సినీరంగంలో అడుగు పెట్టిన తొలినాళ్లలో చిరంజీవి జీవితం వడ్డించిన విస్తరి కాదు. తళుకు బెళుకుల జగతిలో అనామకుడిగా మొదలెట్టి అగ్రనటుడిగా ఎదిగే క్రమంలో ఆయన అధిగమించిన అడ్డుగోడలెన్నో. పాతికేళ్ల పైచిలుకు నట జీవితానికి స్వస్తి చెప్పి గతేడాది రాజకీయ నాయకుడిగా కొత్త అవతారమెత్తే నాటికి పరిస్థితి తద్భిన్నం. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ప్రేక్షకుల అభిమానమే ఆయన పార్టీకి పునాది. శుభం పలికిన నోళ్లూ, సన్నాయి నొక్కులు నొక్కిన వేళ్లూ కూడా ఉన్నా – ప్రజారాజ్యం ఆవిర్భావం నాడు వచ్చే ఎన్నికల్లో చిరంజీవి గెలుపు నల్లేరుపై నడకే అన్నవాళ్లూ కోకొల్లలు. తీరా, ఎన్నికలు వారం దూరంలో ఉండగా ప్రరాపా గుమ్మంలోకి తొంగి చూసినవాళ్లకి అక్కడ అగుపడుతున్నది – సినీ పరిభాషలో – యాంటీ క్లైమాక్స్ దిశగా సూచనలిస్తున్న ఇంటర్వల్ బ్యాంగ్.
రాజకీయం ప్రజాసేవ కోసం అనేది పాచిపట్టిన పాత మాట. ప్రస్తుతం ‘నాకేంటి’ అనే నాయకులే ఎక్కడ చూసినా. ఎన్నికల ముందు టికెట్లాశించి భంగపడ్డ ఛోటా మోటా నాయకుల అలకలు, అసమ్మతి రాగాలు, గోడ దూకుళ్లు రెండు మూడు సీజన్లుగా అలవాటైపోయిన వ్యవహారమే. కమ్యూనిస్టుల్ని మినహాయిస్తే దేశ వ్యాప్తంగా ఈ సంస్కృతి లేని రాజకీయ పార్టీ దుర్భిణీ వేసి వెదికినా కనిపించని పరిస్థితి. ఈ తంతు చూసి బుగ్గలు నొక్కుకోవటం ప్రజలెప్పుడో మానేశారు. రాజకీయాలంటే సామాన్యులకి ఏవగింపు కలిగిన దశలో మార్పు తెస్తాం అంటూ వచ్చిన ప్రజారాజ్యం రాష్ట్రంలో ఎందరికో ఆశలు రేకెత్తించింది. చిరంజీవి రూపంలో వచ్చిన కొత్త నీరు వరదై పారి రాష్ట్ర రాజకీయాలని కడిగేస్తుందని ఆయన అభిమానులతో పాటు అనేకమంది ఇతరులూ ఆశ పడ్డారు. కానీ జరిగింది, జరుగుతుంది ఏమిటి?
ప్రజారాజ్యం పార్టీకి చిరంజీవి గ్లామరే పెట్టుబడి. ఇది ఆయన కోటరీ సదా వల్లెవేసే మాటే. అయితే ఆ పెట్టుబడినెలా వాడుకోవాలో తెలీకపోవటం చిరంజీవి బలహీనత, ఇంకా చెప్పాలంటే ఆయన అసమర్ధత. ప్రత్యర్ధుల్ని ఆశ్చర్యంలోకి నెడుతూ ఎవరూ ఊహించని సమయంలో పార్టీ ప్రకటించాల్సింది పోయి నెలల పాటు వదంతులతో తాత్సారం చేసి తర్వాత తీరిగ్గా ప్రకటించటం తొలి తప్పు. ఆలస్యానికి నాడాయన ఇచ్చుకున్న వివరణ ‘పార్టీ విధానాలని రూపొందించటానికి ఇంత సమయం పట్టింది’. అంత సమయం తీసుకుని రూపొందించిన విధానాలేమిటని అడిగిన వాళ్లకి ఆవు పాఠంలా ఆయన్నుండొచ్చే రెడీమేడాన్సర్లు: ‘మేధావులతో చర్చిస్తున్నాం’, ‘ ప్రజలు రమ్మన్నారు’, ‘ప్రజలకే చెబుతా’, ‘సామాజిక న్యాయం’!
ఇదంతా చూస్తూ కూడా చిరంజీవి నాయకత్వమ్మీద నమ్మకం సడలని వాళ్లెవరన్నా ఉన్నారంటే – వాళ్లు ఆయన వీరాభిమానులే. అయితే, తన సత్తాపై అభిమానులకున్న నమ్మకం చిరంజీవికి తనపై ఉందా అన్నది అనుమానం. ఓ పక్క ‘నన్ను చూసి ఓట్లేస్తారు’ అంటూనే మరోపక్క కులాల వారీ లెక్కలు, పరాయి పార్టీల్లోని బలమైన నాయకులకి గాలం, ఇతర పార్టీలతో పొత్తుల కోసం ఆరాటం .. ఇలా పొంతన లేని చర్యలెన్నో. ఎన్టీయార్ స్ఫూర్తితో రాజకీయాల్లోకొచ్చానని స్వయానా చెప్పుకున్న చిరంజీవికి ఎన్టీయార్‌కున్న నాయకత్వ లక్షణాలున్నాయా అనేది ప్రశ్న. తెదెపా ఎదుర్కొన్న తొట్టతొలి ఎన్నికల్లోనే వందలాది అనామకులకి టికెట్లిచ్చి రాత్రికి రాత్రే రాష్ట్రంలో కొత్త తరం నాయకుల్ని సృష్టించిన ఎన్టీయార్ సాహసం చిరంజీవికేదీ?
సాహసం సంగతటుంచితే – ప్రరాపాలో చిరంజీవి కేవలం ఉత్సవ విగ్రహమేనా అన్నది నేడా పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని గమనిస్తున్న వారికెవరికైనా వచ్చే సందేహం. పార్టీ విధానాల రూపకల్పన నుండి, అభ్యర్ధుల ఎంపిక దాకా ముందుండి నడిపించకుండా అరవింద్ ప్రభృతుల నిర్ణయాలకి తలాడించటమే పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏకైక విధి లాగుంది!
బావుంది. ఈ టపాకొంచం ముందొచ్చుంటే ఇంకా బావుండేది.
“మొత్తమ్మీద ప్రజారాజ్యం ఆవిర్భావం నాడు వచ్చే ఎన్నికల్లో చిరంజీవి గెలుపు నల్లేరుపై నడకే అన్నవాళ్లే కోకొల్లలు”
ఇలాకన్నా, in front krokodile pheshtival అన్నావాళ్ళే ఎక్కువనుకుంటాను.
As an actor he is example to describe how to become successful,
but as a leader he is a example to describe how to fail.
If he wins this time, then he can never learn from his mistakes and become worse politician we can see. I wish he fail this time and come back to earth from his dreaming world.
అతను మేల్కోవటం అలా ఉంచండి.
మనం మేల్కొని అతన్నుండీ, అతని పార్టీ నుండి మనల్ని రక్షించుకోవాలి.
ప్రారంభంలోనే భూమా గారిని చేర్చుకుంటూ రాయలసీమ ఫ్యాక్షన్ ను రూపుమాపుతానంటేనే తెలిసిపోయింది ఆయన తెస్తానన్న మార్పు పరిస్థితేంటో,తర్వాతికాలంలో తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళను చేర్చుకుంటూ మొదట్లో కాంగ్రెస్సును విమర్శించిన ఆయన తర్వాత తెలుగుదేశాన్ని విమర్శించడంతో తెలిసిపోయింది ఆయన తెస్తానన్న మార్పు, Jr.NTR ను ఎవరో రాసిచ్చింది చదువుతున్నాడన్న ఆయన తను చేస్తున్నదేంటో ఎవరికీ తెలియదనుకుంటున్నాడేమో.ఒకవేళ ఎవరో రాసిచ్చినది చదువుతున్నాడంటున్నJr.NTR తనకిచ్చిన దాన్ని తన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.మరి మీరేమో మెగాస్టార్ కదా అంతకన్న ఎక్కువ ఆకట్టుకోవచ్చుకదా,ఎందుకు మరి పేలవంగా ఉంటున్నాయి మీ ప్రసంగాలు.చదవడంలో సోనియమ్మను మరపిస్తున్నారు మీరు.మీపైన ఆశలు పెట్టుకున్న మాపై జరుగుతున్న సంఘటనలు నీళ్ళు చల్లుతున్నాయి .ఏమైనా ఈ సామాజిక న్యాయం తో మమ్మల్ని ఏం ఉద్దరిస్తారో ఏమో కాలమే నిర్ణయించాలి.
ప్రజారాజ్యం పోకడలు పెద్ద ఆశ్చర్యకరంగా లేవు. ఇక అల్లుఅరవింద్ “చక్కదిద్దుడు” పరిశ్రమ మొత్తానికీ ఎరుకే, ఇప్పుడే రాష్ట్రం మొత్తానికి తెలిసొస్తోంది అంతే!
దేశంలో ఇన్ని దోచుకుతినే పార్టీలు ఉండగా ప్రజారాజ్యాన్ని మాత్రమే విమర్శించడానికి ఇంత ఉత్సాహం ఎందుకు చూపిస్తున్నట్టు? ఐదేళ్ళకొకసారి పార్టీలు మార్చే నాయకుల వల్ల చిరంజీవే కాదు, ఇంకెవడు రాజకీయ పార్టీ పెట్టినా మునుగుతాడు. చిరంజీవి తన గ్లామర్ ని రాజకీయ ప్రయోజనాలకి ఉపయోగించాలనుకోవడం తప్పే, కానీ అతని కంటే పెద్ద పోటుగాళ్ళు లేరనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు.
All these resignations are immature, Parakala, chiru, babu, YS and JP are not “gandhis”. In a young party there will be immature decisions. Let us all be thankful that Telugu people are not going to vote for PRP the way they did for NTR which has resulted in a fairshare of tuglak decisions. Atleast people should be thankful for chiranjeevi to create a situation where the defficiencies of the two party system and the decay of social fabric of AP has come out open and issues are brought out openly. Hates off Chiranjeevi. He has done his duty. Parakala, babu, Junior NTR and YS and others are no less opportunists and politicians than Chiru and Allu.
Strangest thing is suddenly every one wants to be very truthful, with the advent of PRP. Now every one wants ideal politics and policies from chiranjeevi. This is a good sign. They have long ago realised in their lives, values etc; can not be expected from others. Atleast all these comments reveal that people want change. It should result in exercising the votes
వేరే పార్టీ వాళ్లను ప్రజారాజ్యం లో చేర్చుకోవటంతోనే, ప్రజా రాజ్య సైద్ధాంతిక విలువలేమిటో, ఆ పార్టీ బలమేమిటో తేట తెల్లమయ్యింది. మిగతా పార్టీలను విమర్శించకుండా, కేవలం తాము చేసిన అభివృద్ధి పనులు చూసి వోటేయ్యమని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు (Television) ఎంతో ఆకర్షణీయంగా ఉన్నై. ఉచిత కరంటు తో రైతులను, పెంచిన జీతాలతో ప్రభుద్యోగులను కాంగ్రెస్స్ చక్కగా ఆకర్షించగలుగుతూంది. ఈ ప్రకటనలు ఎంతో పాజిటివ్ బలం కలిగి ఉన్నై.
చాలా చక్కగా విశ్లేషించారు.
>>> చిరంజీవికి ఎన్టీయార్‌కున్న నాయకత్వ లక్షణాలున్నాయా అనేది ప్రశ్న.
ఇది మాత్రం అంగీకారం కాదు. అప్పటి పరిస్థితి కి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎన్‌టీఆర్ కి మీడియా కూడా వెన్నుదన్ను గా నిలిచింది. కాంగ్రెస్ పూర్తిగా ప్రజల్లో నమ్మకం కోల్పోయి ఉంది. + ఎన్‌టీఆర్ సినీ గ్లామర్ బాగా పనిచేసింది. ఇంకా చాలా Factors ఎన్‌టీఆర్ కి అనుకూలించాయి. కాని ఒకటి. NTR చిరు కన్నా చాలా courageous గా ఉండేవాడు. courageous అనే కన్నా కొద్దిగా మొద్దు తరహా అనేది suit అవుతుంది.
ఇంక చిరంజీవి వైఫల్యం నిజంగా స్వయంకృతం. తన ఇమేజ్ కి కొద్దిగా నిజాయితీ, నిబద్దత, కొంత పరిణతి, అందరిని కలుపుకుపోయే తత్వం ఉంటే సునాయాసంగా గెలిచేవాడు. ఈ అనవసరమైన కుల సమీకరణలు, ఓట్ల శాతాలు, పార్టీ లో అతి గుంభనం ఎందుకో అర్దం కాదు. అరవిందు వల్ల అర విందే దక్కేలా ఉంది.
గొంగళిలో అన్నం తింటూ వెంట్రుకలు వస్తున్నాయి అని గొణుక్కోవటం వేస్టైన ముచ్చట…!
మొదటినుంచీ అరవిందు బలవంతం మీద తప్ప చిరంజీవి రాజకీయాల్లోకి తనంతట తాను ఇష్టంగా రాలేదేమోనని సందేహంగా ఉండేది.ఇప్పుడు పరిస్థితులూ అలాగే ఉన్నాయి. ఆయన చాలా ఎమోషనల్, ఫామిలీ టైప్ మనిషి, వ్యక్తిగత దాడుల్ని ఎదుర్కునే సామర్థ్యం, తెగువ లేవు.ఇవన్నీ రాజకీయాలకు ప్రాథమిక అర్హతలు కదా!(తెలుగు సినిమా వజ్రోత్సవాల్లో మోహన్ బాబుకి సమాధానం చెప్పడానికి చిరంజీవి పడ్డ ఆయాసమే ఇదుకు ఉదాహరణ) అరవింద్ ధోరణి పట్ల మొదటినుంచీ పార్టీలో ఆరోపణలు ఉంటూనే ఉన్నాయి. వ్యవహారం మొదటినుంచీ constructive గా లేదని అందరికీ తెలుస్తూనే ఉంది.కానీ ఇబ్బంది ఏమిటంటే సినిమా ద్వారా అభిమానులైన కొంత మందికి చిరంజీవినో, పార్టీనో విమర్శించడం నచ్చటం లేదు. “మిగిలిన వాళ్లంతా పెద్ద క్లీన్ గాళ్లా” అంటూ విరుచుకు పడుతున్నారు. మొత్తానికి పరకాల రాజీనామా సందర్భంగా ప్రజారాజ్యానికి బ్లాగుల్లో మంచి ప్రచారమే వచ్చిందండోయ్!
నిజంగానే చిరు కి infront there is crocodile fesival! మెజారిటీ వచ్చే పరిస్తితి లేదు కాబట్టి!
చక్కటి విశ్లేషణ.
పైన వున్న ప్రదీప్ గారి అభిప్రాయమే నాది కూడానూ.
మీరు రాసిన కథనం చక్కగా ఉంది. ఈ రోజు మీ కథనానికి సరిపోలే కార్టూన్ ఈనాడులో వేశారు. యాడ్ చేయగలరు.
ఒక పార్టీని విమర్శించడానికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం ఏమీ బాగాలేదు. జె.పి. రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తున్నాడని ఎప్పటి నుంచో అనుమానం ఉంది. లోక్ సత్తా రాజకీయ పార్టీగా మారిన తరువాత ఆ అనుమానం నిజం అని తేలింది. పక్కా ప్రీప్లాన్డ్ గా ఎత్తులు వేసే లోక్ సత్తాని వదిలేసి ప్రజారాజ్యం మీద నిప్పులు కక్కడం ఎందుకు? చిరంజీవి సినిమా గ్లామర్ ని రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవడం తప్పే కానీ అదొక్కటే పెద్ద సమస్య అయినట్టు మాట్లాడుతున్నారు. చిరంజీవి టికెట్ కి ఇన్ని కోట్లు తీసుకున్నాడని పరకాల ప్రభాకర్ చెపితే ఎలా నమ్మేశారు? అతనేమైనా ఎవిడెన్సెస్ చూపించాడా? టికెట్లు కోసం పార్టీలు మార్చే గోడ మీది పిల్లులకి నిజాయితీ ఉంటుందనుకుంటున్నారా? జనం కేవలం సినిమా గ్లామర్ చూసి వోట్లు వేసేంత అమాయకులు కారు. చిరంజీవి ఎలాగూ ముఖ్యమంత్రి అవ్వలేడు. మీరు చిరంజీవిని తిట్టినా, తిట్టకపోయినా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇతర పార్టీలని వదిలేసి ప్రజారాజ్యం మీద ఎందుకు ఈ స్థాయిలో మండిపడుతున్నారు? కుక్కల్ని వదిలేసి పిల్లిని తరిమినట్టు ఉంది ఈ వ్యవహారం.
well said.
