పెళ్లిళ్లలో జరిగే చదివింపుల తంతు గురించిన హాస్య టపా అనుకున్నారా? అయితే తప్పులో కాలేసినట్లే. నా స్నేహితుడి కుమార్తె – పదేళ్ల పూజా వాసన్ – తలపెట్టిన బృహత్కార్యానికి చిరు చేయూతనిచ్చే సదుద్దేశంతో రాస్తున్న బుల్లి టపా ఇది.
ఈ మీడియా యుగంలో బుడతల నుండి పెద్దలదాకా అన్ని వయసులవారిలోనూ చదవటం అనే అలవాటు బాగా తగ్గిపోయిందనేది కాదనలేని సత్యం. ప్రపంచవ్యాప్తంగా ప్రచురణ రంగం పెను సంక్షోభంలో ఉండటం దానికో నిదర్శనం. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం కన్నా టీవీ చూడటమే ఇప్పుడు అధికుల వ్యాపకం. టీవీ చూడాల్సిందే. దానివల్ల ఒరిగే లాభాలూ ఉన్నాయి – మంచి మంచి కార్యక్రమాలు చూస్తే. అయితే పిల్లల్లోనూ, పెద్దల్లోనూ వ్యక్తిత్వ వికాసానికి మంచి పుస్తకాలు చదవటమూ ఇతోధికంగా దోహదం చేస్తుందనేది నిజం. ఈ టపా చదివేవారందరూ పుస్తకాల పురుగులే అయ్యుంటారు కాబట్టి – పుస్తకాలు చదవాల్సిన ఆవశ్యకత గురించి ఇంతకన్నా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు – కనుక ఎకాఎకీ అసలు విషయంలోకెళదాం.
ఈ ఏడాది సెప్టెంబరు తొమ్మిదిన, ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల తొమ్మిది సెకండ్లకు (09/09/09 @ 09:09:09) తనకు చేతనైనంతమందితో ఏదో ఒకటి చదివించాలని చిన్నారి పూజ సంకల్పం. తన బుర్రలో పుట్టిన ఈ చిట్టి ఆలోచనకి Global Read-a-thon గా పేరు పెట్టి దాని ప్రచారం కోసం ఒక వెబ్ పేజ్ రూపొందించిందా అమ్మాయి. మీరు చెయ్యవలసిందల్లా ఆ వెబ్ పేజ్‌కి వెళ్లి పూజ అభ్యర్ధన చదవటం, ఆ పేజ్ని (లేదా అందులో సందేశాన్ని) మరో పదుగురికి పంచటం. ఆ తర్వాత, వచ్చే నెల తొమ్మిదో తారీఖున చేతనైనంతమందితో చేరువలో ఉన్న పుస్తకాన్నొకదాన్ని చదివించటం. ఏమంత కష్టం?
మరెందుకాలస్యం – ఓ చూపు చూడండి: WWW.GlobalReadAThon.US
గమనిక: ఇది ఛారిటీ/విరాళాలకి సంబంధించిన వ్యవహారం కాదు.
చాలా మంచి ఆలోచన… చిన్న పాప కు వచ్చింది తప్పకుండా అందరికి చెప్పాలి.. మాకు తెలియచేసినందుకు దన్యవాదాలు.
Nice.
great!!
Excellent.
I will do my bit
హ్మ్మ్
My contribution will be there!
చాలా మంచి విషయం చెప్పారు. నా పరిధిలో నేను చేయగలిగినది చేస్తాను.
I’ll contribute from my end
తప్పకుండా నా వంతు సాయం నేను చేస్తానండి. ఒక పదేళ్ల పిల్ల ఇంత బృహత్తర కార్యానికి పూనుకోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. మా మిత్రులలో చాలా మందికి ఇంకా mail idలు నిర్వహించడం కూడా రాదు, కాని ఇక్కడ ఒక పదేళ్ల అమ్మయి ఒక సైటు నిర్వహించడం నాకు నిజంగా ఆశ్బర్యమేస్తున్నది.
మంచి ఆలోచన, నావంతు కృషి నేను చేస్తాను.
పిల్లలు కాదు పిడుగులు, తప్పక కృషి చేస్తాను.
మంచి ఆలోచన, నావంతు కృషి నేను చేస్తాను.