నా ఫోటో బ్లాగులో రెండో టపా: న్యూయార్క్ నగర చిత్రాలు.
అనగనగా నలుపు-తెలుపు నిశ్చల చిత్రాలు రాజ్యమేలే కాలంలో అరుదుగా కనిపించే వర్ణచిత్రాలకేసి అబ్బురంగా చూసేవారంతా. ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. డిజిటల్ కెమెరాలూ, సెల్ఫోన్ కెమెరాలూ వచ్చేశాక ఫోటోలు తీయటం అందరికీ కూసువిద్యైపోయింది. ఎక్కడ చూసినా రంగు రంగుల ఫోటోలే. వర్ణచిత్రాల వరదలో కొట్టుకుపోతుండేవారికి అడపాదడాపా ఓ నలుపు-తెలుపు చిత్రం కళ్లబడితే అదో ఊరట. రంగుల చిత్రాలపై చిన్నచూపు లేదు కానీ, నా మటుకూ నాకు, కొన్ని ఫోటోలు నలుపు-తెలుపుల్లోనే మరింత డ్రామా పండిస్తాయనిపిస్తుంది. అందుకే ఈ సారి టపా మొత్తం వాటితోనే నింపేశాను. చూడండి: న్యూయార్క్, న్యూయార్క్.
0 స్పందనలు to “న్యూయార్క్, న్యూయార్క్”