గతంలో టి.ఆర్.ఎస్. టికెట్లు రాని వాళ్ళు కూడా కె.సి.ఆర్. టికెట్లమ్ముకున్నాడని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ప్రజారాజ్యం ఐదు కోట్లకి టికెట్లు అమ్ముకుంటోందని ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ వ్యక్తిగత ఆరోపణలే కానీ నిజాలు కావు. మా జిల్లాలో ఐదు కోట్లు ఇచ్చి టికెట్లు కొనుక్కోగల ఆర్థిక స్థితి ఉన్నవాళ్ళు లేరు. మరి ప్రజారాజ్యం పార్టీ మా జిల్లాలో కూడా పోటీ చేస్తోందే. శ్రీకాకుళం జిల్లా పాలకొండ అసెంబ్లీ నియోజక వర్గ ప్రజారాజ్యం అభ్యర్థి విశ్వాసరాయి కళావతి & అరకు పార్లమెంట్ అభ్యర్థి మీనక సింహాచలం మాజీ బ్యాంక్ ఉద్యోగులు. బ్యాంక్ ఉద్యోగులకి ఐదు కోట్లు లంచం తెచ్చివ్వమంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ప్రజారాజ్యం కంటే ఎక్కువ ప్రజాదరణ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ రేట్ కి టికెట్లు అమ్మలేరు. విశాఖపట్నం జిల్లాలో ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళకి అభ్యర్థి దొరక్కపోతే సర్పంచ్ ఎన్నికలలో ఓడిపోయిన ఒక వ్యక్తికి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. తెలుగు దేశం పై వ్యతిరేకతని ఉపయోగించుకుని ఆ కాండిడేట్ ని గెలిపించారు. సర్పంచులు, ఎం.పి.టి.సి.ల దగ్గర ఎలాగూ కోట్లు ఉండవు. టికెట్ రేట్ ఐదు కోట్లు పెడితే ఏ పార్టీకీ గ్రామీణ ప్రాంతాలలో అభ్యర్థులు దొరకరు. అది ప్రజారాజ్యమైనా, కాంగ్రెస్ అయినా, తెలుగు దేశమైనా, లోక్ సత్తా అయినా.
కొత్తపార్టీ ..
రాజకీయ అనుభవం లేదు ..
నటుడిగా ఎంతో ఆదరించిన ప్రజల ఋణం తీర్చుకోవాలి ..
సమాజంలో పెరిగిపోతున్న అసమానతలు తగ్గించాలి ..
కండలు తిరిగిన ప్రత్యర్ధులు ..
ప్రతి చర్యను భూతద్దంలో పెట్టి చూసి రెచ్చగొట్టే దురాభిమానులు ..
అన్నీ తెలిసి కులం వుచ్చులోంచి బయటకు రాలేని మేధావులు ..
చిరంజీవి పేరుతొ అందలం ఎక్కాలనుకునే ఆశాపరులు ..
ఒక కొత్తపార్టీని ప్రజలలోకి తీసుకొని వెళ్ళడం ఎంత కష్టమో అర్దం అవుతుంది.
ఒక పార్టీపై ఇంత ఒత్తిడి వున్నప్పుడు నాయకుడి నిర్ణయానికి కట్టుబడి వుండాలి. తప్పులు .. లోపాలు .. పొరబాట్లు .. ఎవరు చెయ్యరు చెప్పండి ? మనతో వాదించే ఒక వ్యక్తినే సమాధాన పరచలేము. అటువంటిది ఇన్ని కోట్లు వున్న రాష్ట్రంలో అందరినీ అలరించడం సాధ్యమా ? సహనంతో వెయిట్ చెయ్యాలి ..
జనం చెవిలో పువ్వులు పెట్టుకునే అమాయకులైతే ఐదు కోట్లేమిటీ, పది కోట్లకి పల్లెటూరివాడికి టికెట్ అమ్మేశారని కూడా కట్టుకథ చెప్పొచ్చు. రాష్ట్రంలో 70% జనాభా గ్రామీణ ప్రాంతాలలోనే ఉంటోంది. పల్లె ప్రాంతానికి చెందినవాడు ఐదు కోట్లు పెట్టి టికెట్ ఎలా కొనేస్తాడు? మా బంధువు ఒకతను విశాఖపట్నంలో రైల్వే ఉద్యోగం మానేసి, ఒరిస్సాలోని తన సొంత గ్రామానికి వెళ్ళిపోయి రాజకీయాలలో చేరాడు. ఎం.ఎల్.ఎ. అవుదామనుకున్నాడు కానీ చివరికి జిల్లా పరిషత్ మెంబర్ పదవి దొరికింది. ఎవడైనా ఐదు కోట్లు ఖర్చు పెట్టి అసెంబ్లీ ఎన్నికలకి టికెట్ కొంటే, వాడు ఓడిపోతే ఆ ఐదు కోట్లు బూడిదలో కలిసిపోయినట్టే. పట్టణ ప్రాంతాలలో కూడా అంత ఖర్చు పెట్టే సాహసాలు చేసేవాళ్ళు తక్కువ. ఇక పల్లె ప్రాంతాలలో ఐదు కోట్లు లంచం ఇచ్చి టికెట్లు కొనేవాళ్ళు ఉంటారంటే అది అతిశయోక్తే అవుతుంది.
@a2zdreams, రాజకీయ అనుభవం, కనీసం MLA గా కూడా పరిపాలనా అనుభవం లేదు, అసలు ఏ రకంగానూ పరిపాలనా అంశాలలో ప్రవేశం లేని వ్యక్తి కి ఏకంగా CM పదవి ఎందుకు ఇవ్వాలయ్యా?
జనం ఎలాగూ సినిమా గ్లామర్ చూసి వోట్లేసేంత అమాయకులు కారు. మీరు ఇంత శ్రమపడి చిరంజీవిని తిట్టాల్సిన అవసరం లేదు. అలా తిడితే మీరు తెలుగు దేశం – లోక్ సత్తా సపోర్టర్స్ అని అర్థమైపోతుంది. http://a2zdreams.wordpress.com బ్లాగ్ లో ఆ బ్లాగర్ ని తిడుతూ తెలుగు దేశం – లోక్ సత్తా వాళ్ళు వ్రాసిన వ్రాతలు చూస్తే అర్థమైపోతుంది వాళ్ళకి ప్రజారాజ్యం పై ఎంత అసహనం ఉందో. చిరంజీవి ఇప్పట్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు కానీ ప్రజారాజ్యాన్ని విమర్శిస్తూ పోతే మీది కాపు వ్యతిరేక అజెండా అని కూడా డౌట్ వస్తుంది. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేని చిరంజీవిని తిడుతూ కుల రాజకీయాల్ని ప్రోత్సహించడం ఎందుకు?
@మార్తాండ:
నేనెవరినీ తిట్టటం లేదు. తిట్టుకి, విమర్శకి తేడా ఉంది – గ్రహించండి. నాది సద్విమర్శే. అరవింద్ లాంటి వాళ్ల పడగనీడ నుండి చిరంజీవి బయటపడితే ఆయనకీ, ఆయన పార్టీకీ మంచిదన్నది నా టపా సారాంశం. ఇందులో తిట్లేం కనపడ్డాయో!
a2z బ్లాగ్‌లో ఎవరో ఏదో రాస్తే దానికి నా టపాతో ముడి పెడతారెందుకు?
>> “ప్రజారాజ్యాన్ని విమర్శిస్తూ పోతే మీది కాపు వ్యతిరేక అజెండా అని కూడా డౌట్ వస్తుంది”
మీ ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయి. నాకే జెండాలూ, అజెండాలూ లేవు. మీకలాంటి అనుమానాలొస్తే రానివ్వండి. నేను చెయ్యగలిగిందేమీ లేదు. నా సంగతవతల పెట్టండి. మీరు ఎర్ర జెండా పారేసి రైలెప్పుడెక్కారు? 🙂
>> “ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేని చిరంజీవిని తిడుతూ కుల రాజకీయాల్ని ప్రోత్సహించడం ఎందుకు?”
ముఖ్యమంత్రయ్యే అవకాశం ఉన్నవారిని తిడితే కుల రాజకీయాలని దునుమాడినట్టా? మీ లాజిక్ నాకర్ధం కాలేదు. ఈ కులం గొడవేంటి మధ్యలో. పదే పదే కులం పేరెత్తుతుంది మీరు – నేను కాదు.
అబ్రకదబ్ర గారు, మీరెలా అర్ధం చెసుకున్నారో గాని మార్తాండ గారి మాటలు నాకు ఒక్క ముక్క అర్ధం కాలేదు. ఏదో చిరంజీవి ని అన్నారు కదా అని ఆవేశంలో ఏదేదో వ్రాసినట్లు ఉంది. అయితే ఒకటి, ప్రజారాజ్యం లోనూ, దాని వీరాభిమానుల్లోనూ కాంగ్రెస్ పోకడలే ఎక్కువ కనిపిస్తున్నాయి, విమర్శించిన వారిని ఏదో పార్టీ కి అంటగట్టటం, ముసుగులో వ్రాస్తున్నారనటం, పార్టీ వారేమో కోవర్టులని బిరుదులివ్వటం, ఇలాంటివి కాంగ్రెస్ ఎదురుదాడి రాజకీయాల్లానే ఉన్నాయి.
@a2z:
>> “చిరంజీవి పేరుతొ అందలం ఎక్కాలనుకునే ఆశాపరులు ..”
నే రాసింది అదే విషయమ్మీద. ఆ ఆశాపరుల్లో మొట్టమొదటి వాడు అరవింద్. చిరంజీవిని దెబ్బ తీస్తుంది ప్రత్యర్ధులు కాదు, సొంత వాళ్లే.
“..అసమర్ధ నాయకుడికన్నా తప్పులు చేసే నాయకుడికే విలువెక్కువని గ్రహించాలి,..” – చక్కగా చెప్పారు. పార్టీ అన్నాక అన్ని రకాల జనం ఉంటారు. అరవిందులాగా అవకాశాలను వాడుకోజూసేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అలాంటివాళ్ళను ఎక్కడుంచాలో అక్కడుంచాలి. నాయకుడికి స్వయంగా ఆలోచించే శక్తి, నిర్ణయాలు తీసికోగలిగే శక్తీ, సరైనవారి సలహాలను స్వీకరించే శక్తియుక్తులూ ఉంటేనే నాయకుడిగా కొనసాగగలుగుతాడు.
చిరంజీవి ఇప్పట్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు కానీ ప్రజారాజ్యాన్ని విమర్శిస్తూ పోతే మీది కాపు వ్యతిరేక అజెండా అని కూడా డౌట్ వస్తుంది.
@marthanda,
ప్రజారాజ్యం కాపుల పార్టీ అని ఒప్పుకున్నారా? మరి ఆ పార్టీ ని వ్యతిరేకిస్తే కాపు వ్యతిరేక అజెండా ఏంటి? అది కాపుల కోసమే పనిచేస్తుందా? ప్రజా వ్యతిరేక అజెండా అంటే ఒకలా ఉండేది. కేవలం కాపు వ్యతిరేకం అయితే, అది అందరివాడి పార్టీ కాదు, కులపార్టీ నే..
తెలుగు దేశం కమ్మవాళ్ళని, కాంగ్రెస్ రెడ్లని పెంచి పోషించలేదా? శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు గొర్లె శ్రీరాములు నాయుడు దగ్గర కార్ డ్రైవర్ గా పని చేసిన గద్దె బాబూరావుని విజయనగరం జిల్లా నుంచి ఎం.ఎల్.ఎ.గా గెలిపించి అతన్ని రాష్ట్రంలోని సీనియర్ నాయకుణ్ణి చెయ్యలేదా? ఎన్.టి.ఆర్. కమ్మవాళ్ళని ఎలా పెంచి పోషించాడో కమ్మవాళ్ళ జనాభా చాలా తక్కువ ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజలకి కూడా తెలుసు.
I am not supporting Prajarajyam in this issue but I noticed that TDP and Lok Satta supporters are trying to use Parakala Prabhakar’s issue in fraudulent manner.
@మార్తాండ:
ఎన్టీయార్ వల్ల కమ్మ వాళ్లకి ఏం ఒరిగిందో, ఏం ఒరగలేదో మీకన్నా వివరంగా నేను మాట్లాడగలను. అలాగే రెడ్లు కాంగ్రెస్‌ని వాడుకున్నారో, కాంగ్రెస్ రెడ్లని వాడుకుందో కూడా నాకు బాగా తెలుసు. ఏ పార్టీ కూడా ఏ ఒక్క కమ్యూనిటీకీ ఊడబొడిచిందేమీ లేదు – అలా ఊడబొడవాల్సిన అవసరమూ లేదు. ఊరికే ప్రతి చర్చలోనూ మీ ఊరి చుట్టుపక్కల విషయాలు ప్రస్తావించి అవే రాష్ట్రవ్యాప్తంగా ప్రామాణికం అనే మీ భ్రమని ఇతరుల మీద రుద్దటానికి ప్రయత్నించకండి. అసలు నా టపాతో మీ వ్యాఖ్యలకేమన్నా పొంతనుందా? కులం కళ్లద్దాలు తీసేసి ఎదుటి వాళ్లు చెప్పేది వినటం నేర్చుకోండి.
చిరంజీవి రాజకీయాలలోకి రావడానికి మొదట ఇష్ట పడలేదు, నిజమే. ఆ టైమ్ లో అభిమానులే ఓవర్ యాక్షన్ చేసి చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడు అని పుకార్ సృష్టించారు. ఆ వార్తల వల్ల తాను పాపులర్ అయ్యానని భ్రమపడి చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టాడు. చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టిన తరువాత ఇతర కులతత్వ పార్టీలకి భయం పట్టుకుని కాపుల పై ద్వేషంతో ఏ చిన్న కారణం దొరికినా ప్రజారాజ్యం పై విరుచుకుపడుతున్నారు. ఒక సినిమా హీరో రాజకీయాలలోకి వచ్చినా, రాకపోయినా నాకొచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఆ హీరో చేసిన తప్పులు ఎత్తి చూపి ఆ అంశాలని కుల అజెండా కలిగిన ప్రచారం కోసం వాడుకోవడం అభ్యంతరకరంగా ఉంది. అందుకే ఈ విషయంలో ఇలా వ్రాయవలసి వచ్చింది.
Seems something is wrong with Marthanda, here nobody is talking about caste, probably he is trying to bring some external things in the context of this post
They do not directly refer about caste, but they too have caste hatred in mind.
అబ్రకదబ్ర, మీరు శీర్షికలు భలే పెడతారు… 🙂
@ సత్య
అవును, కాంగ్రెస్ లో నాయకులు ఎదురుదాడి మొదలుపెడతారు. దాన్ని పట్టుకుని కార్యకర్తలు, సానుభూతిపరులు చేస్తారు. ఇప్పుడు పి ఆర్ పి కూడా అలానే కనపడుతుంది. పి ఆర్ పి సానుభూతిపరుల ఎదురుదాడి ముందు, కాంగ్రెస్ వాళ్ళ ఎదురుదాడి దిగదుడుపే..! కొంచెం కీ ఇచ్చి వదిలేస్తే చాలు రెచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న గుడ్డి అభిమానులు ఎంతమందో…
పీఆర్పీ వాళ్ళ ఎదురుదాడి ఆక్రొశం, ఆవేదన తో కూడుకున్నదిలా అనిపిస్తుంది కొన్ని సంధర్బాలలో.. మేము చేసిన తప్పులు మా కంటే ఎక్కువ కాంగ్రెస్, టీడీపీలు చేస్తుంటే, కొద్దో గొప్పో బెటర్ గా చేసిన మమ్మల్నే ఎందుకు ఎక్కువ అంటున్నారని? అర్ధం చేసుకోదగినదే.. కాకపోతే పీఆర్పీ ని విమర్శిస్తే ఆ రెండు పార్టీలని సమర్ధిస్తున్నట్లుగా ఎందుకు కుమిలిపోతారో అర్ధం కాదు. చివరకు వాళ్ళ అసహనం ఎలా తయారయ్యిందంటే లోక్‌సత్తా ని అడ్డు పెట్టుకొని టీడీపీ ముసుగులో పీఆర్పీ ని తిడుతున్నారు అని డిక్లేర్ చెసుకొని తృప్తి పడుతున్నారు. అయినా సంతృప్తి కలుగకపోతే JP ని కూడా ముసుగు దొంగ గా అభివర్ణించి సాంత్వన చెందుతున్నారు.
బాగుంది…, చక్కని విశ్లేషణ..!
మార్తండా,
మీకు ప్రజాస్వామ్య పార్టిల మిద అంత ఉత్సాహం ఎందుకు? మీరు ఎ ఎండకు ఆ గొడుగు పట్టె రకంలా ఉన్నారు. ఇన్నయ గారి బ్లొగ్ లో ఏమొ మీరు నాస్తికులు, మీ బ్లొగ్ లో మరో ప్రపంచం సాధ్యమే అంటారు, మరి మీకు ఎలెక్షఒన్స్ మీద ఉత్సాహం ఎందుకు? ఒక్కొక చోట ఒక్కొక రకం గా ఉన్నాది మీ వేషం. మీకు క్లారిటి లేదు. మొత్తానికి మీకు అగ్రవర్ణాల చేతీలొ అధికారం ఉనండ కూడదంటారు. అంతేగా మరి.
@అబ్రకదబ్ర,
* ఎన్టీయార్ వల్ల కమ్మ వాళ్లకి ఏం ఒరిగిందో, ఏం ఒరగలేదో మీకన్నా వివరంగా నేను మాట్లాడగలను. అలాగే రెడ్లు కాంగ్రెస్‌ని వాడుకున్నారో, కాంగ్రెస్ రెడ్లని వాడుకుందో కూడా నాకు బాగా తెలుసు. ఏ పార్టీ కూడా ఏ ఒక్క కమ్యూనిటీకీ ఊడబొడిచిందేమీ లేదు – అలా ఊడబొడవాల్సిన అవసరమూ లేదు*
మీరు పదే పదే తెలుగు దేశం వాళ్ళ వల్ల కమ్మ వాళ్లకి ఏం ఒరిగిందో, ఏం ఒరగలేదో మీకన్నా వివరంగా నేను మాట్లాడగలను. మీరొ క టపా వివరం గా రాశెది ట్వరలో . మీరు దేనిని బెస్ చేసుకొని అలా అంటున్నారో అందరికి తెలుస్తుంది . అదే కాక మీరు మీగురించి కొంచేం చెబితే బాగుంటుంది, అంటె మీరు పనీ చేసే రంగం మీ వయసు సుమారు గా ఎంతౌండవచ్చొ తెలెయజెయగలరు మీకు సమ్మతి ఐతేనే, ఎందుకంటె చదివెవారికి మీ గురించి ఒక అంచనా కి వస్తారు.
@అరుణ:
>> “మీరు పదే పదే తెలుగు దేశం ..”
పదే పదే కాదు – నేను ఒకే ఒక సారి అన్నాను. మార్తాండ మాటలకి విసిగిపోయి 🙂 కులాల లెక్కలకు సంబంధించిన వివరాల్లోకి నేను వెళ్లదలచుకోలేదు. నాకవంటే చిరాకు. ఒకటి మాత్రం చెబుతాను. కుల మతాలు పార్టీలకి వోట్ బ్యాంకులు మాత్రమే. ఏ పార్టీ కూడా ఏ కులాన్నీ, మతాన్నీ ఉద్ధరించదు. అసలు ఎవరైనా ఎందుకు ప్రత్యేకంగా ఓ వర్గాన్ని మాత్రమే ఉద్ధరించాలి? ఆ మధ్య తాడేపల్లి గారి బ్లాగులో ‘బ్రాహ్మలకి ఏమీ చెయ్యలేదు కాబట్టి కాంగ్రెసుకి బ్రాహ్మలు వోట్లెయ్యొద్దు’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కుళ్లిపోయిన పార్టీ అన్న విషయంలో తాడేపల్లిగారితో నాది ఏకాభిప్రాయం. కానీ కుల ప్రాతిపదికన కాంగ్రెస్‌కి వోటెయ్యకూడదనటం నాకు అభ్యంతరకరంగా తోచింది. (ఇదే అభిప్రాయాన్ని అక్కడ వ్యాఖ్యగా పెట్టాను). Bottom line: రాజకీయ పార్టీలని సమర్ధించే, వ్యతిరేకించే విషయంలో నా నిర్ణయాలని నా కులమో, ఆయా పార్టీ నేతల కులమో ప్రభావితం చెయ్యదు. వోటర్లందరూ ఇదే రకంగా ఆలోచించగలిగినప్పుడు పార్టీలు కూడా కులాలని వోట్ బ్యాంకులుగా చూడటం మానేస్తాయి.
>> “మీరు మీగురించి కొంచేం చెబితే బాగుంటుంది”
అడిగినందుకు ధన్యవాదాలు. సందర్భమొచ్చినప్పుడు చెబుతాను. ప్రస్తుతానికైతే నా గురించి చెప్పుకోగలిగినంత గొప్ప వివరాలేమీ లేవు.
There is nothing implicity. I express every thing explicitly. ఈ మధ్య తాడేపల్లి గారి బ్లాగ్ లో కాంగ్రెస్ కొంత మంది దళిత నాయకుల్ని చేరదీసిందని కాంగ్రెస్ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ అని ఆరోపణలు. వీళ్ళ వాదనలు చూసిన తరువాత అగ్రకులాల చేతి నుంచి రాజ్యాధికారాన్ని లాకోవడం తప్పు కాదనిపించింది.
మార్తండ,
*మధ్య తాడేపల్లి గారి బ్లాగ్ లో కాంగ్రెస్ కొంత మంది దళిత నాయకుల్ని చేరదీసిందని కాంగ్రెస్ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ అని ఆరోపణలు.*
అసలికి దలితుల పరిస్థిని అందరికన్నా ఎక్కువ గా మార్చింది కాంగ్రెస్ పార్టియె. తాడెపల్లి గారిని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని మాత్రం నేను చెప్పగలను. బాబా సాహెబ్ గారు అన్ని విమర్శలు చేసినా గాంధి గారి మీద,కాంగ్రెస్ మీద చివరికి నెహౄ గారి మంత్రివర్గం లో చేరాడు. ఆయన పార్టీ అధికారం లోనికి రాలేదు కదా. ఆ రోజుల లో ఆయన భావజాలానికి ప్రజల మద్దతు లభించలేదు. మాయావతి లా మీరు అధికారం చేపడుతామంటె వద్దనెది ఎవరు? దానిని లాక్కొంటారొ, ప్రజల మద్దతు గెలుస్తారో మీ ఇష్టం. ప్రయత్నించి అధికారం లోనికి రండి ఎవరు వద్దన్నారు? దానికి మీరు రోజు బ్రాహ్మణ వాదులు/ భావజాలం అని నిమిషానికి ఒక టపా రాయాలా? మీకు తెలిస్తె బ్రాహ్మణ భావజాలం అంతే ఎమిటో ఒక టపా రాసెది?
నేను అడిగిన దానిలొ మీరు ఒక్క దానికే సమాధాన మిచ్చారు. కింద ప్రశ్నలకు సమాదానం ఎమిటి?
మీకు ప్రజాస్వామ్య పార్టిల మిద అంత ఉత్సాహం ఎందుకు? మీరు ఎ ఎండకు ఆ గొడుగు పట్టె రకంలా ఉన్నారు. ఇన్నయ గారి బ్లొగ్ లో ఏమొ మీరు నాస్తికులు, మీ బ్లొగ్ లో మరో ప్రపంచం సాధ్యమే అంటారు, మరి మీకు ఎలెక్షఒన్స్ మీద ఉత్సాహం ఎందుకు? ఒక్కొక చోట ఒక్కొక రకం గా ఉన్నాది మీ వేషం. మీకు క్లారిటి లేదు
నేనేమీ ప్రజాస్వామిక పార్టీల వైపు incline అవ్వడం లేదు. ఆరోపణల వెనకాల ఉన్న hidden కుల అజెండాని విమర్శిస్తున్నాను. పక్కా ప్రీప్లాన్డ్ గా రాజకీయ పార్టీ పెట్టిన జె.పి.ని వదిలేసి చిరంజీవి మీదే ఎందుకింత విరుచుకుపడుతున్నారా అని డౌట్ వచ్చి, క్రమంగా ఆ డౌట్ బలపడింది.
@@@@@@@@@@@కుల మతాలు పార్టీలకి వోట్ బ్యాంకులు మాత్రమే. ఏ పార్టీ కూడా ఏ కులాన్నీ, మతాన్నీ ఉద్ధరించదు. అసలు ఎవరైనా ఎందుకు ప్రత్యేకంగా ఓ వర్గాన్ని మాత్రమే ఉద్ధరించాలి?@@@@@@@
this point, 100% AGREE.
Marthanda@చిరంజీవి మీదే ఎందుకింత విరుచుకుపడుతున్నారా
పళ్ళు వున్న చెట్టుకే రాళ్ళు విసురుతారు. మంచి వుద్దేశంతో చేసే విమర్శలు గౌరవంగా స్వీకరించగల్గాలి. కానీ మీరు చెప్పినట్లు చాలా విమర్శలు పక్కా ప్రీప్లాన్డ్ మరియు hidden కులం/ద్వేషం అజెండాలు వుండటం వలన, విమర్శలకు విలువ లేకుండా పోయింది.
@ Marthanda & A2Z
After hearing you two, I was reminded of this strip 🙂
Dogbert: My invention can detect human stupidity. It has a very simple interface. All I do is point it at people.
Dilbert: Then what does it do?
Dogbert: Why would it need to do anything else?
I think you are the real hole searcher (రంధ్రాన్వేషి)
Wonderful analysis అబ్రకదబ్ర గారు. టైటిల్ అదిరింది.
మరొక జోకేమిటంటే “సామాజిక న్యాయం” కి కొత్త ఆర్థం చెప్పిన ఘనత – సమాజాన్ని కులాల పేరుతో విభజించటం
శీర్షిక అద్భుతం. విశ్లేషణ చాలా బాగుంది. మంచి భాష.
శుభాభినందనలు.
– కెవిజి