హాలీవుడ్ హాస్య చిత్రాలనగానే నేటి తరం ప్రేక్షకులకి గుర్తొచ్చే మొదటి పేరు: జిమ్ క్యారీ. ‘ది మాస్క్’, ‘ఏస్ వెంచురా: పెట్ డిటెక్టివ్’, ‘లయర్-లయర్’, ‘డంబ్ అండ్ డంబర్’, ‘హౌ ది గ్రించ్ స్టోల్ క్రిస్మస్’, ‘బ్రూస్ ఆల్మైటీ’ వంటి హిట్ చిత్రాలతో హాస్యనటుడిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడీ ప్రతిభావంతుడు. క్యారీ పేరు చెప్పగానే అతని ఎలాస్టిక్ ముఖమే మదిలో మెదులుతుందెవరికైనా. ఐతే జిమ్ క్యారీ హాస్య చిత్రాలకే పరిమితమవకుండా ‘ది ట్రూమాన్ షో’, ‘ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ఎ స్పాట్‌లెస్ మైండ్’, ‘నంబర్ 23’ వంటి విభిన్న తరహా చిత్రాల్లోనూ ప్రధాన పాత్రలు పోషించాడు. అతని హాస్య చిత్రాల్లాగే ఇవి కూడా బాక్సాఫీసు వద్ద మంచి విజయం నమోదు చేసినవే. అయితే – క్యారీ చిత్రాలన్నింటిలోకీ తలమానికమైనదిగా పలువురు విమర్శకులు పేర్కొనే చిత్రం పేరు సైతం చాలామంది వినుండకపోవచ్చు! అది, 2001 డిసెంబర్లో విడుదలైన ‘ది మెజెస్టిక్’. జిమ్ క్యారీ అంటే వెకిలి చేష్టలతో వింత వేషాలేసే ఓ సాధారణ హాస్యనటుడు మాత్రమే అనే అభిప్రాయం మీకుందా? మీరీ సినిమా చూస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకుతీరతారు.
(‘ది మెజెస్టిక్’ సినిమా రివ్యూ, కధా నేపధ్యం, మరిన్ని ఇతర విశేషాలు – నవతరంగంలో)
0 స్పందనలు to “ది మెజెస్టిక్”