మద్య తరగతి మహిళ

ధూమపాన వ్యతిరేక పోరాటం తర్వాత తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రి అన్బుమణి రాందాస్‌గారి దృష్టి మద్యపానంపై పడింది. ఆమధ్య బొంబాయిలో ఏదో ఆసుపత్రి శంఖుస్థాపన సందర్భంగా మాట్లాడుతూ బహిరంగ స్థలాలు, పబ్‌లు, బార్‌ల వంటి ప్రదేశాల్లో మద్యపానాన్ని నిషేధించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పాపం – ఆయన ఉద్దేశాలు మంచివే, కానీ ఇవన్నీ జరిగే పన్లేనా? ధూమపాన నిషేధాన్నే చూస్తే, అదో పెద్ద ఫార్సు. నానా తిప్పలూ పడి దేశవ్యాప్తంగా బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రించాలని సచివులు శాసనం చేయిస్తే – ఎక్కడి దాకో ఎందుకు – మన రాష్ట్రంలోనే రాజకీయపక్షాలన్నీ ఏకమై దానికి పురిట్లోనే సంధి కొట్టించేదాకా నిద్రపోలేదు (పుర్రెలు, అస్థిపంజరాల బొమ్మల్జూసి దడుచుకుని బీడీల జోలికెళ్లటం మానేసే వెర్రి బాగులోళ్లెందరనేది వేరే ప్రశ్న). కాదేదీ ఓటుకనర్హం అనుకునే రాజకీయ పార్టీలున్న దేశంలో ఏక్ నిరంజన్ అనుకుంటూ మంత్రిగారొక్కరే ఎంతకని ఒంటరి పోరాటం చెయ్యగలరు?

భారతీయులు ఇతర దేశాలతో పోలిస్తే ఎన్ని విషయాల్లో వెనకబడున్నా తాగుడు వ్యసనంలో మాత్రం చాలా ముందున్నట్లు కొన్ని నివేదికలు చెప్పే సత్యం. 1990లలో ఆర్ధిక సరళీకరణలు మొదలైనప్పట్నుండీ దేశంలో ఆల్కహాల్ ఉత్పత్తుల వినియోగం ఏటేటా పెరుగుతుంది. నూరుకోట్ల జనాభాతో తులతూగే దేశం మద్యం తయారీ సంస్థలకి అక్షయపాత్రలా కనిపించటంలో వింతేమీ లేదు. ఈ సామాజిక వ్యసనాన్ని అడ్డుకోటానికి ప్రభుత్వాలు చేస్తున్నది శూన్యం. దశాబ్దంపైగా మనదేశంలో మద్యం అమ్మకాలు ఏటా ఆరు నుండి ఎనిమిది శాతం వృద్ధి చెందుతున్నాయని గణాంకాలు చెప్పే నిజం! స్థూల జాతీయోత్పత్తి వృద్ధి శాతం దీనంత నిలకడగా ఉంటుందని చెప్పలేం కానీ రానున్న దశాబ్దాల్లో మందుబాబుల సంఖ్యలో వృద్ధి రేటు నిలకడకి మాత్రం ఢోకాలేదని ఢంకా బజాయించి చెప్పొచ్చు. తాగుడు మొదలు పెట్టేవారి సగటు వయసు 1930లలో 28గా ఉంటే, ఇప్పుడది ఇరవయ్యేళ్లకి తగ్గటం స్వతంత్ర భారతం సాధించిన కొద్ది ఘనతల్లో ఒకటి.

గత పదిహేనేళ్లలో మధ్యతరగతి కుటుంబాల దృష్టిలో తాగుడు అనేది ఓ దురలవాటు అనే భావన క్రమంగా చెరిగిపోయి, తాగటం ఓ స్టేటస్ సింబల్‌గా పరిణమించింది! ఇంటికొచ్చిన అతిధుల్ని ‘ఏం తీసుకుంటారు’ అన్న దానికి ఒకప్పుడు కాఫీయా, టీయా అన్న ఏకార్ధమైతే, ఇప్పుడు బీరా, బ్రాందీయా అనే మరో అర్ధమూ వచ్చేసింది. తాగుబోతులని చిన్నచూపు చూసే దశ నుండి మందు ముట్టని వాళ్లపై జోకులేసుకునేదాకా మన సమాజం పురోగమించింది. పండగలకో పబ్బాలకో ఇళ్లలో తలుపులు మూసుకుని గుట్టుచప్పుడు కాకుండా తాగే రోజులు పోయి ‘రెండు పెగ్గులేస్తూ మాట్లాడుకుందాం రావోయ్’ అని పలకరించుకునే రోజులొచ్చాయి. అక్కడితో ఆగితే మద్యం ఉత్పత్తి సంస్థల కడుపు నిండేనా? ఇప్పుడు వాళ్ల దృష్టి మరో వర్గమ్మీదకీ పాకింది. దీని వెనుక ఒక్క దెబ్బకి రెండు పిట్టల్ని కొట్టే దూరపు దురాలోచన: అటు మద్యం మార్కెట్ పరిధి విస్తరణ, ఇటు మగమహారాజుల వ్యసనాన్ని నిలదీసే ఓ ప్రభావశీల వర్గానికి చరమగీతం.

చారిత్రకంగా మనదేశంలో మద్యపానానికీ మధ్యతరగతి మహిళాలోకానికీ చుక్కెదురు. ఉన్నత స్థాయి కుటుంబాల్లోనూ, మరీ అల్పాదాయవర్గాల్లోనూ ఉన్నంత ఎక్కువగా మద్యం సేవించే అలవాటు మధ్యతరగతి స్త్రీలకు లేదు. అందుకే మద్యపాన వ్యతిరేక పోరాటాల్లో ఈ తరగతి మహిళల పాత్రే ఎక్కువగా ఉండటం. రాజకీయ పక్షాలూ వీళ్ల ఓట్ల కోసం తిప్పలు పడుతూ మొక్కుబడిగానన్నా ఏవో కంటితుడుపు చర్యలు తీసుకుంటుండేవి. అయితే ఇటీవలి కాలంలో పెరిగిన ఉద్యోగావకాశాల వల్లనైతేనేమి, కుటుంబపరమైన ఆంక్షలు తగ్గటంవల్లనైతేనేమి, పాశ్చాత్య నాగరికతపై మోజువల్లనైతేనేమి, ప్రచార సాధనాల చలవతోనైతేనేమి – మధ్యతరగతి స్త్రీలలో కూడా ఈ అలవాటు పెరుగుతుండటం ఓ ఆందోళనకర పరిణామం. మగవారితో సమానంగా దురలవాట్లు కలిగుండటం సమానత్వానికి చిహ్నమనుకునే కుహనా ఫెమినిజమూ దీనికో కారణం. వచ్చే ఎనిమిదేళ్లలో దేశంలో మద్యం అమ్మకాల వృద్ధిలో నాలుగో వంతు మధ్య, ఉన్నత తరగతి మహిళామణుల పుణ్యాన కలగనుందని సదరు ఇండస్ట్రీ వారి ప్రొజెక్షన్! దాన్ని సొమ్ముచేసుకునే దిశలో ప్రయత్నాలెప్పుడో మొదలైపోయాయి. దానికి ఉదాహరణలే ఇటీవలి కాలంలో సినిమాల్లోనూ, ప్రకటనల్లోనూ ఓ పద్ధతి ప్రకారం స్త్రీలని కూడా తాగుడు వ్యసనం వైపు పురిగొల్పుతూ సాగిస్తున్న ప్రచారాలు. ఒఒకప్పుడు మన సినిమాల్లో కధానాయకుడు బుద్ధిమంతుడు, సకల సద్గుణాభిరాముడు. మరి ఇప్పుడో – ఇడియట్, పోకిరి, కంత్రి, దేశముదురు.  ప్రేమ విఫలమైన కొడుక్కి ఆప్యాయంగా తాగుడు అలవాటు చేసి ఓదార్చే తండ్రి, కలిసి మందు కొట్టే ఆదర్శ కుటుంబాలు, తాగి తల్లిదండ్రులతో సహా గుర్తొచ్చిన అందర్నీ తూలనాడే హీరోధాత్తులు, వీళ్లతో కలిసి తాగి తందనాలాడుతూ చిందులేసే కధానాయికలు .. ఈ మధ్య కాలంలో ఇటువంటి సన్నివేశాల్లేని సినిమా ఒక్కటైనా ఉందా? ‘కధ ప్రకారం అలా చేశాం’ అని దర్శక నిర్మాతలెంత ఊదరగొట్టినా అవి వాళ్ల భావదారిద్ర్యానికి మాత్రమే సూచికలు. ఆయా అనవసర సన్నివేశాల రూపకల్పన వెనుక మద్యం లాబీ మంత్రాంగం లేదంటే నమ్మటం కష్టం.

మద్యోత్పత్తుల ప్రత్యక్ష ప్రకటనలపై ప్రసార మాధ్యమాల్లో నామ్‌కే వాస్తే నిషేధమొకటి విధించి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. నైట్ ఔట్ వంటి టీవీ కార్యక్రమాల్లో యువత పబ్‌లలో తాగి చిందులేస్తున్నట్లు చూపటం, సెలబ్రిటీ ఇంటర్వ్యూల పేరుతో ఎవరే పబ్బుల్లో గడుపుతారో చెప్పించటం వంటివి పరోక్ష ప్రచారం కాక మరేమిటి? యునైటెడ్ బ్రూవరీస్ వంటి సంస్థల సౌజన్యంతో క్రికెట్‌ని అడ్డు పెట్టుకుని మద్యం ఉత్పత్తుల ప్రచారం టెలివిజన్ ప్రేక్షకుల గదుల్లోకి, మదుల్లోకి చేరటం ఈ మధ్యనే మొదలయింది. స్టేడియాలలో బీరు వంటి తక్కువ శాతం ఆల్కహాల్ పానీయాల అమ్మకాలు మొదలయే రోజులూ త్వరలోనే రావచ్చు. మధిరాపానం వల్ల కలిగే ప్రత్యక్ష, పరోక్ష అనర్ధాలని ఉద్యమ సదృశంగా ప్రచారం చేయాల్సిన ప్రభుత్వాలు ఆ విషయంలో చేస్తున్నది సున్న. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలకి అబ్కారీ ఆదాయమే ప్రాణాధారం. మందుబాబులు ఎక్కువున్న రాష్ట్రాల్లో పంజాబ్, గోవాల తర్వాత మన రాష్ట్రానిది ముచ్చటగా మూడో స్థానం. జనాల్తో పూటుగా తాగించి బొక్కసం నింపుకునే యావలో ప్రభుత్వాలున్నంత కాలం ‘మందు మానండోయ్ బాబూ’ అనే రాందాసులది అరణ్య రోదనే.

18 స్పందనలు to “మద్య తరగతి మహిళ”


 1. 1 కె.మహేష్ కుమార్ 8:16 సా. వద్ద డిసెంబర్ 8, 2008

  మందు తాగడం పురాణకాలం నుంచీ మన సంస్కృతిలో భాగం…:) సోమ/సురాపానాల సంగతి మీకు తెలియనిది కాదు.దేవతలు ఈ అద్భుతమైన పానీయాన్ని తాగేవాళ్ళు. ఆ దేవతల పుణ్యమా అని ప్రస్తుతం అది మానవులకు సంక్రమించింది. మీరు భారతీయ సంస్కృతినీ నమ్మకాల్నీ గేలిచేసేవిధంగా టపా రాసారని మనవి.:):):):):)

  jokes apart, మధ్యపాన వ్యతిరేక ఉద్యమం చేసింది కూడా మధ్యతరగతి మహిళలు కాదు.ఉద్యమాన్ని ముందుండి నడిపిన దూబగుంట సుబ్బమ్మ ఒక సాధారణ క్రిందితరగతి మహిళ.అప్పట్లో ఈ ఉధ్యమానికి నైతిక మద్దత్తుని మాత్రం ఖచ్చితంగా మధ్యతరగతి అందించింది. జనవిజ్ఞాన వేదిక మరియూ వామపక్షాల మద్దత్తుతో సామాన్య మహిళకు సాధించిన మహోన్నత విప్లవం అది.

  ప్రస్తుతం ‘లోక్ సత్తా’ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా, మధ్యతరగతి మాత్రం దీనికి దూరంగా నిరాసక్తత కనబరుస్తోంది. మద్యపానంపట్ల విస్తృతమైన అంగీకారధోరణి బహుశా ఈ నిరాసక్తతకు కారణం కాబోలు.ప్రభుత్వం క్రిందితరగతి వాళ్ళకు కనీసం choice లేకుండా చేసి మందుతాగిస్తున్నారు. వాడవాడలా వెలిసిన బెల్టుషాపులు, నెలనెలా అబ్కారీ శాఖకు ఇస్తున్న టార్గెట్లూ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. మద్యపానంవలన వచ్చిన ఆదాయాన్ని మద్యపాన నిషేధ ప్రచారానికి వాడుతామనే irresponsible statements ఇచ్చేధైర్యాన్ని ప్రభుత్వం కూడగట్టుకుంది.

  మద్యం వ్యాపారస్తుల కుట్ర ఎంతున్నా, జనాల ఆరోగ్యాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం మద్యపానాన్ని ప్రోత్సహించే విధంగా తయారవడం నిరసించదగిన పరిణామం.ఎంత ఆదాయం వస్తోంది అని ఆలోచిస్తున్నారేగానీ సమాజం ఎంత విఛ్ఛిన్నతికి గురైతోంది అనే social cost ని ఎవరూ బేరీజు చెయ్యడం లేదు. తమ టార్గెట్లు పెంచుకోవాలనే ధోరణి కనబరుస్తున్నారేగానీ ప్రజల health expenditure ద్విగుణీకృతమౌతోందమే స్పృహ కోల్పోయారు.

  ‘పేజ్ 3’ కబుర్లు పేరుతో ఈ మధ్య పబ్బులూ,డిస్కోధెక్కులూ,సోషలైట్లను ప్రముఖంగా సచిత్రప్రచారం చెయ్యడంలో conspiracy ఉందని మీకు అనిపించినట్లే నాకూ అనిపించింది. ఇప్పుడు కాదు…1995 లో Times of India Bangalore ఎడిషన్ చూసినప్పటినుంచీ.ప్రస్తుతం అది బెంగుళూరు సంస్కృతిలో ఒక (సాధారణ)భాగంగా అప్పుడప్పుడూ proud tradition గా మారిపోయింది. హైదరాబాద్ లో కూడా త్వరగా అదే అవుతుంది. కాస్మోపోలిటన్ కల్చర్ అవడానికి అదొక qualification అన్నమాట!

  మధ్యతరగతి పరిధిలో మద్యపానం ఒక choice.మరీ ఆల్కహాలిక్ కానంతరకూ ఆ choice వర్తిస్తుంది. ఎంతైనా వ్యసనం వ్యసనమేకదా! దాన్ని సమర్ధించలేం కానీ వ్యక్తిగతహక్కుల్నీ కాదనలేం. ఇక్కడ పెద్దస్థాయిలో నష్టం (ఇప్పట్లో) కనిపించడం లేదు కాబట్టి ప్రస్తుతానికి దాటవేసినా, మద్యపానం మరీ ప్రోత్సహించదగిన అలవాటుల్లో ఒకటి కాదనేది ప్రతి ఒక్కరూ అంగీకరించే నిజం.

  మంచి ఆలోచనాత్మక టపా…ఆలోచనతోపాటూ కార్యశీలతకు దిగాలంటే మాత్రం లోక్ సత్తాలో చేతులు కలపాల్సిందే. అలాగే మద్యపాన నిషేధ ఉద్యమం గురించి ‘షమ్నం విర్మానీ’ తీసిన “When Women Unite”(ఆడవాళ్ళు ఏకమైతే!) అనే డాక్యుమెంటరీ తప్పకుండా అందరూ చూడాలి. అందరికీ చూపించాలి. ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు చూస్తే ఇంత ఉద్యమస్ఫూర్తి ఎలా నీరుగారిపోయిందా!!!…ఇంతటి విప్లవం ఎలా అణగారిపోయిందా!!! అనే సందేహాలు తప్పకుండా వస్తాయి. ఆ కోణంలో గనక ఆలోచించగలిగితే బహుశా ప్రభుత్వవిధానాలను మనం ఎలా ఎదుర్కోగలమో కొంత తెలిసి రాగలదు.

 2. 2 bollojubaba 8:47 సా. వద్ద డిసెంబర్ 8, 2008

  టపా టైటిల్ తప్పుగా పెట్టారేమిటా అనుకొంటూ వచ్చాను. (మద్య, మధ్య):-)

  టపాలోని విశ్లే్షణ బాగుంది.
  మహేష్ గారి కామెంటు కూడా బాగుంది.

  మద్య పాన వ్యతిరేక ఉద్యమానికి అప్పట్లో రాజకీయ పార్టీలు, కొన్ని పత్రికల అండదండలుండటం వల్ల విజయవంతమైనదేమోనని నా అనుమానం.

 3. 3 కె.మహేష్ కుమార్ 9:15 సా. వద్ద డిసెంబర్ 8, 2008

  @బొల్లోజు బాబాగారు: నిజమే! పొలిటికల్లీ మోటివేటెడైనా ‘ఈనాడు’ పాత్ర ఈ ఉద్యమంలో మరువలేనిది. 1992 లో నెల్లూరులో మొదలైన ఈ ఉద్యమం నాలుగు నెలల్లో పోలీసులకూ,ప్రభుత్వానికీ వెరవక 800 మద్యంషాపుల్ని మట్టుబెట్టింది చేసింది. ఒక సంవత్సరం తిరక్కుండానే ఈ ఉద్యమం ప్రతి జిల్లాకూ వ్యాపించింది. మూడు సంవత్సరాల సుధీర్ఘపోరాటం తరువాత ప్రభుత్వం మెడలు వంచి మద్యపాన నిషేధాన్ని సాధించుకుంది.

  I consider it as one of the most powerful social uprising Independent India has ever seen. సామాజిక-పత్రికా-మేధావివర్గం మద్దత్తు లేకుండా ఇలాంటి ఉద్యమాన్ని సాధారణ మహిళలు మూడుసంవత్సరాలు నిరాటంకంగా సాగించడం అంత సులభం కాదు.ఆంద్రప్రదేశ్ రాజకీయ,సామాజిక అర్థాల్ని మార్చిన ఉద్యమం ఇది. ఫెమినిజం యొక్క అర్థాల్ని తిరగరాసిన ఉద్యమం ఇది. కానీ, ఈ ఉధ్యమాన్ని మనం ఎంత సులభంగా మర్చిపోయామో గమనించారా? అదే గ్లోబలైజేషన్ మహత్యమంటే!!

  ఈ పోస్టు చదవగానే మళ్ళీ ఆ డాక్యుమెంటరీనొకసారి చూసాను. I am feeling pathetic.మన భారతీయులకు ఎందుకు sense of history and social responsibility లేదో అర్థమవుతోంది.We are a national of convenient people. అమెరికన్లకన్నా ఈ విషయంలో మనం ఖచ్చితంగా ఒకమెట్టు కిందేవున్నాం. and we still claim moral high ground.

 4. 4 ఏకాంతపు దిలీప్ 3:20 ఉద. వద్ద డిసెంబర్ 9, 2008

  మంచి టపా! అంతే కాకుండా, భారత దేశం ఇన్ని కష్టాలున్నా నెట్టుకుంటూ ముందుకెళ్తుందీ అంటే దానికి కారణం వారి వారి కుటుంబాలకి అంకితమైపోయిన మధ్య, కింది తరగతి మహిళలే కారణం అని నాకెప్పుడూ అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా అలవాట్లని పెంచుకుని, ఖర్చు చేసే యంత్రాలుగా మారితే ఈ దేశాన్ని దేవుడే కాపాడాలి.

 5. 5 sravya 11:03 సా. వద్ద డిసెంబర్ 9, 2008

  Abrakadabra gaaru good post ! I can add one more thing here our government and are media succeeded in injecting the following ideas

  1.Due to prohibition we are loosing the economy and it is giving advantage to other states .
  2.Our tourism is getting more impact !
  3.Monthly budget spent on this increased for individuals on this habit durign prohbition 🙂

 6. 6 sri 1:08 ఉద. వద్ద డిసెంబర్ 11, 2008

  Dear Maheshkumar,
  The drink that devathas were supposed to be drinking is not the mediocre liquor or the material level liquor. There is a subtle meaning for this soma rasa drink in yoga aspects. There is a kind of process that occurs in any one who had practiced some specific yogic techniques. This process generates soma rasa, which is nothing but the prana shakti, that enhances the individuals evolutionary process to be much faster than an average individual, and there by attain the level of evolutionary state, where the individual can now start perceiving the universalness instead of individualness.

  There is very subtle process that happens here, when the devathas or the saintly persons or yogis start the process of drinking the soma rasa panam.

  Please note this.

 7. 7 కె.మహేష్ కుమార్ 2:42 ఉద. వద్ద డిసెంబర్ 11, 2008

  @శ్రీ: బాబ్బాబూ ఈ సోమరసమెక్కడ దొరుకుతుందో కాస్త అడ్రసిస్తారా! అర్జంటుగా ఒక పీపాడు కావాలి. అయినా నేనేదో హాస్యానికంటే దాన్నిబట్టుకుని మీరు misinformation ఇచ్చేస్తే ఎలా? మీ దగ్గర సోమరసం ఫార్ములా ఉందా..ఎప్పుడైనా తాగారా…ఎవరైనా చెయ్యగా చూసారా…ఎందుకండీ ఈ పుక్కిటిపురాణ ప్రేలాపన.

  ఇక్కడ చర్చిస్తున్నది అవసరమైన సామాజిక సమస్య. దానిమీద శ్రద్ధపెట్టి ఏదైనా కొంత సమాచారం ఇవ్వండి సార్! కొంత స్వాంతనన్నా దక్కుతుంది.

 8. 8 sri 11:01 ఉద. వద్ద డిసెంబర్ 11, 2008

  Dear Maheshkumar,
  Its ok if you said for the sake of fun, but you know what, these are not the pukkiti puranalu, for god’s sake.There are specific Yogic techniques that generates the Soma rasa, and I have experienced this, of course, not like the way you intend to drink by borrowing a drum from someone, but by way of intense hardwork in the area of Yoga/Meditation. There are countless individuals that had done this technique since ages. Its just that you donot know this.Its a fashion these days to say PUKKITI PURANALU, when it comes to the Vedic knowledge, but accept anything blindly that is modern scientific discovery.

  This is purely because of the ignorance of the masses about the magnanimous vedic knowledge, that has UNDOUBTEDLY GIVEN RISE TO LORD KRISHNA OR LORD JESUS CHRIST LIKE SAINT IN EVERY GENERATION WITH OUT FAIL, SILENTLY AND WITHOUT ANY SHOW-OFF.

 9. 9 ప్రవీణ్ గార్లపాటి 1:02 సా. వద్ద డిసెంబర్ 11, 2008

  మద్యం ప్రభావం తప్పకుండా అన్ని పెద్ద నగరాల్లోనూ కనిపిస్తుంది. తాగని వారు కనిపించడం కూడా తక్కువే ఈ రోజుల్లో.
  ప్రజల్లో అవేర్నెస్ తేవాల్సిన ప్రభుత్వమే దానిని పని గట్టుకుని ప్రోత్సాహిస్తుంటే ఇక చెప్పేదేముంది.

  ధూమపానం కన్నా మద్యపానమే ఎక్కువగా వ్యాపిస్తుందనేది నాకనిపిస్తుంది నా సర్కిళ్ళలో చూసినా.

  ఇక తాగడాన్ని ఒక పెద్ద ఫ్యాషన్‌గా భావించే వారికీ తక్కువ లేదు. పైన తీవ్రంగా వ్యాఖ్యానించిన మహేష్ గారితో సహా.
  అమ్మానాన్నల డబ్బులు అలా స్టూడెంటు లైఫులో తగలెయ్యడం తప్పు అంటే నేను నీలా ముసలాడిని కాదు, ఏ వయసులో చెయ్యాల్సిన పనులు ఆ వయసులో చేస్తానని ఎద్దేవా చేసారు ఒక టపాలో.

  చదువుకున్న వారే అలా ఆలోచిస్తే ఇక కింది తరగతి, పేదవారి గురించి చెప్పేదేముంది.

 10. 10 munny 1:31 సా. వద్ద డిసెంబర్ 11, 2008

  కింద తరగతి, మధ్య తరగతి అని మాత్రమే కాకుండ అసలు మహిళలు మద్యం తాగటం వల్ల నష్టలు ఎన్నో ఉన్నయి. వాళ్ళ ఆరోగ్యంతో పాటు వాళ్ళ బిడ్డల ఆరోగ్యానికి కుడా హానికరం. ఇలాంటి విషయలు మన టివి చానల్స్ దృష్టికి తెస్తే బెట్టర్ ఏమొ కదా!

 11. 11 కె.మహేష్ కుమార్ 7:10 సా. వద్ద డిసెంబర్ 11, 2008

  @ప్రవీణ్ గార్లపాటి: నేను నా బ్లాగులో రాసిన టపాకూడా (http://parnashaala.blogspot.com/2008/08/blog-post_09.html) తాగుడులోని “అతి” గురించే.యువకులుగా అందరూ experiments చేస్తారు.అదే నేనూ చేసాను. I have learned my limits through my professor. ఆ టపా సారాశంకూడా అదే! తాగడం పెద్ద ఫ్యాషన్ అని కాదు. దాన్ని నేను సమర్ధిస్తున్నట్లూ కాదు.

  మీరు high moral ground తీసుకుని నాటపాలో రాసిన వ్యాఖ్యకు సరదాగానే నేను అంటించిన చురక ఇప్పటికీ మీకు గుర్తుందంటే,I am sure it might have hear you. అందుకే పైన లంకె ఇచ్చాను. ఆ టపావేడి ఇప్పుడు తగ్గుటుంది గనక మళ్ళీ ఒక సారి నా టపా మరియూ వ్యాఖ్య చదవండి. నా ఉద్దేశం మిమ్మల్ని ఎద్దేవా చెయ్యడంకన్నా, యువకుడిగా నేను యువకులు చేసే తప్పులే చేసాను I was not mature enough అనే self critic మీకు కనిపించొచ్చు.

  @శ్రీ: సొమరసానికి ఇంత శక్తుంటే దాన్ని అందరికీ అందకుండా ఎందుకు దాస్తున్నట్లు? విజయమాల్య లాంటివాళ్ళక్కూడా ఈ ఫార్ములా దక్కకుండా ఎవరు guard చేస్తున్నారు? ఇంత పవిత్రమైన,ఆరోగ్యవంతమైన పానీయం దొరికితే ఎవరు మాత్రం సాధారణమందు తాగుతారు? ఇక్కడ మీరు self experience తో చెప్పానన్నారుకాబట్టి ఆ వివరాలు మాతో పంచుకునే బాధ్యతను మీరు తీసుకొని ఆ సోమరసం దొరికే చోటు చెప్పాల్సిందే!

  ఇక “పుక్కిటి పురాణాలు” అనేది మీరు derogatory గా చూస్తే అలాగే ఉంటుందిగానీ,దానర్థం oral tradition అనిమాత్రమే.

 12. 12 కె.మహేష్ కుమార్ 7:12 సా. వద్ద డిసెంబర్ 11, 2008

  @ప్రవీణ్ గార్లపాటి: నేను నా బ్లాగులో రాసిన టపాకూడా (http://parnashaala.blogspot.com/2008/08/blog-post_09.html) తాగుడులోని “అతి” గురించే.యువకులుగా అందరూ experiments చేస్తారు.అదే నేనూ చేసాను. I have learned my limits through my professor. ఆ టపా సారాశంకూడా అదే! తాగడం పెద్ద ఫ్యాషన్ అని కాదు. దాన్ని నేను సమర్ధిస్తున్నట్లూ కాదు.

  మీరు high moral ground తీసుకుని నాటపాలో రాసిన వ్యాఖ్యకు సరదాగానే నేను అంటించిన చురక ఇప్పటికీ మీకు గుర్తుందంటే,I am sure it might have hear you. అందుకే పైన లంకె ఇచ్చాను. ఆ టపావేడి ఇప్పుడు తగ్గుటుంది గనక మళ్ళీ ఒక సారి నా టపా మరియూ వ్యాఖ్య చదవండి. నా ఉద్దేశం మిమ్మల్ని ఎద్దేవా చెయ్యడంకన్నా, యువకుడిగా నేను యువకులు చేసే తప్పులే చేసాను I was not mature enough అనే self critic మీకు కనిపించొచ్చు.

  @శ్రీ: సొమరసానికి ఇంత శక్తుంటే దాన్ని అందరికీ అందకుండా ఎందుకు దాస్తున్నట్లు? విజయమాల్య లాంటివాళ్ళక్కూడా ఈ ఫార్ములా దక్కకుండా ఎవరు guard చేస్తున్నారు? ఇంత పవిత్రమైన,ఆరోగ్యవంతమైన పానీయం దొరికితే ఎవరు మాత్రం సాధారణమందు తాగుతారు? ఇక్కడ మీరు self experience తో చెప్పానన్నారుకాబట్టి ఆ వివరాలు మాతో పంచుకునే బాధ్యతను మీరు తీసుకొని ఆ సోమరసం దొరికే చోటు చెప్పాల్సిందే!

  ఇక “పుక్కిటి పురాణాలు” అనేది మీరు derogatory గా చూస్తే అలాగే ఉంటుందిగానీ,దానర్థం oral tradition అనిమాత్రమే.

 13. 13 రవి 1:03 ఉద. వద్ద డిసెంబర్ 12, 2008

  అబ్రకదబ్ర గారు, మీరన్నట్టు మారుతున్న జీవన శైలి, కుటుంబ పరమైన ఆంక్షలు తగ్గడం, వృత్తి ద్వారా వచ్చే విపరీతమైన మానసిక అలసట మద్య పానానికి కారణం. ఇది తగ్గడానికి ప్రభుత్వం తరపు ఆంక్షలు పని చేస్తాయని నమ్మకం లేదు. కాస్తో కూస్తో ప్రభుత్వం చేయగలిగింది, కుటుంబ జీవితాన్ని, సాంప్రదాయ విలువల సారాంశానికి ప్రాచుర్యం తెచ్చి, సమస్య ను subtle levels లో Deal చేయడం అని నేను అనుకుంటున్నాను.

 14. 14 అబ్రకదబ్ర 11:03 ఉద. వద్ద డిసెంబర్ 12, 2008

  వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు. పని వత్తిడివల్ల ఈ వ్యాఖ్యలన్నీ ఇందాకా చదవలేకపోయాను.

  @శ్రీ:

  Cool down. మహేష్ సరదాకి సోమరసం ప్రస్తావన తెచ్చాడు. మీరు చెప్పిన వివరాలు నాకూ తెలీదు. మొత్తానికి, సోమరసం అనేది ఒక virtual drink అంటారు! మరిన్ని విషయాలు తెలిస్తే పంచుకోగలరు.

  @మహేష్:

  శ్రీతో మీ ఉపచర్చ అసలు చర్చకన్నా ఆసక్తికరంగా ఉంది 🙂

  @ప్రవీణ్:

  ఈ ఫ్యాషన్ ఎలా, ఎందుకు మొదలౌతుందో నాకంతుపట్టదు. సిగరెట్లు, మందు గురించి చాలామంది అంటుంటారు – ‘స్నేహితుల వత్తిడితో మొదలెట్టా’ అని. నన్ను అలా వత్తిడి చేసిన వారెవరూ లేరు. ఈ అలవాట్లు లేని స్నేహితులు చాలామంది ఉన్నారు నాకు. వత్తిడి చేసేవారున్నా లేకున్నా, మహేష్ అన్నట్లు, కుర్రతనంలో అదొక experiment లా మొదలవుతుందేమో.

 15. 15 sri 11:17 ఉద. వద్ద డిసెంబర్ 12, 2008

  Dear Ravi,
  You are 100% right. The world around us is so much driving us towards the material level pleasures, and the reasons may be that daily work stress, family problems related to sentiments, financial troubles, or mere enthusiasm for the drugs and liquor etc.

  To resist this level of freely available worldly temptations or pleasures, the best way is to adopt some mechanism that can give us self-control in a much faster way. While doing service to others, prayers, bhajans, poojas, vrathams etc may be good in gaining the self-control, but since they are slow processes and they involve others as well and the moment others are involved, we are again prone to being drawn to material level. After all the thourough examinations, saints have come up with the Yoga & Meditation techniques that will give us self-control in a rapid manner, if we can adopt them in to the daily life these yoga and meditation to be practiced for just 15 minutes a day , then, it gives a huge difference in our lives. Even the practice of basic PRANAYAMA techniques done for 15 minutes a day sincerely will give us a huge amount of freedom from te day-today temptations and stress and gives so much strength to face any eventuality in day to day work and make us a balanced person.

  It is the lack of the common people interest in the cultural aspects(which in turn are interwoven brillinatly with the Yoga & meditation practices) that makes them loose their self control and yield to the day to day temptations, whcih leads to the gradual collapse of the character of the person.

  If you want to gain self-control when you are subjected to the environment where worldly pleasures are easily reachable, then you need a mechanism that can give you self-control even more easily, AND THAT IS POSSIBLE ONLY BY WAY OF YOGA & MEDITATION.

  Adopting of Yoga and Meditation practices for 15 minutes a day in the Schools and colleges will make the Kids gain self-control that they need and give freedom from stress and other problems.

  By the way, AMERICAN PUBLIC SCHOOLS ARE NOW ADOPTING YOGA AND MEDITATION AS PART OF THEIR OFFICIAL CURRICULAM.
  Here is the info on them:

  http://www.foxnews.com/printer_friendly_wires/2007Jan28/0,4675,FitnessYogainSchools,00.html

  By the way, I am not telling this out of some mere reading, but out of my own practice of the Yoga and Meditation techniques. If you go deeper in to these Yoga and Meditation techniques, then, you will find that Yoga is nothing but the ESSENTIAL CORE OF ALL RELIGIONS. Afterall, Swami Vivekananda said that “Each Soul is Potentially divine” or same words told by Lord Jesus Christ that “God made man in his image”.

 16. 16 Marthanda 6:39 సా. వద్ద జనవరి 26, 2009

  >>>
  ప్రేమ విఫలమైన కొడుక్కి ఆప్యాయంగా తాగుడు అలవాటు చేసి ఓదార్చే తండ్రి, కలిసి మందు కొట్టే ఆదర్శ కుటుంబాలు, తాగి తల్లిదండ్రులతో సహా గుర్తొచ్చిన అందర్నీ తూలనాడే హీరోధాత్తులు, వీళ్లతో కలిసి తాగి తందనాలాడుతూ చిందులేసే కధానాయికలు .. ఈ మధ్య కాలంలో ఇటువంటి సన్నివేశాల్లేని సినిమా ఒక్కటైనా ఉందా? ’కధ ప్రకారం అలా చేశాం’ అని దర్శక నిర్మాతలెంత ఊదరగొట్టినా అవి వాళ్ల భావదారిద్ర్యానికి మాత్రమే సూచికలు. ఆయా అనవసర సన్నివేశాల రూపకల్పన వెనుక మద్యం లాబీ మంత్రాంగం లేదంటే నమ్మటం కష్టం.
  >>>

  మా మామయ్య రైల్వేలో మంచి జీతం వచ్చే ఉద్యోగం చేసేవాడు. ఫ్రెండ్స్ ప్రభావం వల్ల తాగుడుకి, పేకాటకి అలవాటు పడి, డబ్బులు పోగొట్టుకుని, అప్పులు కూడా చేసి, అప్పులిచ్చిన వాళ్ళని మోసం చేసి పారిపోయాడు. తాగిన వాడు నష్టపోతాడు, తాగుబోతుని నమ్మిన వాడు మోసపోతాడు.

 17. 17 ఆకాశరామన్న 12:24 ఉద. వద్ద మార్చి 1, 2009

  అబ్రక దబ్ర గారు,
  “మగవారితో సమానంగా దురలవాట్లు కలిగుండటం సమానత్వానికి చిహ్నమనుకునే కుహనా ఫెమినిజమూ దీనికో కారణం”

  చక్కగా చెప్పారు.మగాల్లతో చదువులో పోటీ పడుతున్నారు, ఉద్యోగాల్లో పోటీ పడుతున్నారు. దాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు, కానీ ఇలా దురవాట్లలో పోటీ పడడం దాన్ని ఆధునికతగానో సాధికారతగానో భావించడం విచారకరం.


 1. 1 సెన్’సెక్స్’ - కోతి’గీతలు’ « Rayraj Reviews 6:01 ఉద. వద్ద మార్చి 2, 2009 పై ట్రాక్ బ్యాకు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: