రిజర్వేషాలు

దళిత క్రిస్టియన్లకూ రిజర్వేషన్లు కల్పించే దిశలో రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసన సభ తీర్మానం ఆమోదించటంతో రిజర్వేషన్ల తేనె తుట్టె మళ్లీ కదిలింది. రిజర్వేషన్లు వోటు సాధనాలుగా మారిపోయి దశాబ్దాలయింది. వాటి పేరుతో కులాల మధ్య కుమ్ములాటలు జరగటమూ సాధారణమైపోయింది. ఇప్పుడా గోదా లోకి మతాలనూ చేర్చిన ఘనత ముఖ్యమంత్రికి చెందుతుంది. ఉద్యమాలేమీ నడవకున్నా ఉన్న పళాన ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి కారణమేమిటో ఆయనకే ఎరుక. పోయిన టెర్మ్‌లో ఇలాగే అయాచితంగా ముస్లిములకి రిజర్వేషన్ వరం ప్రకటించి భంగపడ్డ చరిత్ర ఆయనది. ఇప్పుడీ వరం వెనక మతలబు – రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జంట నగరాల్లోని లక్షలాది క్రిస్టియన్ల వోట్లు కొల్లగొట్టటం కావచ్చు. ప్రధాన ప్రతిపక్షం సైతం ఈ విషయంలో వ్యతిరేకించలేని పరిస్థితి. వోటు బ్యాంకు రాజకీయాల యుగం కదా – ఇష్టమున్నా లేకున్నా వంతపాడక తప్పని గతి తెదేపాది. రేపెప్పుడో తెదేపా ఇంతకు మించిన దివాలాకోరు ప్రతిపాదనతో ముందుకు రావచ్చు, దానికి కాంగ్రెస్ తందానా అనొచ్చు. మతాధార రిజర్వేషన్లకు రాజ్యాంగం ఒప్పుకోదని ఇద్దరికీ తెలుసు. దాన్ని మార్చటం తమ పరిధిలోది కాదనీ తెలుసు. అయినా ఆగేది లేదు! ప్రజలకు పంగనామాలు పెట్టే కళలో ఇరు పక్షాలూ దొందూ దొందే. వోట్ల రాజకీయాలకొచ్చేసరికి ప్రరాపా కూడా ఆ తానులో ముక్కేనని తేలిపోయింది. ఇక భాజపా పంధా అందరికీ తెలిసిందే. హిందువుల్ని ఉద్ధరిస్తున్నట్లు కనిపించటానికి వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోని పక్షం కాబట్టి వీళ్ల స్పందన దానికి తగ్గట్లుగానే ఉంది. ఉన్నంతలో పద్ధతిగా మాట్లాడింది లోక్‌సత్తా ఒక్కటే.

కులాలు హిందూ మతానికి ప్రత్యేకించినవైనప్పుడు కులాధారిత రిజర్వేషన్లు ఇతర మతాలకు వర్తింపజేయటం మతిలేని పని అనేది కొందరి వాదన. దళితులు క్రైస్తవంలోకి మారినా కుల వివక్ష తగ్గటం లేదు కాబట్టి రిజర్వేషన్ సదుపాయం ఆ మతస్తులకీ వర్తింపజేయాలనేది మరి కొందరి ప్రతివాదన. అటు క్రైస్తవం లోకి మారటం వల్ల వచ్చే లాభాలకి ఇటు రిజర్వేషన్లూ తోడైతే హిందూత్వం నుండి వలసలు మరింత పెరిగిపోతాయనే ఆందోళన హైందవ సంస్థలది. వీరి ఆందోళనలోనూ కొంత నిజముంది. ఈ రెండు రకాల వాదనల హోరులోనూ మూడో వర్గం రోదన ఎవరికీ వినిపించకుండా పోతుంది. ‘అసలు కులాధారిత రిజర్వేషన్లే దండగ’ అనే వాదన అది. ఇందులోనూ నిజమే ఉంది. రిజర్వేషన్లంటూ ఇస్తే వాటిని కులమతాలతో సంబంధం లేకుండా కుటుంబాల ఆర్ధిక స్థితిగతులని బట్టి ఇవ్వాలనే ప్రతిపాదన ఎప్పటినుండో ఉంది. వాటిని పట్టించుకుంటున్న పాపాన మాత్రం ఏ ప్రభుత్వమూ పోలేదు. ఎలా పోతుంది? అలా చేస్తే వోటు బ్యాంకులేం కావాలి? మెడలో గంటలు కట్టుకోమని పిల్లుల్నే అడిగితే ప్రయోజనం కల్ల.

అర్ధరాత్రి స్వతంత్రం వచ్చి అరవై మూడేళ్లయింది. ఈ మధ్య కాలంలో జనాభా రెట్టింపయింది. జనరాజకీయాలు విభజన రాజకీయాలయ్యాయి. రిజర్వేషన్లు వోట్ల సంపాదనకు దొడ్డిదారులుగా రాజకీయుల మంత్రాంగాల్లో సుస్థిర స్థానం సాధించుకున్నాయి. వాళ్ల పుణ్యాన – ఒక ఉద్దేశంతో మొదలైన కోటాలు పక్కదారి పట్టి వెర్రితలలేసి శాఖోపశాఖలుగా విస్తరించాయి. అనుభవిస్తున్నవారికి ఒరిగిందేమన్నా ఉందా అంటే – ఉన్నదల్లా కాకి లెక్కలే. అదే సమయంలో, రిజర్వేషన్ల దెబ్బతో అవకాశాలు కోల్పోయి అణగారిపోయిన అగ్రవర్ణాల పేదల లెక్కలు మాత్రం ఎవరూ తీసిన దాఖలా లేదు. రిజర్వేషన్ల కారణంగా పైకెదుగుదున్న ప్రతి పది మందికీ, అవే రిజర్వేషన్లు అడ్డు పడి కుదేలైపోయిన మరో పది మంది తయారవుతుంటే – వీటి పరమార్ధం ఎంతవరకూ నెరవేరిందన్నది ప్రశ్నార్ధకం. ఇప్పటికే దేశంలో మెజారిటీ జనాభా ఏదో ఒక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పరిస్థితుంది. ఇక మతాలనూ ఈ గొడుగు కిందకి పట్టుకొస్తే మిగిలిన వారి పరిస్థితేంటి? మరో పక్క – రిజర్వేషన్ల శాతం ఇంతకు మించకూడదన్న సుప్రీం కోర్టు హుకుం కారణంగా, కిక్కిరిసిన బస్సులో సీట్ల కోసం కొట్లాడుకునే ప్రయాణీకుల్ని తలపిస్తున్నాయి కోటాల్లో ఎవరి వంతు ఎంత అనే విషయంలో ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్న లబ్దిదారీ వర్గాలు. ఈ వర్గాలకి ఇప్పుడు వివిధ మతాల్లోని వెనకబడ్డ వర్గాలూ తోడైతే జరగబోయే జాతర ఊహకందదు.

రిజర్వేషన్ల వల్ల వెనకబడ్డవర్గాలకి ఒరిగిందేమన్నా ఉందో లేదో తెలీదు కానీ పెరిగింది మాత్రం మరింత వివక్ష, లబ్దిదార్లంటే అనేక మంది అగ్ర కులస్తులకు ఎనలేని చులకన. ఐతే – కొన్ని సార్లీ అగ్రవర్ణాల ఆక్రోశం రిజర్వేషన్ల వల్ల నిజంగానే ఎవరికీ ఉపయోగం లేదనా, లేక తమకి దక్కనిది పక్కవాడికి దక్కుతుందన్న అక్కసుతోనా అన్నది అంతుపట్టదు. ఓ పక్క కోటాల వల్ల తమ సొమ్మేదో పోతుందనుకునే వీళ్లు మరో పక్క అవకాశమొస్తే తామూ అలాంటి తాయిలాలందుకోటానికి సిద్ధంగా ఉంటారు. ప్రభుత్వాలు చేసే వివిధ రుణ మాఫీలు ఇలాంటి వాటికి పెద్ద ఉదాహరణ. ఈ మధ్య జరిగిన వ్యవసాయ రుణ మాఫీని దర్జాగా దుర్వినియోగం చేసేసిన అగ్రవర్ణ అధికాదాయ రైతులెందరో! అవకాశముంటే అనాయాసంగా అందలమెక్కటానికి అందరూ సిద్ధమే. మన తీరే అంత. కులమతాలకతీతంగా – అప్పనంగా వచ్చి పడే ముల్లె కోసం అర్రులు చాచటం సగటు భారతీయుడి బలహీనత. అధికారుల నుండి బంట్రోతులదాకా మామూలైపోయిన మామూళ్ల స్వీకరణ, ఆదాయప్పన్ను ఎగవేత, వోటుకు నోటు, డొనేషన్లు, కుంభకోణాలు .. ఇలా ఈ మనస్తత్వానికి తార్కాణాలెన్నో. ప్రభుత్వాలు దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నాలే – ఉచిత కరెంటు, రెండ్రూపాయల బియ్యం, అడ్డగోలు రిజర్వేషన్ల వంటి ప్రలోభాలు. మన బలహీనత ఆసరాగా పార్టీలాడే రాజకీయ చదరంగంలో పావులం మనమే. వ్యక్తిగత స్వార్ధాలకు సంఘ హితాన్ని బలిపెడుతున్న పాపులమూ మనమే. మనం మారందే, మన దేశాన్ని ఏ దేవుడూ కాపాడలేడు.

53 స్పందనలు to “రిజర్వేషాలు”


 1. 2 జీడిపప్పు 4:21 సా. వద్ద ఆగస్ట్ 26, 2009

  good analysis. పోటీ పడి చంద్రబాబు, చిరంజీవి దీనికి మద్దతునివ్వడం చూస్తే జాలేస్తున్నది.

  btw, ఈ రిజర్వేషన్ దరిద్రం ప్రైవేటు రంగంలో లేనందువల్ల కొందరయినా సంతృప్తిగా ఉండగలుగుతున్నారు. తొందర్లో ప్రైవేటురంగంలోనూ రిజర్వేషన్లంటారేమో ఈ రాజకీయనాయకులు!

 2. 3 Praveen 4:52 సా. వద్ద ఆగస్ట్ 26, 2009

  నా అఫీస్ లో తెలగా వాళ్ళు అనే అగ్రకులానికి చెందిన ఓ అమ్మాయి పని చేసేది. ఆమె భర్తకి ఉద్యోగం లేదు. ఆమె మామగారు వ్యాపారం చేసి నష్టం వచ్చి ముసలైపోవడం వల్ల ఇంకో వ్యాపారం గురించి ఆలోచించలేదు. తెలగా వాళ్ళకి కూడా రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ఉంది. ఆ అమ్మాయి తమ కులానికి రిజర్వేషన్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసింది. గతంలో చెన్నారెడ్డి తెలగా వాళ్ళకి కూడా రిజర్వేషన్లు ఇస్తూ జి.వొ. తెస్తే కోర్టు ఆ జి.వొ.ని రద్దు చేసింది. అయినా రాజకీయ పార్టీలు పలు అగ్రకులాలకి కూడా రిజర్వేషన్లు ఇస్తాం అని చెప్పి జనాన్ని ఫూల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయి భర్త డి.టి.పి. చేసి సంపాదిస్తున్నాడు. పేదవాళ్ళకి రిజర్వేషన్లు అవసరమే కానీ డబ్బున్న వాళ్ళు బ్యాంక్ లోన్లు తీసుకుని వ్యాపారాలు పెట్టుకోకుండా రిజర్వేషన్ల కోసం అనారోగ్యకరమైన కులతత్వాన్ని పట్టుకోవడం సిగ్గు సిగ్గు.

 3. 4 vg 5:29 సా. వద్ద ఆగస్ట్ 26, 2009

  tittadam prati okkaru tidutaru .. solution cheppadam important !

  reservations kakunda vere paddati enti anedi mukyam ?

  christians ga convert ayyaka .. antavaraku kulam valla jarigina vivaksha potunda ? vallaki reservations kavali ante andaru balavantam ga malli hinduvu lu ga maarala ?

  EBC ante .. prastutam unna mana system lo adi velavutunda ?

  prati vakkariki ration cards ela unnayo .. alane andariki reservations vastayi emo !

 4. 5 మేధ 9:08 సా. వద్ద ఆగస్ట్ 26, 2009

  ఈ దళిత క్రైస్తవులు అనే మాట ఎక్కడినుండి వచ్చిందో.. హిందూ మతంలో ‘దళిత’ అనే పదం ఉంది.. క్రైస్తవ మతంలో ఎప్పుడు చేర్చారో! అలా అయితే,ఇతర దేశాల్లో ఉండే క్రైస్తవులు ఏ వర్గంలోకి వస్తారో! జీసస్ కూడా సమాధానం చెప్పలేని ప్రశ్న!!

  @జీడిపప్పు గారు:
  ఆల్రెడీ ప్రైవేటు రంగంలో కూడా పెడదామనే ఆలోచనలో ఉన్నారు మన నాయకులు.. ప్రస్తుతానికి ప్రైవేటు రంగం వారు ఎదురు తిరగడంతో కాస్త తగ్గారు కానీ, లేకపోతే అది కూడా ఉండేది.. అయినా రాబోయే కాలంలో ఇలానే ఉంటుందని గ్యారంటీ లేదు! నయానో, భయానో ప్రైవేటు రంగంలో కూడా, రిజర్వేషన్లు వస్తాయి..

  గుజ్జర్ల కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య పచ్చి నిజం.. నేను వెనకబడి ఉన్నాను అని ముందుకు వచ్చి మరీ చెప్పుకునేది ఈ దేశంలో మాత్రమే..!!
  అప్పుడు గుజ్జర్లు, రేపు మన రాష్ట్రంలోని దళిత క్రైస్తవులు.. మర్నాడు ఇంకెవరో…

 5. 6 మేధ 9:11 సా. వద్ద ఆగస్ట్ 26, 2009

  @vg గారు:
  మీరన్నది నిజమే.. విమర్శించడం ముఖ్యం కాదు, దానికి సరైన పరిష్కారం కావాలి.. కానీ, అసలు పరిష్కారం గురించి ఆలోచించాలని రాజకీయ నాయకులకి ఉందా. ఎంతసేపు ఏ సమస్య ఎగదోసి, జనాలని ఆ గొడవలో ఉంచేసి వాళ్ళ పబ్బం గడుపుకోవాలని తప్పితే, ప్రజల సమస్యలని తీరుద్దామని ఎవరికీ లేదు. వాళ్ళకి నిజంగా ఆ నిబధ్ధతే ఉంటే, కాశ్మీరు సమస్య తో సహా, ఏ సమస్యలు ఉండేవి కావు దేశానికి..

 6. 7 వెంకటరమణ 10:01 సా. వద్ద ఆగస్ట్ 26, 2009

  మీ విశ్లేషణ చాలా బాగుంది.

  // మన బలహీనత ఆసరాగా పార్టీలాడే రాజకీయ చదరంగంలో పావులం మనమే. వ్యక్తిగత స్వార్ధాలకు సంఘ హితాన్ని బలిపెడుతున్న పాపులమూ మనమే. మనం మారందే, మన దేశాన్ని ఏ దేవుడూ కాపాడలేడు.

  తాము రిజర్వేషన్లు అనుభవించి కొద్దో గొప్పో మంచి స్థాయిలోకి వచ్చాక ఎంతమంది ఈ రిజర్వేషన్లు వద్దనుకుంటున్నారు అన్నది ప్రశ్న.
  అసలు వీటి గురించి తెలియని ప్రజలు గ్రామాల్లో చాలా మంది ఉన్నారు.

 7. 8 కె.మహేష్ కుమార్ 10:22 సా. వద్ద ఆగస్ట్ 26, 2009

  @మేధ: “దళిత” పదం హిందూ మతానికి సంబంధించినది కాదు. కులానికి సంబంధించింది అసలు కాదు. అది అణగద్రొక్కబడిన “వర్గానికి” సంబంధించింది. ఇందులో 59 కులాలు అన్ని మతాల్లోంచీ కలిసి ఉన్నాయి. ముస్లింలలో దూదేకులవాళ్ళు,సిక్కుల్లో డేరాసచ్చాసౌదా పంథ్ కు సంబంధించినవాళ్ళూ దానికొక ఉదాహరణ మాత్రమే.

  సామాజికంగా-ఆర్ధికంగా-రాజకీయంగా అణగద్రొక్కబడిన ప్రతొక్కడూ దళితుడే! బ్రాహ్మణ,రెడ్డి,బలిజ,కమ్మ… అన్ని కులాల్లోనూ దళితులున్నారు. అలాగే క్రైస్తవుల్లో,ముస్లింలలోనూ ఉన్నారు.

  రాజకీయ నిర్వచనాన్ని సామాజిక ఉద్యమానికి అంటగట్టి విచారించి,విమర్శించే ముందు కొన్ని వివరణలు కోరడం అవసరం. కొన్ని నిజాలు తెలుసుకోవడం అవసరం. కొంత సైద్ధాంతిక నేపధ్యాన్ని తలుచుకోవడం అత్యవసరం.

 8. 9 Praveen 10:49 సా. వద్ద ఆగస్ట్ 26, 2009

  కులంతో నిమిత్తం లేకుండా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామంటే కారెం శివాజీ లాంటి డబ్బున్న దళిత నాయకులు ఒప్పుకుంటారా?

 9. 10 కె.మహేష్ కుమార్ 1:16 ఉద. వద్ద ఆగస్ట్ 27, 2009

  @ప్రవీణ్: ఈ దేశంలో కులంతో నిమిత్తం లేకుండా Below Poverty Line (BPL) కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సమస్య ఆర్థికపరమైనది కాబట్టి ఇలాంటి ఆర్థికపరమైన వెసులుబాటులు కల్పించడం ప్రభుత్వం బాధ్యత.రేషన్ కార్డులనుంచీ, ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ యాక్ట్ వరకూ ఇలాంటివి ఎన్నో. విద్య,వైద్యం విషయాలలో స్కాలర్ షిప్పులు, హెల్త్ కార్డులద్వారా BPL కుటుంబాలకు సహాయం అందించబడుతోంది.

  కానీ,కులపరమైన “రిజర్వేషన్” granting access to resources that are traditionally denied to certain social groups కోసం ఏర్పరచబడింది. దాని ప్రాతిపదికే కులం-కులవివక్ష- వనరుల లబ్ధినుంచీ వంచింపబడటం. ఈ కనీస జ్ఞానం లేకపోతే, మీలాంటి తలా తోకా లేని సందేహాలే వస్తాయి. కాబట్టి వీలైనంతగా రిజర్వేషన్ల నేపధ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. Constituent assembly లో రిజర్వేషన్లకు అనుకూలంగా- ప్రతికూలంగా జరిగిన వాదోపవాదాలను అర్థం చేసుకునే “సాహసం” చెయ్యండి.

 10. 11 Praveen 1:24 ఉద. వద్ద ఆగస్ట్ 27, 2009

  ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ విధానం వల్ల కుల వివక్ష తగ్గడం లేదు. మీ కులానికి ఇంత శాతం రిజర్వేషన్లు ఇచ్చాము కనుక మాకు వోట్లెయ్యండి అనడం జరుగుతోంది. కుల ప్రాతిపదకన కాకుండా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే కారెం శివాజీ, మంద కృష్ణ లాంటి డబ్బున్న దళిత నాయకులు తమ కులం వాళ్ళని పోగు చేసి ధర్నాలు, రాస్తా రోకోలు చెయ్యిస్తారు. పేద దళితులకి ప్రాతినిధ్యం లేని రిజర్వేషన్ల వల్ల దళితుల గౌరవం ఎలా పెరుగుతుంది?

 11. 12 కె.మహేష్ కుమార్ 1:43 ఉద. వద్ద ఆగస్ట్ 27, 2009

  @ప్రవీణ్: మీకు చెప్పినా అర్థమవ్వదనేది తెలుస్తోంది.

  రిజర్వేషన్ ఉద్దేశం కులవివక్ష తగ్గించడం కాదు. వనరుల లబ్ధికి అవకాశం కల్పించడం. కులవివక్ష తగ్గించడానికి చట్టాలున్నాయి. ప్రాధమిక (మానవ) హక్కులు,directive principles ఉన్నాయి. Try to separate, ‘access to resources’ and ‘human dignity’ as two different context that need different solutions.

  ఈ “రిజర్వేషాల్లో” రాజకీయ ఉద్దేశాలున్నంత మాత్రానా మొత్తంగా రిజర్వేషన్ల ప్రాతిపదికని ridicule చెయ్యడం అవగాహనారాహిత్యం. ఈ ప్రహసనాన్ని సాకుగా చూపించి రిజర్వేషన్లని ఒక జోకుగా చెయ్యడం అసహనానికి పరాకాష్ట.

  ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు భంగం కలగకుండా ఆర్థికపరమైన రిజర్వేషన్లు కల్పిస్తే దళితులు ఎందుకు వ్యతిరేకిస్తారు? దళితుల పోరాటం అసమానతల్ని రూపుమాపడం. అవి ఆర్థికమైనా-సామాజికమైనా-రాజకీయమైనా సరే. అవి అంతర్గతమైనా, బహిర్గతమైనా సరే! పోరాటం అసమానతల్ని రూపుమాపడం కోసం అది ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికోస్దమైనా దళిత పోరాట పంథానే.

  మీకు స్త్రీవాదం లాగానే దళితవాదమూ అర్థం కాదు. ఎందుకంటే మీ ప్రాతిపదిక చదివిన పది పుస్తకాలను ఎప్పుడూ దాటలేదు. Please grow-up.

 12. 13 Praveen 2:11 ఉద. వద్ద ఆగస్ట్ 27, 2009

  నేను గిరిజన కుటుంబం నుంచి వచ్చినవాడిని. నాకు దళితుల సమస్యలు తెలియకపోవడం జరగదు. డబ్బున్న దళితులకి మాత్రమే రిజవరేషన్ కోటాలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నంత కాలం దళితుల ఆత్మగౌరవం పెరగదు.

 13. 14 sUryuDu 3:32 ఉద. వద్ద ఆగస్ట్ 27, 2009

  “మన బలహీనత ఆసరాగా పార్టీలాడే రాజకీయ చదరంగంలో పావులం మనమే. వ్యక్తిగత స్వార్ధాలకు సంఘ హితాన్ని బలిపెడుతున్న పాపులమూ మనమే. మనం మారందే, మన దేశాన్ని ఏ దేవుడూ కాపాడలేడు.”

  Good point.

  Any type of reservation should be limited to 2 or at max three generations of that family but should not be continued forever.

 14. 16 Praveen 4:50 ఉద. వద్ద ఆగస్ట్ 27, 2009

  మందార ప్రభాకర్ బ్లాగ్ లో మహేష్ వ్రాసిన చెత్త ఇది
  >>>>>>>>>>
  @Praveen Sharma: What do yo mean by “double benefits”?ప్రభుత్వ విద్యాసంస్థలూ, ఉద్యోగాలూ చర్చ్ నడపడం లేదే! మరి రెండుసార్లు దళితులు ఎలా లబ్ధిపొందుతున్నారు?

  నీకు జీతం వస్తోందికదా అని బ్యాంక్ లోనిస్తే వద్దంటావా? లేదా ఎవరైనా తేరగా ఒక లక్ష ఇస్తామంటే కాదంటావా? ఏదోఒక లబ్ధికలిగిస్తామంటే తృణీకరిస్తావా? లాభపడేది ఏదైనా మనిషి కావాలనే కోరుకుంటాడు.అది ఎన్ని రకాలుగా ఉన్నా అది కావలసిందే! దీనికి దళితులు మాత్రం వంచితులు ఎందుకవ్వాలి?

  చర్చ్ మంచి విద్యనిస్త్రే తీసుకుంటాం. వైద్యాన్ని అందిస్తే సంతోషిస్తాం. ఆర్థిక వనరులు కల్పిస్త్రే అందుకుంటాం. దానికీ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకూ లంకెకలిపి double benefit అనడం మీ తెలియనితనానికి ఒక ఉదాహరణగా మాత్రమే అనిపిస్తోంది.
  >>>>>>>>>>

 15. 17 prasad 10:07 ఉద. వద్ద ఆగస్ట్ 27, 2009

  దొచేయండి .. ఎన్నిరకాలుగా వీలయితె అన్ని రకాలుగా ఈ దేశాన్ని దొచేయండి.
  వద్దని చెప్పిన సాటి దళితుడే మూర్ఖుడు.

 16. 18 అబ్రకదబ్ర 11:16 ఉద. వద్ద ఆగస్ట్ 27, 2009

  Folks,

  Please, retain your composure. Do not use derogatory remarks.

 17. 19 Ashok 11:50 ఉద. వద్ద ఆగస్ట్ 27, 2009

  మహేష్, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. రిజర్వేషన్స్ తో అర్హత లేని వాళ్ళకి వుద్యోగాలు ఇస్తే వాళ్ళ పెర్ఫార్మన్స్ ఎలా వుంటుందో ఆలోచించు..
  EAMCET లో జస్ట్ Qualify అయిన వాళ్ళకి రిజర్వేషన్ లో మెడిసిన్ సీట్ వస్తే వాలు డాక్టర్ అయి ప్రజల ప్రాణాలతో ఆడుకోరా? దానికి నీ సమాధానం ఏంటి? వాడు దళితుడు కాబట్టి వాడికి అర్హత లేకున్నా వుద్యోగాలు ఇవ్వాళా? అలా చేయబట్టే మన దేశం ఇలా తాయారు అయింది..

 18. 20 కత్తి మహేష్ కుమార్ 12:25 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  @అశోక్: మెరిటోక్రసీ గురించి ఇప్పటికి చాలా పేలవం అని నిరూపించబడిన వాదన గురించి చెప్పకండి.అసలు “అర్హత” అంటే ఏమిటి? EAMCET “కేవలం” qualify అయినా, మెడిసన్ లో పాసవ్వకపోతే పట్టాచేతికి రాదు. అయినా “పాన్” 35% అని నిర్ణయించిందెవరు? అదేమన్నా minimum learning కు చిహ్నమా లేకపోతే అన్ని మార్కులొస్తే చాలా? ఎక్కడైనా excellent/exceptional students కొందరే ఉంటారు. మిగతావాళ్ళందరూ యావరేజే.

  ఒక విషయం మీకు తెలుసో లేదో, రిజర్వేషన్లద్వారా మెడికల్ సీటు సంపాదించే దళితుల సంఖ్యకన్నా వందరెట్లు ఎక్కువమంది(దళిత విద్యార్థులకన్నా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు) డబ్బులుకట్టి కోర్సుల్లోకి చేరుతున్నారు. దళితవిద్యార్థులతో సమానంగా మార్కులొచ్చి పాసైన “ఇతర” విద్యార్థులూ అదే సంఖ్యలో ఉంటున్నారు. వాళ్ళందరివల్లా దెబ్బతినని మీ “మెరిట్” (bullshit) రిజర్వేషన్ ఉన్న దళితుల ద్వారా dilute అయిపోతోందా!

  డబ్బులిచ్చి సీట్లు కొనుక్కుంటే గౌరవమూ…అర్హతా… అదే రిజర్వేషన్లో “అర్హత” సంపాదిస్తే అది అర్హత లేకపోవడమూనా!

  ఉద్యోగాలెవరూ అర్హత లేకుండా ఇవ్వట్లేదు. కనీస అర్హతను వయసు పరంగానో లేక కొంతశాతం మార్కులపరంగానో కోంతమేరకు సడలిస్తున్నారు అంతే. అయినా, 55% మార్కులొచ్చినోడికీ 65% మార్కులొచ్చినోడికీ (మార్కులతో సంబంధం లేని) ఉద్యోగం చెయ్యడానికి ఏ బీరకాయపీచు సంబంధం ఉంటుంది? అయినా ఈ పదిమార్కుల్లో వచ్చే అద్వితీయమైన తేడాలేమిటో? ఒకవేళ గ్రేడింగ్ పెడితే ఒకడిది B మరొకడిది B+ అంతేగా!

  మనదేశం ఇలా అవ్వడానికి కారణం దళితులు కాదు. ఇప్పటిదాకా దాదాపు సగం జనాభా అయిన దళితుల్ని వనరులకు దూరంగా ఉంచిన వర్గాలు. So blame them first and then come to Dalits.

 19. 21 Praveen 4:52 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  మహేష్ గురించి అర్థమవ్వాలంటే ఈ పోస్ట్ చదవండి http://uyyaala.blogspot.com/2009/08/blog-post_27.html

 20. 22 జీడిపప్పు 5:04 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  మహేష్ గారు, just curious – ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు ఉండాలి అన్నవాదన పైన మీ అభిప్రాయం కాస్త వివరిస్తారా?

 21. 23 Praveen 5:32 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  దొంగ క్యాస్ట్ సర్టిఫికేట్స్ తో ఉద్యోగాల్లో చేరే వాళ్ళు అక్కడ కూడా చేరుతారు. దొంగ సర్టిఫికేట్ తో ప్రైవేట్ ఉద్యోగంలో చేరినా 100% జాబ్ సెక్యూరిటీ ఉండదు. వాళ్ళు ఉద్యోగం నుంచి తొలిగిస్తే వ్యాపారం పెట్టుకోవాలి. ఇంత దాకా ఎందుకు? జాబ్ సెక్యూరిటీ సరిగా ఇవ్వని ప్రైవేట్ కంపెనీలు రిజర్వేషన్లు ఎలా ఇస్తాయి?

 22. 24 కత్తి మహేష్ కుమార్ 6:53 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  @జీడిపప్పు: Enabling Dalits to access resources is State’s responsibility.అలాంటప్పుడు, ప్రభుత్వం ఇచ్చే రాయితీల మీద విపరీతంగా ఆధారపడే ప్రైవేటు కంపెనీలు as part of their social responsibility should implement reservation.

 23. 25 Praveen 7:12 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  జాబ్ సెక్యూరిటీ సరిగా ఇవ్వని ప్రైవేట్ కంపెనీలు రిజర్వేషన్లు ఎలా ఇస్తాయి? లాభాలతో నడుస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసే యోచనలో ఉన్నారు మన పాలకులు. ప్రైవేటీకరణని వ్యతిరేకించడం చేతకాక ప్రైవేట్ సెక్టార్ లో రిజర్వేషన్లు పెట్టమంటున్నారు.

 24. 26 జీడిపప్పు 7:16 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  మహేష్ గారు, పభుత్వ రాయితీలపైన ఆధారపడుతున్న ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ఉండాలి అంటున్నారు. మరి ప్రభుత్వమే అన్ని ఖర్చులు పెట్టి ఆటగాళ్ళను తయారుచేసే “ఒలింపిక్ క్రీడాకారుల” ఎంపికలో లేదా క్రికెట్ ఆటగాళ్ళ ఎంపికలో కూడా దళితులకు రిజర్వేషన్ ఉండాల్సిందేనా? 11 మంది క్రీడాకారులున్న క్రికెట్ టీంలో ఎందరు దళితులకు ఖచ్చితంగా స్థానం ఉండాలి?

 25. 27 Praveen 7:29 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  ప్రైవేట్ ఉద్యోగంలో చేరితే ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియదు. ఉద్యోగి అగ్రకులస్తుడైనా, దళితుడైనా పరిస్థితి అలాగే ఉంటుంది. ముందు ప్రైవేటీకరణని వ్యతిరేకించు మహేష్. ప్రైవేట్ సెక్టార్ లో రిజర్వేషన్ లు పెట్టాలని డిమాండ్ చెయ్యడం వల్ల ప్రయోజనం ఉండదు.

 26. 28 పునర్వసు 8:24 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  చదువులో రిజర్వేషన్, తరువాత ఉద్యోగానికి రిజర్వేషన్ అంతవరకూ బాగానే ఉంది, మరి తరువాత ప్రమోషన్లలో రిజర్వేషన్, వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్, ఇలా ఇలా….

 27. 29 Praveen 9:10 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  ప్రవేట్ సెక్టార్ లో రిజర్వేషన్ల డిమాండ్ ని లేవనెత్తింది చంద్రభాన్ ప్రసాద్ లాంటి వాళ్ళు. సామ్రాజ్యవాదుల ఏజెంట్లు జనానికి ప్రైవేటీకరణ పై వ్యతిరేకత కలగకుండా చెయ్యడానికి ఆ డిమాండ్ తెచ్చారు. ప్రైవేట్ సెక్టార్ లో రిజర్వేషన్లు సాధ్యం కావని అందరికీ తెలుసు.

 28. 30 కత్తి మహేష్ కుమార్ 10:24 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  @జీడిపప్పు: You are trying to trivialize the issue.

  In principle క్రీడలూ క్రియేటివిటీ వంటి కొన్ని రంగాలలో రిజర్వేషన్ల ఆలోచన చెల్లదు. కానీ అక్కడా వివక్ష మాత్రం ఖచ్చితంగా ఉంది.సత్తా ఉండీ వివక్షకు గురవుతున్న కొందరు దళితులు,స్త్రీలూ వాళ్ళ హక్కులకోసం అక్కడా పోరాటం జరుపుతున్నారు.

 29. 31 Praveen 10:35 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  భూస్వామ్య సమాజపు ఫలం అయిన వ్యభిచారాన్ని సమర్థించే నువ్వు స్త్రీల హక్కుల గురించి మాట్లాడుతున్నావా? నువ్వు స్త్రీల హక్కుల గురించి మాట్లాడితే స్త్రీవాదులు నవ్వుతారు. నువ్వు దళితుల గురించి మాత్రమే మాట్లాడితే సరిపోతుంది.

 30. 33 జీడిపప్పు 10:39 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  మహేష్ గారు, నేను trivialize చేయడం లేదు. మీరు చెప్పినదాని గురించే అడుగుతున్నాను.

  ప్రభుత్వ రాయితీలు తీసుకుంటున్న విప్రో, ఇన్‌ఫోసిస్ లాంటి కంపెనీల్లో రిజర్వేషన్లు ఉండాలి అన్నారు మీరే! అంటే ఆ సంస్థల్లో క్రియేటివిటీ అక్కర్లేదా?

  ఆపరేషన్ చేసి ప్రాణం పోసే డాక్టరుకు రిజర్వేషన్ ఉన్నపుడు, విమానాలను నియంత్రించే కంప్యూటరు ప్రోగ్రాం రాసే కంపెనీల్లో రిజర్వేషన్లు ఉండాలన్నపుడు – క్రీడాకారుడికి ఎందుకు రిజర్వేషన్ ఉండకూడదో కాస్త వివరించగలరా?

 31. 34 కత్తి మహేష్ కుమార్ 10:54 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  @జీడిపప్పు: 90% ఉద్యోగాలకు కొంత శిక్షణ మరికొంత అవకాశం ఉంటే చాలు.

  సాఫ్ట్ వేర్ ప్రోగ్రామింగ్ చెయ్యడానికి ఇంజనీరింగ్ లో ర్యాంకు సాధించిన విద్యార్థే కావాలా లేక విషయపరిజ్ఞానాన్ని కొంత సంపాదించిన ఒక సాధారణ గ్రాడ్యుయేట్ సరిపోతాడే అనేది మీకు తెలియని రహస్యం కాదు. కోకొల్లలుగా (మొదళ్ళు ఉపయోగించకుండా, అతితెలివి ప్రశ్నలు వెయ్యకుండా చెప్పింది “సైనికుల్లాగా” చేసే)ఇంజనీరింగ్ విద్యార్థులు లభ్యతలో ఉన్నారు కాబట్టి సాఫ్ట్ వేర్ కంపేనీలు వీళ్ళకు ప్రిఫరెన్సునిస్తున్నాయిగానీ, అవసరం వచ్చిన రోజున సాధారణ గ్రాడ్యుయేట్లకు తర్ఫీదు ఇచ్చిమరీ తీసుకోవూ! కాబట్టి మీరు సాఫ్ట్ వేర్ కంపెనీల “క్రియేటివిటీ” సంగతి పక్కనపెట్టండి. అక్కడా “కొంత” క్రియేటివ్ పని ఉంటుంది అది ఆ 10% వాళ్ళు చూసుకుంటారు.

  రిజర్విడు సీటుతో మెడిసిన్ చదివిన విద్యార్థి పరీక్ష ప్యాస్ అయితేనే (అర్హత సాధిస్తేనే) డాక్టర్ అవుతాడు. కాబట్టి వారి అర్హతను ఏవిధంగా మీరు శంకిస్తారో నాకు అర్థం కాకుండా ఉంది. పాస్ అవ్వకుండా పట్టాపుచ్చుకుంటున్న రిజర్వుడు డాక్ట్రర్లు, కంప్యూటర్ ప్రోగ్రామర్లు ఎక్క్డున్నారో కాస్త చెబుతారా? qualification ఉన్నవాళ్ళకే అవకాశాలు ఇమ్మంటున్నాను. ఇక్కడ “మెరిట్” గురించి మళ్ళీ చెప్పకండి ఆ తరువాత నేను నవ్వడం తప్ప మరేమీ చెయ్యలేను.I know this education system better than you do for sure….

  • 35 Nandu 7:46 ఉద. వద్ద ఆగస్ట్ 28, 2009

   @Katti: You showing ur stupidy again. Do you think, a little training is enough to become a Space or Nuclear or Bilogical scientist without any intelligence and analytical skills.

   There are many sectors in Science and Technology, where persons need Knowledge, intelligence, analytical, reasoning, computational skills. These skills doesn’t come simply just a few months training.

   Even in Space and Atomic energy departments recruiting unqualified (knowledgebly)guys, they don’t involve them in the projects…. otherwise we can expect what will happen to our Rockets and Nuclear reactors……

   It’s not like sitting infront of computer blogging with all nonsense or Eating free food at universities and doing dirty things…..

 32. 36 జీడిపప్పు 11:11 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  మహేష్ గారు, ఓపికగా వివరిస్తూ చాలా కొత్త విషయాలు తెలుపుతున్నందుకు ధన్యవాదాలు.

  IT నిపుణులకు, డాక్టర్లకు ఇచ్చినట్టే దళితులకు క్రికెట్‌లో రిజర్వేషన్లు కల్పించి కఠోర శిక్షణ ఇస్తే వాళ్ళు నెగ్గుకురాలేరా?

  IT లో “కొంత” క్రియేటివ్ పని ఉంది అన్నారు. దానిని బట్టి మీకు ఎంత తెలుసో అర్థమవుతున్నది కాబట్టి ఇక్కడితో ఈ విషయం ముగిస్తున్నా. వీలయితే “ఐటీలో రిజర్వేషన్లు ఉంటే” అనే పూర్తి స్థాయి టపాలో వివరించగలను.

  ఇక మెరిట్ అంటే మీకు నవ్వురావడం చాలా చక్కగా ఉంది. ఉదాహరణకు మీ అబ్బాయికి ఒక ఆపరేషన్ చేయాలి. మీ ఊళ్ళోకి ఇద్దరు కొత్త కుర్ర డాక్టర్లు వచ్చారు. ఒకడు రిజర్వేషన్‌తో 35% మార్కులతో “పాస్” అయిన వాడు ఇంకొకడు రిజర్వేషన్ లేకుండా “మెరిట్” లో 85% మార్కులతో పాసయి డాక్టరయ్యాడు. ఇపుడు మీ అబ్బాయిని ఎవరి దగ్గరికి తీసుకెళ్తారు? ఎందుకో కాస్త వివరించగలరా?

 33. 37 Praveen 11:33 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  ప్రభుత్వం గ్రామ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య బోధించి మంచి ప్రమాణాలు పాటిస్తే దళిత విద్యార్థులలో మెరిట్ పెంచడం సాధ్యమే. రిజర్వేషన్ల అంశం వివాదాస్పదం కావడానికి కారణం మతం మార్చుకున్న వాళ్ళకి హిందూ ఐడెంటిటీ అయిన కులం పేరుతో రిజర్వేషన్లు ఇవ్వడం. ఇది మెరిట్ సమస్య కాదు.

 34. 38 కత్తి మహేష్ కుమార్ 11:57 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  @జీడిపప్పు: మీరు డాక్ట్రర్ కు మెడిసిన్ లో వచ్చిన మార్కులు చూపిస్తేగానీ వైద్యం చేయించుకోరన్న సంగతి నాకు తెలీదు. నేను మాత్రం చుట్టుపక్కలవాళ్ళని మంచి డాక్టర్ ఎవరు? అని అడిగి మాత్రమే వెళ్తాను. లేదా ఏదైనా హాస్పిటల్ వివరాలు తెలుసుకుని అక్కడ వైద్యం చేయించుకుంటాను.

  According to me marks has nothing to do with performance of any “professional”. More often, what you study has nothing to do with the “job” you do.

  ఆర్టిస్టులు, సాహితీవేత్తలు, క్రీడాకారులూ సమాజంలో కొందరే ఉంటారు. వారు “తయారు”చెయ్యబడరు. మనం ఇక్కడ మాట్లాడుతోంది, ఉద్యోగాల గురించి. సాధారణ ఉద్యోగాల గురించి. కొంత knowledge,skill and experience తో చెయ్యగలిగే ఉద్యోగాల గురించి. ప్రపంచంలో 90% శాతం ఉద్యోగాలు అలాంటివే. మళ్ళీమళ్ళీ క్రికెట్ గురించి ప్రస్తావిస్తూ మీ వాదనని మీరే trivialize చేస్తున్నారు.

  IT పరిశ్రమ మొత్తంలో క్రియేటివీటీ లేదని నేను అనటం లేదు. కానీ అక్కడా 90% ఉద్యోగాలు నేర్చుకోగలిగే కోడ్ కి సంబంధించినవే. కొన్ని languages, programming code తెలిస్తే కొంత సాధనతో ఎవడైనా చెయ్యగలిగేవే. కొత్తగా “కనుక్కోవడం” లాంటి 10% high-end operations తప్ప చాలా వరకూ “క్రియేటివిటీ/ఒరిజినల్ థింకింగ్” అవసరం లేని ఉద్యోగానే IT లో కూడా ఉన్నాయి. ఇవిగాక కొత్తగా మీరు చెప్పేవాటి గురించి నేను ఎదురుచూస్తాను.

 35. 39 Praveen 11:57 సా. వద్ద ఆగస్ట్ 27, 2009

  రాష్ట్ర జనాభాలో 16% దళితులు ఉన్నట్టు సమాచారం. 90% పైగా దళితులకి దేవాలయ ప్రవేశం లేదు కాబట్టి 90% పైగా దళితులు క్రైస్తవ మతంలో చేరిపోయే అవకాశం ఉంది. కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు, కాపు క్రైస్తవులు కూడా మతం మార్చుకున్న తరువాత కుల ఐడెంటిటీ వదులుకోవడం లేదు. రిజర్వేషన్ సౌకర్యం ఉన్న వాళ్ళు ఆ ఐడెంటిటీ వదులుకోవడానికి ఎంత వరకు ఒప్పుకుంటారనేది ప్రశ్న? అసలు దేవుడి మీదే నమ్మకం లేని ఇద్దరు నాస్తికులు ఓపెన్ గా కులం పేరు చెప్పుకుని కులం వేరు, మతం వేరు అని వాదించడం చూసాము. క్రైస్తవ మతంలోకి లేదా ఇస్లాం మతంలోకి మారిన వాళ్ళు కుల ఐడెంటిటీని అంత సులభంగా వదులుకుంటారా? ఈ ప్రశ్నలు ఆలోచించాల్సినవే.

 36. 40 కత్తి మహేష్ కుమార్ 12:05 ఉద. వద్ద ఆగస్ట్ 28, 2009

  @జీడిపప్పు: IT లో నాకు తెలిసీ సాధారణంగా ఉండేవి support, maintenance and sales services. అవికాక development. వీటిల్లో నిజంగా ఎంత క్రియేటివిటీ/ఒరిజినల్ థాట్ కావాలో నేనూ నా మిత్రుల్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. మీరూ కొంత వివరంగా చెప్పండి.

 37. 41 చదువరి 12:07 ఉద. వద్ద ఆగస్ట్ 28, 2009

  నా రిజర్వేషాలు:
  http://chaduvari.blogspot.com/2006/05/blog-post_22.html

  చరసాల ప్రసాదు గారి రిజర్వేషాలు:
  http://www.charasala.com/blog/?p=22

 38. 43 కత్తి మహేష్ కుమార్ 12:13 ఉద. వద్ద ఆగస్ట్ 28, 2009

  @జీడిపప్పు: ఐతే ఒక్క విషయం…పాఠశాలలో విద్యాబోధనకు టీచర్లని శిక్షణ ద్వారా తయారు చెయ్యచ్చు. కానీ “అందరు టీచర్లూ క్రియేటివ్ గా ఉంటారా?” అంటే దానికి సమాధానం ఉండదు. అలాగే వంట తయారు చెయ్యడం అందరూ చెయ్యొచ్చు కానీ “ఫైవ్ స్టార్ హోటల్ ఛెఫ్ లాగా క్రియేటివ్ గా వండగలరా?” అంటే సమాధానం ఉండదు. బాత్రూములు అందరూ కడగొచ్చు, కానీ “మా పనిమనిషిలాగా క్రియేటివ్ గా కడగ్గలరా?” అంటే సమాధానం ఉండదు.

  ఇలాంటి డొంకతిరుగుడు subjective సమాధానం కాకుండా, “R&D (research and development) తరహా పనులకు క్రియేటివిటీ కావాలి” వంటి అర్థవంతమైన సమాధానం మీరు ఇస్తారని ఆశిస్తాను.

 39. 44 Praveen 1:46 ఉద. వద్ద ఆగస్ట్ 28, 2009

  విద్యా ప్రమాణాలు పెంచితే మెరిట్ అనేది సమస్య కాదు. మెరిట్ ఉన్నా కూడా మతం మార్చుకున్న వాళ్ళు రిజర్వేషన్ కోసం కులం పేరు చెప్పుకోవడం తప్పు కాదా? మతం ప్రశ్నకి సమాధానం దాట వేస్తే ఎలా?

 40. 45 జీడిపప్పు 6:41 ఉద. వద్ద ఆగస్ట్ 28, 2009

  మహేష్ గారు, ఆ డాక్టర్లు ఆ ఊరికే “కొత్తగా” వచ్చారు, పైగా వారు వృత్తికే కొత్తవారు అని స్పష్టంగా చెప్పినా మీ బుర్రకు ఎక్కకపోవడం శోచనీయం. ఆ ఇద్దరు డాకటర్లు తప్ప మీకు వేరే దిక్కులేదు. మీకు తెలిసిందల్లా ఒకడు రిజర్వేషన్‌తో 35% మార్కులతో “పాస్” అయిన వాడు ఇంకొకడు రిజర్వేషన్ లేకుండా “మెరిట్” లో 85% మార్కులతో పాసయి డాక్టరయ్యాడు. ఇపుడు మీ అబ్బాయిని ఎవరి దగ్గరికి తీసుకెళ్తారు? ఎందుకో కాస్త వివరించగలరా?

  “నేను మాత్రం చుట్టుపక్కలవాళ్ళని మంచి డాక్టర్ ఎవరు? అని అడిగి మాత్రమే వెళ్తాను” లాంటి డొంక తిరుడు సమాధానాలు కాకుండా మీ అంతట మీరు నిర్ణయం తీసుకోవలసి వస్తే ఎవరి దగ్గర వైద్యం చేయిస్తారో అర్థవంతమైన సమాధానం మీరు ఇస్తారని ఆశిస్తాను.

 41. 46 జీడిపప్పు 7:15 ఉద. వద్ద ఆగస్ట్ 28, 2009

  మహేష్ గారు, ఇక IT సంగతి అంటారా – మీ మిత్రుల్ని ఇది అడిగి చూడండి: maths, anaytics, programming లో ఒకడికి 80% ఇంకొకడికి 35% వచ్చాయి. వీరిద్దరిలో ఎవరు ఎఫిషియంట్ గా ప్రోగ్రాం వ్రాయగలరు? వీరిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు?

  అన్నట్టు “ఎవరు రాసినా వచ్చేది same output కదా” అని అతితెలివి సమాధానమిచ్చే వాడిని కాకుండా efficiency అంటే తెలిసిన వాళ్ళను అడిగి చూడండి.

 42. 47 Praveen 10:09 ఉద. వద్ద ఆగస్ట్ 28, 2009

  దళిత విద్యార్థుల్లో మెరిట్ పెంచడం సాధ్యమే అని నేను ఇందాక చెప్పాను. మెరిట్ గురించి అడిగితే ప్రయోజనం ఉండదు. నాస్తికుడైన మహేష్ తన పిల్లలకి హిందూ చిహ్నం అయిన కులం పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పించాలనుకోవడం, అందుకు క్రైస్తవ రిజర్వేషన్లని కూడా సమర్థించడం గురించి అడగండి. మందార ప్రభాకర్ గారు తన సిద్ధాంతాలూ, మహేష్ సిద్ధాంతాలూ ఒకటేనని చెప్పుకున్నారు. మహేష్ సమాధానం చెప్పలేకపోతే ప్రభాకర్ గారిని అడగండి.

 43. 48 Malakpet Rowdy 11:23 ఉద. వద్ద ఆగస్ట్ 28, 2009

  Easy guys! I dont think the issue of reservations is gonna hot the Private Sector in the near future (Unless I’m terribly wrong) – The organizations are interested in recruiting whoever gets them money .. be it Dalit or be it someother. If the Govt tries to enforce reservations then many of the jobs will go to the other BRIC countries or Vietnam.

 44. 49 Praveen 7:07 సా. వద్ద ఆగస్ట్ 28, 2009

  డబ్బున్న దళితులు వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే బ్యాంక్ లోన్ సులభంగానే వస్తుంది. వీళ్ళకి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు చెయ్యాల్సిన అవసరం ఏమిటి? మన బ్యాంక్ లు డబ్బున్న వాళ్ళకి అనుకూలంగా పని చేస్తున్నాయని వీళ్ళకి తెలియదా?

 45. 50 Praveen 7:45 సా. వద్ద ఆగస్ట్ 28, 2009

  ఆర్థిక సంక్షోభం వస్తే ప్రైవేట్ ఉద్యోగం ఊడిపోయే అవకాశాలు ఇంకా ఎక్కువ. వీళ్ళకి నిజాయితీ ఉంటే జాతీయ కంపెనీల ప్రైవేటీకరణని వ్యతిరేకించాలి కానీ ప్రైవేట్ సెక్టార్ లో రిజర్వేషన్లు డిమాండ్ చెయ్యడం వల్ల ప్రయోజనం ఉండదు.

 46. 51 Praveen 10:43 సా. వద్ద ఆగస్ట్ 29, 2009

  http://vrdarla.blogspot.com/2009/08/blog-post_29.html మర “రిజర్వేషా”లని దళితులు కూడా వ్యతిరేకిస్తున్నారు.

 47. 52 suresh 8:04 సా. వద్ద సెప్టెంబర్ 16, 2009

  అందరి అభిప్రాయం వోపిగ్గా చదివాను. కాని రిజర్వేషన్ల గొడవ ఎప్పుడు విరగడ ఐతే అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది అని నేను బలంగా నమ్ముతాను. మనిషికి (వికలాంగులు తప్ప) చేయూత కొంతవరకే ఇవ్వాలి. అమ్మైనా జీవితకాలం బిడ్డకు పాలివ్వదుకదా? పోషించదు కదా? మరి ప్రభుత్వం ఎందుకివ్వాలి? విద్యార్థి దశలొ ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వార , వివిధ పథకాల ద్వార ప్రొత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాలె తప్పౌ ఇంజనీరింగ్ కి, యం.బి.బి.యెస్. కి ,వుద్యొగాలకి, ప్రమొషన్ లకి ఇలా.. జీవితమంతా సాయం చేస్తు పోతె రిజర్వేషన్లు అంతమయ్యెదెపుడు? సంఘం లొ పరివర్తన వచ్చేదెప్పుడు? దీని వల్ల ఎంతొ మంది ప్రతిభావంతులకి అవకాశాలు మ్రుగ్యమైపొతాయి. సమసమాజం రావాలంటే ఇంకొకడి కడుపు కొట్టాలనే ‘రాబిన్ హూడ్ సిద్దాంతం మాని , వెనుక బడిన వాడిని మన నాయకులు ప్రొత్సహించాలి. అది కూదా విద్యార్థి దశ లోనే!

 48. 53 Indrasena Reddy 4:54 ఉద. వద్ద ఏప్రిల్ 26, 2010

  @ మహేష్ కుమార్ గారు

  నా అభిప్రాయలు కూడ అచ్చం మీ అభిప్రాయలు లాగె ఉన్నాయి అండి.కొన్ని వర్గాల ప్రజల్ని వందల తరాలుగా విద్యకి,ఆస్థికి దూరంగా పెట్టి వారికి ఇవాళ ఎటువంటి సప్పొర్ట్ ఇవ్వకూడదు అనడం అన్యాయం అని నా అభిప్రాయం.భారత దేశంలొ ప్రతి కట్టడం,రోడ్డు,గుడి,మసీదు,చర్చి,తినే ప్రతి తిండి గింజ, దళిత చెమట ద్వారానె వస్తుంది అని నేను ఖచ్చితంగ నమ్మే అభిప్రాయం.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: