డిగ్రీ చదివే రోజుల్లో కాలక్షేపంగా వేసుకున్న పెయింటింగుల పుస్తకం నిన్న అనుకోకుండా తవ్వకాల్లో బయటపడింది. పేజీలు దుమ్ముకొట్టుకుని, చిరిగిపోయి దాదాపు జీర్ణావస్థలో ఉన్న ఆ పుస్తకంలోనుండి కాపాడగలిగినన్నిట్ని కాపాడి ఫోటోలు తీసి భవిష్యత్ తరాల కోసం భద్రపరిచాను. వాటిలో కొన్ని, మీకోసం. ఈ కళలో మనది ఏకలవ్య శిక్షణే కాబట్టి ఇవేమీ మాస్టరుముక్కలు కావు; కానీ మరీ అంత చెత్త చిత్రాలూ కావని నా నమ్మకం. కావున భయరహితులై , చూడండ్రి. అన్నట్టు – కింది సుందరాంగులిద్దర్లో నా మోనాలిసా ఒకరు. ఆమెవరో, ఆమే ఎందుకు మోనాలిసానో కరెష్టుగా కనిపెట్టిన షెర్లాక్‌కి వెయ్యి ఉత్తుత్తి వరహాలు.
(పాత కలాపోసనలు: మొదటిది, రెండోది, మూడోది)
బావున్నాయండీ ! ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని ఆశిస్తాను.
గ్రేట్ సార్. మీ రైటింగ్ శైలికే కాదు, మీ ఈ టాలెంట్ కు కూడా దాసోహుడ్ని చేసేటట్టు వున్నాయి. మీ వ్రాతలు, మీ టాలెంట్ జస్ట్ బ్లాగుకు మాత్రమే పరిమితం కాకుడదు అని నా కోరిక.
ఇటువంటి పోస్ట్ లు చూస్తున్నప్పుడు బ్లాగులోకంలో నేను ఒకడిని అయినందుకు గర్వంగా ఫీల్ అవుతూ వుంటాను. మొన్న దివాలీ గోల రైటప్, ఈ రోజు ఇది చాలా ఇన్‌స్పైర్ గా అనిపించాయి.
thanks for sharing with us.
కలా పోసన….hmmmm…! ఈ మాటను కూడా నా కొత్త పొస్టులో వాడుంటే బాగుండేది!
మీ చిత్రాలు చాలా బావున్నాయని ఒప్పుకోక తప్పట్లేదు. వెలుగు నీడలు బ్రహ్మాండంగా ఆవిష్కరించారు.మీ మొనాలిసా మొదటి చిత్రమే అని ఊహిస్తున్నాను! ఎందుకంటే ఆమెక్కూడా మోనాలిసాకు మల్లే కనుబొమ్మలు (సులభంగా అర్థమయ్యేందుకు…ఐబ్రోలు) లేవుగా మరి!(కానీ అసలు మోనాలిసా పోలికలేమో కింద బొమ్మలో కనిపిస్తున్నాయి..ఇదేంటి?) కరెష్టయితే నాకు ఉత్తుత్తి వరహాలు వద్దు గానీ మీ వూళ్ళో ఉన్న పాత పుస్తకాల బీరువా దయ చేయించండి! (బీరువా కాదు, పుస్తకాలు)
ఒక కొశ్చెను! ఈ కలాపోసన ఇప్పుడు కొనసాగిస్తున్నారా? లేనిచో ఎందుకు కొనసాగించట్లేదూ అని!
ఇంత బ్రహ్మాండంగా ఉంటే మాష్టరు ముక్కలుకావంటారెందుకు ?
Your Monalisa is No.1. My guess is you are “Madhuri Dixit” fan!
మీ చిత్రలేఖనం, శాన్ఫ్రాన్సిస్కో వీడియో సూపర్. క్రికెట్ బాంబు టపా కూడా చదివా.
హాస్యం తో కూడిన వ్యంగ్య వ్రాతలే కాదు చాలా ‘కళలు(శకలు) న్నాయే’ !! 😀 😀
మాష్టర్ ముక్కలకు తీసిపోవు అబ్రకదబ్ర గారు… మీరు గానీ మణిరత్నం మరియూ పీసీ శ్రీరామ్ ల వీరాభిమానా ఏంటి.
చాలా చక్కగా ప్రొఫెషనల్ ఆర్టిస్టు గీసినట్టుగా ఉన్నాయి. కంగాట్స్!!
వెంకట రమణ గారు,
“శకలు”….ఎన్ని రోజులైందో ఈ మాట విని! 🙂
అహా…ఏం వేసారండీ ! ( ఎంతబాగా వేసారనిలెండి)
ఇక మొనాలిసా ఎవరంటే……రెండొ ‘చింత్రాం’ గి కదండీ.
ఎలాగూ సుజాతగారు మొదటిదని చెప్పేరుకదా! ఎవరు గెలిచినా ఉత్తుత్తి వరహాలు సమంగా పంచేసుకుందామని అవుడియా.
చాలా బాగున్నాయి.
మీ మూడు కళాపోసనలు ఎలాగో ఇంతవరకు చూడలేదు కాని మీ వందో ఠఫాలోనో సింహవలోకనంలోనో చదివినదాన్ని బట్టి మీకు చిత్రలేఖనంలో ప్రవేశం ఉందని గుర్తుంది కాని మీరింత బాగా వేస్తారని అనుకోలేదు. మీ చిత్రాలు చూస్తుంటే నాకు నేను డ్రాయింగ్ పీరియడ్(నరకం) కష్టాలు గుర్తొచ్చింది :).
ఇక మోనాలిసా విషయానికొస్తే, నేను ఇస్మాయిల్ గారితో ఏకీభవిస్తూ మాధురీకే నా ఓటు.
చాలా బావున్నాయండీ!
Picasso, Vincent van gough, Mullapudi Bapu, Abrakadabra, MF… 😀
Picasso, Vincent van gough, Mullapudi Bapu, Abrakadabra ల సరసన ఆ చింపిరి గడ్డం ఎందుకండి?
వామ్మో మీరు మామూలు వాళ్ళు కాదండి బాబు ! If I am not wrong third one is your Monalisa.
మనసుకందని ఎన్నో భావాల్ని ఆ మూసుకున్న మీ మోనాలిసా కళ్ళల్లో చూపించారు.చాలా బావుంది.
చివరి చిత్రం “త్యాగం”. చాలా చాలా బావుంది.
బాగున్నాయి అండీ. మొదటి పిక్చర్ లో అమ్మాయి నవ్వు చాలా బాగా ప్రెజంట్ చేసేరు..
అమ్మో ఎంత బాగా వేసారో..నేను పొస్ట్ లో పై వాక్యాలు చదివి..ఆ… ఏదో వేసి ఉంటారు లే ..కాసింత ప్రోత్సహించేద్దాం అని అతి మాములుగా చూసి డంగైపోయి డింగయ్ పోయాను… సూపర్ …ఆ కలర్స్ కూడా ఎంత బాగున్నయో మొదటి బొమ్మకు 🙂
మీ మిగిలిన కళా పోషణలు అన్నీ ఇప్పుడే చూసి ఒక నిర్ణయానికి వచ్చేసాను.. మీరు సామాన్యులు కారు ..సకల కళా కోవిదులు 🙂
@SRRao,a2z,చిలమకూరు విజయమోహన్,విశ్వామిత్ర,సునీత,గోపాల్ కోడూరి,కుమార్,భావన,నేస్తం:
ధన్యవాదాలు. ఇవి నిజంగానే మాస్టరుముక్కలు కావు; వాటిలో కొన్ని లోపాలున్నాయి కాబట్టి. For eg, మొదటి బొమ్మలో కనుబొమ అంత సహజంగా రాలేదు; అలాగే కురులు కూడా.
(Btw, ఇవన్నీ వాటర్ పెయింటింగ్స్ – in case anybody thought they’re done in oils)
@సుజాత:
కారణమైతే పట్టేశారు కానీ బొమ్మని పట్టే దగ్గర కన్‌ఫ్యూజయ్యారు. మొదటమ్మాయికి అంత నల్లగా ఇండియన్ ఇంకుతో దిద్దినట్లు ఐబ్రో కనిపిస్తుంటే లేదంటారేమిటి! రెండోదే రైటు. ఐలాషెస్ లేవు కదా, అందుకు. వరహాలు రానట్లే. పుస్తకాలు ఓకే, తప్పకుండా.
గత పదేళ్లలో రెండు ఆయిల్ పెయింటింగ్స్, నాలుగైదు పెన్సిల్ స్కెచెస్ మాత్రమే వేశా. ఎప్పటికప్పుడు మళ్లీ మొదలెట్టాలనుకుంటా కానీ అది జరగట్లేదు.
@Dr.Ismail,కన్నగాడు:
మాధురి మంచి నటి, మరియు మంచి నృత్యకారిణి అన్న అభిప్రాయం తప్ప ప్రత్యేకంగా అభిమానం గట్రా ఏమీ లేవండీ.
@వెంకటరమణ:
మడిసన్నాక ఆ మాత్రం శకలుండాలి గందా.
అప్పుడెప్పుడో నేను జురాన్ మీద వాడిన మాట గుర్తుంచుకుని మరీ ఇప్పుడు నా మీద ప్రయోగించారన్నమాట. మీకూ శానా శకలున్నాయి మరి 🙂
@వేణూశ్రీకాంత్:
బాగా కనిపెట్టారు. ఒకప్పుడు పీసీ శ్రీరామ్, మధు అంబట్‌ల పనితనం నచ్చేది నాకు. మణిరత్నానికి నేను అభిమానినేమీ కాదు కానీ, ‘గీతాంజలి’ నుండి ‘బొంబాయి’ వరకూ ఆయన తీసిన సినిమాలు నచ్చాయి. అంతకు ముందువీ, ఆ తర్వాతవీ సోసో.
@లలిత:
కరెక్టే. అయితే కారణం చెప్పలేదు కాబట్టి మీకు ఐదొందలు, అది చెప్పిన సుజాత గారికి మరో ఐదొందలు.
@గీతాచార్య:
ఆపవో .. పైగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్కొహటి 😀
@శ్రావ్య:
మూడోవాడు మోనాలిసా కాడు 🙂 కానైతే మీరలా అనుకోటానిక్కారణం నాకు తెలుసు. మంచి పరిశీలన. మగ మోనాలిసా అందాం.
రెండో బొమ్మలోని అమ్మాయిని నేను పేమిత్తున్నాను. అడ్రస్ చెప్పండి.పెయింటింగ్స్ సూపరు.
అమ్మాయి బొమ్మ పద్నాలుగేళ్ల నాటిది. మీకు బోలెడు వరహీనం అవుద్దేమో? 😀
మడిసన్నాక కూసింత కలాపోసనుంటే చాలన్నాడో పెద్దాయాన..కానీ పై బొమ్మలు చూసాక కూసింత కాదు శానా కలాపోసనుందని అర్థమైంది..చివరాఖరి క్రొవొత్తి కలర్ కాంబినేషన్ కేక!!!
@అబ్రకదబ్ర : నేను వ్రాసిన వ్యాఖ్య యాదృచ్చికం గా వ్రాసిందే నండీ. మీరు వ్రాసినట్లు గుర్తులేదు. ఆ వ్యాఖ్య మాత్రం బాగా గుర్తుండిపోయింది. నచ్చింది. ఎందుకంటే మా ఊర్లో ఎవరినైనా పొగిడేటప్పుడు కొన్నిసార్లు ‘చాలా కళలున్నాయి / శకలున్నాయి’ అంటారు. అటువంటిది బ్లాగుల్లో చూసేటప్పటికి, ఇలా వ్రాశాను. ఇది నిందా-స్తుతి మాత్రమే.
I know 🙂
చాలా బాగున్నాయండీ మీరు వేసిన బొమ్మలు. ఇప్పుదు కూడా వేస్తున్నారా. దయ్చేసి ఆపకండి. చిత్ర కళ మీకు చాలా బాగా అబ్బింది. అందరికీ ఆ అదృష్టం ఉండదు. ఆధ్యాత్మిక ఉన్నతికి కళలు చాలా సులభమైన మార్గాలు. మనకు తెలియకుండానే మనల్ని సత్వ మార్గంలో నడిపిస్తాయి.
Wow!!
గుడ్డుకి ఈకలు పీకడం – అసలు మోనాలీసాకి కనుబొమలు వుండవు (కనిపించవు). మీ మోనాలీసాకి కనురెప్పల వెంట్రుకలు (ఐలాషెస్) మాత్రమే లేనిది. ఇద్దరు చిత్రాంగులకీ కనుబొమలు నిండుగానే వున్నాయిగా!
అందుకే ఇది ‘నా’ మోనాలిసా 😉
సజ్జనుండు పల్కు చల్ల గాను అన్నట్లు, వడ్డించిన విస్తరి అణగి మణగి వుంటుందన్నట్లు……ఇందుగలదందులేడని సందేహము వలదు అబ్రకదబ్ర సర్వోపగతుండు. మీరు తీసిన గోల్డెన్ గేట్ స్వర్ణ ద్వారం , సన్ ప్లవర్స్….పైంటింగ్స్ ..రియల్లీ వాఆఆవ్…..గొప్ప టాలెంట్ ప్రపంచం మిస్స్ కాకూడదు కాబట్టి …..పెయింటింగ్ అశ్రద్ధ చేయకండి.. శ్రేయోభిలాషి …….నూతక్కి రాఘవేంద్ర రావు.
రెండో చిత్రం చాలా బాగుంది.
నిఝంగా చెప్పాలంటే బ్లాగులలో ఒన్ ఆఫ్ ది బెస్ట్ థీం మీ బ్లాగుది, పాతదే బాగుంది…
ఆలస్యంగా చూస్తున్నాను.ఇంకా ఆలస్యం చేస్తే, ఫ్యానుక్లబ్బులో మొంబర్‌షిప్ కూడా దొరకదేమో!. బావున్నాయి.
Sometimes, I feel I should respond on mail..but…హు…
మీరు పియానో కూడా వాయిస్తారు అని తెలుసు. మీరు చాలా టాలెంటున్న మనిషే! బాహ్య ప్రపంచంలో కలిసినా చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారని నమ్మకం కలుగుతోంది. కొద్దికొద్దిగా టాలెంటు బయటికి తీస్తుంటారు. 🙂
కొద్దిగా జలసీగా కూడా ఉంది సుమా 🙂
ఓ మాట చెప్పండీ మీకు సినిమావాళ్ళతో దగ్గర సంబంధాలు ఏమన్నా ఉన్నయా?
పియానో కాదు, కీబోర్డు మాత్రమే – అదీ సొంత పాండిత్యమే కాబట్టి అంతంత మాత్రంగానే. చదువుకునే రోజుల్లో అయిష్టంగా మూడేళ్లపాటు వీణ వాయించటం నేర్చుకున్నా (వీణ అమ్మాయిల వాయిద్యం అన్న అభిప్రాయం అప్పట్లో ఉండటం, ఆ అయిష్టతకి కారణం).
సినిమావాళ్లతో మరీ దగ్గరి సంబంధాలేమీ లేవు. బంధువులు కొందరు ఆ ఇండస్ట్రీలో ఉన్నారు కానీ వాళ్లతో నాకు పెద్దగా కాంటాక్ట్స్ లేవు.
ఏమిటీ అబ్రకదబ్ర పియానో వాయిస్తారా? ఇక్కడ అర్జెంటుగా లెసన్సు వాంటెడ్!
@సుజాత:
బ్లాగుల్లో తరచూ కనపడడు కానీ, బ్లాగుల ద్వారా పరిచయమైన గొర్తి బ్రహ్మానందం గారు నన్ను మించిన కలాపోసకుడు. ఆయన పెయింటింగ్స్ వేస్తాడు, అద్భుతంగా వీణ వాయిస్తాడు, కథలు రాస్తాడు, సినిమాల మీద విమర్శనాత్మక వ్యాసాలు రాస్తాడు. మ్యూజిక్ లెసన్స్‌కి ఆయనే కరెక్టు.
బాగా వేశారు అంటే సరిపోదేమో ! కొనసాగించండి.
@రాజశేఖరుని,బోనగిరి:
ధన్యవాదాలు.
@కన్నగాడు:
అప్పుడు థీమ్‌తో ప్రయోగాలు చేస్తున్నా. నాకూ పాతదే నచ్చింది.
@నూతక్కి రాఘవేంద్రరావు,తాడేపల్లి:
మీ అందరి ప్రోత్సాహం చూశాక నాకూ మళ్లీ కొనసాగించాలన్న ఉత్సాహం వస్తుంది. ధన్యవాదాలు.
మరీ గెలకడం అనుకోకపోతే, మీ థీంలో మంచు వర్షం పడట్లేదు అది ఎంత లోటుగా ఉందంటే మీ బ్లాగు చూసిన మైక్రో సెకనులో గుర్తుపట్టేసా..:)
మీ బ్లాగుకి నేను ఇంతకు మునుపు ఎప్పుడో వచ్చేవుంటాను కానీ , ఇదే మొదటి సారి అనిపిస్తుంది. అనిల్ ‘రాయల్’ అనే పేరు చూసి వెనక్కి మళ్ళివుంటాను. (మనవాళ్ళ రాయల్ వాడకమ్మీద ఒక సారి నేను రాళ్ళెత్తి పోయడం జరిగిందిలెండి.)
ఇక ఈ టపా గుఱించి, wow !
మూడు పరిమాణాల (3d) ప్రపంచాన్ని, రెండు పరిమాణాల కాగితం మీదకి ఎలా ఎక్కిస్తారా జనులు అని నేను ఎప్పుడూ ఆశ్చర్యపడేవాడిని, నా కైతే జీవశాస్త్రంలో శరీరావయాల బొమ్మలు తప్ప ఇంకేం చేతకాలేదు. ఒకప్పుడు దుర్గమ్మ బొమ్మ వేద్దామనుకున్నాను. ముఖం వచ్చింది కానీ అక్కడినుండి ముందుకు వెళ్ళలేపోయాను. దుర్గమ్మ బొమ్మే వేయలేకపోతే ఇంకే వేయలేంలే అని ఆ డిపార్టుమెంటుని తెఱవకుండానే మూసేసాను. అప్పటి నుండి నా దృష్టిలో బొమ్మలు వేసేవారంటే దేవులు కాకపోయినా యక్షులు కిన్నెర స్థాయి అని అంచనా.
నాకు పోటోబ్లాగుంది. కానీ నాకు పోటోలంటే ఎందుకో అయిష్టం. ఏదో మోసం చేసినట్టుంటుంది. కానీ చిత్రలేఖనంలో యోగతత్వం వున్నట్టనిపిస్తుంది.
ఇంకో అంచనా మీరు మంచి తెలుఁగు పౌరులనిపించుకోవడానికని చెప్పి, ఏ సాప్టువేరోడి ఉద్యోగమో చేస్తున్నారనుకుంట. ప్చ్.
–
మీ గణాంకాలు చూస్తుంటే (ఏఁడాదిలో డబ్బైవేల దర్శనాలు) మీరు చాలా ప్రముఖ బ్లాగరులా వున్నారు. నా దృష్టిలో ఇన్నాళ్ళుగా పడలేదంటే ఆశ్చర్యంగా వుంది.
(నేను ఐదేళ్ళగా వుంటున్నా బ్లాగ్ప్రపంచంలో లెక్కించకోదగ్గ హిట్లేం లేవు).
రా.రా.
@రాకేశ్వరరావు:
పేరులోనే రాళ్లున్నాయి కదాని అందరి మీదా వేసేస్తే ఎలా 😉
ఆ ‘రాయల్’ నేను పొగరెక్కువై తగిలించుకున్న తోక కాదండీ. నా పేరులో నిజంగానే ఉందది. మా ఇళ్లలో అందరి పేర్లలోనూ అది తప్పనిసరి. దాని వెనకో చాంతాడంత చరిత్రుంది. ఇప్పుడదంతా ఎందుగ్గానీ, చెప్పొచ్చేదేమంటే – మీ రాళ్లు నాకు తగలవు 🙂
నా ఫొటో బ్లాగు ఇక్కడుంది. కుదిరితే ఓ లుక్కు లుక్కండి.
Btw, నన్ను మీరెగకపోయినా, మిమ్మల్ని నేనెరుగుదును. నవతరంగంలో కూడా తరచూ కనిపిస్తుంటారు కదా.
చాలా చాలా బాగున్నాయి ఈ బొమ్మలు
ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని.
కళకు పరిమితులుండవు. అది కొందరికే సాధ్యం. అది మీకు లభ్యమైనందుకు అభినందనలు…
అబ్రకదబ్ర గారూ,
అయ్య బాబోయ్,ఇవి మాస్టరు ముక్కలు కాకపోవటం ఏమిటండీ ? అసలు మీ దృష్టిలో మాస్టరు ముక్కలు అనేవి ఎలాంటివో తెలుసుకోవాలని ఉంది !
అసలు మోనాలిసకి కనుబొమలు లేకపోతె, మీ మోనాలిసకి కనురెప్పలు ఉండవా ? హహహః. నిజం చెప్పొద్దూ, మీరు చెప్పే వరకు, ఆ విషయమే తెలియలేదు ఎవరికీ. అంత అందంగా ఉందా బొమ్మ.
మీరు కుంచె మరింత పట్టుకుంటే బాగుండును.నేను అమీబా బొమ్మ తప్ప, ఏమీ వెయ్యలేను ! అందుకేనేమో మంచి చిత్రాలని చూస్తే, ఒక విచిత్రాన్ని చూసినట్టు ఉంటుంది నాకు.