జ్ఞానోదయం

ఆయన – గుంటూరు జిల్లాలో రెండు పర్యాయాలు తెదెపా తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై క్రితం సారి కాంగిరేసు హవాలో కొట్టుకుపోయిన ఓ రాజకీయుడు. స్థానికంగా ప్రముఖుడు. తెదెపా తరపున వచ్చే ఎన్నికల్లో మరోసారి టికెట్ ఖాయమన్న నమ్మకంతో – తన నియోజక వర్గంలో జన చైతన్య యాత్రలతో పార్టీ వర్గాలని ఉత్తేజ పరిచే పనిలో మునిగున్నాడు. రాజకీయాల్లోకి రాకముందునుండీ మా కుటుంబానికి సన్నిహితుడు. ఆ పరిచయం కొద్దీ నేనీ మధ్య నేటి రాజకీయాల గురించి సిల్లీ ప్రశ్నలేవో వేస్తే ఆయన్నుండొచ్చిన సమాధానాలివి.

ఈ రోజుల్లో ఎన్నికల ప్రచారానికి ఒక్కో ఎమ్మేల్యే అభ్యర్ధి పెట్టే ఖర్చు తక్కువలో తక్కు ఐదు కోట్ల రూపాయలుంటుందనేది నా ఒకానొక ప్రశ్నకి ఆయనిచ్చిన బదులు. ఇది కనీస ఖర్చు. ఇరవై కోట్ల దాకా ఖర్చు పెట్టే వాళ్లూ ఉంటారట. ఎమ్‌పి అభ్యర్ధుల ఖర్చు దీనికి కొన్ని రెట్లు ఎక్కువ. ఐదేళ్ల పాటు దోచేశారు కాబట్టి అధికార పార్టీ వాళ్లు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, తాము వాళ్లకి సరితూగగలరో లేరో అన్నది ఆయన ఆందోళన. ఇది విన్నాక నాకు సహజంగానే ఓ సందేహమొచ్చింది: ‘ఇంత ఖర్చు పెట్టి గెలిచినోళ్లు అదృష్టం బాగుండి తమ పార్టీయే అధికారంలోకొస్తే ఈ ఖర్చంతా రాబట్టుకునే పనిలో పడతారు కదా‘?

‘నిస్సందేహంగా. అంతే కాదు. తర్వాతొచ్చే ఎన్నీకల్లో పెట్టబోయే ఖర్చూ ఇప్పుడే రాబట్టుకోవాలి కూడా. అంటే, ఇప్పుడు ఇరవై కోట్లు ఖర్చు పెట్టిన వాడు కనీసం నలభై కోట్లు రాబట్టుకోకపోతే కష్టం. నాలాగా క్రితం సారి ఓడిపోయినోళ్లకి అప్పటి నష్టాలు పూడ్చుకోవటం అదనం’ – ఇది ఆయన సమాధానం.

బాగానే ఉంది. ఈ రకంగా ఎవరి ఖర్చులు వాళ్లు రాబట్టుకుంటూ కూర్చుంటే ఇక జనాలకోసం పని చేసే వాళ్లెవరు?

‘జనాల కోసం ఏదన్నా చెయ్యాలటే అధికారంలో ఉండాలి, అధికారంలో ఉండాలంటే ఎన్నికల్లో ఎగస్పార్టీవాడికన్నా ఎక్కువ ఖర్చెట్టాలి, ఖర్చంటూ పెట్టాక ఛాన్సొచ్చినప్పుడే దాన్ని వెనక్కి రాబట్టుకోవాలి. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల కోసం పనులు, పైరవీలూ చేసిపెట్టాలి. మరీ అవసరమైతే ఎగస్పార్టీ వాళ్లకీ అక్కడోటీ ఇక్కడోటీ చేసి పెట్టాలి – మా మొహమాటాలు మాకుంటై కదా. ఇవన్నీ అయ్యాక కానీ బయటోళ్ల గురించి ఆలోచించే టైముండదు. ఆ లోగా ఎటూ మళ్లీ ఎలక్షన్లొచ్చేస్తాయి. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇదింతే. తప్పదు మరి’

సొంత ఖర్చు రాబట్టుకోటానికి గడ్డి కరిచారంటే ఏదో అర్ధం చేసుకోవచ్చు. మధ్యలో కార్యకర్తల గోలేంటి?

‘అమాయకుడా. వాళ్ల పనులు చేసి పెట్టక పోతే మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు పార్టీ జెండా భుజానేసుకుని మోసేవాడెవడు? ఏ లాభమూ లేకపోతే పన్లు మానుకొచ్చి నా కోసం తిరుగుతారా వాళ్లు? ఎవరిదాకో ఎందుకు, నువ్వు ఫ్రీగా తిరుగుతావా నా కోసం? చెప్పు’

నిజమే. ఇదో విషవలయం లాగుంది. దీన్నుండి బయట పడటమెలా మరి?

‘అది జరిగే పని కాదులే. ఉన్నంతలో మెరుగ్గా పని చేసే వాళ్లని ఎన్నుకోటమే కానీ అవినీతిని పూర్తిగా తన్ని తగలెయ్యటం అయ్యే పని కాదు’

ఎందుక్కాదు, వ్యవస్థని మారిస్తే ఏదైనా సాధ్యమే

‘పిచ్చివాడా. అలాంటి నినాదాలు సినిమాల్లో వింటానికే బాగుంటాయి. ఆచరించటానిక్కాదు. అయినా, ఎవరు అవినీతి పరులు? మందు పోస్తేనో, డబ్బులిస్తేనో కానీ ఓట్లెయ్యమనేవాళ్లా లేక మేమా? ఓటర్లతో సహా అందరూ దొంగలే ఇక్కడ. మీరు సరిగ్గా ఉంటే మేమిలా ఎందుకుంటాం? యధా ప్రజా, తధా రాజా’

మందు, నోటుకి ఓటు .. మీరు చేసిన అలవాట్లే కదా అవన్నీ

‘కోడి ముందో, గుడ్డు ముందో. మార్పు మాత్రం ఓటర్లలో రావాలి ముందు. అప్పుడు మాలోనూ రాక చస్తుందా?’

ఒక్క రోజులోనే మార్పు రాదు కదా. మెల్లిగా వస్తుంది. లోక్ సత్తా లాంటోళ్లు ప్రయత్నం చేస్తున్నారుగా’

‘వాళ్లది మంచి ప్రయత్నమే. అయితే ఈ మార్పొచ్చేదాకా ఆగే ఓపికెవరికుంది? తాను మారడు కానీ ప్రతోడూ పక్కోడు మారాలనుకునే వాడే. ఇన్ని కోట్ల మంది జనాలు మారాలి, వాళ్ల మనస్తత్వాలు మారాలి. లోక్ సత్తా ఎంత గింజుకున్నా, ఎప్పటికయ్యే పనది? వాళ్లకి ఓటేస్తే మురిగిపోవటమే కానీ ఉపయోగం లేదు. దాని బదులు చంద్రబాబుని మళ్లీ అధికారంలోకి తెస్తే ఎంతో కొంత ఉపయోగముంటుంది’

ఒకప్పుడు చంద్రబాబు మెరుగే. కానీ పోయినసారి తగిలిన షాకుకి ఆయనకి జ్ఞానోదయమై ఇకపై విజన్లూ, గిజన్లూ నాకొద్దు; నేనూ అందిన కాడికి దోచుకుంటా అనుకుంటే?’

‘అనుకుంటే అనుకోవచ్చు కానీ, మళ్లీ చంద్రబాబొస్తే ఇప్పుడున్న స్థాయిలో దోపిడీ ఉండదని చెప్పగలను’

ఆఁ ఇంకా ఆయన దోచుకోటానికి ఏమ్మిగిలిందిగనక. ఇప్పుడిక ఎవరొచ్చినా ఒకటే’

‘అంతేనంటావా?’

అంతే కదా మరి. మీ ఖర్చులు, మీ కార్యకర్తల బత్తాలు, ఎక్స్‌పార్టీ మొహమాటాలు పోగా ఏదన్నా మిగిలితే మాకోసం. ఇప్పుడున్నాయన అంతా ఊడ్చుకుపోగా మీకు దొరకబోయేదే ఖాళీ చిప్ప. అందులోంచి మాకు వీర ముష్టెయ్యటానికి ఏముందక్కడ? మొత్తానికి – మీతో మాట్లాడాక బోలెడంత తత్వం బోధ పడింది’

‘ఏమని?’

‘ఏ రాయైతేనేం అని’

 

 

6 స్పందనలు to “జ్ఞానోదయం”


 1. 1 kannagadu 4:40 సా. వద్ద ఫిబ్రవరి 17, 2009

  “వాళ్లకి ఓటేస్తే మురిగిపోవటమే కానీ ఉపయోగం లేదు” మనం ఓటేసిన పార్టీ ఓడిపోయినంత మాత్రాన మనకొచ్చే మురిగిపోయేదో మునిగిపోయేదో ఏమీ ఉండదు, ఓడిపోయిన వాడికి మాత్రం కనీసం నావెనక కొందరున్నారు ఇంకా కృషి చేస్తే అందరూ తనవైపు వస్తారన్న నమ్మకమన్నా వస్తుంది.
  చాలామంది లోక్‌‌సత్తాకి ఓటేయమంటే “ఆ! ఎందుకు ఎటూ ఓడిపోయేదే కదా ఎందుకు వేయటం దండగ” అనే వారే అధికం ప్రత్యేకించి నిజాలు తెలిసినవారే. మన ఓటు అనేది గెలిచే వాడికి కాదు నిజాయితీగా, ఓడిపోయేవాడైనప్పటికీ మంచివాడికి ఓటేయాలి.

  దయచేసి ఓటేసేముందు ఒక్కక్షణం లోక్‌సత్తాకి ఎందుకు వేయకూడదు అని ప్రశ్నించుకోవలిసిందిగా మనవి.

 2. 2 xyz 6:41 సా. వద్ద ఫిబ్రవరి 17, 2009

  @తాను మారడు కానీ ప్రతోడూ పక్కోడు మారాలనుకునే వాడే:

  This is too good and absolutely correct.

 3. 3 జీడిపప్పు 8:38 సా. వద్ద ఫిబ్రవరి 17, 2009

  ఇప్పుడు చాలామంది ప్రజలు మొహమాటపడకుండా “ఎంతిస్తావు వోటేస్తే” అని అడుగుతున్నారు. ప్రజలనుండి అంత ఎంకరేజ్‌మెంట్ వస్తుంటే మరింత రెచ్చిపోయి తింటున్నారు మన రాజకీయనాయకులు.

 4. 4 sUryuDu 4:48 ఉద. వద్ద ఫిబ్రవరి 18, 2009

  “‘పిచ్చివాడా. అలాంటి నినాదాలు సినిమాల్లో వింటానికే బాగుంటాయి. ఆచరించటానిక్కాదు. అయినా, ఎవరు అవినీతి పరులు? మందు పోస్తేనో, డబ్బులిస్తేనో కానీ ఓట్లెయ్యమనేవాళ్లా లేక మేమా? ఓటర్లతో సహా అందరూ దొంగలే ఇక్కడ. మీరు సరిగ్గా ఉంటే మేమిలా ఎందుకుంటాం? యధా ప్రజా, తధా రాజా’”

  “‘వాళ్లది మంచి ప్రయత్నమే. అయితే ఈ మార్పొచ్చేదాకా ఆగే ఓపికెవరికుంది? తాను మారడు కానీ ప్రతోడూ పక్కోడు మారాలనుకునే వాడే. ఇన్ని కోట్ల మంది జనాలు మారాలి, వాళ్ల మనస్తత్వాలు మారాలి.”

  adiraayi kaameMTs 😉

 5. 5 Sreedahr 12:20 సా. వద్ద ఫిబ్రవరి 18, 2009

  దయచేసి ఓటేసేముందు ఒక్కక్షణం లోక్‌సత్తాకి ఎందుకు వేయకూడదు అని ప్రశ్నించుకోవలిసిందిగా మనవి

 6. 6 ramesh kumar 12:04 ఉద. వద్ద ఫిబ్రవరి 19, 2009

  Think about your nation and its situation before you vote, When my father finished his degree, at those times, there were multiple job options it seems.But now, see the situation, how many young graduates are on roads, this happened just after a generation, Think about how will be the situation in the next generation.

  If we don’t transform the politics who will be in severe trouble?, it is us, the citizens of this great democratic country.

  Even now also there are lot of government positions are vacant, they won’t fill them, in education department only there are 70,000 posts vacant it seems, government don’t fill them because if they fill these positions, they have to pay salaries for the people.

  This is only about employment, Think about all other sectors in the country.

  We are responsible for the current situation please think twice before you VOTE.

  Keep aside heroes, caste, religion and region, Just think about nation and VOTE.

  I thought like that several times but i found only one answer that is LOKSATTA.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: