శీర్షిక తికమకగా ఉందా? కింది ఛాయా చిత్రాలు చూడండి, అర్ధమౌతుంది. ఫొటోషాప్ కనికట్టు కాదిది. ఆ మేకలు నిజంగానే చెట్లెక్కాయి. మొరాకోలో నేషనల్ జియోగ్రఫిక్ ఫొటోగ్రాఫర్ల కళ్లబడ్డ దృశ్యమిది.
ఆ దేశంలో స్థానికంగా పెరిగే ‘అర్గన్’ అనబడే చెట్లివి. వాటి కాయలంటే ఈ మేకలకి అమితమైన ఇష్టం. ఐతే, ఆ కాయల నుండొచ్చే నూనెలోని పోషక పదార్ధాలు, ఇతర ప్రశస్తమైన లక్షణాల గురించి కొత్తగా పరిశోధనల్లో బయటపడటంతో వీటికి కష్టకాలం దాపురించింది పాపం. చెట్లకున్న కాయలన్నిట్నీ స్థానిక ప్రజలు, వ్యాపారులు ఊడ్చుకు పోతుండటంతో – చిటారు కొమ్మనన్నా మిఠాయి పొట్లం దొరుకుతుందేమోనన్న ఆశతో – తమ ‘ఫేవరెట్ స్నాక్’ కోసం ఇలా తెగించి చెట్లెక్కటం నేర్చేసుకున్నాయవి! ఎవరన్నారు గొర్రెలూ, మేకలూ బుర్ర తక్కువ జీవులని!?!
సీతారామశాస్త్రి గారు ‘గాయం’ గేయాన్ని తిరగరాస్తారీ సిత్రాలు చూస్తే.
(ఫొటోలపై క్లిక్కితే పెద్దవిగా అగుపిస్తాయి)
హ్హహ్హహ్హ, ఇక్కడ మరోసారి రుజువైంది “మనుగడ కోసం పోరాటం”
మొరాకోలో మేకలు చెట్లెక్కితే గొప్పేంటి.
మనదేశంలో కుక్కలు గద్దెలెక్కు తాయి. నక్కలు వంత పాడతాయి. కోతులు వెండితెరలెక్కుతాయి.
కన్న గాడు చెప్పినట్టు అక్కడ మనుగడ కోసం పోరాటం. ఇక్కడ పదవులకోసం ఆరాటం.
హ హ్హ హ్హా
హా హా ఆత్రేయ గారూ మీ కామెంటు సూపరు.
ఆత్రేయ గారూ 🙂
పాపం ఎక్కటానికి చెట్లన్నా మిగిల్చారు. చెక్కపొడుము కూడా కొంటారని తెలిస్తే అవీ వుండేవికావు.
Interesting article about these goats:
http://www.iht.com/articles/2005/10/28/news/goats.php
I remember reading a similar story about an expensive brand of coffee beans.
అబ్రకదబ్ర,
ఇలాంటి చెట్లు నేను మనవైపు బోలెడు చూసాను. ముఖ్యంగా నల్లతుమ్మ లాంటి ముళ్లచెట్లు ఎక్కువగా ఉండే పల్నాడులోనే!
@సుజాత:
ఇలాంటి చెట్లు నేను చూసిన గుర్తులేదు కానీ, మీరు పల్నాటి నల్లతుమ్మ చెట్ల ప్రస్తావన తెస్తే నా హైస్కూలు రోజులు గుర్తొచ్చాయి. అప్పట్లో – మేం ఇంకా వర్ధమాన క్రికెటర్లమే కనుక – టీముకొక్క బ్యాట్ తప్ప ఇతర సరంజామా ఏదీ ఉండేది కాదు (రెండు బ్యాట్లున్న టీము బహు రిచ్ కింద లెక్క). మరి అతి ముఖ్యమైన వికెట్లో? నల్లతుమ్మ చెట్లు నరికేసి తాట వలిచేసి వికెట్లుగా మలిచేసేవాళ్లం 🙂 ఇప్పుడంటే హైస్కూలు పిల్లకాయలు జేబు డబ్బుతో సరంజామా అంతా కొనేస్కుంటున్నారు కానీ, అప్పట్లో క్రికెట్టాడాలంటే ఇలాంటి చిట్కాలు బోలెడు తెలిసుండాలి.