కథలు చదవటమే తప్ప రాయటం నాకలవాటు లేదు. మొన్నీ మధ్యనే మొదటిసారిగా ఓ కథ రాయాలనే కోరిక పుట్టింది (దీన్నే కొందరు దురద అంటారు. అరచేతుల్లో పుట్టిందిది, అంత తేలిగ్గా వదిలేనా?) ఏం రాయాలో అప్పటికైతే తెలీదు. అనుకున్నాక ఆలోచిస్తే చిన్న కథాంశం తట్టింది – wafer thin storyline అంటారే, అలాంటిదన్నమాట. కట్టె, కొట్టె, తెచ్చె అంటే ఒకే పేజీకి సరిపోయే అంశం. చిలవలు పలవలు చేర్చి కొన్ని సన్నివేశాలు, పిసరంత సస్పెన్స్ కలిపి చూసుకుంటే పదిహేను పేజీలకి సాగిపోయింది. అనవసరమనుకున్న పేరాలు, వాక్యాలకి అడ్డ కత్తెరేస్తే చివరాఖరికి పది పేజీల చిల్లర మిగిలింది. పూర్తి చేసి ‘కౌముది’ సంపాదకులకి పంపితే వారికది నచ్చింది, తాజా (జులై) సంచికలో వెలువడింది. గడియారం – నా తొలి కధ. పెద్ద గ్రౌండ్‌బ్రేకింగ్ కథేమీ కాదు, కానీ మీకు విసుగెత్తించదని నాదీ హామీ. చదివి చెప్పండి ఎలా ఉందో, ఇంకెలా ఉంటే బాగుండేదో.
కథ కోసం ఇక్కడ నొక్కండి.
ఈ సినిమా నేను చూశాను!
starting konchem dull ga vunna raanuraanu oopiribigabatti chadhivimpachesindhi.chaala baaga raasaru ,.
కథాంశం బాగానే ఉంది. ఇంకా చిక్కగా అల్లొచ్చు అనిపించింది. హోటల్లో ఇద్దరి మధ్యా జరిగిన చర్చ అనవసరంగా సాగదీసినట్లుంది.ఇంకా క్లుప్తంగా ఉంటే విసుగుపుట్టించకుండా ఉండేది. ఉపసంహారం యండమురి స్టైల్లో ఉంది. కథనం విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంకా మంచి కథగా రూపు దిద్దుకుని ఉండేది అనిపించిందండీ అబ్రకదబ్ర గారూ! అలాగే ఎత్తుగడ కూడా! జరిగిన కథ చెప్తున్నట్లు కాక ఏదైనా చిన్న సంభాషణతోనో, సంఘటనతోనో ప్రారంభించి ఉంటే మరింత బాగుండనిపించింది.
మొదటి కథ విజయవంతం అయినట్లే! అభినందనలు! మీ బ్లాగు పోస్టు పేరు “నా మొదటి కథ-గడియారం”అని పెట్టుంటే ఎక్కువమంది మీ కథ చదవగలరు !
modatlo irani chai daggara koncham bore anipinchina taruvatha manchi pattu kanipinchindi andi kadhalo.bagundi
I just loved it..యండమూరి కథలా ఉంది..
దట్స్ ఎ కాంప్లిమెంట్…యూ విల్ ష్యూర్లి బి బెటర్ దాన్ హిమ్…ఐ జుస్ట్ లవ్డ్ ఇట్..
******************************
బట్..వాట్ మేక్స్ పీపుల్ టు రీడ్ ఇట్ ఎ సెకండ్ టైమ్…ప్లీజ్ బేర్ మై చచ్చు ప్రశ్న…వి కెన్ డిస్కస్ దిస్ ఆఫ్టర్ ఎ మంత్..ఆర్ వెన్ ది యుఫోరియా ఈజ్ ఓవర్…బట్ ఐ లైక్డ్ ఇట్.
కొన్ని విషయాలు ఒక సారి వింటేచాలు…. కొన్ని కథలు ఒక సారి చదివితే చాలు…..
పది కాలాలు గుర్తుంటాయి.
బావుంది….
కథ చాలా బాగుందండీ…! కొంచం తెలుగు సినిమాలు ఎక్కువ చూసిన మహిమ వల్ల ఏమో… సీతారాం చనిపోయినట్టేనా?
మాంచి పట్టుగా వ్రాసారు. అభినందనలు !
@మహేష్:
ఏ సినిమా?
@చిన్ని,సుజాత,రూట్స్:
కథ మొదలయిన పద్ధతి నాకూ నచ్చలేదు. నేను మొదట రాసుకున్న ఆరంభం మరో విధంగా ఉంటుంది. మరీ పొడుగైపోవటం, మరి కొన్ని ఇతర కారణాలవల్ల ఇలా సాదా ఆరంభాన్ని ఎంచుకోవాల్సొచ్చింది.
ఇరానీ హోటల్ సన్నివేశం చాలా కీలకమైనది. ఆఖర్లో cause & effect కి సంబంధించిన ఒక మోస్తరు paradox situation కల్పించటానికి ముందస్తు ఏర్పాట్లవన్నీ. నిజానికక్కడ అనవసరమైన వాక్యాలేవీ లేవు – ‘షేవింగ్ క్రీం’ సంభాషణతో సహా. అవన్నీ తరచి చదివితే కథ ముగింపు గురించి కనీసం అరడజను హింట్స్, మరి కొన్ని misleading clues కనిపిస్తాయి – గమనించారా? అందుకే దాన్ని తగ్గించలేకపోయాను.
యండమూరిలా ఒక వాక్యం రాయటం – it was deliberate. పట్టేసినట్లున్నారు 🙂
@రేరాజ్:
నేనే చెట్టు చిటారు కొమ్మనున్నానో చెప్పుకోండి చూద్దాం.
@వరుణుడు:
సీక్వెల్ రాసే ఉద్దేశంతో అలా వదిలేశానేమో 😉
very cool. We have our own Madhu babu!
అర్రె…నా మొదటి వ్యాఖ్యలో స్మైలీలు పెట్టడం మర్చిపోయానే. మీకథ చదివినంతసేపూ ఏదో సినిమా చూసినట్లు అనిపించింది. నిజానికి ఇదొక కథలాగా కాకుండా కొంత అటూఇటుగా ఒక స్క్రీన్ ప్లే చదివిన అనుభవం వచ్చించి. అందుకే ఈ సినిమా నేను చూశా అన్నాను. ఆ కేఫే సీనొక్కటే మరీ సా…గతీసినట్లనిపించింది.
బాగుంది ..చాలా బాగా రాసారు ..కాస్త భిన్నం గా 🙂
నా అభిప్రాయం ఆల్రెడీ పైన చెప్పేశారు 🙂
కధ ఆరంభం బాలేదు కానీ, కధ కొనసాగిన తీరు బావుంది.. మంచి ప్రయత్నం.. మొదటి కధే కౌముదిలో ప్రచురితమైనందుకు అభినందనలు..
chala bagundi.
http://www.makemeideal.com
కనబడటం లేదు..ఎక్కడికో వెళ్ళిపోయారు..నేను చదివిన ఒకటి రెండు సోమర్సెట్ మోగమ్ కధలను మించిపోయింది. దీనికి సీక్వెల్ ఐడియా నాకు రాలేదు… ఆ ఐడియా ఇంకా బావుంది.
“నేను చదివిన ఒకటి రెండు సోమర్సెట్ మోగమ్ కధలను మించిపోయింది.”
abrakadabra garu – no offense intended either to you or to your story..
Rayraj – సోమర్సెట్ మామ్ కథలతో పోలికేమిటండి! సోమర్సెట్ అభిమానిగా ఒక్కసారి మనసు చివుక్కు మంది. మీ అభిప్రాయాలు మీ ఇష్టం అనుకోండి, కానీ తట్టుకోలేక…..
నేను రెండు guess చేసాను ..
1) రెడ్డే చంపుతాడెమో అనుకున్నాను
2) మీరు కథలో __edited__ .. (__edited__ అవే కదా ఎక్కువ జరిగేది ..)
ఓవర్ ఆల్ .. కథ బాగుంది .. __edited__ సూపర్ లాజిక్
ఉచిత సలహా:
ఒక స్నేహితుడి మీద అంత నమ్మకంతో తన అదృష్టాన్ని అతని చేతుల్లో పెట్టడం నమ్మకాశ్యంగా లేదు. ఎదైన చిన్న రీజన్ చెపితే బాగుందెమో ..
@a2z:
స్నేహితులకు అంతకన్నా పెద్ద సాయాలు చేసేవాళ్లుంటారు. సీతారామ్‌కి అయాచితంగా వచ్చినదాన్ని స్నేహితుడికివ్వటానికి కారణాలు వివరించటం అనవసరం అనిపించింది.
@a2zdreams: నమ్మచ్చు. నిజంగానే అంతకంటే ఎక్కువ చేసే స్నేహితులూ ఉంటారు.అందికే మంచి స్నేహాలు అనేవి కూడా ఉంటాయి. ఏ విషయాన్ని లేదా ఏ మనిషిని నమ్మలేకపోవటం కన్నా, నమ్మి మోసపోవటమే మంచిది. అది “నమ్మకం” అనేది ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మోసపైనవాడికీ, మోసం చేసే వాడికీ కూడా.
“నమ్మకం నమ్మకం నమ్మకం……నమ్మకమే లేకుంటే బతుకేది”…ఏదో జెమినీ సీరియల్లా టైటిల్ సాంగ్. చాలా రోజులైపోయింది ఆ సీరియల్ ఐపోయి. ఆ ఒక్కలైను మాత్రం ఎప్పుడూ చెవుల్లో మోగుతూనే ఉంటుంది నాకు.
అబ్రకదబ్ర గారు మొదటి కధే కౌముది లో అచ్చయినందుకు అభినందనలు.
కధ చాలా బాగుంది. పైన కొందరు చెప్పినట్లు ఇరానీ కేఫ్ ఎపిసోడ్ కాస్త బోరు కొట్టించింది. మీరు చెప్పినట్లు హింట్ లున్నాయ్ కానీ, నా మట్టి బుఱ్ఱ కధ పూర్తయ్యే వరకూ గ్రహించలేక పోయింది. కానీ ముగింపు యండమూరి గారి స్టైల్ లో, కధనం మధుబాబు శైలి లో ఉందనిపించింది 🙂
అన్నట్లు చాయ్ బాగుంటాయా, చాయ్ బాగుంటుందా 🙂 హ హ ముళ్ళపూడి వారిలా “అంతపెద్ద కధలో వీడికి ఇదే కనిపించిందా” అని విసుక్కోకండేం మీ రచనల్లో అప్పుతచ్చులుండవు కదా అందుకని అడుగుతున్నా… బహుశా ఇది నాకు పరిచయం లేని వాడుక అయి ఉండచ్చు.
మీరు ‘నీళ్ళు వస్తుంది’ అనే తరహా ఐతే మీకు చాయ్ ‘బాగుంటుంది’; ‘నీళ్లు వస్తున్నాయి’ తరహా ఐతే మీకు చాయ్ ‘బాగుంటాయి’ 😉
నాకైతే సీతారం రెడ్డికి ఎలా బోర్ కొట్టిస్తున్నాడో అదే ఇరానీ ఎపిసోడ్లో కనపడింది.. అది రచయిత రెడ్డికి కలిగే చిరాకుని చూపిస్తున్నట్టే అనిపించింది కానీ, నేను చదివేప్పుడు బోర్ ఫీల్ అవ్వలేదు, చిరాకు కలగలేదు… మంచి కథ! మంచి పనిలో ఉన్నా కూడా మొదలుపెట్టి చివరవరకూ ఆగకుండా చదివేసాను…
హ హ మంచి సమాధానం ఇచ్చారు 🙂 సమస్య ఎక్కడంటే… నేను నీళ్ళు వస్తున్నాయ్, చాయ్ బాగుంటుంది అనే తరహా అందుకే అసలు ఈ అనుమానం వచ్చింది మరి 🙂
అన్నట్లు దిలీప్ గారు చెప్పినట్లు ఆ సన్నివేశం లో బోర్ కొట్టడం సబబే అనిపిస్తుంది 🙂
అబ్రకదబ్రగారు,
మీ మొదటి ప్రయత్నం చాలా బాగుంది. ఆసక్తితోపాటు ఆలోచనలూ రేకెత్తే కథ (ఆలోచల్ని రేకెత్తించడానికి మీరు ప్రత్యేకంగా ప్రయత్నించలేదు కాని).
కథ చదవగానే Matrix సినిమాలో హీరో Oracle దగ్గరకి వెళ్ళినప్పటి సీను గుర్తుకొచ్చింది. “#Don’t worry about the vase#” ani ఆవిడ anaDaM, ఏవిటని చూడబోయి పక్కకి తిరిగి నిజంగానే దాన్ని అతను పెడెయ్యడం, ఆ తర్వాత వాళ్ళ సంభాషణ.
పదాలు, వాక్యలు మరికొంత సానపడితే మరింత బావుంటుంది. ఉదాహరణకి:
“సహ రూమ్మేటు” – రూమ్మేటంటేనే చాలు దానికి సహ అనవసరం.
“చేర్చుకుంటాననొక” – చదవడానికి కొంచెం కష్టం, “ఒక” విడగొడితే బావుంటుంది.
“అసలు ధరకే ఉచితంగా పాతికశాతం క్రీం అదనం” – ఈ వాక్యం కొంచెం కృతకంగా ఉంది.
చాయ్ షాపులోని సంభాషణలో రెడ్డి గడియారం గురించి చెప్పిన మాటలు మరికాస్త తేలిగ్గా ఉంటే బావుణ్ణనిపించింది.
@కామేశ్వరరావు:
>> “ఆలోచల్ని రేకెత్తించడానికి మీరు ప్రత్యేకంగా ప్రయత్నించలేదు కాని”
ప్రత్యేకంగా ప్రయత్నించినట్లు కనిపించకుండా ఉండటానికి ప్రయత్నించాను. ఐతే, ఆ విషయం మీరు పసిగట్టేసిన సంగతి నేను పసిగట్టేశానన్న సంగతి మీకు తెలుసని నాకు తెలుసు 🙂
పద ప్రయోగాల గురించి మీ సూచనలు గుర్తుంచుకుంటాను. ఇచ్చినందుకు ధన్యవాదాలు.
వేణూ శ్రీకాంత్
నీళ్ళు వస్తున్నాయి, చాయ్ బాగుంటుంది….చాలా మంది ఇదే టైపు. అదే కరెక్టు కూడా!(కాబట్టి నేను కూడా అదే టైపు) నీళ్ళు బహువచనమే కాని, కాఫీ టీలు ఏకవచనమే అనిపిస్తుంది..:-)
Thanks సుజాత గారు 🙂