తారలెంతగా మెరిసేనో

రేడియోలు రాజ్యమేలిన కాలంలో, వేసవి రాత్రులు వీధిలో మంచమేసుకు పడుకుని నీలాకాశంలో చుక్కల్లెక్కబెట్టే పనిలో మునిగి తేల్తుండగా దూరం నుండి పిల్లగాలి తెమ్మెర తెరలు తెరలుగా మోసుకొచ్చే మహమ్మద్ రఫీ మంద్రమైన మధుర గానం – గుర్తుందా? సైనికుల కోసం ప్రత్యేకించిన ఆకాశవాణి జనరంజని కార్యక్రమంలో సిపాహీ సర్వజిత్ సింగ్, హవల్దార్ హర్జిత్ సింగ్ తతిమ్మా సైనిక శ్రోతలడిగే పాటల్లో నూటికి తొంభై రఫీ లేదా కిశోర్ పాటలే ఉండటం అప్పట్లో నాకు వింతనిపించేది. వాళ్లిద్దరూ కాక హిందీలో గాయకులే లేరా అనుకునేవాణ్ణి. ఆ ప్రశ్నకి తర్వాతెప్పుడో సమాధానం దొరికిందనుకోండి. ప్రస్తుతం నేను చెప్పదలచుకుంది, రఫీ పాటలతో నాకు పరిచయం ఎలా అయిందనే విషయం మాత్రమే. అలా అయిన పరిచయం కాలక్రమంలో ఆయన పాడిన పాతికవేల పైచిలుకు పాటల్లో ఐదారొందల అద్భుత గీతాలు సేకరించి పెట్టుకునేవరకూ దారితీసింది.

కిశోర్, రఫీ ఇద్దరూ ఇద్దరే ఐనా నాకెందుకో రఫీ పాటలంటేనే కొంత ఎక్కువ ఇష్టం. బహుశా నా అభిమాన గాయకుడు ఎస్పీబీ మీద రఫీ ప్రభావం వుండటం దానిక్కారణమేమో. రఫీ తెలుగులో పాడిన పాటల్లో నాకు బాగా నచ్చినవి రెండు. రెండూ ‘అక్బర్ సలీం అనార్కలి’ చిత్రంలోనివే. వాటిలో ఒకటి ‘తారలెంతగా మెరిసేనో’ కాగా రెండవది ‘తానే మేలిముసుగు తీసి’. ఇవి కాక ఆయన తెలుగులో పాడినవి మరో పదిహేను దాకా ఉన్నాయనుకోండి, కానీ వాటిలో ఎక్కువ హిందీ స్వరాలకి తెలుగు అనుకరణలు కావటం వల్లో, లేదా ఆయన తెలుగుని ఖూనీ చేస్తూ పాడటం వల్లో మొత్తమ్మీద నా దృష్టిలో అవి సోసో.

ఈ మధ్య పాత హిట్ పాటల్ని నేటి తరం గాయకులతో మళ్లీ పాడించి కొత్త సినిమాల్లో వాడుకునే ప్రయోగాలు మొదలయ్యాయి కదా. ఆ పరంపరలో ఎవరన్నా ‘తారలెంతగా మెరిసేనో’ని సోనూ నిగమ్‌తో పాడించి (బాలూ కన్నా ఇతని మీద రఫీ ప్రభావం మరింత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది గమనించారా?) ఏ జూనియర్ ఎన్టీయార్ సినిమాలోనో వాడతారేమోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా నేను. అదటుంచితే – నాలుగైదు రోజుల కిందట యూట్యూబ్‌లో యధాలాపంగా ‘తారలెంతగా మెరిసేనో’ వీడియో నా కంటపడింది. దాన్ని మీతో పంచుకునేందుకే ఈ టపా. టీనేజ్ బాలకృష్ణ ఎంత చక్కగా ఉన్నాడో చూడండి (ఆ విగ్గు మాత్రం .. షరా మామూలే. విగ్గుల పిచ్చి అప్పట్నుండే ఉందన్నమాట!) ఆసక్తి కలవారి కోసం పాట సాహిత్యం, ఇతర వివరాలు – కింద.

చిత్రం: అక్బర్-సలీం-అనార్కలి  దర్శకుడు: ఎన్టీయార్  సంగీతం: సి.రామచంద్ర  సాహిత్యం: సి.నారాయణరెడ్డి

సాకీ:
ఏ మాయని గురుతు కోసం ఈ గాయం కలవరించెనో
ఏ తీయని వలపు కోసం ఈ గేయం పలవరించెనో

పల్లవి:
తారలెంతగా మెరిసేనో చందురుని కోసం
రేయి ఎంతగా మురిసేనో దినకరుని కోసం

చరణం:
చిగురుటాకులే చేతులుగా
మిసిమి రేకులే పెదవులుగా
పరిమళాలే పిలుపులుగా
మకరందాలే వలపులుగా
పూవులెంతగా వేచేనో తుమ్మెదల కోసం

చరణం:
నింగి రంగులే కన్నుల దాచి
కడలి పొంగులే ఎదలో దాచి
గులాబి కళలే బుగ్గల దాచి
మెరుపుల అలలే మేనిలో దాచి
పరువాలెంతగా వేచేనో పయ్యెదల కోసం

ఈ పాటకి రెండు వెర్షన్లు ఉన్నట్లున్నాయి. రెంటిలోనూ సాహిత్యం ఒకటే అయినా, సినిమాలో వాడిన పాటకీ ఆడియో రికార్డుల్లో విడుదలైన పాటకీ చిన్న చిన్న తేడాలున్నట్లు నాకనిపించింది. ఆడియో వెర్షన్ కూడా లంకె ఇస్తున్నాను.

Audio Version

14 స్పందనలు to “తారలెంతగా మెరిసేనో”


 1. 1 నేస్తం 6:39 సా. వద్ద సెప్టెంబర్ 11, 2009

  తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏంచేయను ..అబ్బా ఈ సాంగ్ అంటే నాకెంత ఇష్టమంటే రేడియోలో వచ్చినపుడు ఎక్కడున్నా పరిగెట్టుకుని వచ్చి వినేదాన్ని..రఫీ పాటలు ఇలా ముస్లిం కేరక్టర్స్ వేసిన వాళ్ళకు తప్ప మాములు పాత్రలకు సరిపోదనిపిస్తుంది , నా మది నిన్ను పిలిచింది గానమై పాటకూడా వినడానికి బాగానే అనిపించినా ఎంటీఆర్ కి నప్పలేదనిపించింది … కాని ఇప్పుడు ‘వెరైటీ కదా’ అలా నప్పని గొంతులతొ హీరోలకు పాడించడం 🙂 మంచి పాటను మళ్ళి గుర్తుకు తెచ్చారు

 2. 2 సుజాత 10:34 సా. వద్ద సెప్టెంబర్ 11, 2009

  ఈ రెండు పాటలూ రఫీ నొక్కి నొక్కి కాకుండా హాయిగా పాడాడు. హీరో బాలకృష్ణ కాదని తెలిస్తే ఇంకా బాగా ఎంజాయ్ చెయ్యవచ్చు! తానే మేలి ముసుగు పాట అద్భుతం! “జవ్వని”అనే పదాన్ని అంత భావయుక్తంగా పలకడం రఫీకి ఎలా సాధ్యమైందబ్బా అని ఆశ్చర్య పడుతుంటాను!

  ఈ తారెలంతగా, తానే మేలి ముసుగు..తో పాటు సిపాయీ పాట కూడా నా ప్లేయర్ లో ఎప్పుడూ గింగురుమనే పాటలు.

  ఈ పాటలకు ఇంత మాధుర్యం అబ్బడానికి సి.రామచంద్ర సంగీతం కూడా అనేది విస్మరించకూడదు

  మంచిపాటలు గుర్తు చేశారు.

  • 3 kamal 4:08 ఉద. వద్ద నవంబర్ 15, 2009

   బాలకృష్ణ కాదని తెలిస్తే ఇంకా బాగా ఎంజాయి చేయొచ్చా..? బహుశ ఇప్పటి బాలకృష్ణ ని చూసి అప్పటికాలానికిమీరు అన్వయించుకుంటే అది మీ పొరబాటే..! ఆపాటలో బాలకృష్ణ చాలా అందంగా ఉన్నాడు, అది కాక అప్పట్లో ఇంక తండ్రి చాటు పిల్లాడు కాబట్టి నటన, అభినయం అన్నీ వారి నాన్నగారి దర్శకత్వం లో కావున ఆయన ప్రభావం చాలా ఉంటుంది. ఆ పాటకు తగ్గట్లు అభినయించాడు బాలకృష్ణ..! అందులోను అప్పటి కాలపు సినిమా కాబట్టి. అప్పటి కాలానుగుణంగా ఉంటాయి అభినయాలు, మేక అప్, ఇంకా కెమరా పనితనం అప్పటివి ఇప్పటి కాలనికి అన్వయించుకొని చూస్తే ఎలా..? ఇప్పుడు పెరిగినా టెక్నాలజీ అన్ని మనం చూసాం గనుక అప్పటివి మనకంతగా నప్పవు.అప్పటివి ఇప్పటి టెక్నాలజి పోల్చకండి..

  • 4 గీతాచార్య 12:03 సా. వద్ద నవంబర్ 17, 2009

   మరీ ఇంత మంది బాలకృష్ణ ఫాన్సా? My!!! Me too. అమ్దుకే చాలా మంచి పాటల్ని ఆయన గారి వల్ల వదిలేయాల్సి వచ్చింది.

 3. 5 rayraj 11:41 సా. వద్ద సెప్టెంబర్ 11, 2009

  Offtrack:
  >> “బాలూ కన్నా ఇతని మీద రఫీ ప్రభావం మరింత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది గమనించారా?””

  కాపీరైట్లు తుంగలో తొక్కి, హిందీ పాటలన్నీ తిరిగిపాడించి జీవింపచేసి, ఇప్పుడు పెద్ద మ్యూజిక్ కంపెనీగా చెలామణీ అయిపోతున్న కంపెనీకి – ఆ ఫేక్ క్యాసెట్ల తయారీలోని గాయకుడు “సోనూ నిగమ్”. అది రఫీ గొంతుగానే చెలామణి అయిపోయినంత “ప్రభావం” అన్నమాట.

  ఓ ఇంటర్వ్యూలో “మీడియోక్రసీ హాస్ సెట్ ఇన్…బట్ ఐ యామ్ హోప్‌ఫుల్ మెరిట్ విల్ గెట్ ఇట్స్ ప్లేస్” అని అన్నరోజు చాలా బాధేసింది. చాలా గొప్ప టాలెంటున్న మనిషి వీడు. కాకపోతే, తొందరగా బర్న్ ఔటైపోయినట్టు. చేసినదానికన్నా ఇంకా ఏం చెయ్యాలో గుర్తించలేక, అవకాశాలు సృష్టించుకోలేక “ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెమ్ట్” స్టేజిలో బతుకుతున్నాడు పాపం. ప్చ్! వాడిని వాడుకోదగ్గ ఇతర సంగీతఙ్ఞులూ లేక, ఇప్పుడు రొటీన్ ఐపోయాడు.

 4. 6 సాయి బ్రహ్మానందం 1:06 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2009

  “నీకై ఎంత ఎంత వేచి వున్నానో, ఈ వాలు కనలనడుగు చెబుతాయి” – “చిరుగాలిలో కురులూగితే నీ చేయి తాకెననుకున్నా” వంటి చక్కటి కవిత్వం ఈ పాటలో కనిపిస్తుంది.

 5. 7 సాయి బ్రహ్మానందం 1:07 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2009

  ఇదే సినిమాలో “సిపాయీ, ఓ సిపాయీ” – పాట కూడా చాలా బావుంటుంది.

  “నీకై ఎంత ఎంత వేచి వున్నానో, ఈ వాలు కనలనడుగు చెబుతాయి” – “చిరుగాలిలో కురులూగితే నీ చేయి తాకెననుకున్నా” వంటి చక్కటి కవిత్వం ఈ పాటలో కనిపిస్తుంది.

 6. 8 sunita 2:49 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2009

  మనసెక్కడికో వెళ్ళిపొఇంది. “తానే మేలిముసుగు తీసి”నా టాప్ టెన్ లో ఒకటి.

 7. 9 chinni 6:19 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2009

  మంచి పాట,వినేకొద్ది వినాలనిపిస్తుంది ….మంచి జ్ఞాపకం

 8. 10 usha 8:26 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2009

  nice to recall those days…. ఆరాధనలో “నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై” నాకు రఫీ పాటల్లో చాలా ఇష్టం. అక్బర్ సలీం అనార్కలిలో మరో పాట [పాడినది ఆయన కాదు] “సిపాయి ఓ సిపాయీ.. హసీనా… నీకై…” అన్న పాట అంటే ఇంకా ఇష్టం..

 9. 11 Kannajie 12:43 సా. వద్ద సెప్టెంబర్ 12, 2009

  ఆహాహా ఏదో చెప్పలేని అనుభూతి …. రఫీ మన స్థానికుడు కాకపోయినా ఆ స్వరం లో వింటూంటే మరి..ఒహోహూ

 10. 12 nelabaludu 8:44 సా. వద్ద సెప్టెంబర్ 12, 2009

  ఆ ఫీలే వేరు.. ఎక్కడికొ తీసుకెళ్తాయ్.. 😉

 11. 13 రవి చంద్ర 11:44 ఉద. వద్ద సెప్టెంబర్ 13, 2009

  నాకు మాత్రం సిపాయీ ఓ సిపాయీ అనే పాట అన్నింటికిన్నా ఇష్టం.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: