‘హ్యాపీ దివాలీ’
‘ఏం కావాలీ?’
‘ఏమీ వద్దు. దివాలీ, దివాలీ .. హ్యాపీ దివాలీ బాస్’
‘అర్ధంగాలే. ఏంటిదది?’
‘దీపావళి నాయనా, దీపాల పండగ’
‘ఓ అదా. థ్యాంక్యూ, అండ్ సేమ్ టూ యూ’
‘దీపావళీ దివాలీ ఒకటేనని తెలీదా! పోజులు కాకపోతే’
‘పోజులా? ఆ కూత నేను కుయ్యాలి. అసలు పేరు తెలిసీ దివాలీ అంటూ దిక్కుమాలిన పిలుపేంటి?’
* * * *
కొన్నేళ్లుగా దీపావళి పండగ సందర్భంగా నాకు సాధారణమైపోయిన సంభాషణ ఇది. అచ్చు ఇదే కాదు కానీ, అటూ ఇటూగా అర్ధం ఇదే. దివాలీట, దివాలీ! ఆ పేరు వింటేనే నా నెత్తురు ఉడుకుతుంది, నరాలు ఉబుకుతాయి, పళ్లు పటపటలాడతాయి, కళ్లు ఎర్రెర్రబారతాయి, దవడ కండరం బిర్రబిగుసుకుంటుంది, పిడికిళ్లు మూసుకుంటాయి, ఆవేశం తన్నుకొస్తుంది, ఆగ్రహం కట్టలు తెంచుకొంటుంది …. యూ గాట్ ది పిక్చర్. చెప్పొచ్చేదేంటంటే, నాతో దివాలీ అన్నవాడికి దవడ పగల్టమే తక్కువగా – దబిడీ దిబిడీ దరువే. దివాలీ ఏంటండీ? నిండా మునిగినట్లూ, నెత్తిన గుడ్డేసుకుని కూర్చున్నట్లూ .. దిగులుగా అనిపించటం లేదూ, దిగాలు భావాలు చుట్టుముట్టటం లేదూ? (ఏంటేంటీ, లేదా? ఏం ఫర్లే. ఇకనుండీ ముడతాయి. ముట్టనివారికీ ముట్టించటమే ఈ టపా ముఖ్యోద్దేశం. రీడాన్) నా ముందుకొచ్చి ఆ పిచ్చి పేరు ఉచ్ఛరించినవారికో సుదీర్ఘ లెక్చరు దంచి జీవితమ్మీద విరక్తి కలిగించి, చివరికి చెంపలు వాయించుకుని దీపావళి, దీపావళి అని వందసార్లు అప్పజెబితే కానీ వదలన్నేను. పన్లో పనిగా పాతిక గుంజీలు తీయించి గోడకుర్చీ వేయించి రొండొందలేభయ్యారు సార్లు ఇంపోజిషను కూడా రాయిద్దామనుంటుంది కానీ నేను పంతుల్ని కాను, సదరు దివాలీవాలాలు నా దగ్గర సదూకునే సత్రకాయలూ కారు కాబట్టి అంతటితో క్షమించి వదిలేస్తాను.
అసలు మనోళ్లకీ పేర్లని పచ్చడి చేసేసే పిచ్చేమిటో, పర్వదినాలనీ వేలంవెర్రికి బలిచెయ్యటమేమిటో! దీపావళి అన్న పేరుకెంత అందమైన అర్ధముంది? తెల్లోడికి నోరు తిరక్క దాన్ని దివాలా తీయిస్తే, తిన్నదరక్క ఫ్యాషన్ పేరుతో దాన్నే మనమూ చంకనెక్కించుకోవాలా? పది పదిహేనేళ్ల కిందటి దాకా ఉత్తరాదివాసుల నోళ్లలోనే ఈ దరిద్రప్పేరు ఎక్కువగా నానేది. ఇప్పుడు తెలుగోళ్లకీ జిడ్డులా అంటుకుని ఊరూరా వైరస్‌లా పాకేసింది. ఓ పక్క కాశీని కాషీ, శివని షివ అంటూ ఖూనీ చేసేస్తూ మరోపక్క బాలూ హిందీ ఉచ్ఛారణకి వంకలెట్టే ఉభాకులతో ఈ విషయంలో నేను చాలాసార్లు వాదులాటేసుకున్నాను – అది వేరే కథ. ఏదేమైనా, అది వాళ్ల పైత్యం. దాన్ని మనం వంటబట్టించుకోటానికి ఉవ్విళ్లూరటం చోద్యం.
‘దీపావళి శుభాకాంక్షలు’ అంటూ అంతా తెలుగులోనే వెలగబెట్టమనేంత చాదస్తం నాకు లేదు. కాలానికి తగ్గట్లు ఆంగ్లంలోనే అఘోరిద్దాం. ‘హ్యాపీ దీపావళి’ అంటే అంతో ఇంతో ప్రాస కూడా కలిసి ఎంత చక్కగా ఉంది? ‘హ్యాపీ దివాలీ’ ఏంటి. దివ్యంగా దివాలా తియ్యమనా? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లు లేదూ? తెలుగోళ్ల ఈ అనుకరణాభిలాష దీపావళికే పరిమితం కాలేదు. ‘దషమి’/’దషరా’ దగ్గర్నుండి సంక్రాంతి దాకా పాకిందది. ఈ మధ్య ఎవర్ని చూసినా ‘హ్యేపీ పొంగల్’ అనేవాళ్లే. ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అన్న ముక్క విని ఎన్నేళ్లయిందో. నాకు తెలిసిన తమిళుడెవడూ ‘హ్యాపీ సంక్రాంతి’ అనడు. ఈ పొంగల్ పిచ్చి మనకెందుకో మరి!
ఆల్రెడీ దీపావళి అంటే అర్ధం తెలీని తరం పుట్టుకొచ్చింది. ఆ పేరెందుకొచ్చిందో తెలీటం తర్వాత సంగతి, ఆ పండగ వెనకున్న కథ కూడా తెలీకుండా పోతుంది కొందరికి. రాముడు పద్నాలుగేళ్ల వనవాసానంతరం అయోధ్యకి తిరిగొచ్చిన రోజుగా దీపావళిని గుర్తించటం ఉత్తరాది హిందూ సంప్రదాయం. నరకాసుర వధ తర్వాతి రోజు దీపావళిగా జరుపుకోటం దక్షిణాది ఆచారం. ఇప్పుడా తేడా చెరిగిపోయి రాముడి కథే ఇక్కడా ప్రాచుర్యంలోకొస్తుండటం మన ఆచారాలపై ఉత్తరాది ప్రభావానికి దర్పణం; వెరసి మన దౌర్భాగ్యం. పదుగురి పద్ధతులూ తెలుసుకోవాల్సిందే, వాటిని గౌరవించాల్సిందే. అయితే మనవైన సంస్కృతీ, సంప్రదాయాలూ అటకెక్కించి పొలోమంటూ పొరుగువారివి నెత్తినెక్కించుకుని ఊరేగాలా? చెప్పండి.
హా.. మన వాళ్ళ “పొరుగింటి పుల్ల కూర రుచి” గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే…
శివ ని షివ గా మార్చడం కంటే మించిపోయారు మనవాళ్ళు.. మొన్న వంశీ అన్న పేరుని యాంకరమ్మ వంషీ అని ఎంతో అందంగా పిలిచింది, దెబ్బకి నాకు పొలమారింది.. ఇదేం పిలుపు భగవంతుడా అనిపించింది..
హ హ భలే… అసలు దివాలీ గా ఎందుకు దివాలా తీసిందో నాకు అస్సలు అర్ధంకాదు. అన్నట్లు మొన్నీ మధ్య ఏదో హిందీ ఛానల్ యాడ్ లో “ఇస్ దీపావళి సీజన్…” అని విని ఆహా అనుకున్నాను. మన వాళ్ళు కూడా మెల్లగా మారతారు లెండి.
మంచి టపా వ్రాశారు.
దీపావళి శుభాకాంక్షలు అని చెబితే చాదస్తం ఏంకాదు. ముందుకు వెళ్ళటమంటే భాషను వదిలేయమనా! కొంతమందికి నాటకీయంగా అనిపించినా పట్టించుకోకుండా అంటే అదే అలవాటవుతుంది.
ఇటువంటి వాటి గురించి నాకు, మా స్నేహితులకు ఎప్పుడూ వాదన జరుగుతూ ఉంటుంది.
దీవాలీ, పొంగలే కాదండీ, ఈ మధ్య “దుర్గా పూజ” కూడా ఫ్యాషను. దసరా అనకూడదు. అంటే ఫ్యాక్షను!
>>‘దీపావళి శుభాకాంక్షలు’ అంటూ అంతా తెలుగులోనే వెలగబెట్టమనేంత చాదస్తం నాకు లేదు.
నాకు పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. కళ్ళు నానా పటేకర్ కళ్ళలా ఎర్రగా అవుతున్నాయ్!దవడ కండరమూ తన పని తను చేసుకుపోతూంది….తెలుగును చాదస్తం అనకండి.
“ఆ పేరు వింటేనే నా నెత్తురు ఉడుకుతుంది, నరాలు ఉబుకుతాయి, పళ్లు పటపటలాడతాయి, కళ్లు ఎర్రెర్రబారతాయి, దవడ కండరం బిర్రబిగుసుకుంటుంది, పిడికిళ్లు మూసుకుంటాయి, ఆవేశం తన్నుకొస్తుంది, ఆగ్రహం కట్టలు తెంచుకొంటుంది ..”
మొత్తానికి తెలుగు నవలా నాయకుడి లక్షణాలన్నీ రాసేసి హీరో అనిపించుకున్నారు .. సరే ,మీ ముచ్చట ఎందుకు కాదనాలి చెప్పండి ..
హేపీ దివాలి సార్ 🙂
ఇదేముందండీ బాబు, కొంతమంది మాట్లాడేటప్పుడు వాఖ్యం చివరికొచ్చే సరికి పదాల్లో అక్షరాలు అటుఇటుగా పలికేస్తున్నారు, అలాకాదురా అంటే విషయం అర్థమయ్యిందా లేదా అని తిరిగి కొడుతున్నారు. ప్చ్….:(
నేను మాత్రం దసరా అనే అంటాను, చిన్నప్పటి నుండి అలాగే తెలుసు మావైపందరు అలాగే అంటారు.
హిందీలో దీపావళిని ‘దివాలీ’అనే అంటారు. దక్షిణాభారతీయులకన్నా ఉత్తరభారతీయులకు దీపావళి అతిముఖ్యమైన పండగ. దక్షిణభారతీయులు నరకాసురవధను celebrate చెయ్యడానికి దీపావళి చేస్తే, ఉత్తరభారతీయులు రాముడు అయోధ్యకు తిరిగిరావటంగా దివాలీని జరుపుకుంటారు. సాంస్కృతికంగా ఈ పండగలో వీళ్ళు బట్టలు,నగలు ఇతరత్రావాటిపై ఎక్కువ ఖర్చు చేస్తారు. ఈ అవకాశాన్ని మార్కెట్ చేసుకునే అన్ని వ్యాపారాలూ “దివాలీ” అనే పదాన్ని దేశవ్యాప్తంగా వెదజల్లేసారు. కాబట్టి మన దీపావళి కాస్తా చాలా మందికి దివాలీ అయిపోయింది. I don’t see anything wrong with it…any way HAPPY DIWALI-DEEPAWALI !
>> “హిందీలో దీపావళిని ‘దివాలీ’అనే అంటారు” …. I don’t see anything wrong with it.
I don’t think so Mahesh. ‘Deepavali’ is a Sanskrit term that means row of lights, and ‘Diwali’ is an obvious corruption of it. The fact that Hindi folks prefer the altered form doesn’t automatically make it right.
why do we have to be “purists” here? if north Indians call it DIWALI then it is diwali thats all. భాష మాట్లాడేవారిదేగానీ, దాని మూలానిది కాదు.
ఈ దివాలీ/పొంగల్ గొడవ నేను మా ఆఫీసులో ప్రతి సంవత్సరం పడుతూనే ఉన్నాను. నాకు కాస్త చనువున్న ఉన్నవాళ్ళు అలా విష్ చేస్తే దివాళీ ఎంట్రా నివాళి లాగా అని చిరాకుపడేవాడ్ని. కానీ నాకన్నా పెద్దవాళ్ళో, లేకపోతే నాకు ఎన్ని గింజలు కొలవాలో నిర్ణయించే మేనేజర్లో అయితే అలా చిరాకు ప్రదర్శించలేక, వాళ్ళు “హ్యాపీ దివాళీ” అంటే నేను “సేమ్ టుయూ” అనకుండా “హ్యాపీ దీపావళి” అనటం మొదలుపెట్టాను. మా తమిళ మేనేజర్ “హ్యాపీ పొంగల్” అంటే నేను తిరిగి “హ్యాపీ సంక్రాంతి” అని విష్ చేయటం మొదలుపెట్టాను. నాతో వేగలేక ఇప్పుడు వాళ్ళే గుర్తుపెట్టుకుని విష్ చేస్తున్నారు.
hmm…idedo bagund kanundi nenu kuda ilage cheyalanukuntunnanu….thanxandi manch salaha icchinanduku…
“దీపావళి శుభాకాంక్షలు” అని చెప్పడం చాదస్తం ఏంటండి? ఆంగ్ల భాష అనుకరణ కూడా ఒక రకంగా మీరు చెప్పిన ఆ ఉత్తరాదివార్ని అనుకరించడం లాంటిదేనూ.. ఏమైతేనేం, పోస్టు మాత్రం అమోఘంగా రాశారు! 🙂
నాకసలు పండగలకు శుభాకాంక్షలు చెప్పడమే కృతకంగా కనపడుతుంది. పండగ అంటే పండగే! అది మన వ్యక్తిగతం కాదు కదా “హాపీ బర్త్ డే” అనో,”హాపీ యానివర్సరీ” అనో చెప్పడానికి!నాకొచ్చే శుభాకాంక్షల గ్రీటింగులకీ, ఎస్సెమ్మెస్ లకీ రెస్పాండ్ కూడా అవను.
మా పొరుగింటావిడ దసరాల్లో “హాపీ దుర్గా పూజ”అని చెప్తే తెల్లబోయాను.
దివాలీ అంటే నాక్కూడా “లీ” బదులు “లా” నే వినపడుతుంది.
భాష గురించా….నేనేమీ చెప్పను! రాసి చూపిస్తాను.
రవి గారూ,
అయితే షాడో ఆవహించేశాడన్నమాట….!
interesting :)hmm i agree to it.
దీపావళి జిందాబార్ …
దివాలీ డౌన్ డౌన్….
🙂 🙂
baaga frustrated ga vunnattu vunav…:P
‘దీపావళి శుభాకాంక్షలు’
బాగా రాసారండి. కేకో కేకో !! దీపావళి శుభాకాంక్షలు 🙂
మా ఇంట్లో కూడా ఈ దీవాలిలు పొంగల్లు పడవు! ఎందుకనో మన తెలుగు వాళ్లకే ఈ అనుకరింపు జబ్బు ఎక్కువ.
అయినా సుజాతగారన్నట్లు అసలు పండగలకి శుభాకాంక్షలు చెప్పటమేమిటి??
@చైతన్య కృష్ణ, మీ పద్దతి బాగుంది.
భలే రాసారులెండి.
మరి దీపావళి వెళ్ళిన వెంటనే నాగులచవితి వస్తుందికదా! దాన్నేమని విష్ చేస్తారో తెల్సుకోవాలనుంది.
సుజాతగారూ, వరూధినిగారూ…. హేపీ దిపావళి అండోయ్.
సుజాత గారు,
షాడో ఆవహిస్తే అలా ఉండదు. ఇలా ఉంటుంది.
అప్రయత్నంగా బిగుసుకున్నాయి షాడో పిడికిళ్ళు.కళ్ళు ఎరుపు రంగు జీరల్ని పులుముకున్నాయి. గుండెలు జలదరింపజేసేలా, నాభి దగ్గర నుండీ వెలువడింది, కుంగ్ ఫూ షౌట్.
…
…
“తీర్చుకుంటాను ఫ్రెండ్, నీ ఈ స్థితికి కారణమైన వారిని ఇంతకంటే దారుణమైన చావుకు గురి చేసి తప్ప విశ్రమించను.” మృదువుగా బుగ్గల్ని తడుతూ చెప్పి, కళ్ళను మూశేసాడు షాడో.
అబ్రకదబ్ర గారు, పిడకలవేటకు క్షమాపణలు.
🙂 🙂
రవి గారు.. షాడో ని దింపేశారు 🙂 ).
🙂 చాలా బాగుంది. చక్కగానూ, చమత్కారంగానూ రాశారు. ఎంతమంది దివాలీ అనడం మానేస్తారో చూడాలి.
చాల బాగా రాసారు….అభినందనలు
ఆంగ్లంలోనే అఘోరించడం ఎందుకెండి ..చాదస్తం అనకండి..చక్కగా తెలుగు లో నే చెప్పుకుందాం..
అందరికి దీపావళి శుభాకాంక్షలు
రవి గారూ,
కత్తి! కేక!
నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లు లేదూ?… అచ్చం అలాగే అనిపిస్తుంది దివాలీ అంటె !!!
ఈ ఉఛ్ఛారణ సంకరం మనకి నార్త్ నుండే దాపురించింది.
తెలుగులో (ఆ మాటకొస్తే హిందీలో కూడా ) “స”, “శ”, “ష” అనే మూడు రకాల సకారాలలో మధ్య “శ” ని తుడిచిపెట్టేసింది వీళ్ళే! రమేశ్ ని రమేష్ అనీ, సురేశ్ ని సురేష్ అనీ, శశిని, షషీ లేదా శషీ అనీ, శంకరాభరణాన్ని, షంకరాభరణమనీ పలికే తెలుగు వాళ్ళు చాలామందే ఉన్నారు. అలా మాట్లాడడం గొప్పనీ ఫీలయ్యే జనాభాని నిత్యమూ చూస్తూనే ఉంటాము. ఎలాగయినా పలకచ్చు అనుకునేవాళ్ళని పట్టించుకోకుండా మనం చేయగలిగింది చేయడమే! మనకి మన సంస్కృతన్నా, భాషన్నా చులకన. మీరెవరూ తెలుగు టీవీలు చూడరల్లే వుంది. ఆ మధ్య ఓ యాంకరమ్మ వువాచ – “పెల్లంటే నూరేల్ల పంట” అని. భాషా సంకరాన్ని చూస్తూ ఏం చెయ్యలేకపోతున్నాం, టీవీ కట్టేయడం తప్ప.
“దివాలీ” అనీ, “దీపావళీ” అని ఎలా పలికితేనేమిటి, శుభాకాంక్షలు చెప్పడం ముఖ్యం అనే వాళ్ళకి “సేమ్ టూ యూ” అని చక్కగా చెప్పేయడమే!
-సాయి బ్రహ్మానందం
లేదా ‘షేమ్ టూ యూ’ అని వాళ్ల ష్టయిల్లోనే చెబితే మరింత రంజుగా ఉండును 😀
బ్రహ్మానందం గారు చాలా బాగా అన్నారు. అది ఉత్తర భారతీయుల, ముఖ్యంగా బీహారీల ఉచ్చారణా దోషం. ఇక్కడ మా ఆఫీసులో బీహారీల ఉచ్చారణ గమనించిన తర్వాత అర్థమయ్యింది. ఓ బీహారీ, తెలుగబ్బాయితో మాట్లాడినప్పుడు దొర్లిన ఓ మాట ఇలా ఉంది.
“వాశూ, కం, కం అండ్ షిట్ హియర్”. ఇది నిజంగా ఓ సారి జరిగింది.
అలహాబాద్ లాంటి చోట్ల శుధ్ధ హిందీ మాట్లాడేవాళ్ళు శుభ్ దీపావలీ అనే అంటారు.
కనీసం వ్రాసేటప్పుడు అలాగే వ్రాస్తారు.
ఒకో ప్రాంతానికి ఒకో యాస ఉంటుంది. దానిని గేలి చేయడం అనవసరం.
మన తెలుగు వాళ్ళలో సత్యనారాయణ అని స్పష్టంగా ఎవరైనా అంటారా?
అందరూ సచ్యనారాయణ అనే అంటారు.
ఆదిత్య అనడానికి ఆదిచ్య అంటారు.
కావాలంటే పలికి చూడండి.
అసలు హిందీ లో మన ‘శ ‘, ‘ళ ‘ లకు సమాన అక్షరాలు లేవు. కాబట్టి వాళ్ళు ఎలా ఐనా అనుకోవచ్చు. మనకు శుభ్రంగా ఉన్నాయిగా అన్నీ, మనమెందుకు షాంతి, వమ్షి లేక కల(కళ) అనాలి? మా ఫ్రెండు ఒక అమ్మాయి తనపేరు షైలజ అని చెప్పేది. మేము చేసేదిలేక అలానే పిలిచేవాళ్ళం.
హిందీలో శ, స, ష మూడూ ఉన్నాయండి.
మీ పోస్ట్ తో డిఫరెన్స్ తెలుసుకున్న నేను, దివాలీ కాదు దీపావళి అని ఈ-మెయిల్స్ లో కనీసం ఒక పది మందికి చెప్పి వుంటాను..
@a2z:
ఆ పది మంది మరో పదిమందికి .. glad my tiny effort isn’t in vain. Thank you.
కొన్నాళ్ళు పొతే తెలుగు లో “ణ”, “ళ” అనే అక్షరాలూ ఉండేవి అని అనుకోవాల్సి వస్తుందేమో ఈ వరస చూస్తుంటే. టీవీల్లో ఏంకర్లు, సినిమాల్లో డబ్బింగ్ వాళ్ళు, పాటలు పాడే వాళ్ళు ఎవరూ కూడా ఈ అక్షరాలని పట్టించుకోవడం బాగా తగ్గించారు.
ఇక దీపావళి విషయానికి వస్తే, మొన్న మా ఆఫీసు లో పండుగ పేరిట ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమ ఆహ్వానాన్ని, మొత్తం కమ్యూనికేషన్‌ని, “దీపావళి” గానే నడిపించాము. తెలుగు వాళ్ళు, తమిళం వాళ్ళు మామూలుగానే హ్యాపీ, నార్త్ వాళ్ళకి కూడా “ఇదిరా సంగతి నాయనా” అని చెబితే ఒప్పుకున్నారు (దీపావళి ప్రతిపదార్ధం వివరించాము). పని లో పని అమెరికన్స్ కూడా ఈ పండగని దీపావళి గానే గుర్తించారు, కష్టపడి అనడం కూడా నేర్చుకున్నారు. మా చిన్న ఊరిలో చిన్ని ప్రయత్నం.