కదా. నేను వ్రాసిన “విమోచనం” కథ గురించి కూడా మీ అభిప్రాయం చెప్పండి. http://streevadam.co.cc/mag/node/12

 11. 16 రవి చంద్ర 5:35 ఉద. వద్ద అక్టోబర్ 27, 2009

  చాలాకాలం క్రిందట జెమిని టీవీలో ప్రసారమైన “రహస్యం” అనే సీరియల్ గుర్తొచ్చింది. అందులో ఒక అజ్ఞాత వ్యక్తి వీరభద్రుడి అవతారంలో వచ్చి తప్పు చేసిన వాళ్ళను చంపేస్తుంటాడు. కథలో ప్రధాన పాత్రధారి ఒకమ్మాయిని రేప్ చేస్తాడు. అప్పటి నుంచీ తనను వీరభద్రుడు చంపేస్తాడేమోనని అతను తెగ భయపడిపోతుంటాడు. సీరియల్ క్లైమాక్స్ లో అతనే వీరభద్రుడిగా వస్తున్నాడని తెలుస్తుంది. చివరికి అతన్ని ఆవహించిన వీరభద్రుడు నేరస్తుడెవరో చెప్పమని హుంకరిస్తాడు. అప్పుడు వాళ్ళు అతన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అతని ప్రతిబింబం చూపిస్తారు. అతని తలని అతనే నరికేసుకుని చనిపోతాడు.

 12. 17 బ్లాగాగ్ని 5:47 ఉద. వద్ద అక్టోబర్ 27, 2009

  కథనం ఫరవాలేదు. కథలో నాక్కనిపించిన పెద్ద లొసుగు, —- పాఠకుల దృష్టిని బలవంతంగా మళ్ళించటానికి చేసిన ప్రయత్నంలా ఉంది. అఫ్కోర్స్, దృశ్య మాధ్యమంలో అయితే ఈ అనుకోటాలూ అవీ లేకుండా చూపించొచ్చు కానీ కథలో కొంచెం కష్టం అనుకోండి. నాకయితే గడియారం కథే మెరుగనిపించింది (అక్కడా మొదట్లో కొంత సాగతీత ఉన్నప్పటికీ).

 13. 20 rayraj 7:55 ఉద. వద్ద అక్టోబర్ 27, 2009

  @Mahesh: That’s interesting comment though i don’t agree with it in total.

  However, అబ్రకదబ్రగారూ, I think you also might agree with :
  “You cannot imagine them out of nowhere, they are part of your previous experience of something else. You are only extending it…creatively”

  నా కర్ధమైనదాన్ని బట్టి, ఆ క్రియేటివ్ ఎక్స్‌టెన్షన్నే, అబ్రకదబ్రగారు “ఊహజనితం” అంటున్నారు. ఎందుకంటే, ఆ ఊహాజనితమైన విషయం అనుభవించిన విషయం కాదు అని. కరెక్టేనంటారా?

 14. 23 jaya 8:40 ఉద. వద్ద అక్టోబర్ 27, 2009

  అబ్బా! మీ పేరుకు తగ్గట్లే ఉందండి అబ్రకదబ్ర గారు. సస్పెన్స్ అదిరింది. మీరు సైంటిస్ట్, ఆర్టిస్ట్ మాత్రమే కాదు సైకో కిల్లర్ అని కూడా అర్ధమైపోయింది. నిజంగానే ఊహించని మలుపు చూపించారు.

 15. 24 మేధ 8:53 ఉద. వద్ద అక్టోబర్ 27, 2009

  కధ బావుంది..
  ఆ సినిమా నేను చూశా.. 🙂
  అయినా కూడా, మీ కధనం బావుంది..

 16. 25 Praveen Garlapati 11:39 ఉద. వద్ద అక్టోబర్ 27, 2009

  కథ బానే ఉంది. కానీ ఓపెనింగ్ నుండీ కథ ఎటు వైపు వెళుతోందో తెలిసిపోతూనే ఉంది.
  నేను ఇంతకు ముందు ఇలాంటి కథలు చదివి, సినిమా చూసి ఉండడం వల్లనేమో.

  కథనం మాత్రం బాగా సాగింది.

 17. 26 a2zdreams 12:04 సా. వద్ద అక్టోబర్ 27, 2009

  రెండు సార్లు చదవాల్సి వచ్చింది. ట్రిక్ చాలా చాలా బాగా ప్లే చేసారు.

 18. 27 Srinivas 12:13 సా. వద్ద అక్టోబర్ 27, 2009

  ఇలాంటి మెలికల కథలు కొత్తవి రాయడం కష్టం. మీ గడియారమూ, ఆరో ప్రాణమూ పాత కథలే. కథలు రాయడం మీద రాసిన ఏ పుస్తకంలోనయినా ఇలాంటివి వద్దు వద్దని మొత్తుకుంటూ ఉంటారు.

  మీ సవాల్ను పక్కన పెడితే మీరు మంచి కథలు రాయగలరనే నా నమ్మకం.

 19. 28 అబ్రకదబ్ర 3:42 సా. వద్ద అక్టోబర్ 27, 2009

  @నేస్తం:

  లింకిచ్చినందుకు ధన్యవాదాలు. మొత్తం చూడలేదు కానీ కొన్ని బిట్లు చూశాను. మొత్తంగా కథాంశం అర్ధమయింది. అయితే దానికీ నా కథకీ ఉన్న ఒకే పోలిక – ప్రొటాగనిస్టే కిల్లర్ కావటం. ఆ పాయింట్ ఇంకా అనేకానేక సినిమాల్లో ఉన్నదే. కథ చెప్పటంలో నేను ప్రయత్నించింది unreliable narrator పద్ధతి – సినిమాలో అది లేదనుకుంటా. I don’t think ‘Kaun’ runs in first person narrative either, as my story does. ఉత్తమ పురుషంలో ఈ రకమైన కథలు నడిపించటం సినిమాల్లో వీలు పడకపోవచ్చు.

  @సుజాత:

  హింటివ్వటం రిస్కే కానీ తప్పదు. Chekov’s gun, prefiguring, etc, etc .. తెలుసుగా. అవి లేకపోతే నేను పాఠకుల్ని మోసం చేసినట్లే. My hint, if caught in time, only gives away the ‘who’ part. You still need to read on – to figure out the ‘why’ part.

  ఇక ‘తుపాకినా’ గురించి – కిల్లరుడు అలాగే అనుకుంటాడు. నాకు చెప్పి ఉపయోగం లేదు, అతనికే చెప్పండి 😀

  @వెంకటరమణ:

  మీరూ, నేస్తం ఇద్దరూ ఒకే సినిమా తెలుగు/హిందీ వెర్షన్ల గురించి మాట్లాడారని కనుక్కున్నా. Thanks for the remark, and marks 🙂

  @టెస్టర్,చావా కిరణ్,వేణూ శ్రీకాంత్,ప్రవీణ్,రవిచంద్ర,వీవెన్,జయ,మేధ,ప్రవీణ్ గార్లపాటి,a2z

  ధన్యవాదాలు.

  @రేరాజ్:

  అంతే, అంతే. అదే నేననేది – ఊహాజనితమని.

  @మహేష్:

  తిమ్మిని బమ్మిని చేసి నీకు నచ్చిందే రైటనిపించాలనుకుంటావు కదా 😀

  @నేనే:

  yeah, yeah, whatever ..

  Thanks for dropping by.

  @వినయ్:

  అతనంతే. ఇదే మొదలు కాదు, ఇదే చివరా కాదు. పట్టించుకోకండి.

  @శ్రీనివాస్:

  ముందే చెప్పినట్లు, ఇది నేను సరదాకి చేస్తున్న ప్రయోగమే తప్ప సీరియస్‌గా కాదు. స్టోరీ రైటింగ్ గైడ్స్‌లో ఇలాంటివి వద్దంటారేమో నాకు తెలీదు, కానీ నాకెక్కువగా నచ్చేది ఇలాంటి అంతో ఇంతో సస్పెన్స్ కలిసిన కథలే. అందుకే నా టపాలో అన్నాను ‘నేను కోరుకునే విభిన్నత ఇలా ఉంటుంది’ అని.

  మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. చూద్దాం, ఎప్పటికన్నా ఓ మంచి కథ రాయలేకపోతానా.

 20. 29 కన్నగాడు 6:03 సా. వద్ద అక్టోబర్ 27, 2009

  నాకూ ఇలాంటి కథలే నచ్చుతాయి, అంతో ఇంతో ఉత్కంఠ లేదంటే మరీ చప్పగా అనిపిస్తుంది. గుడ్ అటెంప్ట్…

 21. 30 నేస్తం 1:43 ఉద. వద్ద అక్టోబర్ 28, 2009

  అబ్రకదబ్ర గారు నిజానికి నేను కౌన్ సినిమా చూడలేదు.ఒక సారి టి.వి లో లాస్ట్ సీన్ వస్తుంటే ఒక్క ముక్కలో మా చెల్లి విషయం చెప్పేసింది. అయితే మీ కధ చదువుతున్నపుడు నాకు ఆ విషయం గుర్తువచ్చి ముందుగానే సస్పెన్స్ తెలిసి పోయింది ..కాని అక్కడే ఆశక్తి మొదలైంది.. మీరు మిగిలిన పాఠకులకు సస్పెన్స్ తెలియకుండా కధ ను ఎలా పండిస్తారా అని .ఎంత బాగా రాసారంటే చక్కగా ఎక్కడా డవుట్ రాకుండా కధని భలే ముగించారు..ఒక్కసారి కాదు 4 సార్లు చదివాను.:) అయితే మీకు ఇదే పొయింట్ మీద సినిమా వచ్చిందన్న విషయం తెలియదేమో (తెలియదని పక్కాగా అనిపించింది) నేనే ముందుగా మీకు చెప్పేయాలి అని అతి ఉత్సుకత తో అలా కామెంట్స్ పెట్టాను అంతే .. 🙂

 22. 31 సుజాత 5:55 ఉద. వద్ద అక్టోబర్ 28, 2009

  రవిచంద్ర,
  నైస్ క్యాచ్! రహస్యం థీమ్ కూడా ఇదే!

 23. 32 Siva Reddy 11:52 ఉద. వద్ద అక్టోబర్ 28, 2009

  మొదటిసారి చదివినప్పుడు ఒకలాగా రెండోసారి చదివితే ఇంకోలా అనిపించే ఇలాంటి కధ తెలుగులో ఫస్ట్ టైమ్ చదివాను. రచయిత ప్రయత్నాన్ని మెచ్చుకొవాల్సింది పోయి రహస్యం, కౌన్, ఎవరు, డర్నా మనా లాంటి సినిమాలతో పోలికపెట్టటం ఫన్నీగా ఉంది. ఒక్క కధ అన్నిట్లా ఎలా అనిపిస్తుంది? ఇఫ్ యు కాన్ట్ రెసిస్ట్ కంపేరింగ్, కంపేర్ ఇట్ విత్ ‘సిక్స్త్ సెన్స్’. సిక్స్త్ సెన్స్లో లాగా ఈ కధలో కూడా ప్రతి వాక్యానికి రెండు అర్ధాలు ఉన్నాయి.. అదొక్కటే పోలిక. వెరీ ఒరిజినల్ అండ్ స్మార్ట్ నెరేషన్ ఇన్ డీడ్, నాకు బాగా నచ్చింది.

 24. 33 కామేశ్వర రావు 12:56 సా. వద్ద అక్టోబర్ 28, 2009

  అన్ని సినిమాలతో పోలికలు చెప్పి ఎవరూ అగాథా క్రిస్టీ నవల గురించి ప్రస్తావించక పోవడం ఆశ్చర్యంగా ఉంది! ఆ నవల పేరు నేనిక్కడ చెప్పను, చిన్న సస్పెన్స్ 🙂 అందులో ఇదే unreliable narrator, first person narrative, చివరికి అతనే హంతకుడని మనకి తెలియడం… అగాథా నవలలంటే నాకొకప్పుడు పిచ్చి (ఇప్పటికీ పోలేదనే అనుకుంటాను)! ఆవిడ నవలలన్నిటిలోకి నాకిది అత్యంత ఇష్టమైన నవల.

  అబ్రకదబ్రగారు, మీ కథని ఆ నవలతో పోల్చడం నా ఉద్దేశం కాదు. కాని ఇది చదివాక అది గుర్తుకు రాక తప్పింది కాదు. అది ఇక్కడ పంచుకోడం నాకు తప్పింది కాదు, అంతే! కథ విషయానికి వస్తే, ఇలాటి సస్పెన్సు కథలు కేవలం ఆ ఒకే పాయింటు మీద ఆధారపడతాయి కాబట్టి, మరి కాస్త సంక్లిష్టంగా, మరి కొన్ని ట్విష్టులతో ఉంటే బాగుంటుంది. ఇందులో తక్కువైనది అంటూ ఉంటే అదే అని నా కనిపించింది. అది అంత సులువైన విషయం కాదు. చాలా ఓపిక పరిశ్రమ అవసరమవుతాయి. ఇలాంటి వైవిధ్యమున్న కథలు మనకి కచ్చితంగా అవసరమే. ప్రయత్నమంటూ మొదలుపెట్టారు కాబట్టి మరికొంత శ్రద్ధతో ఇంకా మంచి మంచి కథలు రాయడానికి ప్రయత్నించండి. మీరు రాయగలరనే నాకు అనిపిస్తోంది.

  అన్నట్టు, కథ చదవకుండా కామెంట్లు చదవ వద్దని ఒక warning పెట్టండి.

 25. 34 Bhaavana 11:04 ఉద. వద్ద అక్టోబర్ 30, 2009

  నాకు ఆ సినిమాలు నవలలు ఏమీ తెలియవు కాని మీ కధలు మాత్రం బాగున్నాయి. చదివి నా వంటి సగటు ప్రేక్షకులు అరే బలే వుందే ఇది చాలా అరుదు గా జరిగే కాకతాళీయమా.. లేక ఏవైన శక్తులుంటాయా నిజం గానే ఇటువంటి సంఘటనలు జరగటానికి, అని కూసేపు బుర్ర గోక్కుంటు ఆలోచించి ఏదైతే ఏమి లే కధ మాత్రం చాలా బాగుంది అని అనుకుంటాము “గడియారం” చదివి,

  అవును సీరియల్ కిల్లర్ లంటే ఇలానే వుంటారు కామోసు అని విస్తు పోయి కధ బలే రాసేరే అందకుండ కందకుండా మొదటినుంచి అనుమానమే రాకుండ చాలా బాగా అల్లేరే కధ అని మెచ్చుకుంటాము “ఆరో ప్రాణం” చదివినప్పుడు. ఇంక అంతే కధ కంచికి మనం ఇంకో పుస్తకం లోకి.. 🙂
  నాకైతే రెండు చాలా బాగా నచ్చాయి.

 26. 35 saipraveen 7:01 ఉద. వద్ద నవంబర్ 5, 2009

  మీకు ప్రతిభలేదనడం మీ వినమ్రతకు చిహ్నం. కాని, సవాళ్లును ఎదుర్కొని కథను ఇంత బాగా రూపొందించడం మరియు దీనికి ఇంత మంచి స్పందన రావడం చూసిన ఎవరికైనా మీకు ప్రతిభ లేదని అనుకోరు.

 27. 37 Srinivas 10:13 ఉద. వద్ద నవంబర్ 24, 2009

  Chaala Bagundhi. Also నాగరికత

  All your stories captivated me. Please continue the good work by writing more stories like this and Naagarikatha.

  Congratualations.

 28. 38 Keshavcharan 2:49 ఉద. వద్ద జనవరి 21, 2010

  చివరి paragraph చదివిన తర్వాత ఆ italicized font లో ఎందుకు రాసారో అర్థమయ్యింది ! ‘ఇంకొంతమంది కాపు కస్తున్నారా’ అంటే కూడా వాళ్ళు పోలీసులు అని అర్థమవలేదు… మల్లి అవన్నీ ఇంకొకసారి చదివించి ఆశ్చర్యచికితుడిని చేసారు. బహు బాగుగా ఉంది.

 29. 39 Swathi 5:25 ఉద. వద్ద ఫిబ్రవరి 6, 2010

  Excellent Story.Wondefully narrated.I read it twice.When reading for the second time , I realised the beauty of your style. Every sentence was in line with what the reader thinks, but implicitly it meant something else.In fact, I analyzed each line to find some minor flaw, but your writing is flawless.I haven’t read such stories in telugu.At times I read stories in eenadu magazine but they always have monotonous themes.

  Keep writing.Congrats once for such a good story.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 293,577

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: