గులాబి గోల

పదేళ్లనాటి సంగతి. అమెరికా జీవితం ఇంకా కొత్తగానే ఉన్న రోజులు. ఇక్కడి అలవాట్లు, పద్ధతులు నేర్చుకుంటున్న దశ. శాన్ ఫ్రాన్సిస్కోలో పనిచేసేవాడిని అప్పట్లో నేను. మా టీమ్‌లో నేనొక్కడినే భారతీయుడ్ని. ఓ రోజు నా టీమ్మేట్లు కొందరు నాకేసి కొంత వింతగా చూస్తున్నట్లనిపించింది. ఎందుకో అర్ధం కాలా. అడుగుదామంటే మొహమాటం (భయం అనాలేమో. ఇండియాలో ఉండగా చూసిన హాలీవుడ్ సినిమాల ప్రభావం. అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడుకునే అమెరికన్లు హఠాత్తుగా పిస్తోళ్లు తీసి ఒకర్నొకరు కాల్చేసుకోటం ఎన్ని సినిమాల్లో చూడలా? అడిగితే అలాగే రియాక్టవుతారేమోనన్న భయం అన్నమాట)

సాయంత్రానికి, అలా తేడాగా చూసేవాళ్ల సంఖ్య పెరుగుతున్నట్లనిపించింది. ఇక లాభం లేదనుకుని మొహమాటం వదిలేసి (‘ధైర్యం తెచ్చుకుని’గా చదువుకోగలరు) కాస్త సాత్వికుడిగా కనబడే ఓ టీమ్మేటుడ్ని అడిగేశా, ‘ఏంటి గురూ, నాకేసందరూ ఎందుకలా చూస్తున్నారు?’ అని. ‘తెలుగులో అడిగావా’ అంటూ చొప్పదంటు ప్రశ్నలేయొద్దని మనవి.

టీమ్మేటుడు గంభీరంగా – అంటే నవ్వాపుకుంటూ – చెప్పాడు, ‘ఏం లేదు. నీ చొక్కా బాగుందనీ’.

కొత్త చొక్కానే. కానీ అంత బాగుండటానికేముందో అర్ధం కాలా. అదే అడిగా.

‘అంటే, డిఫరెంట్ కలర్ కదా. అది బాగుందన్న మాట’, బుర్రపై లేని జుట్టు బరుక్కుంటూ చెప్పాడతను.

అంత డిఫరెంట్ కలర్ కూడా కాదే! లేత గులాబీ రంగు. నాకు ఇష్టమైన రంగేమీ కాదు, అయిష్టమైనదీ కాదు. ఏదో చేతికందింది, కొన్నాం, ధరించాం. చొక్కా కూడా అంత స్టైలిష్‌గా ఉండదు. ఏదో దాస్తున్నాడు గురుడు. మళ్లీ రెట్టించి అడిగాను, డెస్క్ వెనక నక్కటానికి సిద్ధమౌతూ. తుపాకీ గట్రా తీస్తే తప్పుకోవాలి కదా మరి.

తుపాకి పేలలేదు కానీ తూటాలాంటి ప్రశ్నొచ్చింది అతన్నుండి, ‘ఆ రంగు దేనికి గుర్తో తెలుసా నీకు?’ 

షాట్ కట్ చేస్తే, ఆ వారాంతం నా దగ్గరున్న గులాబి రంగు వస్తువులు – ఆ వర్ణంతో సుదూర సంబంధమున్నవి సైతం, మణిరత్నం ‘రోజా’ సినిమా డీవీడీతో సహా – అన్నీ సాల్వేషన్ ఆర్మీ వారికిచ్చేయబడ్డాయి.

ఆ నాడు – ‘రంగులకీ విపరీతార్ధాలా! ఇదేం దేశంరా బాబూ’ అని చిరాకొచ్చింది. ఆ తర్వాత ఏడాదికో రెండేళ్లకో ఓ మహానుభావుడు తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేసే మహాశయంతో పార్టీ ఒకటి పెట్టి గులాబి రంగు జెండా ఎంచుకున్నప్పుడు నవ్వొచ్చింది. అప్పటికి అమెరికా అంతో ఇంతో వంటబట్టిందాయె.

