భారతీయం

నాకో స్నేహితుడున్నాడు. అంటే – ఉన్నదే ఒకడు కాదు; ఉన్నోళ్లలో ఒకడు. బాగా ఉన్నోడే. అంతున్నా, ఇంకా కావాలనే యావున్నోడు. వాడికో బ్రహ్మాండమైన జీతమిచ్చే ఉద్యోగముంది. ఉద్యోగంలో పరిచయాలను తన తతిమ్మా వ్యాపారాలకు వాడుకునే నేర్పూ ఉంది. అసలు వాడు ఉద్యోగం చెయ్యటం ఆ పరిచయాలకోసమే తప్ప, వాడికొచ్చే జీతం ఇతర సంపాదన ముందు పల్లీపప్పులు. నాకు వీడిలో అన్నీ నచ్చుతాయి – ఒకటి తప్ప. భారతీయత అంటే ప్రాణం వీడికి. మంచిదే కదా, అదా నచ్చనిది? కాదు. మరి? సదరు భారతీయతకి వాడి స్వీయ డెఫినిషనుందే, నా సమస్య దానితో. మన సంస్కృతి ప్రస్తావనొచ్చినప్పుడల్లా ‘పాశ్చాత్యులు పేద్ద మెటీరియలిస్టులు’ అంటూ ముక్తాయించిగానీ శాంతించడీ మితృడు. నా ఎరికలో వీడికన్నా పెద్ద మెటీరియలిస్టుల్లేరు. ఆ మాటే అంటే తొణక్కుండా ‘భారతీయులు ప్రపంచానికి ఆధ్యాత్మికతని ఎగుమతి చేస్తే, ప్రపంచం మనకి మెటీరియలిజాన్ని ఎగుమతి చేసింది’ అనేస్తాడు. తస్సదియ్యా, తప్పంతా మిగతా ప్రపంచానిదేనన్నమాట. వాళ్లు కోరుకుంది వాళ్లూ, మనం కోరుకుంది మనమూ దిగుమతి చేసుకుంటున్నామన్న పెడార్ధాలు తీస్తే మాడు పగులుద్ది – జాగ్రత్త.

ఆ మధ్యనో తెలుగు సాహితీ సదస్సులో ఓ నడివయస్కుడు – తెల్లటి ధోవతీ, కండువాలో హుందాగా విచ్చేసిన పెద్దాయన – వేదికెక్కి ‘ఆంధ్రదేశంలో మిణుకు మిణుకుమంటున్న తెలుగు వెలుగుల్ని మళ్లీ మెరిపించటమెలా’ అనే అంశమ్మీద అరగంటసేపు ఆంగ్లంలో అనర్ఘళంగా ఉపన్యాసం దంచిపారేశాడు. పన్లో పనిగా తెలుగువారి ఆహార్యమ్మీదా, కనుమరుగైపోతున్న పంచెకట్టుమీదా నాలుగు చెణుకులు కూడా విసిరాడు. ధోవతీ తొడుక్కోవటమే తెలుగుదనమనేది ఆయన నిశ్చితాభిప్రాయం – మాట్లాడే భాషతో పని లేకుండా!

తెలుగుదనానికి పై కండువా పెద్దమనిషి ఇచ్చుకున్న స్వీయార్ధమంత సొంపైనదే ఇంచుమించు భారతీయతకి నా యాంటీ-మెటీరియలిస్టు స్నేహితుడిచ్చుకున్నదీనూ. ఈ బాపతు వాళ్లు మరీ అరుదేమీ కాదు. అంటే, భారతీయత అనే మాటకి ఎవరికి తోచిన అర్ధాలు వాళ్లు చెప్పేసుకుని ‘నేను మాత్రమే నిఖార్సైన భారతీయుణ్ని, తక్కినోళ్లంతా చవటాయలు’ అనుకునేవాళ్లన్నమాట. మావాడి సంగతే చూస్తే – వాడి దృష్టిలో వాడు, కొడిగడుతున్న భారతీయ సంస్కృతీ సంప్రదాయ జ్యోతులకు అరచేతులడ్డుపెట్టి ఓ కాపుకాయటానికై అరుదెంచిన అవతార పురుషుడు. ‘జాతీయతా వాది’ అనేది వాడికి వాడేసుకున్న వీరతాడు.

వీడి దృష్టిలో భారతీయత అంటే ఏమిటో చూద్దాం. భారతీయులనబడేవాళ్లు విధిగా హిందువులై ఉండాలనేది మొదటి నియమం. దేశంలోని ఇతర మతస్థులందర్నీ కట్టగట్టి హిందూ మహాసముద్రంలో విసిరేయాలని ఇతని అభిప్రాయం; ముఖ్యంగా ముస్లిముల్ని. హిందూ మహాసముద్రంలో హిందూయేతరుల్ని విసరొచ్చా అనేది వెర్రి ప్రశ్న. పాకిస్తానుని ద్వేషించటం భారతీయుల ప్రధమ కర్తవ్యమనేది ద్వితీయ భారతీయతా నియమం. ‘మేడిన్ పాకిస్తాన్’ లేదా ‘మేడిన్ బాంగ్లాదేశ్’ అనున్న ఉత్పత్తులు – ముఖ్యంగా దుస్తులు – వీడు కొననే కొనడు. ఆ రకంగా వాళ్లకొచ్చే డబ్బు మనదేశంలో తీవ్రవాద కార్యకలాపాలకి వాడతారని గురువుగారి నమ్మకం. ఆ మాత్రం దేశభక్తుండాల్సిందే. ఐతే మనోడు కన్వర్షన్లో రెండ్రూపాయలెక్కువొస్తాయని ఎప్పుడూ హవాలా దారుల్లో మాత్రమే హమారా భారత్‌కి డబ్బు పంపుతాడు. ఆ డాలర్లూ, పౌండ్లూ ఎక్కడికెళ్తాయో తెలీని అమాయకుడులెండి. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడైనందుకు వాడు తెగ బాధపడిపోయాడు. ఆయన సగం నల్లోడవటం ఒక కారణం కాగా, ఆయన్లో ముస్లిం మూలాలుండటం అసలు కారణం. ఇంతా చేసి – మావాడికి ప్రతి శుక్రవారమూ డిన్నర్‌కి దగ్గర్లో ఉన్న ఫలానా పాకిస్తానీ రెస్టారెంటుకెళ్లి ఆవురావురుమంటూ గొఱ్ఱె బిరియానీ పొట్లమొకటి లాగించకపోతే నిద్ర పట్టదు. దేశభక్తి దేశభక్తే, బిరియానీ బిరియానీయే – దేన్దోవ దాన్దే.

సరే, దేశభక్తి అనే మాటొచ్చింది కదా. ఆ విషయంలోనూ మావాడికి కొన్ని స్థిరాభిప్రాయాలున్నాయి. మొదటిది, ముఖ్యమైనది: పురాణములను గౌరవించవలెను. వాటిగురించి పిచ్చి పిచ్చి ప్రశ్నలేయరాదు. మంచిదే కదా. ఇందులో తప్పేముంది? పాపం వ్యాసుడూ వాల్మీకీ ఇప్పుడు లేరు కదా అన్జెప్పి వాళ్ల గ్రంధాలని ఇష్టమొచ్చినట్లు ఏకిపారేయటం న్యాయమా? ‘వాళ్లేదో వాళ్ల కాలానికి తగ్గట్లు కధలో కాకరగాయలో రాసుకుంటే వాటిని ఇప్పటి సామాజిక దృష్టితో చూసి పురాణ పురుషుల వ్యక్తిత్వాలకి వంకలు పెట్టటం తప్పు’ అనేది మావాడి స్థిరాభిప్రాయం. పురాణాలనుండి మంచినే గ్రహించాలి కానీ విమర్శనాత్మక దృష్టితో చూడకూడదనేది వాడి నమ్మకం. మన్లోమాట – వాడే చెప్పినట్లు అవి ఏ కాలానికో సంబంధించిన కధలు, ఇప్పటి పరిస్థితులకి పనికొచ్చేవి కాకపోతే ఇక అందులోనుండి నేర్చుకునేదేముంది? అయినా అలాంటి ప్రశ్నలడగటం దేశద్రోహం కాబట్టి మనం అడగరాదు. ‘మానవ నాగరికత మొదలయింది ప్రశ్నతోనే కానీ పనిముట్లతో కాదు’ లాంటి పిచ్చి ప్రేలాపనలు వాడిదగ్గర చేయరాదు.

దేశభక్తికి సంబంధించిన ఇతర నియమాలు: ఎల్లవేళలా భరతమాతని ప్రస్తుతించాలేగానీ పొరపాటున కూడా ఇక్కడి చెడు గురించి మాట్లాడకూడదు. వేలాది ఏళ్ల క్రితం భరతఖండం ఎలా విరాజిల్లిందో డప్పులు కొట్టుకుంటూ బ్రతకాలే కానీ వర్తమానం గురించి బాధపడటం, భవిష్యత్ గురించి బెంగటిల్లటం అవివేకం. దేశంలో చెడంటూ ఏదన్నా ఉంటే గింటే అదంతా రెండొందలేళ్ల బ్రిటిష్ వలస పాలన చలవేనని గ్రహించాలి. అప్పటికీ, ఇప్పటికీ ప్రతిదాని వెనుకా మనల్ని తొక్కేసే కుట్రలే. మనం వెనకబడిపోయాం అని బాధపడకుండా అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష అని ఇతర భారతీయ మితృలకి చాటింపేయాలి (విదేశీయులకి, ముఖ్యంగా పాశ్చాత్యులకి, వేయనవసరం లేదు – వేదాలు కాజేసి వాటి గుట్టు వాళ్లే విప్పారు కాబట్టి). అన్నట్లు – పాశ్చాత్యుల మాటొచ్చింది గనుక – ఆర్యుల దండయాత్ర అనీ, మరోటనీ వాళ్లు తిక్క తిక్క ప్రచారాలు చేస్తుంటారు. అలాంటివన్నీ మనం నమ్మకూడదు. వాటిలో మనకి నచ్చినవి మాత్రమే నమ్మాలి. ఉదాహరణకి, రామేశ్వరం దగ్గరి ఆడమ్స్ బ్రిడ్జి రాముడే కట్టాడని నాసావాళ్లు చెప్పినట్లు వార్తలో, వదంతులో వస్తే చచ్చినట్లు నమ్మాలి, మరో పదిమందికి చెప్పి నమ్మించాలి. ‘మేమా మాటెప్పుడూ అన్లేదు బాబో’ అంటూ నాసా ఇచ్చిన వివరణ నమ్మకూడదు.

ఇంగ్లాండులో స్థిరపడిన నా ఈ స్నేహితుడి దగ్గర ఇటువంటి భారతీయతా చిట్కాలు, జాతీయతా సూత్రాలు మరిన్ని తెలుసుకోవాలనే కుతూహలమున్నవారు అడిగితే అతనితో పరిచయభాగ్యం కల్పించగలను. అయితే మీరు తన వ్యాపారానికి ఉపయోగపడగలరు అనుకుంటే మాత్రమే అతను మీతో పరిచయానికి ఆసక్తి చూపిస్తాడు. ఒకవేళ మీరు మెటీరియలిస్టులైతే ఆ విషయం అతనిదగ్గర బయటపడకుండా జాగ్రత్తపడగలరు. చిత్తగించవలెను.

35 స్పందనలు to “భారతీయం”


 1. 1 భస్మాసుర 9:21 సా. వద్ద డిసెంబర్ 24, 2008

  మొదటగా, మీకు ఇక్కడ బ్లాగులు రాసే మీతో విభేదించే ప్రతి ఒక్కరి లోని మీరూహించుకున్న అన్నిగుణాలూ కట్టకట్టుకుని ఉన్న ఒక స్నేహితుడు లండనులో ఉండటం, ఆయనగారి గురించి మీరు బ్లాగులు రాయటం చాలా అరుదైన విషయం. ఎంత బాగా కుదిరిందీ!

  వెలుతురు చినుకులు వర్షించే మీ ఈ రచన చదివాకా కొన్ని ధర్మ సందేహాలు:

  1. “భారతీయత” కు మీ నిర్వచనం ఏమిటి? మీ స్నేహితుడిలాంటి భారతీయత గురించి ఎలాగూ చెప్పేసారు, వాడి(రి) స్వీయ నిర్వచనం ఇబ్బందికరమైనదే… మరి మీరు, మీ భావాలను పంచుకునే అందరూ(అంటే మీ స్నేహితుని మార్కు భారతీయతతో విసిగిన వారు) సమ్మతించే భారతీయత ఏమిటొ నాకు తెలుసుకోవాలని ఉంది.

  2. “వాడి దృష్టిలో వాడు, కొడిగడుతున్న భారతీయ సంస్కృతీ సంప్రదాయ జ్యోతులకు అరచేతులడ్డుపెట్టి ఓ కాపుకాయటానికై అరుదెంచిన అవతార పురుషుడు” మీ వాడూ, “అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న” చాందసవాదులను ఉద్ధరించాలనుకునే స్వయంప్రకటిత వైతాళికులకూ ఒక పేరుంది – Retards. Its a lovely name isn’t it? మీరు రెండో రకం మనుషులను చూడటంలేదా?

  3. “వీడి దృష్టిలో భారతీయత అంటే ఏమిటో చూద్దాం. భారతీయులనబడేవాళ్లు విధిగా హిందువులై ఉండాలనేది మొదటి నియమం. దేశంలోని ఇతర మతస్థులందర్నీ కట్టగట్టి హిందూ మహాసముద్రంలో విసిరేయాలని ఇతని అభిప్రాయం; ముఖ్యంగా ముస్లిముల్ని” — వీళ్ళని Fanatics అంటారు. మీ ఉద్దేశ్యం మీరు పైన చెప్పిన లక్షణాలున్న భారతీయులందరూ విధిగా ఇలాంటి Fanatics/Zealots అయి ఉంటారనా? ఏరకంగా మీరు ఇలాంటి అలొచన చేస్తారు? Do you have any empirical evidence?

  4. “బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడైనందుకు వాడు తెగ బాధపడిపోయాడు. ఆయన సగం నల్లోడవటం ఒక కారణం కాగా, ఆయన్లో ముస్లిం మూలాలుండటం అసలు కారణం” -ఓహో! మీరు చెప్పిన “భారతీయత” పాటించే మనుషులకు ఇప్పుడు ఆఫ్రికనులు కూడా నచ్చరన్నమాట, ముస్లిములంటే నచ్చరని మనం ముందే ఎలాగూ అనేస్కున్నాం గా.. ఈ లెక్కన వీళ్ళకు సగం మొత్తం ప్రపంచం అంటే అసహ్యం అని మీ భావం.

  5. “మావాడికి ప్రతి శుక్రవారమూ డిన్నర్‌కి దగ్గర్లో ఉన్న ఫలానా పాకిస్తానీ రెస్టారెంటుకెళ్లి ఆవురావురుమంటూ గొఱ్ఱె బిరియానీ పొట్లమొకటి లాగించకపోతే నిద్ర పట్టదు. దేశభక్తి దేశభక్తే, బిరియానీ బిరియానీయే – దేన్దోవ దాన్దే.” –మీరేం మాట్లాడుతున్నారో దానిమీద మీకు అవగాహన ఉందా? బెంగాలులో బ్రాహ్మణులు మాంసం తింటారు ఇప్పటికీ. వైదిక కాలంలోనూ తినేవారు. ఈ దేశంలో ఎప్పుడూ మాంసభక్షణ ప్రాతిపదిక గా Religious prosecution జరుగలేదు.అదట్లుంచి, మాంసభక్షణకూ దేశభక్తికీ లంకేమిటీ? లేదా మాంసభక్షణకూ చారతీయతకూ ఉన్న సంబంధమేమిటో చెప్పగలరా?

  6. “పురాణములను గౌరవించవలెను. వాటిగురించి పిచ్చి పిచ్చి ప్రశ్నలేయరాదు. మంచిదే కదా. ఇందులో తప్పేముంది” — సరిగ్గా చెప్పారు… పురాణాల మీద ప్రశ్నలు వేయవచ్చు, పిచ్చి ప్రశ్నలు కాదు. If one wants to study Ramayana using theories of psychoanalysis, he is simply a spineless retard. పురాణాలను గౌరవించనవసరం లేదు. రాముడు తాటకిని వధించడాన్నీ, మార్టిన్ లూథర్ కింగు అహింసా సిద్ధాంతంతో ముడిపెట్టకుంటే చాలు

  7. “దేశంలో చెడంటూ ఏదన్నా ఉంటే గింటే అదంతా రెండొందలేళ్ల బ్రిటిష్ వలస పాలన చలవేనని గ్రహించాలి. అప్పటికీ, ఇప్పటికీ ప్రతిదాని వెనుకా మనల్ని తొక్కేసే కుట్రలే. మనం వెనకబడిపోయాం అని బాధపడకుండా అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష అని ఇతర భారతీయ మితృలకి చాటింపేయాలి” — రెండువందల ఏళ్ళ బ్రిటీష్ పాలన కాదు అసహ్యించుకోవాల్సింది. బ్రిటీష్ వారు colonize చెయ్యడానికి వీలుగా గా పెంచుకున్న కాపలా కుక్కలన్నీ ఇంకా యధేచ్చ గా సమాజంలో తిరిగుతుండటం. బ్రిటీషు వారూ పోయారు, పోతూ పోతూ వారి శునకాలను ఇక్కడ వదిలి వెళ్ళారు.మీకు ఈ రెండింటికీ తేడా తెలుసా?

  8. “వేదాలు కాజేసి వాటి గుట్టు వాళ్లే విప్పారు కాబట్టి” — ఆఁహా! వారు రట్టు చేసిన ఆ గుట్టేమిటి? మీగ్గానీ తెలిస్తే మాకు కొంచెం చెబుతారా?

  9.”ఆర్యుల దండయాత్ర అనీ, మరోటనీ వాళ్లు తిక్క తిక్క ప్రచారాలు చేస్తుంటారు. అలాంటివన్నీ మనం నమ్మకూడదు” – Even your esteemed western academia doesnt care about this topic thesedays. The intelligentsia in West has moved on. This Aryan/Dravidian crap doesnt have any steam anymore. Why is this crap being reproduce then?

  10. “రామేశ్వరం దగ్గరి ఆడమ్స్ బ్రిడ్జి రాముడే కట్టాడని నాసావాళ్లు చెప్పినట్లు వార్తలో, వదంతులో వస్తే చచ్చినట్లు నమ్మాలి, మరో పదిమందికి చెప్పి నమ్మించాలి. ‘మేమా మాటెప్పుడూ అన్లేదు బాబో’ అంటూ నాసా ఇచ్చిన వివరణ నమ్మకూడదు.” — దీనిని Internet Scandal అంటారు. Hoax. ఎప్పుడన్న విన్నారా?? ఆఫ్రికను రాకుమారి ఒకామె మీకు మెయిలు చేస్తుంది… ఏదో యుద్ధంలో ఆమె తప్పించుకుని పోయింది, ఆమె ఆస్తులన్నింటికీ ఒక ట్రస్టీ కావాలి.. వగైరా వగైరా… ఇలాంటివి చదివి మీరు ఆఫ్రికను ఆడవాళ్ళందరూ రాకుమార్తెలు, వారు యుద్ధంలో తప్పించుకుని కనిపించినవారికందరికీ మెయిళ్ళు పంపుతారు, పాపం ఎందుకో అవి స్పాము లోకి వెళ్తాయి అని అలోచిస్తారా?

  వీటన్నిటీ దగ్గరగా చూస్తే మీరు అవగాహనలేకుండా మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తోంది. తప్పని మీకనిపిస్తే, ఎందుకో చెప్పండి.

  ఈ వ్యాఖ్యను మీరు పబ్లిష్ చెయ్యండి, లేకుంటే నేను ఇంకో చోట పెడతాను. (>>అబ్రకదబ్ర: పబ్లిష్ చేసింది మీరు మరెక్కడో పెడతారనే భయంతో కాదు. గ్రహించగలరు<<)

  ఇంతా చేసి ఇప్పుడు నేనేదో నా స్నేహితుడి గూర్చి రాశాను అని అనకండి. అది నిజం కాదు అని మీకూ, నాకూ కూడలినుంచి ఇక్కడికొచ్చి చదివే అందరికీ తెలుసు. ముసుగులో గుద్దులాటలెందుకు. Lets be men and sort out things like MEN.

 2. 2 కె.మహేష్ కుమార్ 10:22 సా. వద్ద డిసెంబర్ 24, 2008

  ఇలాంటి వ్యక్తిని..కాదు కాదు..వ్యక్తుల్ని నేనెక్కడో చూసినట్లున్నానే!! ఎక్కడ చెప్మా?

 3. 3 bollojubaba 10:39 సా. వద్ద డిసెంబర్ 24, 2008

  ఆహా
  పొగ రాజుకొంది.
  ఇంక మండటమే తరువాయి.
  వస్తా రేపొస్తా. మరింత మేతకై.
  సరదాగా

 4. 4 సుజాత 1:06 ఉద. వద్ద డిసెంబర్ 25, 2008

  అబ్రకదబ్ర,
  చలా బాగుంది. ఇలాంటి వ్యక్తులు “మన చుట్టూనే” బోలెడు మంది ఉన్నారు. తరచి చూడక్కర్లేదు కూడా!

 5. 5 భస్మాసుర 7:13 ఉద. వద్ద డిసెంబర్ 25, 2008

  సుజాత, మీకు సొంతం గా ఏమీ అభిప్రాయాలు ఉండవేమో అని అనిపిస్తుంది నాకు. కత్తి గారి కామెంటు కు క్రింద విధిగా మీ కామెంటు ఉంటుంది, కత్తి గారితో ఏకీభవిస్తూ! నా ఊహ నిజమేనా లేక పాత్రికేయులుగా పనిచేసిన ఫలితమా అది?

  @అబ్రకదబ్ర – భయపడమని ఎవరన్నారు? నేను భావరహితంగా చెప్పాను అంతసేపు తెలుగులో టైపు చేసాను కాబట్టి, మీరు పబ్లిష్ చేయకపోతే ఇంకెక్కడైనా పెడతాను అని. ఇందులో భయం ప్రసక్తి ఎందుకు తెస్తారు? ఇలాగే అలోచిస్తారా మీరనీ?

  నా స్పందనకు ఎందుకో మళ్ళీ చెబుతాను. మీకు గానీ, కత్తిగారికి కానీ, మీరు చెప్పే కతలను “ఆహా!ఓహో!” అని తాళం కొట్టే మీ భట్రాజులకు (ఉదాహరణ సుజాత, రాకేశ్వర, ఇంకొందరు …) కి ఎదుటివారి Intellect అంటే అస్సలు లెఖ్ఖలేదు. మీరు ఇలాంటి Beating around the bushes లాంటి రాతలు మీ స్నేహితునిమీద ఆపాదించి రాయడం చూస్తుంటే స్ఫష్టమైన సంగతి ఏమిటంటే, మీకు మీ వాదనలను వ్యతిరేకించేవారితో Rational గా మాట్లాడి గెలవగల సత్తా లేదు.When one lacks the basic theoretical tools to have a reasonable, rational, logical and scientific dialogue on, one simply resorts to making generalizations, stereotyping.

  This is what I suggest you – stop making generalizations, be man enough to point out a person/persons, invite them to dialogue, and talk rationally. If you write stories about you “London friend” – this only indicates your cowardice(and eventually your group’s)

 6. 6 కొత్తపాళీ 10:04 ఉద. వద్ద డిసెంబర్ 25, 2008

  @అబ్రకదబ్ర – వినోద భరితంగా ఉంది.
  @భస్మాసుర – అనవసరంగా బుజాలు తడుముకుంటున్నారేమో?

 7. 7 కె.మహేష్ కుమార్ 10:43 ఉద. వద్ద డిసెంబర్ 25, 2008

  @భస్మాసుర/సుత్తి నరేష్ కుమార్/అష్టావక్ర/నిర్హేతుక వాది etc. etc. etc.:జెనరలైజేషలూ, భట్రాజు పొగడ్తలూ,being man enough లూ,showing finger లూ ఎవరెంతచేసారో నీ అక్కసువెళ్ళబుచ్చుకునే శైలి చూస్తే తెలుస్తోంది. Why you keep calling people “retards”,when all the symptoms are very well evident in your comments!!

  బ్లాగుల్లోని సైద్ధాంతిక,ఆలోచన,అభిప్రాయ విభేధాల్ని వ్యక్తిగత విద్వేషాలుగా మలుచుకున్న నువ్వు పిచ్చివాడివైనా అయ్యుండాలి లేక ఇంకా ఆంగ్లమేతప్ప ఆలోచన ఎదగని పిల్లకాకివైనా అయ్యుండాలి. బ్లాగుల్లో గ్రూపులుగా ఏర్పడి ఏదో గూడుపుఠాణీ నడుపుతున్నారనే నీ అపోహ(conspiracy theory) చూసాక నీ మానసికస్థితిపై నాకు ఖచ్చితమైన సందేహాలు కలుగుతున్నాయి.

  ఎవరికి తోచిన వ్యాఖ్యలు ఇక్కడ వారు చెయ్యొచ్చు. నీకు బ్లాగరి టపాపై ఉన్న విభేధాన్ని భుజాలుతడుముకుంటూ మొదట్లోనే రాసేసావు. మరి మళ్ళీ మిగతా వ్యాఖ్యాతలమీద రాళ్ళువిసిరే ఉన్మాదం ఎందుకు? what are trying to prove? ముఖ్యంగా నాగురించీ సుజాత గారి గురించీ నువ్వు చేసిన ప్రేలాపన దిగజారుడుతనాన్ని సూచిస్తుందేతప్ప నీ intellectual abilityని కాదు.అందుకే నీలాంటి వాడితో rationalగా,logical గా మాట్లాడాలంటే retardల వలనే అవుతుందేమో!Go search for such retard somewhere else..this is not a place for lunatics like you.

  @అబ్రకదబ్ర: స్వతంత్రించి మీ బ్లాగులో ఈ భస్మాసురుడికి స్థానం లేదని చెప్పినందుకు క్షమించండి. ఈ IP అడ్రస్ నుంచీ మీ బ్లాగుకు వివిధపేర్లలో రాస్తున్న ఈ ఉన్మాది మిగతా పేర్లుకూడా మీరు బ్లాగ్ముఖంగా చెప్పగలిగితే మిగతావాళ్ళకు మేలు చేసినవాళ్ళవుతారు.This guy is no short of a lunatic and a retard to behave in this fashion.I urge you to kindly disclose all the fake names he is using so far to perpetuate his lunacy across other wise healthy Telugu blog sphere.

 8. 8 భస్మాసుర 11:24 ఉద. వద్ద డిసెంబర్ 25, 2008

  భస్మాసుర/సుత్తి నరేష్ కుమార్/అష్టావక్ర/నిర్హేతుక వాది etc. etc. etc. — Katti, as a matter of fact, why would it matter to you? You confirm that the views expressed by these Ids are consistent everywhere. You and your band of lunatics express inconsistent views with a single “identity”. Now people will decide for themselves which is right and which is not.

  Since you insist, I will tell you – my friend; you are at your idiosyncratic best if you assume that all these people are a single person. Panashaala Naresh, I am sure is watching this. Ashtavakra wouldn’t give a damn anyways. (Now dont accuse that “wouldn’t give a damn” reminds you of someone – This is a common expression of your secular masters)

  “ముఖ్యంగా నాగురించీ సుజాత గారి గురించీ నువ్వు చేసిన ప్రేలాపన దిగజారుడుతనాన్ని సూచిస్తుందేతప్ప నీ intellectual abilityని కాదు” — That is my sincere opinion on Sujata and Co, they may object it. What do you care? (Dont accuse me that copying text, quoting it and explaining it reminds you of somebody — it is the way internet debates take place)

  “Go search for such retard somewhere else..this is not a place for lunatics like you. ” — Excuse me!? who the heck are you to decide it?

  What you have done so far, katti, is what you are good at doing. That is, evading issues. Grow up dude.

  కొత్తపాళీ గారూ: భుజాలు తడుముకున్న మాట వాస్తవమే, కానీ అనవసరంగా కాదు 🙂

 9. 9 అబ్రకదబ్ర 11:32 ఉద. వద్ద డిసెంబర్ 25, 2008

  @భస్మాసుర:

  టపా రాసింది నేను. మీ విమర్శను నాకు పరిమితం చెయ్యండి. ఇతరుల పేర్లను ఇందులోకి లాగకండి.

 10. 10 అష్టావక్ర 11:46 ఉద. వద్ద డిసెంబర్ 25, 2008

  కత్తీ, నన్ను మధ్యలో లాగకుండా ఉండలేవా?

 11. 11 సుజాత 12:16 సా. వద్ద డిసెంబర్ 25, 2008

  భస్మాసురా,
  నేను కత్తి గారితో ఏకీభవించిన సందర్భాల కంటే విభేదించిన సందర్భాలే ఎక్కువ, ఒకసారి పర్ణశాల బ్లాగుకెళ్ళి చదవండి! అయినా మీరు మీ అభిప్రాయాలు ప్రకటించుకోవాలి గానీ వేరే వారి అభిప్రాయాలను సమీక్షించడం దేనికంటారు?

  భుజాలు ఎక్కువగా తడిమేసుకుంటున్నారు. పైగా మాటలు మీరి కూడా రాస్తున్నారు భట్రాజులూ అదీ ఇదీ అని! సంయమనం పాటించండి.
  ఒకరి అభిప్రాయాల్తో ఎవరు ఏకీభవించాలనేది మీరు నిర్ణయిస్తారా? మీకా హక్కు ఎవరిచ్చారు? పైగా నా బ్లాగులో కాకుండా నా గురించి వేరొకరి బ్లాగులో ఇష్టం వచ్చినట్టు రాయడం మీ సంస్కారాన్ని మీరే నలుగురికీ చాటుకోవడమే అవుతుంది.

 12. 12 భస్మాసుర 12:48 సా. వద్ద డిసెంబర్ 25, 2008

  సుజాతగారూ, నేను మిమ్మల్ని ప్రశ్న మాత్రమే అడిగాను. మీ హక్కుల్ని ప్రశ్నించలేదు. సమాధానం ఇచ్చారుగదా, నెనరులు.ఇక మాటలు మీరడం అంటారా క్షమించాలి నాకు మెత్తగా “చురకలు” వేయడం రాదు. నా సంస్కార ప్రకటన గురించి మీరు చింతించకండి, బ్లాగుల్లోని ఈ వ్యాఖ్యలు నన్ను కుసంస్కారిగా మార్చేయవు.

 13. 13 Sai Brahmanandam 7:28 సా. వద్ద డిసెంబర్ 25, 2008

  అబ్రకదబ్ర గారూ,

  ఏ వూళ్ళోనండీ ఈ సహితీ సదస్సు జరిగింది?
  ఆ మధ్యనే స్నేహితుడొకడు మీరు రాసినట్లుగానే నాకు క్లాసు పీకాడు.
  తెగ మురిసిపోతూ తను కట్టిన పంచ కేసి చూపిస్తూ హుషారుగా స్టేజెక్కడు – “పంచె కట్టుకుంటే తెలుగు పంచ్ వస్తుందంటూ..”
  పంచ కట్టుకుమంటే మటేమో కానీ, ఊడితే మాత్రం ఖచ్చితంగా పంచ్ వస్తొందని అక్కణ్ణుంచి తప్పించుకున్నాను.

  ఆ పాండవుల్లో పంచముడేవెరండీ బాబూ? కొంపతీసి మైకాసురుడు కాదు కదా?

  – సాయి బ్రహ్మానందం

 14. 14 సుజాత 8:34 సా. వద్ద డిసెంబర్ 25, 2008

  భస్మాసురా,
  మీరు ప్రశ్న మాత్రమే అడిగి ఉంటే బాగుండేది! నాకంటూ సొంత అభిప్రాయాలు లేవంటూ స్టేట్మెంట్ ఇచ్చేసారు.(నా అభిప్రాయాలు నా సొంతవో లేక మరొకరివో మీకంటే ముందుగా వచ్చిన బ్లాగర్లకు కూడా తెలుసులెండి)

  ఒకసారి వ్యాఖ్య చదివి ప్రతివ్యాఖ్య రాయాలండీ! నా హక్కుల గురించి కాదు నేనడిగింది, మీకు ఆ హక్కెవరిచ్చారని అడిగాను.

  సుజాత అండ్ కో లాంటి మాటలు వాడటాన్ని రకమైన సంస్కారమంటారో కుసంస్కారమంటారో మేధావులు మీకే తెలియాలి.

 15. 15 కె.మహేష్ కుమార్ 9:04 సా. వద్ద డిసెంబర్ 25, 2008

  @అష్టావక్ర: I sincerely believe that its all you and I have a reason to do so. If you disagree and still disown it, its your right and please do.

 16. 16 srinivas 12:07 ఉద. వద్ద డిసెంబర్ 26, 2008

  @ kathimaheshkumar
  ఇలాంటి వ్యక్తిని..కాదు కాదు..వ్యక్తుల్ని నేనెక్కడో చూసినట్లున్నానే!! ఎక్కడ చెప్మా?

  ఎక్కడో కాదు అద్దంలో చూసుంటావు

 17. 17 అష్టావక్ర 12:32 ఉద. వద్ద డిసెంబర్ 26, 2008

  కత్తీ, నేనే పానశాల నరేష్/భస్మాసుర/కవి/చైతన్య/శ్రావ్య… ఇంకా నిన్ను వ్యతిరేకించినవారందరూ అనుకో, నాకేం నష్టం లేదు. I laugh at you, you’ll make your idiocy evident again

 18. 18 కె.మహేష్ కుమార్ 2:36 ఉద. వద్ద డిసెంబర్ 26, 2008

  @అష్టావక్ర: నీ పెట్టుడు పేర్లలో మరికొన్ని చెప్పినందుకు ధన్యవాదాలు. It will helps others to be conscious of this fact. I can’t even lough at you simply because I think you are sick and can only wish you GET WELL SOON.

 19. 19 madhavaraopabbaraju 3:08 ఉద. వద్ద డిసెంబర్ 26, 2008

  శ్రీ అబ్రకదబ్ర గారు వ్రాసిన వ్యాసంపై శ్రీ భస్మాసురగారు వ్రాసిన వివరణాత్మక వ్యాసం పరిశీలించదగ్గదే. బ్లాగుల్లో ఒకరు వ్రాసిన వ్యాసంపై ఎవరైనా తమ ప్రతిస్పందనను తెలియజేయవచ్చు.ప్రశ్నించి, వ్యాసకర్త యొక్క ఉద్దేసాన్ని తెల్సుకొవటానికి ప్రయత్నించవచ్చు. అయితే, ఇక్కడ, శ్రీ భస్మాసురగారు తమ అభిప్రయాల్ని చాలా పరుషంగా తెలియచేసినట్లుగా నాకు అనిపిస్తున్నది. ” ఈ వ్యాఖ్యల్ని పబ్లిష్ చేయకపోతే ….; లెటజ్ బీ మెన్ ఎండ్ సార్టౌట్ థింగ్స్ ….; నాకు మెత్తగా చురకలు వేయటం రాదు” మొదలైనవి వాడటం సబబుకాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మాంసం తినేవారైన, ఆ జంతువుని, జంతువుకి ఎక్కువ నెప్పి తెలియకుండా వుండటానికి, చాలా పదునైన కత్తిని వాడుతారు. జంతువు చర్మాన్ని, ఒక పద్ధతిలో, ఒడుపుగా ఒలుస్తూ, రక్తపు బొట్టు నేలమీద పడకుండా, ఒక గిన్నెను వుంచుతారు. మాంసాన్ని చిన్న ముక్కలుగా కోసి,ఒక గిన్నెలో వేస్తారు. అంతేకాని, మాంసం తింటాంకదా అని ప్రేగులని మెళ్ళోవేసుకోరుకదా!!. ఆ ప్రదేసాన్ని అంతా రక్తమాంసాలతో చిందరవందర చేయరుగదా!!. చాలవరకు, బ్లాగుల్లో వ్రాసే వారందరు తమ మనుసులోని అభిప్రాయల్ని తెలియచేటానికి ప్రయత్నిస్తారు. వ్యాసకర్తలందరూ, ఖచ్చితంగా అన్నీ తెలిసినవారై వుండాలని చదివేవారందరు ఊహించనక్కరలేదు. తెలుగు భాషలో మనం మన అభిప్రాయాల్ని తెలియచేసేటప్పుడు ” మీ అమ్మ, నీయమ్మ ” కు గల తేడాను గుర్తించి మసులుకుంటే ఉభయత్రా అందంగా, ఆనందంగా కూడా వుంటుంది. మిత్రులందరూ ఇంతటితో సమ్యం పాటిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మన్నించగలరని మనవి. శెలవ్, మాధవరావ్.

 20. 20 bhasmasura 1:44 సా. వద్ద డిసెంబర్ 26, 2008

  మాధవరావు గారూ, మీ వ్యాఖ్యను… మీరు వ్యక్తపరిచిన భావాన్నీ స్వాగతిస్తున్నాను. ఇంత దురుసుగా ప్రవర్తించటం నా స్వభావం కాదు, ఇక్కడ అవసరం అంతే 🙂

  “మాంసం తినేవారైన, ఆ జంతువుని, జంతువుకి ఎక్కువ నెప్పి తెలియకుండా వుండటానికి, చాలా పదునైన కత్తిని వాడుతారు. జంతువు చర్మాన్ని, ఒక పద్ధతిలో, ఒడుపుగా ఒలుస్తూ, రక్తపు బొట్టు నేలమీద పడకుండా, ఒక గిన్నెను వుంచుతారు. మాంసాన్ని చిన్న ముక్కలుగా కోసి,ఒక గిన్నెలో వేస్తారు. అంతేకాని, మాంసం తింటాంకదా అని ప్రేగులని మెళ్ళోవేసుకోరుకదా!!. ఆ ప్రదేసాన్ని అంతా రక్తమాంసాలతో చిందరవందర చేయరుగదా”

  దీన్ని చదివిన తర్వాత మీకు వ్యాఖ్యకు స్పందించాలనిపించింది.. బాగా చెప్పారు 🙂

 21. 21 అబ్రకదబ్ర 2:38 సా. వద్ద డిసెంబర్ 26, 2008

  భస్మాసురగారు,

  సమయాభావం వల్ల వెంటనే మీ వివరమైన మొదటి వ్యాఖ్యకి స్పందించలేకపోయాను. ఓపికగా వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు. మొదటగా రెండు విషయాలు:

  ఒకటి: బ్లాగ్లోకంలోనైనా, బయటైనా ఇతరులతో నాకున్నవి భిన్నాభిప్రాయాలే – విభేదాలు కావు.

  రెండు: ప్రత్యక్ష పరిచయం లేనివారి గుణగణాలగురించి ఊహిస్తూ కూర్చునేంత తీరిక నాకు లేదు. నా రాతల్లో ప్రతిఫలించేవి ఎప్పుడూ నాకు దగ్గరివారిలో నేను పరిశీలించిన విషయాలే. కాబట్టి ఇది తోటి బ్లాగర్లని ఉద్దేశించి రాసే ప్రసక్తే లేదు. That said, నా ‘లండన్ మిత్రుడు’ నిజంగా ఉన్నాడని మీరంతా నమ్మేస్తారనుకునేంత అమాయకుడిని కాను నేను. నేనెరిగిన ఇద్దరు ముగ్గురు వ్యక్తుల సమ్మేళనమీ ఊహాత్మక స్నేహితుడు.

  Now, ఈ నా మిత్రుడు ఇండియాలోనో, సింగపూర్లోనో, దుబాయిలోనో, ఇంకోచోటో కాకుండా ఇంగ్లాండులో ‘స్థిరపడ్డాడు’ అని నేననటం వెనక కారణమేమయ్యుంటో మీరు గ్రహించలేదని నా నమ్మకం. అసహనంతో కాకుండా ఆసక్తితో చదివినట్లయితే మీరు టపాలోని నా భావాన్ని సరిగా అర్ధం చేసుకునేవారు. దేశభక్తి పేరిట శ్రీరంగనీతులు చెప్పే హిపోక్రైట్లపై నేను పేల్చిన తూటా మీకు తగలటం బాధాకరం. టపా వెనుక నా ప్రధానోద్దేశాన్ని తెలుగు వెలుగుల గురించి ఆంగ్లంలో ప్రసంగించే ధోవతీ పెద్దాయన పిట్టకధ ద్వారా ఒత్తి చెప్పాను కూడా కదా. అసలు టపాలో కూడా – బ్రిటిష్ వారినేకుతూ బ్రిటన్‌లోనే స్థిరపడటం, స్వయంగా మెటీరియలిస్టయ్యుండీ పాశ్చాత్యులు మెటీరియలిస్టులనటం, పొరుగు దేశం నేసిన బట్టలు కొనటం తీవ్రవాదానికి ఊతమివ్వటమే అంటూ స్వలాభం కోసం హవాలా దారులనాశ్రయించటం, పొద్దు పొడిస్తే పాకిస్తానుపై తిట్లతో నిద్రలేచేవాడికి పాకిస్తానీ రెస్టారెంటులో మటన్ బిర్యానీ ఆరగించకపోతే నిద్రపట్టక పోవటం .. ఇన్ని హింట్లున్నాయి కదా!!

  మీరు నా టపాని అసహనంతో చదివారనటానికి కారణాలున్నాయి. ‘బిరియానీ’ ఎపిసోడులో నేనెత్తిచూపింది మావాడి హిపోక్రసీనైతే, మీకది ‘హిందువులు మాంస భక్షణ చేయరాదు’ అని నేనన్నట్లుగా అనిపించింది! మరో సారి ఆ పేరాని చదవండి. దేశాభ్యున్నతి గురించి, కనుమరుగవుతున్న సంస్కృతి గురించి మీలాగే నేనూ ఆవేదన చెందుతాను. నా భావాలను అప్పుడప్పుడూ మద్య తరగతి మహిళ, మంద పెళ్లిళ్లు, ఉప్పు, కారం, దేశభక్తి, ఇట్టుండి నరుక్కొద్దాం, ఇండియన్ రికార్డ్ డాన్సింగ్ లీగ్, ఓటేస్తే పెళ్లి ఫ్రీ వంటి టపాల ద్వారా వెలిబుచ్చుతుంటాను. వీలైతే ఒకసారి వాటిని చదవండి.

 22. 22 chaitanya 12:40 సా. వద్ద డిసెంబర్ 27, 2008

  మీ సమాధానం చాలా హుందాగా ఉంది అబ్రకదబ్ర గారు. కొంచెం కూడ సంయమనం కోల్పోకుండా చెప్పారు.

  ఈ టపాలో విషయం నాక్కూడా అర్థం అయ్యింది. ఇలాంటి స్నేహితులు నాకూ ఉన్నారు.

  “The reason I talk to myself is that I’m the only one whose answers I accept.” – George Carlin.

  ఎందుకో ఈ హాస్యోక్తి ఇక్కడ చెప్పాలి అనిపించింది.కార్లిన్ మహాశయుడిలా కాకుండా, మీరు ఆరోగ్యకరమైన చర్చకే మీ వోటు వేయటం గమనించాను.

  మీకున్నవి భిన్నాభిప్రయాలే కాని విభేదాలు కాదు…మీరు చెప్పింది నిజమేనని మీ సమాధానం చూస్తే చాలు. అన్నట్టు “Differences in opinion should never mean hostility !” ( Mahatma’s quote తెలుసా ? ) It’s sometimes easier said than done, and I sincerely appreciate your composure.

 23. 23 sri 3:54 సా. వద్ద డిసెంబర్ 28, 2008

  Dear ABRAKA DABRA and others in this posting, here are my 2cents:
  ——————————————————————
  This is what VIOLENT Islamists did in past to Hindus before British came. Please note the WORD “Violent Islamists” that this comment applies to, which donot APPLY TO those muslims who believe in live and let others live philisophy:
  1.Islamists forced their adulterated version of Islam on majority(40 percent)of Hindus & killed them.
  2.Desecrated & destroyed many temples & idols
  3.Erected Mosques on top of or very near the temples to desmostrate their supremacy & to intimidate the Hindus. Remember Intimidation plays a vital role if you had erected a Mosque on top or next door to the Major Iconic place of worship of other religion.
  4.Divide big India into India,Pak&Bangladesh.
  5.Pump fake currency into India to destabilize economy
  6.Disturb stability of India by planting bombs & killing innocent people.
  7.Create disturbances in J&K in the name of Adulteratedly interpreted of Islam.
  8.Destabilize India by using Nepal&Bangladesh as conduits to send terrorists.
  9.Giving shelter to foreign terrorists who involve in terror activities
  & More

  WHY SHOULDN’T BE AN AVERAGE HINDU HATING Muslims in spite of so much insane actions against Hindus which continues even now.Doesn’t hindus have the right to rise against the insane actions of the so called Violence Loving muslims and their hypocrite secularists?

  While Hindus donot advocate hate for hate, but muslims, if they truly want to solve the problem, should understand that some Hindus hate them for above serious valid reasons & should try to solve problem with patience rather than hate for hate & violence.
  Hindu hate Muslims is reactive while muslims hate hindus for idealogy THAT THEY INTERPRET THAT THEIR BOOK IS TELLING THEM TO DO SO. Again, this is the misunderstanding OF THEIR Holy Quran, by these muslims who go on violent path.

  Remember again and again, IT IS NOT IN THE BOOKS OF HINDUISM, be it Holy Bhagavadgeetha or in Holy Vedas or in Holy Mahabharata, that one need to kill others for the sake of some writing in the book. Infact, Holy Bhagavadgeetha affirms that GOD is in everyone and in everywhere and need to treat others equal to self. So, no hindu will kill OR hate others for the sake of fun or for the sake of EGO satisfaction. Look at the history of India. Indians have accommodated every religion, every race of the world, in its arms peacefully, with out any hatred to others since ages and even now, majority populations of Hindus are ready to live in peace with others, but it is the others evil designs to demonize Vedic wisdom that makes Hindus oppose this insane actions.

  Also, average Hindus does not support the hypocritic Secularists, who turn to secularism, because they have enjoyed the freedom of selecting what they want to practice in India and want to use secularism to MASK OFF THEIR COWARDICE TO RAISE VOICE AGAINST THE INJUSTICES OF THE MUSLIMS IN THE PAST OR PRESENT.

  Also, please NOTE THAT I personally GIVE equal importance to Hily Bhagavadgeetha, Holy Bible & Holy Quran, since they all HAVE EXACT SAME CORE MESSAGE. I denounce those who promote their version of these holy scriptures for the sake of their ego satisfaction and force it on others by using either money power or by using physical power or any other luring.
  ——————————————————————

 24. 24 sri 6:11 సా. వద్ద డిసెంబర్ 28, 2008

  Your friends solution of throwing all Muslims out of India, is not what Vedic Hinduism is all about, but he may be telling this out of his frustration and out of his own suffering or his ancestors suffering in the hands of the Muslims, while the Muslims were in the ruling in India.

  As far as Vedic Hinduism goes, it strictly advocates “saha jeevanam” no matter what the person’s material and mind level differences might be with others.

  I guess, your friend is advocating the elimination of muslims purely out of frustration rather than any inherent hatred for them.

  Also, your friends concept of “Indian means Hindu” is not the right approach, BUT I CAN SAY INDIAN MEANS ONE WHO GIVES HIGHEST PREFERENCE TO INDIA, THE NATION OR PEOPLE OF INDIA, AND TO NONE OTHER THAN INDIA, NOT EVEN TO GOD. If you cannot even love your nation or India as an Indian properly, HOW CAN YOU LOVE GOD or the ALL PERVADING DIVINITY THAT INCLUDES NATIONS OF THE WORLD AS WELL? Your friend may be referring to those in these words, TO THOSE PEOPLE IN INDIA, WHO HOIST A PAKISTANI FLAG, WHEN INDIA LOST A CRICKET MATCH AGAINST PAKISTAN, AND THE SAME TRAITORS WHO BURN INDIAN FLAG WHEN IT WINS CRICKET MATCH AGAINST PAKISTAN. He may have seen in most of his life time THIS KIND OF TRAITORS WHO LIVE AND DEPEND ON INDIAN SOIL, BUT LOVE PAKISTAN WITH-IN AND HENCE HE MAY HAVE TO THE CONCLUSION THAT ONLY A HINDU CAN LOVE A HINDU MAJORITY NATION.

 25. 25 అబ్రకదబ్ర 6:31 సా. వద్ద డిసెంబర్ 28, 2008

  @శ్రీ:

  మీ భావాలు తెలుగులో వ్యక్తీకరిస్తే మరింత బాగుంటుంది…. ఎంతైనా తెలుగు బ్లాగు కదా. ప్రయత్నించండి.

 26. 26 sri 7:48 సా. వద్ద డిసెంబర్ 28, 2008

  Dear Abraka Dabra,

  Samayabhavamu valla, teluguLo, vrayaleka potunnanu. Manninchandi ee vishayamuLo. Veeelaithe tappaKunda vrasthanu.

 27. 27 sri 8:34 సా. వద్ద డిసెంబర్ 28, 2008

  Dear Abraka Dabra and others in this blog,

  Your friend’s idea of “remembering the INIDA’s glorious past in both material and spiritual
  aspects”, may be because, it will give strength to an average Indian in the current period
  of troubles, since NOT ONLY AN INDIVIDUAL BUT ALSO A SOCIETY CAN SAIL THROUGH THE TOUGH TIMES,
  IF THEY CAN REMEMBER THE PAST ACHIEVEMENTS AND CAN REMEMBER GLORIOUS PAST. This will definitely
  serve as an inspirational point to consider. There is a problem in the current generation in
  that, the current generation doesnot know how magnanimous was its previous past, and hence
  the current generation was slowly dipping in to the mode where they were thinking that India
  menas only poverty & suffering (as depicted by the WEST about India in the past), and IT MEANT
  TO BE SUFFERING IN FUTURE AS WELL. Ignoring the past achievements will only weaken as well as
  Ignoring the past mistakes will be even more big mistake. hence your friend may be advocating
  others to remember the past of India.

  Other problem with the current generation is that, they without knowing the India’s glorious past,
  are criticizing India based on its current poverty and some blind beliefs, BEFORE Non-Indians openly.
  This will only damage the reputation of Inida. I guess, ONE HAS TO FOLLOW THE APPROACH OF GLORIFYING
  HIS OWN NATION BASED ON ITS ACHEIVEMENTS EITHER IN THE PAST OR PRESENT, ESPECIALLY BEFORE THE
  NON-INDIANS AND SHOULD DO SOUL SEARCHING ABOUT THE NEGATIVES WITH-IN THE Indian communities. instead
  of this, if we as INDIANS, criticize India before non-indians as well, it is not a sensible approach.
  Hence your friend may not be liking someone criticizing his mother nation by fellow Indians before
  Indinas or non-indinas, as some people who DONOT HAVE COMMON SENSE GO ON AND PRACTICE CIRTICISM OF
  India before non-Indians for the sake of gaining some mileage with the non-indians.

  Also, your friends idea of not worrying about the present problems faced by India is not a good idea.
  While we on one hand should be inspired by the glorious past of India and should share this glorious past with fellow Indians, in material aspects of the life, we should also identify and correct our mistakes
  that gave us the current troubles that India is facing and systematically work on them, ONE-STEP-AT-A-TIME
  and try to inspire fellow Indians to work on the problems that we as Indians face.

  By the way, AS YOUR FRIEND SAID, WE SHOULD TRY TO UNDERSTAND THE ESSENCE OF Holy Vedas OR Holy Bhagavadgeetha
  and should project the correct AND ESPECIALLY THE UNIVERSALLY APPLICABLE MEANING OF THEM TO THE OTHER
  INDIANS AND TO FOREIGNERS. Cause, TRUTH IS UNCHANGING AND THAT NO MATTER WHO SAID ABOUT THE TRUTH, IT IS ALWAYS THE SAME, THOUGH THE WORDS OR LANGUAGE IN WHICH THE TRUTH EXPRESSED MAY BE DIFFERING.

 28. 28 sri 8:38 సా. వద్ద డిసెంబర్ 28, 2008

  BY THE WAY,
  There is a lot of knowledge and practice that WE SHOULD LEARN FROM OUR WESTERN FRIENDS, ESPECIALLY IN THE MATERIAL AND WORLDLY ASPECTS OF LIFE, WHILE WE CAN SERVE THE WESTERNERS IN THE SPIRITUAL ASPECTS OF THE LIFE.

  Like Swami Vivekananda Said: “A life that has the balanced blend of Western material aspects and the Eastern Spiritual aspects will give a happier life in the current times”. At the same time, we should not go and beg money or other material benefits from the west.

 29. 29 sri 10:42 సా. వద్ద డిసెంబర్ 28, 2008

  Dear ABRAKA DABRA garu,

  What your friend may be saying about the Puranas and Vedas may be right in this following sense:

  We may not be able to apply the cosmetic material aspects of the Vedic scriptures to the current times,but the spiritual aspects of the Vedas or the Bhagavadgeetha or Puranas can be applied any time, since the inherent meaning of each of hte puranas or vedas aspects is timeless and Universal. This inherent meaning can only be understood by way of Intuition rather than mere sensual reading and mind level interpretations.

  Same thing applies to other Holy Scriptures of the world. For example, the cosmetic material & mind level aspects of the Holy Quran may be time based, but the spiritual aspects of the same Holy Quran definitely are timeless and are applicable to the entire humanity.

  The reason that the material aspects of hte world are time based, is that, material world changes continuously with time and is not a constant, but the spiritual aspects of the life are timeless and are one and the same irrespective of the time. WE SHOULD TRY TO FIND OUT IF THERE IS THIS UNIVERSAL AND TIMELESS MESSAGE IN ANY SCRIPTURE INCLUDING VEDAS, PURANAS, UPANISHADS, BHAGAVADGEETHA, BIBLE, QURAN etc scriptures and this searching should be done by way of using our intuition rather than mere senses. There is a possibility that your friend may have found that universal and timeless messages in the Vedas and Puranas and other scriptures and hence he may be supporting them nad objecting others who criticize them. I donot know what your friend’s ideas are behind his objections, but these are my two cents on this topic.

  We should try to extract the best possible UNIVERSAL AND TIMELESS message from the Holy Scriptures by using our intuition rather than look merely at the cosmetic material aspects of the stories or the incidents of the scriptures. This is what my view is on the sacred scriptures of the world, and not just on the Sanatana Dharma scriptures.

 30. 30 sri 11:26 సా. వద్ద డిసెంబర్ 28, 2008

  By the way, dear Abraka Dabra garu, I have a common aspect with your friend in some fashion as well.

  I also take money from my friends when they want to send money to India, and I give them some paise extra for sending me money via me, but I go to the SBI and send their money via State Bank of India, which
  gives me less amount, but I feel this is better, since I need the amount and also I donot want my friends to use those backdoor money laundering schemes that may end up against India or fellow humans in general. In this process, I al benefit, since I need white amount , becuase in my business, I unavoidably, get the black money in India, due to the way the govt. rates and the market rates.

 31. 31 కె.మహేష్ కుమార్ 12:46 ఉద. వద్ద డిసెంబర్ 29, 2008

  శ్రీ పుణ్యమా అని ఈ టపాపై నిజమైన చర్చ ఇప్పుడు జరుగుతున్నట్లుంది. తెలుగులో అయితే మాలాంటివారు పాల్గొనే అవకాశం ఉండేది.

 32. 32 bollojubaba 4:58 ఉద. వద్ద డిసెంబర్ 29, 2008

  శ్రీ గారి కామెంట్లు చాలా చాలా అర్ధవంతంగా ఉన్నాయి.
  నాకు నచ్చాయి.

 33. 33 ramudu 6:19 సా. వద్ద మార్చి 5, 2009

  అ. కదబ్ర దీని హాస్యంగా వ్రాసారేమో అనుకొన్నా? కాదన్నమాట?

 34. 34 VenkataRamana 6:54 ఉద. వద్ద అక్టోబర్ 22, 2009

  ఆలోచింపచేసే ఉత్తమ వ్యాసం.
  మీ స్నేహితుడిని గురించి వ్రాశారో, మరెవరిని గురించి వ్రాశారో అన్న విషయాన్ని వదిలేస్తే ఇందులో లేవనెత్తిన అంశాలన్నీ ఆలోచింపచేసేవే.


 1. 1 పొద్దు » Blog Archive » 2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం 10:07 సా. వద్ద జనవరి 1, 2009 పై ట్రాక్ బ్యాకు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: