అమెరికా తూర్పు తీరంతో పోలిస్తే క్యాలిఫోర్నియాలో ఫాల్ కలర్స్ అంత ప్రసిద్ధి చెందినవి కావు. స్ప్రింగ్ కలర్స్ ఇక్కడ ఎక్కువ పేరుగాంచాయి. అయితే అక్కడక్కడా మేమూ తీసిపోలేదన్నట్లుగా శిశిరం రంగులు ఈ పడమటి రాష్ట్రంలోనూ కనిపిస్తుంటాయి. బే ఏరియాలో ఈ సారవి చాలా చాలా ఆలస్యంగా – డిసెంబరాఖర్లో – కనిపించాయి. వీటిని వింటర్ కలర్స్ అనాలేమో మరి. నా కార్యాలయం దగ్గర్లో కనబడ్డ వర్ణరంజిత ప్రాంతాన్ని కెమెరాలో బంధించి ఇక్కడుంచుతున్నాను – మీకోసం. కలర్ కరెక్షన్స్ లాంటివేమీ లేకుండా తీసినవి తీసినట్లుగా ఉంచాను. చూడండి. (క్రింది thumb nail మీద నొక్కితే బొమ్మ పోస్టు కార్డు సైజులో కనిపిస్తుంది. దాని మీద మరోసారి నొక్కితే పూర్తి పరిమాణంలో మీ తెరనిండా కనిపిస్తుంది)
వింటర్ కలర్స్
Published డిసెంబర్ 28, 2008 వ్యక్తిగతం 3 వ్యాఖ్యలుట్యాగులు:కాలిఫోర్నియా, చలికాలం, శిశిరం
ఒకటే కారు ఉన్న చిత్రం తక్కువ distraction తో రమ్యంగా ఉంది. శాన్ హోజే పురంలో fall ఆలస్యమే, తూర్పు తీరం తో పోలిస్తే.
మీకు చెట్లతో నిండిన దారులంటే ఇష్టమా (అశోకుడి వలె) మీ బేనర్ కూడా అలాంటి చిత్రమే ఉంది.:)
చిత్రాలు బాగున్నాయి.
బాగుంది.