* * * *

పదేళ్ల పాత కధ. ఇప్పుడెందుకు గుర్తొచ్చిందంటే – ‘గులాబి బాలలు, బాలికలకు డిస్కౌంట్ రేట్లతో అలాస్కా క్రూయిజ్ అవకాశం’ అన్న ప్రకటన నేడో వార్తాపత్రికలో చూడబట్టి. కాదేదీ వ్యాపారానర్హం. అదేమంటే సమానత్వమట! వికలాంగులకీ, వయసు మళ్లిన వారికీ అలాంటి అవకాశాలు కల్పించే ప్రకటనలెప్పుడన్నా చూశామా?

ఇది ఫ్యాషన్ భరిత ప్రపంచం. చిరిగిన దుస్తులు, జిబ్బిరి జుట్ల ఫ్యాషన్ మొన్నటిదాకా నడిచింది. మానసిక వికారాలకు లోనయ్యేవారి సమానత్వం, హక్కుల కోసం పలవరించటం నేటి లేటెస్ట్ ఫ్యాషన్. అది పాశ్చాత్య దేశాలకి పరిమితమైతే మనకి సమస్య లేదు. ప్రపంచీకరణ మహత్తుతో మనదేశానికీ దిగుమతయ్యిందిది. ఈ విషయంలో పాశ్చాత్యులని తప్పుబట్టనవసరం లేదు. వాళ్ల సమస్యతో వాళ్లు వేగుతారు, మనకనవసరం. పులిని చూసి వాతలు పెట్టుకునే స్వదేశీ ఫ్యాషన్ పోరగాళ్లు వినోదం ముసుగులో ఇలాంటి పెడ ధోరణులని దేశమంతటా పాకించటానికి చేసే నిర్విరామ ప్రయత్నం ఉందే – అదీ తప్పు పట్టాల్సిన విషయం.

నేను చెప్పేది బాలీవుడ్ దర్శక నిర్మాతల గురించి. పేరు సైతం హాలీవుడ్ నుండి ప్రేరణ పొంది కానీ పెట్టుకోలేని భావదారిద్ర్య రంగమది. అధిక శాతం సినిమాలు ఎక్కడ్నుండో ఎత్తేసిన కధలతో మాత్రమే నిండి ఉండటం ఈ పరిశ్రమ ప్రత్యేకత. అంతటితో ఆగితే ఫరవాలేదు. కొత్తగా తమ మనో వికారాలు ప్రేక్షకుల మీద రుద్దే ఉద్దేశంతో సినిమాలు తీసే నవ యువతరం ఒకటి పుట్టుకొచ్చింది. ‘కల్ హో న హో’తో ఈ ధోరణి మొదలయింది. ‘దోస్తానా’తో తారాస్థాయికెళ్లింది (దోస్తానా-2 కూడా రాబోతున్నట్లు తాజా వార్త). అవి తీసేవారి వ్యక్తిగత జీవితాలు పరిశీలిస్తే, ఏ రహస్య అజెండాలూ లేకుండా వినోదం కోసమే ఇటువంటి సినిమాలు తీస్తున్నారంటే నమ్మటం కష్టం. వీళ్ల పుణ్యాన ఈ చీడ మెల్లి మెల్లిగా ఇతర భాషా సినీ రంగాలకీ పాకింది. కామెడీ పేరుతో వెకిలి వేషాలేయించే వాళ్లు మనకెప్పుడూ ఉన్నారు. వాళ్లకిప్పుడో కొత్త అస్త్రం దొరికింది. గులాబి వీరుల గోలతో నిండిన హాస్య సన్నివేశాలు ఇప్పుడు తరచూ దర్శనమిస్తున్నాయి మన సినిమాల్లో. అతి తేలిగ్గా వ్యామోహాలకి గురయ్యే టీనేజ్ బుర్రలకి ఇటువంటి సన్నివేశాలిచ్చే సందేశాలేమిటో ఊహించటం తేలికే. పేరు గొప్ప సెన్సార్ ఉండీ ఉపయోగం లేని పరిస్థితి. ఎలాగోలా వార్తల్లో ఉండే యావతో బరితెగించిన బాలీవుడ్ నటీమణుల ఫోటో విన్యాసాలు, బహిరంగ వ్యాఖ్యలు కూడా దీనికి ఆజ్యం పోస్తున్నాయి. అశ్లీల ప్రతిఘటనా వేదికలూ, సంఘాలూ ఈ ధోరణిపై ఇంకా దృష్టి పెట్టిన ఆనవాళ్లు లేవు. సంస్కృతి పరిరక్షణోద్యమకారులకి పరాయి మతాలపై విరుచుకు పడటానికే ఎక్కడి సమయమూ చాలటం లేదు, ఇక ఇటువంటివి పట్టించుకునే తీరికేది పాపం?

ఎవరో పట్టించుకునేదాకా మనమెందుకాగాలి? ఉద్యమాలన్నీ కలివిడిగా చెయ్యాల్సిన అవసరం లేదు. కొన్ని విడివిడిగానూ చెయ్యొచ్చు. ఎవరికి వారు అటువంటి సినిమాలని బహిష్కరించే నిర్ణయం తీసుకోవాలి. తాము చూడటం మానేయాలి, మరో నలుగురితో చెప్పి మాన్పించాలి. ఏమంత కష్టం. చెయ్యలేమా?

25 స్పందనలు to “గులాబి గోల”


 1. 1 Krishna22 4:07 సా. వద్ద జూన్ 23, 2009

  I got a kind of culture shock when I watched a song from that movie.

  I was also victim of this scary pink.

 2. 2 మేధ 10:10 సా. వద్ద జూన్ 23, 2009

  నిజమే… మార్పు ఎక్కడో రావక్కర్లేదు, మన నుండి మొదలయితే చాలు..

 3. 3 కె.మహేష్ కుమార్ 1:07 ఉద. వద్ద జూన్ 24, 2009

  “ఏ రహస్య అజెండాలూ లేకుండా వినోదం కోసమే ఇటువంటి సినిమాలు తీస్తున్నారంటే నమ్మటం కష్టం.”…ఆ రహస్య అజెండా ఏమిటంటారూ? అందర్నీ కాకపోయినా కనీసం కొందర్నైనా ‘గే/లెస్బియన్’లుగా మార్చాలనా!

  అసలు ఈ “సమస్య” శారీరకఆరోగ్యానికి సంబంధించిందా మానసికారోగ్యానికి సంబంధించిందా అనేదే ఇంతవరకూ తేలలేదు. కాబట్టి సమాజానికి ఈ విధానం వ్యతిరేకమని మీడియానుంచీ వీటిని తొలగించాలంటే దానికొక ప్రాతిపదిక కావాలి.అది బహుశా ప్రస్తుతానికి లేదు.

  కాకపోతే, వీళ్ళు అసాధారణ స్థితిలో ఉన్న సాధారణ మనుషులే కాబట్టి మానవహక్కులు వీళ్ళకూ ఉన్నాయి అనేది ఎవరూ కాదనలేని విషయం. అందుకే “హక్కుల ఉద్యమాలు” ఊపందుకున్నాయి. ముఖ్యంగా AIDS వ్యాధి నేపధ్యంలో భారతదేశంలో వీరిని వ్యవస్థీకరించి ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో భాగం చేశారు. If you know the numbers you might wonder. Its huge. That much I can assure you.

 4. 4 అబ్రకదబ్ర 8:40 ఉద. వద్ద జూన్ 24, 2009

  @మహేష్:

  >> “అసలు ఈ “సమస్య” శారీరకఆరోగ్యానికి సంబంధించిందా మానసికారోగ్యానికి సంబంధించిందా అనేదే ఇంతవరకూ తేలలేదు”

  ఏదో ఓ ఆరోగ్యానికి సంబంధించినదన్న విషయం మాత్రం ఒప్పుకుంటారు కదా. ఇదో జబ్బు అన్నంత వరకూ ఏకాభిప్రాయమే. ఇది మానసికమైనదే అన్నది నా అభిప్రాయం. ముసుగుల్లేకుండా చెప్పాలంటే, పిచ్చి అన్నమాట.

  ‘అనుకోకుండా ఓ రోజు’లో ఓ ప్రధాన పాత్ర వాపోతుంది, ‘ఇంత మంది పిచ్చోళ్లు మన మధ్య విచ్చలవిడిగా తిరిగేస్తున్నార్రా!?!’ అంటూ.

  ఇక్కడీ గులాబీ వీరులు విచ్చలవిడిగా తిరిగేయటంతో ఊరుకోవటం లేదు, మరింత మందిని తమలా మార్చటానికి ఉవ్విళ్లూరుతున్నారు. వాళ్ల బ్రతుకు వాళ్లు బ్రతికితే సమస్య లేదు. కానీ వాళ్లా పని చెయ్యటం లేదే! వీళ్లకి చెయ్యాల్సిన సాయం హక్కుల ఉద్యమాలతో కాదు, వైద్య చికిత్సతో.

 5. 5 కె.మహేష్ కుమార్ 8:48 ఉద. వద్ద జూన్ 24, 2009

  @అబ్రకదబ్ర: Accepted సామాజిక ప్రవర్తన మీరి deviantsగా ఎవరున్నా ఏదో ఒక “రోగం” ఉందనుకోవడం సహజం. కానీ గే/లెస్బియన్లు “ఇది మాకు సహజం” అంటున్నారు. కాబట్టి దీనిని నిర్ధిష్టంగా అటోఇటో శాస్త్రీయంగా నిరూపిస్తేతప్ప ఒక నిర్ణయానికి రావటం అంత సమంజసం కాదు. ఒకవేళ మీరలా నిర్ణయించి ద్వేషిస్తానంటే మాత్రం వీరు దీన్ని హోమోఫోబియా (ఇదీ రోగమే) లేదా కనీసం ఆభిజాత్యం (prejudice) అంటారు.

  అందుకే letting them live the way they chose అనేది ప్రస్తుత విధానం.

 6. 6 rayraj 9:05 ఉద. వద్ద జూన్ 24, 2009

  >>వికలాంగులకీ, వయసు మళ్లిన వారికీ అలాంటి అవకాశాలు కల్పించే ప్రకటనలెప్పుడన్నా చూశామా?

  అంకెలేవీ!? అవి కూడా వస్తాయి.ఉండే ఉంటాయి. మీ వయసు రీత్యా బహుశా మీరు చూసుండరు. తరువాత పెన్షన్ / రిటైర్మెంట్ ప్లాన్సులో – “హనీమూన్ పాకేజ్ ఫర్ సిక్స్టీస్” అని ఇంకో ప్లాను బయటికి తీస్తారు. ఇప్పటి జీవితాలని ఆపుకుంటూ, భవిష్యత్తు కోసం యువత అందులోనూ ఇన్వెస్టు చేసుకుంటారు. ఆ కంపెనీలు సిక్స్టీసులో మూతపడిపోతే లబో దిబో మంటారు.

  మొత్తానికి మీరూ ఓ సెక్సీ యాంగిలే రాసారన్న మాట. 🙂 చరిత్రలో చాలా మంది పేరు మోసిన వారంతా గేసు/లెస్బియన్సేట.ఆ చరిత్రలు కూడా తిరగరాస్తారు.రాస్తున్నారు.వాళ్ళకి ఇవ్వాల్సిన స్వేచ్చ వాళ్ళకి ఇవ్వలేదని,లేకపోతే ఈ పాటికి బోళ్డు మంది వాళ్ళే ఉన్నారని సుస్పష్టంగా తెలిసేదని.

 7. 7 rayraj 9:06 ఉద. వద్ద జూన్ 24, 2009

  ఊప్స్! ఇది కాంట్రవర్శీకి రాయలేదు. ఈ అభిప్రాయాన్ని చాలా రోజుల క్రితమే నా రాతల్లో నేను చెప్పుకున్నదే.దానికే నేను “కావాల్సిన చరిత్ర” అని పేరు పెట్టి మరీ చెప్పాను.

 8. 8 అబ్రకదబ్ర 9:53 ఉద. వద్ద జూన్ 24, 2009

  @మహేష్:

  >> “letting them live the way they chose”

  ‘వాళ్ల బ్రతుకు వాళ్లు బ్రతికితే సమస్య లేదు’ అన్న నా వాక్యం చదవలేదా? వాళ్ల జీవన విధానానికి నేను టపాలో ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం చెయ్యలేదే. వాళ్లలా మరింతమందిని మార్చే ప్రయత్నాలని వ్యతిరేకిస్తున్నాను. అదే నా టపాలో, వ్యాఖ్యలో స్పష్టంగా చెప్పిన విషయం.

  అన్నట్లు, నాది ద్వేషం కాదు, వ్యతిరేకత.

  @రేరాజ్:

  >> “మొత్తానికి మీరూ ఓ సెక్సీ యాంగిలే రాసారన్న మాట”

  ఏ యాంగిల్లో రాసినా, చదివేవాళ్లెవరూ ఇబ్బందిపడకుండా రాయటం ముఖ్యం 🙂

 9. 9 చిలకపాటి శ్రీనివాస్ 12:15 సా. వద్ద జూన్ 24, 2009

  మీ కలం నుంచి బొత్తిగా ఊహించనిది ఈ పోస్టు.

  అందర్నీ స్వలింగ సంపర్కులుగా మార్చేయాలనే ఉద్దేశం వాళ్లకున్నట్లు మీకెందుకు అనిపించింది? అలా ఎవరయినా మారిన వారి సంగతి మీదాకా వచ్చిందా? ఆ గులాబీ గోలలో వాళ్లను కించపర్చడమే గానీ ఎక్కడయినా దాన్ని గ్లోరిఫై చేయడం గమనించారా? టీనేజ్ బుర్రలకి పని కల్పించే అర్థ/ముప్పావు నగ్న తారలు బోలెడుమంది సిద్ధంగా ఉండగా వాళ్లను వదిలేసి ఈ వ్యామోహంలోకి వాళ్ళు పడిపోతారేమోనని మీరు చింతించడం విడ్డూరంగా ఉంది.

  వీళ్లను మార్చే వైద్య చికిత్స ఏదీ లేదు. (మీకు తెలిస్తే చెప్పండి; నోబెల్ ప్రయిజు కొట్టేయొచ్చు) అది రోగం అని మీరనుకోవచ్చు, తాము వేరు అని మాత్రమే వారనుకుంటారు.

  వాళ్ల బతుకులు వాళ్లు బతికినా మీకు సమస్య ఉంది. మీ టపా మళ్ళీ చదువుకుంటే అది మీకే తెలుస్తుంది.

  మనకంటే భిన్నంగా బతికేవాళ్ళను సహించే రోజులు ఎప్పటికొస్తాయో!

 10. 10 అబ్రకదబ్ర 1:00 సా. వద్ద జూన్ 24, 2009

  @చిలకపాటి శ్రీనివాస్:

  >> “మీ కలం నుంచి బొత్తిగా ఊహించనిది ఈ పోస్టు”

  అప్పుడప్పుడూ అలా ఊహించనివి జరిగిపోతుంటాయంతే 🙂 ఈ విషయంలో మీతో నాది భిన్నాభిప్రాయమే. కానీ మీ కోణం వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు.

  వాళ్ల బ్రతుకు వాళ్లు బ్రతికితే నాకు సమస్య లేదండీ. ‘గే ప్రైడ్’ పేర్లతో అమెరికాలో వివిధ నగరాల్లో ఏటా జరిగే ఉత్సవాల్లో వాళ్లు బహిరంగంగా ప్రవర్తించే పద్ధతులు, దారిన పోయే మామూలు జనాలపై చేసే వ్యాఖ్యలు, వేసే వెకిలి వేషాలు ప్రత్యక్షంగా (టీవీల్లో కాదు) చూశాక రాసిన వ్యాసమిది. అటువంటివి మనదేశంలోనూ తలెత్తే ప్రమాదముందన్న ఆలోచనే దీనికి స్ఫూర్తి. నేను ఎత్తి చూపదలచుకుంది, ముందూ వెనకా ఆలోచించకుండా ప్రతిదీ వ్యాపారాత్మకం చేసేసే కొందరు ప్రబుద్ధుల ధోరణి. ఇలాంటివన్నీ ఇంతకు ముందు లేవా అంటే, ఉన్నాయి. వాటిని సినిమాలు తీసి మరింతమందికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందా అన్నది నా ప్రశ్న.

  సినిమాల్లో చెడగొట్టే విషయాలు ఇంకేమీ లేవా అని మీరడుగుతారేమోనని ఇప్పుడే సమాధానం ఇచ్చేస్తున్నా. బోలెడున్నాయి. ప్రస్తుతం నేను రాయదలచుకుంది దీని మీద మాత్రమే 🙂

  అన్నట్టు – తారల, టీవీ పోటీల్లో పోటీదారుల రెచ్చగొట్టే ప్రదర్శనల గురించీ నా టపాల్లో ఇంతకు ముందు పెన్ను చేసుకున్నాను.

 11. 11 చిలకపాటి శ్రీనివాస్ 4:54 సా. వద్ద జూన్ 24, 2009

  వెకిలి ప్రవర్తనను చీదరించుకోవడంలో తప్పేమీ లేదు, అది ఎవరిదయినా. కాకపోతే ఆ అంశమే ప్రస్తావించలేదు మీరు ఈ టపాలో. ఇక వ్యాపార దృక్పథమంటారా, ఇండియన్స్‌కి మసాలా క్రూయిజ్ మామూలు అయిపోయినప్పుడు వీళ్ళకో క్రూయిజ్ ఏర్పాటు చేస్తే అది విపరీతమెందుకయిందో నాకు అర్థం కాలేదు.

  సినిమాల్లో చూపకముందునుంచీ అక్కడ లేరా? వాళ్ళూ బహిరంగ సమావేశాలు జరుపుకుంటున్నారన్న వార్తలూ చదువుతూనే ఉన్నాము గదా! ఖండించవలసింది ఏమిటంటే ఆ సినిమాల్లో వాళ్ళ చేత వెకిలి వేషాలు వేయించడం, చవకబారు హాస్యం కోసం వాడుకోవడం. ఎవర్నో ఒకర్ని గేలి చేయందే మనకు హాస్యం పుట్టి చావదు గద!

  సినిమాల్లో చెడగొట్టేవి బోలెడుండగా దీని మీదే ఎందుకు రాయవలసి వచ్చిందనే మతిమాలిన ప్రశ్న వేసే ఉద్దేశం నాకు లేదు. నేనంటున్నది ఇంతమంది అరకొర దుస్తుల అమ్మాయిల్ని చూసి మురుస్తూండే కుర్రాళ్ళు ఈ పాత్రల్ని చూసి చటుక్కున స్వలింగ సంపర్కానికి దిగే పరిస్థితి లేదనీ, అసలు ఇది చెడగొట్టేదేనా అనీ.

 12. 12 కె.మహేష్ కుమార్ 10:14 సా. వద్ద జూన్ 24, 2009

  @అబ్రకదబ్ర: మీ వ్యతిరేకత సినిమాల గురించే అయితే గే/లెస్బియన్లు ఈ విషయంలో చాలా వ్యతిరేకత కనబరుస్తారు. వారిని derogatory గా represent చేస్తున్నరన్నది వీరి వాదన. గేలిచేసి హేళనచేస్తున్నారన్నది వీరి వేదన.

  ఇక వీళ్ళు ఇతరుల్ని “మార్చడం” గురించి మీకు కొన్ని అపోహలున్నాయేమో! At most they can prompt a minuscule population in to EXPERIMENT in alternate sex. అంతేతప్ప పూర్తిగా మార్చడం జరిగేపని కాదు. gay or straight అనేవి “సహజమైన orientations” అనేది వీరి అభిప్రాయం.

 13. 13 కొత్తపాళీ 12:24 ఉద. వద్ద జూన్ 25, 2009

  అబ్రకదబ్ర గారూ,
  ఈ విషయమ్మీద భారతీయ సినిమాల గురించి నాకు తెలీదు. ఈ మధ్యనే మెంటల్ క్రిష్ణ అనే ఒక చిత్రరాజాన్ని చూశాను. అందులో హోమోసెక్సువాలిటీకి ఎంత వికృతమైన అర్ధం ఇవ్వచ్చో అంత వికృతంగానూ తీశారు. నాకు డోకు రాడం ఒక్కటే తక్కువ.
  అమెరికాలో జరిగే గే ప్రైడ్ పెరేడ్లూ, ఇతర హంగామాలూ .. గే లెస్బియన్ల మీద సాధారణ సమాజం చెలాయించే హింసాత్మక జులుంకి వాళ్ళు చేసేది ఒక చిన్న ప్రతీకారం మాత్రమే. సినిమాల్లోనే ఉదాహరణలు చెప్పుకోవాలంటే, boys don’t cry, broakback mountain ఇత్యాదివి చూడండి.
  ఒకటి గుర్తించుకోవాలి. హోమోసెక్సువాలిటీ అన్నది మతమార్పిడి లాగా అదొక ఛాయిస్ కాదు. ఒకర్ని ఇంకొకరు కన్వర్ట్ చెసేందుకు.

 14. 14 rayraj 12:54 ఉద. వద్ద జూన్ 25, 2009

  @అబ్రకదబ్ర : మొత్తానికి ఇబ్బంది పెట్టేదిగా రాస్తానంటారు. ఐనా చదువుతున్నందుకు థాంక్యూ.:)

  ఇక్కడ పరిస్థితి చూస్తే, నాకెందుకో మీరు చాలా వెనకబడినట్టు, మిగిలిన వారు “వాళ్ళని” యాక్సప్టు చేసినట్టు కనబడుతోంది.

  ఇది చాలా భయంకరమైనది.ఇది ఛాయిస్ కూడా – ఇందులో మళ్ళీ రకాలున్నాయి.దీన్ని ఛాయిస్‌గా ఎంచుకునేవాళ్ళూ ఉంటారు.అప్పుడు చూడండీ ఇక ఉంటుంది నా సామిరంగ….ప్రొమోషెన్లు /ఇంసెంటివ్లూ తెచ్చుకోవటానికి మామూలు మగాళ్ళ పరిస్థితులు కష్టం అవ్వబోతున్నాయి. :)) :)) :))

 15. 15 Aruna 1:00 ఉద. వద్ద జూన్ 25, 2009

  “హోమోసెక్సువాలిటీ అన్నది మతమార్పిడి లాగా అదొక ఛాయిస్ కాదు. ఒకర్ని ఇంకొకరు కన్వర్ట్ చెసేందుకు.”

  అబ్బ చా నిజం గా?? మీ ఇంట్లో టీనేజీ దాటని పిల్లలు ఎంతమంది వున్నారండీ? వాళ్ళు ఇలాంటి మాటలే మాట్లాడితే ఏమి చేస్తారు. అమ్మ, బాబు, అయ్యా, అదొక పిచ్చి వేషం. తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ జోలికి నువ్వెళ్ళకు. వాళ్ళ లాంటి వేషాలు వెయ్యకు అనే మాటల నుండి ఎందుకు వెయ్యకూడదో చెప్పి, సంస్కృతి ని గురించి చెప్పి వీలైతే మోరల్ సపోర్ట్ ఇస్తారు కదా.. మరి ఈ మాటలు పిల్లలకి అందరు ఎందుకు చెప్తారు? వాళ్ళు మానసికం గా ప్రభావితం కాకూడదు అనేగా. ద్వేషమో, ఇష్టమో ఏ వొక్క భావన వారి గురించి వచ్చిన సరి అయిన నిర్దేశం లేకపోతే టీనేజి పిల్లలు ఇలాంటివి చూసి చెడిపోరా? అందరికి ఇంత బాగ చెప్పే తల్లిదండ్రులు వుంటరు అని ఏమిటి, వున్న ఇవన్నీ చెప్పే తీరిక వారికి వుండాలి. ఇలాంటివి పొరపాటున పిల్లల్లో గమనించకపోతే బలయ్యేది అమాయకులు. ఇంత గోల వుండకూడదు అనుకుంటే ముందే వీరి ప్రదర్శనలని బాన్ చేస్తే సరి.

  ~ అరుణ గోసుకొండ

 16. 16 chinni 1:16 ఉద. వద్ద జూన్ 25, 2009

  “ఏ యాంగిల్లో రాసిన , చదివే వాళ్ళెవరు ఇబ్బందిపడకుండా ,రాయడం ముఖ్యం .”…….చాల బాగా చెప్పారు ..

 17. 17 అబ్రకదబ్ర 1:18 ఉద. వద్ద జూన్ 25, 2009

  @రేరాజ్:

  ‘రాజుగారి పెద్దభార్య ..’ తరహాలో అర్ధం చేసుకున్నారు నా వ్యాఖ్యని 🙂

  ఇటువంటి సబ్జెక్టులకి సాధారణంగా అవసరమయ్యే కొన్ని రకాల పదాలు ఒక్కటీ దొర్లకుండానే నేను చెప్పదలచుకుంది అర్ధమయ్యేలా చెప్పాలని ఈ టపాలో నా ప్రయత్నం. ‘ఇబ్బంది పెట్టకుండా’ అన్నది ఆ నా ప్రయత్నాన్నుద్దేశించి మాత్రమే.

 18. 18 Sriram 3:29 ఉద. వద్ద జూన్ 25, 2009

  I was told by many students in australia that one of the main reasons they dont stay in uni. hostels is because of the gay threats…which i think is a big issue affecting srudent security.

 19. 19 కె.మహేష్ కుమార్ 3:33 ఉద. వద్ద జూన్ 25, 2009

  “టీనేజి పిల్లలు ఇలాంటివి చూసి చెడిపోరా?” “వీరి ప్రదర్శనలని బాన్ చేస్తే సరి.”
  టీనేజి పిల్లలు చెడిపోవడానికి ఇదే కావాలా? హెట్రోసెక్సువల్ టెంప్టేషన్స్ ఎన్ని చుట్టుపక్కల లేవూ! గే/లెస్బియన్ల ప్రదర్శనకన్నా విస్తృతమైన ఎన్నో “చెడిపోయే” విషయాలున్నాయి.

  గే/లెస్బియనిజం natural or nurtured అనే ప్రశ్నకు ఇప్పటివరకూ పూర్తి సమాధానాలు లేకపొయినా, చాలా వరకూ ఇది in borne అనే అనుకుంటారు. కాకపోతే expression of sexuality కేవలం టీనేజిలో రావడం వలన దాన్నొక behavioural deviant గా తల్లిదండ్రులు భావించడం జరుగుతోంది. అది అర్థం చేసుకోతగ్గ పరిణామమే అయినా, as a society we can’t be discriminatory to them.

  తమ శరీరంలోపలే అంతర్గత పోరాటం చేస్తున్నవారిపైన మన జులుంచేస్తే పిచ్చోళ్ళన్నా అవుతారు లేక విపరీతమైన పోకడలైనా పోతారు. రెండూ మంచివి కాదు.

 20. 20 chinni 4:08 ఉద. వద్ద జూన్ 25, 2009

  అది నాకు అర్ధమయ్యి చేసిన కామెంటే , కాని రాజు గారి పెద్ద భార్య తరహ నే అర్ధం కాల …

 21. 22 కొత్తపాళీ 6:00 ఉద. వద్ద జూన్ 25, 2009

  @Aruna Gosukonda .. From your response, it appears that you have no clue about this issue. I will stop here.

 22. 23 Aruna 7:11 ఉద. వద్ద జూన్ 25, 2009

  సబ్జెక్ట్ భయంకరమైనది అయ్యేప్పటికి పదాలు సరి ఐనవి పెట్టలేకపోయాను. నిజం.. నేను చెప్పదలచుకున్నది చాలా వున్నది. ఇక్కడ అసలు వుద్దేసాన్ని తారుమారుగా చూసే చాన్స్ వుంది. In that case, I am not ready to discuss on this issue.

 23. 24 rayraj 8:19 ఉద. వద్ద జూన్ 25, 2009

  oh! i really misunderstood. నిజమే. మంచి విజయం సాధించారు.

  సమస్యకొస్తే: సారీ! మళ్ళీ చాలా పొడుగైపోతేనూ…..మరేమో… ..”గులాబీ గోల పై నా గోల” అని బ్లాగేశా! 🙂

 24. 25 బిందు 5:15 ఉద. వద్ద జూన్ 30, 2009

  మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం , మన వీధిలో ఆశుభ్రం మనకు ఎంత కంపు కొడుతుందో వీరి చేష్టలు సమాజానికీ అంతే కంపు కలిగిస్తాయి. మొదటిసారిగా ఈ కంపు గులాబిలని సికిందరాబాద్ పరడే గ్రౌండ్ లో చూసి చాల ఆచ్చైర్యనికి గురిఅయ్యాను.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,731

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: