పలు బ్లాగుల్లో మతాధార రిజర్వేషన్ల గురించిన రచ్చ రగులుతుంది. ఇంతకు ముందు ఇలాంటి సందర్భాల్లో జరిగిన రక్తపాతంతో పోలిస్తే ఇప్పుడు చాలావరకూ ప్రశాంతంగానే చర్చలు నడుస్తున్నట్లు లెక్క. ఐనా ఎంతో కొంత ఉద్రిక్త వాతావరణముంది. దాన్ని తగ్గించటానికి, కాసేపు అందరి దృష్టీ మళ్లించటానికీ నా ఈ చిన్న పోస్టు. పైగా, నేనో సరదా టపా రాసి చాన్నాళ్లయింది; నాళ్లేమిటి, నెలలే అయింది. పనిలో పనిగా ఆ లోటు తీర్చటానికీ ఈ పోస్టనుకుందాం. ఇది సరదా పోస్టు మాత్రమే, హాస్య పోస్టు కాదు (ఆ రెంటికీ తేడా ఏమిటో?)
తెలుగు బ్లాగర్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. ఒకే విషయమ్మీద పుంఖాను పుంఖాలుగా రాసేవారు కొందరు, కనపడ్డ ప్రతి విషయమ్మీదా రాసేవారు కొందరు, ఖండఖండాలుగా రాసేవారు కొందరు, ఏకాంకికలే రాసేవారు కొందరు, ప్రత్యేక అజెండాలతో రాసేవారు కొందరు, జెండాలు భుజానేసుకు రాసేవారు కొందరు, బ్లాగంటూ ఉన్నాక రాయాలి కాబట్టి రాసేవారు కొందరు, కవితలూ రాసేవారు కొందరు, కవితలే రాసేవారు కొందరు .. మొత్తమ్మీద అందరూ ఏదో ఒకటి రాసేస్తూ బ్లాగుల్ని కళకళలాడిస్తుంటారు. టపాలు రాయటంలో ఎవరి శైలి వారిది. వాటికి శీర్షికలు పెట్టటంలోనూ ఎవరి శైలి వారిదే. వీళ్లందరికీ ఒకే అంశం (కుక్క) ఇచ్చి దానిపై ఓ టపా రాయమంటే ఎవరు ఎలాంటి శీర్షిక పెడతారు అన్న ఆలోచన ఈ టపాకి ప్రేరణ.
కింద వరుస క్రమానికి ఏ ప్రత్యేకతా లేదు. నాకు గుర్తొచ్చిన క్రమంలో రాశాను. ఈ జాబితాలో ఉన్నవారేదో పేద్ద ప్రముఖ బ్లాగర్లు, తతిమ్మా వారు కాదు అని కూడా కాదు. నిజానికి, ఈ జాబితాలో లేనివారు ఏ మూసలోనూ అంత తేలిగ్గా ఒదగరు. ముఖ్యంగా – కవితారాధన చేసే చాలామంది మహిళా బ్లాగర్లు, బొల్లోజు బాబా గారు మొదలైనవారు. అందుకే వాళ్ల జోలికి వెళ్లలేదు.
ముందే చెప్పినట్లు, ఇదంతా సరదాకి మాత్రమే. చదివి, నవ్వొస్తే నవ్వుకోండి. లేకుంటే మర్చిపోండి. వీలైతే మీరూ చేతనైనన్ని శీర్షికలు జోడించండి. ఎవరినీ నొప్పించే వ్యాఖ్యలు మాత్రం చేయకండి.
అమ్మఒడి: మన సంస్కృతిపై నకిలీ కణికుడి కుట్ర – కుక్కల పాత్రకి ఆధారాలు-2314
తేటగీతి: భైరవద్వీప రహస్యం-132
డా. ఆచార్య ఫణీంద్ర: శునక శతకము (తొంబదియారవ భాగము)
ప్రమాదవనం: ఎనభయ్యారో నంబరు ప్రమాద సూచిక – కన్సాస్ కుక్కటేశ్వర్రావుగారితో తుంటర్వ్యూ
రేరాజ్ రివ్యూస్: పిచ్చి కుక్కలు కరిచేముందు తెలుగులో ఆలోచిస్తాయా?
చాకిరేవు: పగలదీస్తామంటూ బీరాలు పలుకుతూ వచ్చి కుక్కలరిస్తే పంచెలెగ్గట్టి పరుగుతీశారట బావామరుదులు
ఏ టు జెడ్ డ్రీమ్స్: ఆర్జీవీ డైరెక్షన్లో రామ్చరణ్ హిందీ సినిమా ‘శునక్’
చదువరి: కుక్కకాటు బాధితుల రహస్య సమావేశం
కలగూరగంప: ఎవడన్నాడు కుక్కలకు దేశభక్తి ఉండదని
నా ప్రపంచం: కుక్కల్లో నాస్తికత్వం
హరిసేవ: శునక శుశ్రూష ద్వారా స్వర్గారోహణ భాగ్యం
పర్ణశాల: కులవాదం Vs కుక్కలవాదం
అంతర్యానం: లౌకిక కుక్కలా, లేకి కుక్కలా. కిల్ దెమ్ ఆల్
రెండ్రెళ్లారు: కుక్క కాట్లకు చెప్పు దెబ్బలు
బ్లాగాడిస్తా: దాన వీర శూర శునక
శరత్ కాలం: కుక్కల్లో స్వ.సం. (ఓ మనో వైజ్ఞానిక రచన)
నరసరావుపేట్రియాట్స్: నర్షాపేట్లో కుక్కల లెక్కలు
నెల్లూరు బ్లాగుల సముదాయం: నెల్లూరులో కుక్కల అందాల పోటీలు
కాల్పనికలోకం: సినిమాలోకం!!:: మన!! సినిమాల!! జయాపజయాల్లో!! కుక్కల!! పాత్ర!!
టాలీవుడ్ ఫొటో ప్రొఫైల్స్: ‘గోదావరి’ డాగ్, ‘Godavari’ Dog
జురాన్: హాలీవుడ్ కుక్క – టాలీవుడ్ కుక్క
జీడిపప్పు: అమెరికాలో కుక్కల దర్జా
తెలు-గోడు: భౌభౌ
మనిషి-మనసులో మాట: ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి
కొత్తపాళీ: ఊరకుక్కల కబుర్లు – ఏప్రిల్ 26
నలభీమపాకం: మీ కుక్క కోసం బొక్కల చారు
మారుతీయం: శునకం స్వగతం
అయ్యస్పీ అడ్మిన్ మార్తాండ: శ్రీకాకుళంలో మా ఇంటి పక్క వీధిలో ఒక కుక్క ఐదు పిల్లలు పెట్టింది
గుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్.భౌ భౌభౌ
lollllll
Too hilarious!
hahaa…. heights, good one 🙂
ఎవరిక్కడ!! నలభీమపాకం గురించి అరిచిందెవ్వరు?
LOLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLL
“శరత్ కాలం: కుక్కల్లో స్వ.సం. (ఓ మనో వైజ్ఞానిక రచన)” —- This is the best!
హ. హ. అంత దృశ్యం/ధైర్యం నాకు లేదు లెండి 🙂 నా వేరే బ్లాగులోనయితే ఓక్కే.
కన పడిన దాని కంటే ఎంతో శ్రమ ఉంది, ఈ పట్టిక సమకూర్చడంలో.
చాలా బాగుంది.
హ హ బాగు బాగు 🙂 మంచి అబ్సర్వేషన్ తో రాశారు. very funny.
టాలీవుడ్ ఫొటో ప్రొఫైల్స్: ‘గోదావరి’ డాగ్, ‘Godavari’ Dog>>>>
కేక..అరాచకం..
i will add a few 🙂
Sowmyawrites: Automatic multi lingual speech generation in Dogs- a strategic research
a2zdreams post:
—————-
రాం గోపాల్ వర్మ రాం చరణ్ తో “శునక్” తీస్తున్నాడని ఇందాకే తెలిసింది (source: ఈనాడు). నా వరకు నాకు ఇది మంచి స్టెప్. చిరంజీవి బాలీవుడ్ లో ప్రవేశించినప్పటికీ అక్కడ ఎక్కువగా నిలదొక్కుకోలేదు. ఇప్పుడు ఆ అవకాశం రాం చరణ్ కి వచ్చింది. రాం గోపాల్ వర్మ సినిమా కాబట్టి చరణ్ నుంచి స్టెప్స్ ఎక్స్ పెక్ట్ చేయలేం కానీ మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
ఏమి చెప్పాలనుకున్నాను:
రాం గోపాల్ వర్మ తో చరణ్ సినిమా హిట్ అయినా అవకపోయినా చరణ్ మార్కెట్ పెరగడం ఖాయం
(comments off)
——
(just for fun :D)
రానారె : జిమ్మీ మొరుగు – 1
లీలామోహనం : చిట్టి శునకం – బొమ్మ
సౌమ్య : శునకాలోచనాపథం
విహారి : ఈ వారం సిద్ధ బుద్ధ (శునక ధీరుడు)
🙂 🙂 🙂
:))
Too much…. ఆఫీస్ లో ఉండగా ఇంతలా నవ్వించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్షా
పర్ణశాల: కులవాదం Vs కుక్కలవాదం 😀 😀
నలభీమపాకం: మీ కుక్క కోసం బొక్కల చారు 😀 😀 :d
కుక్కలు,వాటి కులాలు కోతుల పాత్ర [:)]
అయ్యస్పీ అడ్మిన్ మార్తాండ: శ్రీకాకుళంలో మా ఇంటి పక్క వీధిలో ఒక కుక్క ఐదు పిల్లలు పెట్టింది
ఈ శీర్షిక చాల బాగుంది :.మీ భౌ భౌ మాత్రం ఈ మధ్యకాలం లో చుసిన బ్లాగ్ లోనిpost lu అన్నింటికన్నా సరదాగా వుంది..
“శరత్ కాలం: కుక్కల్లో స్వ.సం. (ఓ మనో వైజ్ఞానిక రచన)” 100 marks
నా టపా టైటిల్
తమిళ్: తమిళనాడు లో నాకు నచ్చిన ఒక కుక్క. మీరు కూడా చదివి ఆనందించండి.
Baagundi.:):)
“ఈ మధ్య ఉత్సాహం తగ్గి పోస్టులు తగ్గాయి. ఇలా ఆట పట్టిస్తే ఎలా ?” ఖండిస్తున్నాం. – just kidding.
too good.
ఇంకోటి మరిచిపోయారు…
జంబలకిడిపంబ – శునకసింహారెడ్డి
🙂 🙂 🙂
F A N T A S T I C.
పొద్దు మొదలైన తొలి రోజుల్లో ఇలాగే అప్పటి ప్రముఖ బ్లాగర్లందరితోనూ చీమగురించి రాయించారు. పొద్దు నిర్వాహకులెవరైనా ఆ లంకెలు ఇక్కడ యిస్తే బాగుంటుంది.
:)) :))
ఏంటో ఇదంతా చదివాక ఏ బ్లాగుకు పోయినా కుక్కే కనిపిస్తోంది. “కుక్కమార్పిడి బిల్లు తెండి” లాగా! 🙂 సరే..
1. కుక్కకాటుకు చెప్పుదెబ్బ – చెప్పుకాటుకు కుక్కదెబ్బ (రెండురెళ్ళు ఆరుకు ఇదీ బానే ఉంటదనుకుంటా)
2. “భౌభౌలు” – ఇదేబ్లాగుకో చెప్పుకోండి
పొద్దులో బ్లాగుల పేరడీల లింకు: http://poddu.net/?p=164
మరి నేను వా వా
😦
బావుంది, ఇంతగా నవ్వి చాలా రోజులైంది. నిజంగానే ఇది చదివాక ఏ బ్లాగు చూసినా ఆ టపా టైటిల్ “శునక సంబంధితం” గానే కనిపిస్తోంది!
ఈ టాపిక్ నేను కూడా చదివాను. మత “రిజర్వేష”గాళ్ళతో సీరియస్ డిస్కషన్ జరుగుతోంటే ఈ డీవియేషన్ ఎందుకు?
Praveen!
Awesome is not a word…!:-)
చాలా బాగుంది.. బాగా నవ్వించారు.. 😉
మతాధారిత “రిజర్వేషా”ల గురించిన డిస్కషన్ వల్ల ఓ కథ మూడవ భాగం పూర్తి చెయ్యలేకపోయాను. సఘం వ్రాసిన మూడవ భాగాన్ని CDలోకి ఎక్కించి కంప్యూటర్ ఫార్మాట్ చెయ్యడం, ఇతర పనుల్లో పడిపోయాను. ఇంకో కంప్యూటర్ లో జూన్ నెలలో నేను వ్రాసిన కథ దొరికితే కథా నిలయంలో పెట్టాను.
evarakkada!!!
Please give opportunity to marthanda/Praveen sarma to comment on these issues regularly, so that WE (akhilandhra praveentoperita streevada kadhabadhitulam , more precisely so called Streelam) will be saved from his stories!!!
Dog-ear good! 🙂
అబ్రకదబ్రగారు నాకు కూడ ఒక కుక్కను ఇవ్వొచ్హు కదండి
chaala!! baaga!! raasarandi!!
viparitham! ga….navvukunnandi!!
A Ghantasala song may provide some relief:
praveen,
you are really….”awesome”! keep it up!
బాగుంది మీ కుక్క భాగోతం 🙂
🙂
హమ్మయ్య! ఏదో రకంగా బయటపడ్డాను. 😉 too hilarious, I have a had a good laugh!
తెలుగు బ్లాగర్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. ఒకే విషయమ్మీద పుంఖాను పుంఖాలుగా రాసేవారు కొందరు, కనపడ్డ ప్రతి విషయమ్మీదా రాసేవారు కొందరు, ఖండఖండాలుగా రాసేవారు కొందరు, ఏకాంకికలే రాసేవారు కొందరు, ప్రత్యేక అజెండాలతో రాసేవారు కొందరు, జెండాలు భుజానేసుకు రాసేవారు కొందరు, బ్లాగంటూ ఉన్నాక రాయాలి కాబట్టి రాసేవారు కొందరు, కవితలూ రాసేవారు కొందరు, కవితలే రాసేవారు కొందరు ..
indulo nenu evarini 😛
కవితారాధన చేసే చాలామంది మహిళా బ్లాగర్లు, బొల్లోజు బాబా గారు మొదలైనవారు. అందుకే వాళ్ల జోలికి వెళ్లలేదు..
Meeru sunakanandam post raastharani 6th sense vundi andukunta abrakadabra gaariki anduke mee joliki vellaledu anukuntaa 🙂
అయ్యా! నన్ను మర్చిపోయినట్లున్నారు.
“వయ్యంటే కుక్క” 😀
@గీతాచార్య:
మర్చిపోవటమేంటి .. నర్షాపేట్రియాట్స్ ఉందిగా లిస్టులో.