వేడి కుక్కలు, గేదె రెక్కలు

అమెరికా వచ్చిన తొలినాళ్లలో అంతా గందరగోళంగా ఉండేది నాకు. అందరికీ అంతేననుకుంటా. రోడ్లమీద ట్రాఫిక్, కరెంట్ స్విచ్‌లు, డోర్ నాబ్స్ – అన్నీ రివర్సే. ఇవి చాలనట్లు మైళ్లు-కిలోమీటర్లు, కేజీలు-పౌండ్లు, లక్షలు-మిలియన్లు, సెల్సియస్-ఫారన్‌హైట్ వగైరా కన్వర్షన్లొకటి. ఇక రూపాయలు-డాలర్ల గొడవుండనే ఉంది. ‘యెస్’ అంటానికి మన స్టైల్లో తలూపితే తెల్లదొరలు ‘నో’ అనుకుని కన్‌ఫ్యూజైపోయేవాళ్లు. అదో గోల. వీటన్నిట్నీ మించింది తిండి గోల.

మొదటిసారి డామినోస్ పిజ్జాకి వెళ్లినప్పుడు నా స్నేహితుడు – వాడప్పటికే ఏడాది పాత కాపు – ‘బఫెలో వింగ్స్ తింటావా’ అంటే తికమకపడిపోయా. ‘గేదె రెక్కలా!?! ఫెయిరీ టేల్స్‌లోనూ, ఫ్యాంటసీ కధల్లోనూ రెక్కల గుఱ్ఱాల గురించి వినున్నాం. రెక్కల గేదెల గురించెక్కడా విన్లేదే! ఈ దేశంలో అలాంటివుంటాయా? ఏమో, ఎంతైనా అమెరికన్లసాధ్యులు. జన్యు మార్పిడో మరోటో చేసి వాటినీ పుట్టించేశారేమో. అయినా మనం బీఫ్ తినం కదా. తిననప్పుడు అవి రెక్కలైతేనేంటి, గిట్టలైతేనేంటి’ అనుకుని వద్దన్జెప్పా. రెక్కల గేదెలెక్కడుంటాయో వాడినే అడుగుదామనుకుని కూడా ఇగో అడ్డొచ్చి ఆగిపోయా. ఇంటికొచ్చాక వాటికోసం ఇంటర్నెట్లో వెదికితే తెలిసింది – అవి చికెన్ వింగ్సనీ, న్యూ యార్క్ రాష్ట్రం బఫెలో నగరంలో మొదటిసారిగా వీటిని తయారు చెయ్యటం వల్ల వాటికి బఫెలో వింగ్స్ అనే పేరు స్థిరపడిపోయిందనీ. ఫాస్ట్ ఫార్వార్డ్ చేస్తే, ఇప్పుడు గేదె రెక్కలు నాకత్యంత ప్రీతిపాత్రమైనవి.

పసిఫిక్ తీరంలో క్యాలిఫోర్నియా సహిత పశ్చిమ రాష్ట్రాలన్నీ ఒకప్పుడు మెక్సికో అధీనంలో ఉండేవి. వీటిలో చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ మెక్సికన్ (స్పానిష్) భాష రెండో భాషగా చెలామణిలో ఉంది. అనేక నగరాలు, కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా మెక్సికన్ తరహాలో ఉంటాయి. శాన్ ఫ్రాన్సిస్కో, శాక్రమెంటో, లాస్ ఏంజెలెస్, శాన్ ఆంటోనియో, కొలరాడో మొదలైనవి. వీటిలో కొన్నిటి పేర్లు శుభ్రంగా ఆంగ్లంలో ఉన్నదున్నట్లు పలికితే కుదర్దు. ‘San Jose’ ని ‘శాన్ హోసె’ అనీ, ‘La Jolla’ ని ‘లా హోయా’ అనీ పలకాలి. ఇలాంటి వింత పేరుగల ఒకానొక తిండి పదార్ధంతో నాకోసారి పెద్ద తంటా వచ్చింది.

ఆ రోజు ఆఫీసు కెఫటేరియాలో లంచ్‌కెళ్లాను. ఏం తీసుకుందామా అని చూస్తుంటే అక్కడ మెన్యూలో ‘quesadilla’ అనేది కనబడింది. అదేంటో మనకి తెలీదు కానీ మెన్యూలో ఉన్న బొమ్మ మాత్రం నోరూరిస్తుంది. సరే ఇదే లాగిద్దాం అనుకుని లైన్లో నిలబడి నా వంతొచ్చినప్పుడు స్టైల్‌గా ‘వన్ క్యూసడిల్లా ప్లీజ్’ అన్నా. ‘Excuse me?’ అనేది కౌంటర్లో ఉన్నతని క్వశ్చన్ మార్కు ముఖం నుండొచ్చిన బదులు. ‘పాపం చెవిటివాడేమో’ అనుకుంటూ మళ్లీ ‘వన్ క్యూసడిల్లా’ అన్నా అతనికేసి జాలిగా చూస్తూ, ఈ సారి కాస్త గట్టిగా. ‘I’m sorry. I don’t get you’ అనేదతని ప్రతిస్పందన. నా వెనక లైన్లో ఉన్న తెల్లోడెవరో కిసుక్కుమన్నాడన్న అనుమానం. మరుక్షణం మరిన్ని నవ్వులతో కెఫటేరియా ప్రతిధ్వనిస్తున్న ఫీలింగ్. అది నా చిత్తభ్రమా లేక నిజమా? సరే, ఈ గోలంతా ఎందుకనుకుని ‘this one’ అంటూ మెన్యూకేసి వేలెత్తి చూపించా. ‘ఓ.. కేసడీయ?’ అన్నాడతను. ‘తస్సదియ్యా, అది కేసడీయానా’ అనుకుంటూ ఔనౌనన్నట్లు గొర్రెలా తలాడించా. తీరా ఆర్డరొచ్చాక తినిజూస్తే – బొమ్మలో కన్పించినంత రుచిగా నిజం ‘క్యూసడిల్లా’ అన్పించలా, అది వేరే కధ.

గేదె రెక్కలు, క్యూసడిల్లాల్లా పేర్లతో తికమక పెట్టిన వంటలు మరికొన్నీ ఉన్నాయి. హాట్ డాగ్స్ వాటిలో మొదటివి. మొదటి సారి ఆ పేరు విన్నప్పుడు మరీ కుక్కల్ని తినేంత మొహం వాచిపోయారేంట్రా బాబూ వీళ్లు మాంసాహారానికి అనుకుని జాలి పడ్డా. తీరా చూస్తే అది కుక్క మాంసం కాదు. కుక్క మాంసం కాదనే కానీ, హాట్ డాగ్స్ ఎలా చేస్తారో నేనిక్కడ రాస్తే మీ మానిటర్లు ఖరాబయ్యే అవకాశముంది. పైగా వాటిని తినేవాళ్లెవరన్నా మీలో ఉంటే నన్ను తిట్టుకోవటం ఖాయం. ఇప్పటిదాకా రుచి చూడకుండా, ఇకముందు చూసే ఉద్దేశంతో ఉంటే మాత్రం you don’t want to know ..  కాబట్టి రాయట్లేదు (హమ్మయ్య. మొత్తమ్మీద, ఎలా చేస్తారో చెప్పకుండానే నేననుకున్న ఎఫెక్ట్ సాధించేశా). 

వేడి కుక్కల తర్వాత స్థానం పెప్పరానీది. నాకు పిజ్జా అంటే పెద్దగా ఇష్టముండదు కానీ ఓ సారెవరో ‘పెప్పరానీ పిజ్జా రుచి చూస్తావా’ అనడిగితే ‘ఓహో. పెప్పర్ కుమ్మేసుంటారు, మాంఛి స్పైసీగా ఉంటుంది కాబోలు’ అనుకుంటూ హుషారుగా ఓకే చెప్పా. తీరా తినబోయేముందు ఎందుకో అనుమానమొచ్చి అడిగితే అది బీఫ్ మరియు పోర్క్ సమ్మేళనమని తెలిసి పిజ్జా సన్యాసం చేశా. (నా వరకూ ఆ రెండూ తినకపోవటానికీ మతానికీ సంబంధం లేదు. బీఫ్ రుచి నాకు నచ్చదంతే. పోర్క్ తినకపోవటానికో  ప్రత్యేక కారణముంది, అదేమిటో పందిరాజములో వివరించబడింది) 

వీటన్నిటి తర్వాతిది ‘చీజ్ బర్గర్’. చీజ్ కుమ్మబడిన వెజిటేరియన్ బర్గర్ కాబోలుననుకుని ఆర్డరిస్తే వచ్చాక తెలిసింది అది బీఫ్ బర్గరని! ‘చిల్లీ సూప్’ తో కూడా అదే అనుభవం. కారం ఇరగదీసుంటారు, మనకి పండగే పండగ అనుకుని లొట్టలేసుకుంటూ కొనుక్కుని సేవించబోతే తెలిసింది – ఈ చిలీ (చిల్లీ) నిజానికి గ్రౌండ్ బీఫ్ మరియు మిరప కారం మిశ్రమమని. మరోసారి సుషీ అనబడే జపనీస్ పిండం ముద్దల్ని పేరు చూసి శుచిగా, రుచిగా ఉంటాయని పొరబడి మింగబోతే – అందులో ఉండేది పచ్చి మాంసమట – కళ్లు తిరిగి ముద్ద నోట్లోకొచ్చింది. అబ్బో తొలి ఆర్నెల్లలో ఇలాంటి అనుభవాలు ఒకటా రెండా. ఆ దెబ్బకి ఇప్పటికీ నేను ఏ వంటకాన్నీ కేవలం పేరు చదివి ఇందులో ఫలానావుంటాయని కమిటైపోను. కొత్త వంటకం ఎదురైతే వంటవాడిని అందులో ఉన్నవేంటో ఒకటికి రెండుసార్లు అడిగి కానీ కొనను, తినను.

12 స్పందనలు to “వేడి కుక్కలు, గేదె రెక్కలు”


  1. 1 radhika 8:40 సా. వద్ద డిసెంబర్ 16, 2008

    కేసడిలా పక్కా మెక్సికన్ రెస్టరెంట్ లో ట్రై చెయ్యండి బాగుంటుంది.వేడి వేడిగా వుండాలన్నది రూలు 🙂

  2. 2 sravya 9:32 సా. వద్ద డిసెంబర్ 16, 2008

    చీజ్ బర్గర్’. చీజ్ కుమ్మబడిన వెజిటేరియన్ బర్గర్ కాబోలుననుకుని ఆర్డరిస్తే వచ్చాక తెలిసింది అది బీఫ్ బర్గరని! >> This is my experience also 🙂 🙂

  3. 3 వేణూ శ్రీకాంత్ 10:15 సా. వద్ద డిసెంబర్ 16, 2008

    హ హ అబ్రకదబ్ర గారు You are not alone 🙂 నాకు ఇంచుమించు అన్నీ ఇలాంటి అనుభవాలే, పెప్పరోనీ ని పెప్పర్ + ఆనియన్ గా అర్ధం చేసేస్కుని ఆహా అడక్కపోయినా టమాటాలు కూడా వేసి ఇచ్చాడ్రోయ్ అని ఆనందించా దగ్గరికి తీసుకుని తుంచితే కాని అసలు విషయం బోధ పడలా… రాధిక గారు చెప్పినట్లు ఆఫీస్ కేంటీన్ లోనూ టాకో బెల్ లోనూ కాకుండా నిఖార్సైన మెహికన్ 🙂 రెస్టారెంట్ లో కేసడియా ట్రై చేయండి, బాగానే ఉంటుంది. వీలైతే వీట్ / స్పినాచ్ టార్టియా తో ట్రై చేయండీ.

  4. 4 కె.మహేష్ కుమార్ 2:08 ఉద. వద్ద డిసెంబర్ 17, 2008

    హాట్ డాగ్స్ లోపెట్టే సాసేజస్ ఎలా చేస్తారో ‘fast food nation’ అనే సినిమాలో చూడాల్సిందే!చాలామంచి సినిమా..దాదాపు డాక్యూడ్రామా తరహా చిత్రం.చూడండి.

  5. 5 bollojubaba 2:20 ఉద. వద్ద డిసెంబర్ 17, 2008

    మీ అనుభవాలు బాగున్నాయండీ.
    హాట్ డాగ్స్ కి మా అమ్మాయి అనువాదం కారం కుక్కలు అని.
    🙂

  6. 6 malathi 5:07 ఉద. వద్ద డిసెంబర్ 17, 2008

    నేను అమెరికా వచ్చిన కొత్తలో రెస్టారెంటులో వాటర్ అన్నమాట చెప్పడానికే తలప్రాణం తోక్కొచ్చింది. 🙂
    మీ అవస్థలు చూసేక నేను మాంసాహారిని కానందుకు సంతోషిస్తున్నా. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి. మాడిసన్ చాలా అభివృద్ధి పొందిన వూరు అనుకుంటా. నామొహం చూసి, నేను ఆర్డర్ చేసిన దాంట్లో ఏచికెన్ బేస్ వున్నా చెప్పేస్తారు విచారంగా మొహం పెట్టి.
    మన స్టైల్లో తలూపితే తెల్లదొరలు ‘నో’ అనుకుని కన్‌ఫ్యూజైపోయేవాళ్లు. -అవును :))

  7. 7 వికటకవి 7:37 ఉద. వద్ద డిసెంబర్ 17, 2008

    చీజ్ బర్గర్ దాదాపుగా తినబోతూ ఆ దైవకృప వల్ల తప్పించుకున్నా. ఇక వేడికుక్కకి ఆ పేరు ఎందుకు వచ్చినట్లు?

  8. 8 Sudhakar Yamajala 9:34 ఉద. వద్ద డిసెంబర్ 17, 2008

    స్పానిష్ భాష తో ఒచ్చిన చిక్కులు అంతా ఇంతా కాదండి బాబు. అప్పట్లో టాకోబెల్ లో “Baja chalupa” ఐటంని ఇదేంటిరా వీళ్లు చక్కగా బాజా ఛలూపా అనకుండా బాహా ఛలూపా అంటున్నారు అని అర్ధంచేసుకోడానికి చాలా రోజులు పట్టింది.

  9. 9 kumar 11:20 ఉద. వద్ద డిసెంబర్ 17, 2008

    Vikatakavi,
    what are you..naughty guy huh? 🙂
    Is that a tongue-in-cheek question? 🙂

  10. 10 kumar 2:00 సా. వద్ద డిసెంబర్ 17, 2008

    మాలతి గారు,
    ఇదంతా ఒక ఎత్తు..నేను మెక్సికోలో పని చేసేప్పుడు, వాళ్ళకి ఆంగ్లం అస్సలు రాకపోవడం కాదు కదా, చాలా, చాలా(కొంత మందికి 5 స్టార్స్ లో కూడా) రెస్టారెంట్లల్లో “వాటర్” అంటే కూడా తెలీదండి బాబో. ఆక్వా అనాలి. చచ్చాను నేను ఆ ఆరు నెలలు ఓంటరిగా బయటికెళ్ళలంటే. అప్పుడనిపించింది నాకు, ఇన్ని రోజులు అమెరికాలో తెలీలేదు కాని, భాష రాని దేశంలో చాలా కష్టం రా బాబో అని.

    జర్మనీల్లో, స్పెయిన్లల్లో మనాళ్ళు ఎలా బతుకుతున్నారో. కార్పోరేట్ కారిడార్స్ లో బతకడం వేరు, ఒక సాధారణ మానవుడితో అసువుగా, వాళ్ళ సమాజపు చరిత్ర గురించి, సమకాలీన పరిస్థితుల గురించి మాట్లాట్టం వేరు కదా.

  11. 11 bhavani 2:03 సా. వద్ద డిసెంబర్ 17, 2008

    దేవుడి దయవల్ల వీటితో ఎప్పుడూ ప్రయోగం చెయ్యలేదు. మీ దయవల్ల ఇకమీద చెయ్యబోను.

  12. 12 sri 6:17 సా. వద్ద డిసెంబర్ 17, 2008

    one more shocker from my side:

    When I came to do MS in USA, this is the first cultural shock to me:

    In India, we used to give lot of respect atleast externally to our lecturers and professors like when they enter the classroom, standingup, not calling them by their names in front of the entire class, going out without even asking for hte lecturer permission etc.

    So, that was my first day in the Masters CLASS IN AMERICA and the class was taken by NOT CHINKU, NOT DESI, NOT MAKKU, BUT A STRICT AMERICAN FROM THE MIDDLE STATES. Though the class had been running for last 3 days, that was first session for me. So, I JUST STOOD UP AS SOON AS THE PROFESSOR ENTERED THE CLASS, AND I WAS THE ONLY ONE WHO STOOD UP, AND NOT EVEN OTHER DESIS STOOD UP. I got embarassed by that, and was saved by the fellow next to me and he told me to sit.

    Next bigger shock came after 15 minutes or so, when a fellow student in the class, an AMERICAN slowly pulled next chair towards him and rested his legs on it, pulled a big bottle of COKE, put it up on his arm-rest on the chair, and then, a big double sized burger, and then some chips kind of snacks. No idea what that guy was going to do, so thought he wwas looking for something in the bab and hence he emptied the food items in search of that item.

    Then, he started drinking the COK, EATING BURGER and chips in between and the professor continued with his lecture. At the end of the class, the fello student complete the burger, and the professor completed that CHAPTER, leaving me to a confusion and shock cause I had never seen in my entire student life in india a student drinking bravely before the teacher even water, and this guy ate complete lunch like in restaurent.

    As a matter of fact, he became one of my best buddies later, since he was topping the classin with his good hardwork and studies and wa giving me tough time in class as a fierce competitor.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: