పేరు గొప్ప విజయం

బొంబాయిలో తీవ్రవాద దాడుల నేపధ్యంలో గతవారం రోజులుగా సగటు భారతీయుడి మదిలో రకరకాల భావోద్వేగాలు. తీవ్రవాదులని మట్టుబెట్టిన ఎన్ఎస్‌జి కమాండోలపై ఆదరాభిమానాలు, దాయాది దేశమ్మీద ఆగ్రహావేశాలు, మన భద్రతా వ్యవస్థ సమర్ధతపై ఆందోళనానుమానాలు. దేశమంతా ఏకరీతిన రాజకీయ నాయకత్వంపై పెల్లుబికిన అసహ్యం, అసహనం. ఈ దాడి తాజ్ హోటల్ పై కాకుండా ఏ మురికివాడలోనో జరిగితే ప్రజాస్పందన ఇలాగే ఉండేదా? విద్రోహ చర్యల ఫలితంగా రైలు బోగీలు దగ్దమై వందలాది మంది అమాయకులు మరణించినా, మెట్రో రైళ్లలో బాంబులు పేలి ప్రయాణీకులు మృత్యువాత పడినా, మత ఘర్షణల్లో వేలాదిమంది అసువులుబాసినా రాని స్పందన తాజ్‌పై దాడితో ఎందుకొచ్చింది? ఏళ్లుగా గూడుకట్టుకున్న ఆక్రోశం ఒక్కసారిగా బయటపడిందా? ఎప్పటిలాగే ఇదీ పాలపొంగేనా లేక ఈ సారైనా మంచిమార్పులకి దారితీసేనా? ఎన్నో ప్రశ్నలు.

ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ఈ సంఘటనలో అడుగడుగునా మన రాజకీయ, పోలీసు, భద్రతా వ్యవస్థల వైఫల్యాలే కనపడుతుంటే తుది విజయం మనదేనంటూ తబ్బిబ్బైపోవటం ఎవర్ని మాయచేయటానికి? తమనడ్డగించిన ఒక కోస్ట్‌గార్డ్ గస్తీ ఉద్యోగికి లంచమిచ్చి తీవ్రవాదులు బయటపడ్డారన్న వార్త దిగ్భ్రాంతికరం. ఎంత సమర్ధంగా వ్యవహరించినా అన్ని సార్లూ దాడులు ఆపటం కుదరకపోవచ్చు. నిజమే. కానీ దాడి జరిగాక మన ప్రతిఘటన ఎలా ఉంది? ఎన్ఎస్‌జి రంగప్రవేశం చేసేటప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. కబురందిన వెంటనే వచ్చుంటే నష్టం పరిమితంగా ఉండేదన్న వాదనలున్నాయి. ఆలస్యానికి వెనుక వాళ్ల ఇబ్బందులు వాళ్లకుండొచ్చు. ‘పురుటి నొప్పుల సంగతొద్దు, పాపని కని చూపించు’ అని ఓ పాశ్చాత్య సామెతుంది. పనయిందా లేదా అన్నది ముఖ్యం. త్వరగా రాలేకపోవటానికి ఎన్ఎస్‌జీ చెప్పే కారణం – వాళ్లకున్న ఒకే ఒక విమానమూ మరెక్కడికో ఎగిరెళ్లిందట! దాన్ని తిరిగి తెప్పించుకుని చక్కా వచ్చేసరికి పుణ్యకాలం గడిచిపోయింది. పైగా, ఇది బహు నెమ్మదిగా ప్రయాణించే రకం. అత్యవసర సమయాల్లో మాత్రమే అవసరపడే దళానికి ఉన్న ఒకే ఒక్క బుల్లి విమానం తాబేలు చుట్టం!! ఎయిర్‌ఫోర్స్ వారి విమానాలనడిగి తీసుకోవలసింది కదా అన్న ప్రశ్నకి సమాధానం లేదు. ఎక్కడికక్కడ సమన్వయ లోపాలు. విమానాశ్రయం నుండి తాజ్ వద్దకు రావటానికి వారికోసం సమయానికి బస్సులు కూడా ఏర్పాటు చేయలేదని ఎవరో బాధపడిపోయారు. బస్సులా ఏర్పాటు చెయ్యాల్సింది? ముఖ్యమంత్రులు, ప్రభుత్వాధికారులు సైతం ప్రభుత్వ హెలికాప్టర్లలో దర్జాగా తిరిగే దేశంలో అత్యవసర పరిస్థితిలో ఓ కమాండో దళాన్ని తరలించేది అద్దె బస్సుల్లో! ఇటువంటి దేశంలో భద్రత దైవాధీనం సర్వీసు కావటంలో వింత లేదు.

పదిమంది తీవ్రవాదులు దేశమ్మొత్తాన్నీ మూడు రోజుల పాటు వణికించగలిగారంటే – చివరికి వాళ్ల గతేమిటో అటుంచితే – విజయమెవరిది? కధ మొదలయ్యాక పది గంటలకిగానీ సంఘటనా స్థలానికి చేరుకోలేని జాతీయ భద్రతా దళం ఉన్నా లేకున్నా ఒకటే. పైగా ఈలోగానే వీళ్ల రాక గురించి ఊదరగొట్టేసిన ప్రభుత్వం, ఎట్టకేలకి వచ్చినోళ్లు హెలికాప్టర్లలోనుండి దూకుతుంటే యాక్షన్ సినిమాలా చూపించిన టెలివిజన్ మీడియా .. అంతా కలిసి లోపలున్న తీవ్రవాదులకి వ్యూహాలు మార్చుకోటానికి, జాగ్రత్త పడటానికి కావలసినంత సమయమూ వివరాలూ దయచేశారు. ఇప్పుడు తీరిగ్గా ‘దేశ భద్రతకి సంబంధించిన విషయాల్లో మీడియా అత్యుత్సాహం చూపకుండా స్వయం నియంత్రణ పాటించాలి’ అంటూ ప్రభుత్వం ఆకులు పట్టుకున్నా ప్రయోజనం శూన్యం. అసలు, ఇటువంటి కమాండో ఆపరేషన్లు జరిగేటప్పుడు దగ్గర్లోకి మీడియాతో సహా ఎవరినీ రానీకుండా నిషేధాజ్ఞలు ఉండాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా? ఇలాంటి మెరుపు దాడులు జరిపేటప్పుడు ఎంత దగ్గరలోకి ఎవరిని అనుమతించాలనే విషయంలో ఎన్ఎస్‌జీకి మార్గదర్శకాలంటూ ఏమీ ఉండవా? పరిస్థితిని సమీక్షించి వ్యూహ రచన చేయటానికే ఇరవయ్యారు గంటలు పట్టిందని ఒకానొక ఎన్ఎస్‌జీ జవాను ఉవాచ. తాజ్ హోటల్ మ్యాపులు సమయానికి చేతికందలేదని మరొకరి వివరణ. ఇంత కంగాళీ ఎదురుదాడిని తీవ్రవాదులూ ఊహించుండరేమో. లేకుంటే మరింత భారీగా దాడికి దిగుండేవారు. ఆ మేరా మనోళ్ల సత్తామీద వాళ్ల అతి నమ్మకమే మరింతమంది బలి కాకుండా కాపాడిందనుకోవాలి.

భారతీయులు అల్ప సంతోషులు. హెలికాప్టర్లలోనుండి దూకుతున్న కమాండోలని టీవీల్లో చూసి మురిసిపోయి వాళ్లని హీరోల్లా ఆరాధించేసే అమాయకులు. వాళ్లకున్న అరకొర సదుపాయాలతోనే ప్రాణాలొడ్డి మరీ తీవ్రవాదుల అంతుచూసిన ఎన్ఎస్‌జీ జవాన్లని అభినందించి తీరాలి. అయితే, పదిమంది తీవ్రవాదులు పదహారుగురు పోలీసులతో సహా రమారమి రెండొందలమందిని ఊచకోత కోస్తే పోలీసులు, ఎన్ఎస్‌జి, సైన్యం, సిఆర్‌పిఎఫ్ వగైరా బలగాలన్నీ కలిసి వాళ్ల అంతు చూడటానికి మూడు రోజులు పట్టిందంటే అది తలవంపులు తెచ్చే విషయమా, తలెగరేసే విజయమా? ‘తీవ్రవాదుల్లో ఒకడు నారీమన్ హౌస్ ప్రాంతంలో తప్పించుకుని జనసమ్మర్ధంలో కలిసిపోయి పారిపోతున్నా కాల్పులు జరపొద్దనే ఆదేశాలుండటం వల్ల చూస్తూ ఉండిపోవాల్సొచ్చింది’ – ఒక ఎన్ఎస్‌జి కమాండో వ్యాఖ్య ఇది. కళ్లెదురుగా పారిపోతున్న వాడిని పట్టుకోటానికి కాల్పులు జరపటం మినహా మరో మార్గం తెలీనంత గొప్ప శిక్షణ మనం గర్వపడే కమాండో దళానిది!

శవాలమీద చిల్లర ఏరుకునే హీన రాజకీయాలు ఎప్పటి మాదిరిగానే ఇప్పుడూ కొనసాగాయి. ఓ వంక ఉగ్రవాదులతో హోరాహోరీ ఇంకా జరుగుతుండగానే కాల్పుల్లో మరణించిన పోలీసు అధికారి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందిస్తామంటూ గుజరాత్ ముఖ్యమంత్రి ముందుకు రావటం విడ్డూరం. తామేదో మంచి చేస్తున్నట్లు కనబడటమంటే ఎంత యావో! ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియాలు ప్రకటించటంలో చూపే ఉదారత్వం వాళ్లకి సాధన సంపత్తి సమకూర్చటానికి చూపిస్తే ఇందరి బలిదానం అవసరమయ్యేదా? మీ జాలి మాకొద్దని సదరు అధికారి భార్య తిరగ్గొట్టటం మోడీకి చెంపపెట్టు. మరోవంక మాజీ ఇంటిమంత్రి అద్వానీజీ ‘మా జమానాలో ఇలా దాడి చేసిన ఒక్క తీవ్రవాదినీ పారిపోనీకుండా కాల్చి చంపేశాం’ అని జబ్బలు చరుచుకుంటూ, దాడులు జరగకుండా ఆపలేని తమ చేతగానితనాన్ని స్వయంగా బయటపెట్టుకున్నారు. ఇక సోనియామ్మ భద్రతా వైఫల్యంపై నిప్పులు చెరిగారని, ప్రభుత్వాన్ని నిలదీశారని వార్త. ప్రభుత్వం ఎవరి కనుసన్నల్లో నడుస్తుందో తెలుసుకోలేని చవటాయిలం మనమని ఆవిడ ప్రగాఢ నమ్మకం. ఆవిడ నమ్మకం సరైనదే. ఎందుకంటే, వారం పది రోజులు ఇదో మసాలా వార్త. తర్వాత మరోటొస్తుంది – క్రికెట్టో, ఏ సినీతార పెళ్లో పెటాకులో, ఎన్నికలో, ఇంకేదో కుంభకోణమో. అప్పుడు చల్లగా దీన్నొదిలేసి దానిమీద పడతాం. మళ్లీ దీన్ని మించిన దాడేదో జరిగేనాటికి ఈ గొడవ పూర్తిగా మర్చిపోతాం. యధా ప్రజా, తధా రాజా.

23 స్పందనలు to “పేరు గొప్ప విజయం”


 1. 1 Kumar 9:30 సా. వద్ద డిసెంబర్ 3, 2008

  “పదిమంది తీవ్రవాదులు పదహారుగురు పోలీసులతో సహా రమారమి రెండొందలమందిని ఊచకోత కోస్తే పోలీసులు, ఎన్ఎస్‌జి, సైన్యం, సిఆర్‌పిఎఫ్ వగైరా బలగాలన్నీ కలిసి వాళ్ల అంతు చూడటానికి మూడు రోజులు పట్టిందంటే అది తలవంపులు తెచ్చే విషయమా, తలెగరేసే విజయమా?”

  ఈ విషయంలో, మరియు మొత్తం టపా విషయంలో మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నాక్కూడా పత్రికల్లోనూ,మిగతా చోట్ల చదూతూంటే చాలా భాదేసింది, ఇంత పూర్ రెస్పాన్స్ ని ఇంత సెలబ్రేట్ చేసుకునేంత వెనకబడి ఉన్నామా ఇంకా మనం అని? ఆ తాడు పట్టుకొని జారే సీన్ ని ఎన్ని వందల సార్లు చూపించారో..

  అసలు, చిట్టచివరి టెర్రరిస్టు మాత్రమే మిగిలి ఉన్నాడు అన్న హెడ్ లైన్, అక్కణ్ణుంచి అతన్ని అంతమొందించడం కోసం ఒక 24 గంటల పోరాటం….నాకిప్పటికీ గందరగోళమే..అసలేమయిందీ చివరి 24 గంటల్లో అని. నిజంగా గుండెల్లో కెలికినట్లయ్యింది..It’s a difficult Job, but it’s not 3 days difficult అన్న universal analysis ని వింటూంటే.

  మన డిఫెన్స్ బడ్జెట్ ఎంత పెరిగిందండీ గత 20, 30 సంవత్సరాల్లో..ఎక్కడ పోతోంది ఆ డబ్బంతా..అదంతా కేవలం సైన్యానికీ, యుద్దనికే అంటారా? ఇదీ యుద్దమే కదా??

  ఏమో..నాకంతా అయోమయం.

 2. 2 sravya 9:40 సా. వద్ద డిసెంబర్ 3, 2008

  అబ్రకదబ్ర గారు
  పదిమంది తీవ్రవాదులు దేశమ్మొత్తాన్నీ మూడు రోజుల పాటు వణికించగలిగారంటే –
  విచక్షరహితం గా దొరికిన వాడినల్లా చంపలనుకునేవాడి కి, శత్రువు ని మాత్రమే పట్టుకొనే వాళ్ళకు తేడా లేదంటారా? అన్ని దార్లు దొంగవి కాని దొంగ వెళ్ళె దారి మాత్రమే పట్టుకొనే వాడిది కదా?

  ఇక మీరు చివరి పేరా లొఏ చెప్పినదానికి – Amen to that

 3. 3 కె.మహేష్ కుమార్ 10:19 సా. వద్ద డిసెంబర్ 3, 2008

  మీరు చెప్పినదానితో విభేధించడం కష్టం. కానీ, అంగీకరించడం మాత్రం సులభం కాదు. We are all emotional fools at one level.

 4. 4 వేణూ శ్రీకాంత్ 10:57 సా. వద్ద డిసెంబర్ 3, 2008

  అబ్రకదబ్ర గారు హొటల్ ని సీజ్ చేయడం అనేది one of the brilliant idea of terrorists అండీ. కొన్ని వందల రూముల్లో ఎవరు తీవ్రవాదో ఎవరు మాములు వ్యక్తో తెలియకుండా సామాన్య ప్రజలకి హాని కలుగకుండా ఇటువంటి ఆపరేషన్ నిర్వహించడం సాధారణమైన విషయం కాదు. ఖచ్చితం గా సమయం పడుతుంది. కాకుంటే మీరు చెప్పినట్లు NSG మరింత సంసిద్దం గా ఉండి మరి కొంత వేగంగా స్పందించి ఉండాల్సింది. There are still lot of loop holes that need to be addressed ముఖ్యం గా మీడియా విషయం లో మీరు చెప్పినట్లు కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. మూడొవ రోజు ముంబై లో టీవీ ప్రసారాలు ఆపేసారు అని విన్నాను అది కొంత నయమే కదా. కనీసం ఇప్పుడైనా పాఠాలు నేర్చుకుంటారేమో చూడాలి.

 5. 5 శివ బండారు 11:58 సా. వద్ద డిసెంబర్ 3, 2008

  మీకో విషయం తెలుసా . తీవ్రవదం మీద పోరాటం కు సైన్యం ఒప్పుకోవడం లేదు . ఆర్మీ మేజర్ సింగ్ కచ్చితంగా ప్రకటించారు కొద్దినెలల క్రితం . సరిహద్దులలో మత్రమే యుద్దం చేస్తారట , మహా అయితే పకృతి విపత్తులప్పుడు సహాయం తీసుకోవచ్చట . వాల్ల స్కిల్స్ పాడవుతాయట.

 6. 6 రవి 12:35 ఉద. వద్ద డిసెంబర్ 4, 2008

  “పదిమంది తీవ్రవాదులు దేశమ్మొత్తాన్నీ మూడు రోజుల పాటు వణికించగలిగారంటే – చివరికి వాళ్ల గతేమిటో అటుంచితే – విజయమెవరిది?”

  విజయం తీవ్రవాదులది అంటారా? ఆ తీవ్ర వాదులు చావడానికి సిద్ధపడి, మాదక ద్రవ్యాలు సేవించి వచ్చిన వాళ్ళు. కమాండోలు తీవ్రవాదుల్లాగా నిర్ణయాలు తీసుకోలేరుగా?

  “కధ మొదలయ్యాక పది గంటలకిగానీ సంఘటనా స్థలానికి చేరుకోలేని జాతీయ భద్రతా దళం ఉన్నా లేకున్నా ఒకటే”

  భద్రతా దళం “లేకుంటే” ఎలా ఉండేది. ఒక్క సారి పరిస్థితి ఊహించండి.

  “కళ్లెదురుగా పారిపోతున్న వాడిని పట్టుకోటానికి కాల్పులు జరపటం మినహా మరో మార్గం తెలీనంత గొప్ప శిక్షణ మనం గర్వపడే కమాండో దళానిది”

  ఒక వేళ ఆ ప్రయత్నంలో అమాయకులైన ప్రజ మరణించి ఉంటే? సామాన్య ప్రజ మరణించి, తీవ్ర వాది తప్పించుకుని ఉంటే? ఆలోచించండి. వాళ్ళు ఉన్న పరిస్థితిలో మనం లేము కాబట్టి మనం అభిప్రాయాలు తేలిగ్గా చెప్పగలం.రాజకీయ వాదుల నీచత్వానికి, దివాళా కోరు తనానికి, చేతకాని చేష్టలకు, NSG పై వేలు ఎక్కు పెట్టటం సరైనదేనంటారా?

  being said all above, మీరు చెప్పిన వాటితో ఏకీభవించాల్సిందే. (మహేశ్ కుమార్ వ్యాఖ్య చదువుకోండి ఓ సారిక్కడ.)

  we are all fools. Atleast let us understand that we are fools, try to estimate our foolishness. Did I say wrong?

 7. 7 sri 1:19 ఉద. వద్ద డిసెంబర్ 4, 2008

  The problem lies with people, like you , me and every citizen of India. It is our selfishness that leads our politicians to think that they can gain power by spraying money and by inciting caste & religious sentiments.

  So, because of peoples(our) ignorance, we are suffering. If possible, we should try to sacrifice our own worldly pleasures and wasteful spending and then use that money to give character based education to the needy people. If we donot sacrifice ourselves, then, there is no point in commenting on the people.

  Swami vivekananda said that “as long as even a dog sleeps without its stomach filled in the night in my country, I CANNOT AFORD TO SLEEP ON THE BEDS”, was what he said when he was in the west and when he was offered the luxuries of the west.

  Such is the patriotism that we need to instill in ourselves nad in rest of our families and in fellow Indians, and then, we will see the change. Without people, changing their mindset, there is no point in commenting the politicians.

  Tell me one thing. If I am strong on character, then, would anyone dare to even look at me with a bad intention. Nope.

  But the problem lies in our peoples character. Instead of people controlling the leaders, leaders are controlling them, and this is the reason why we are suffering now.

  The day we develop an unwavering strength to ask questions and then to make our leaders accountable, then, INDIA will regains ITS LOST GLORY. India was for long times, in the past, as recent as 2000 years back, was VERY superpower in all aspects, because of its people and their spiritual and material level values, but later what happened is that, majsses fell prey to the worldly pleasures and their leaders abused the powers given to them in the societal structure, and slowly fell in to the clutches of the materialistic world, and hence the troubles. We will definitely regain the lost material level glory, since India still has not lost the spiritual glory in spite of such suffering at the material level. From the depths of my SOUL, I can affirm that, India is the only nation that had given birth to Lord Jesus Christ or Lord Krishna Like saints IN EVERY GENERATION without fail and silently with out any showoff. It is that spiritual values that will make India regain its past material glories, rather than anything else. We will see that day sooner probably in antoher 2 decades. Of coures, the current troubles are only the hunter lashes on the masses to change their path from falling behind material pleasures and to seek solace in time tested spiritual values.

 8. 9 సుజాత 2:46 ఉద. వద్ద డిసెంబర్ 4, 2008

  మహేష్ గారితో ఏకీభవిస్తున్నాను.

 9. 10 gangabhavani 8:47 ఉద. వద్ద డిసెంబర్ 4, 2008

  Out of many opinions condemning the acts of terrorism and the failure of the government to forestall them, i have found your opinion logical and well grounded except for a few sentences.
  1. I truly believe that Indians glorified NSGs because of their risking their lives to save us.
  2. I really didn’t see the point of talking about win/lose situation.
  3. I eagerly looked for some solutions at least to one problem . To my disgust, i have not found any.

 10. 11 Wanderer 1:30 సా. వద్ద డిసెంబర్ 4, 2008

  @Gangabhavani – I think the author of this post suggested several solutions such as

  “ఇటువంటి దాడులని ఎదుర్కోడానికి కమాండో లకు సరియైన సాధన సంపత్తిని సమకూర్చుకోడంలో ప్రభుత్వం శ్రధ్ధ చూపించాలి”

  “కాల్పులు జరపడం ఒక్కటే కాక పారిపోతున్న ఉగ్రవాదులను పట్టుకోడానికి వేరే tactics వాడగలగాలి”

  The objective of this article is to show the other side of the coin and not to say that the coin has only one side.

  In my opinion, in a populous country like India, it is very difficult to contain and handle terrorist attacks. The only way to prevent future attacks is vigilance. It’s easier and effective to curb these activities at the planning stages than at the execution stage. The country and government should invest more in the intelligence and vigilance. Israel is a good example.

 11. 12 bhavani 2:11 సా. వద్ద డిసెంబర్ 4, 2008

  @wanderer,
  the solutions that you have cited sound very abstract to a layperson like me.
  Your explanation leads me on to the first step towards understanding them i suppose. Thankyou verymuch.

 12. 13 Wanderer 5:16 సా. వద్ద డిసెంబర్ 4, 2008

  A terrorist operation like what happened in Bombay requires quite a bit of planning and coordination. If we had good intelligence, we could have intercepted it and prevented it.

  This is not the first time India has seen terrorists striking. Bombay, Hyderabad and Delhi have been constant targets for many years now. The outfits that claim responsibility to these activities aren’t new either. They have been around for a long time planning and executing these attacks. So what’s stopping us from keeping a constant watch on them?

  Not only the border security, but dealing with terrorism has become pertinent to country’s security lately. If air reconnaissance and intelligence is important for military, it is equally important for fighting terrorism too. Today’s war tactics have changed. It’s infilteration and terrorism within the country that we have to watch out for than the military operations outside the borders. We have to change our defense tactics too accordingly. That’s what I meant.

 13. 14 Wanderer 5:20 సా. వద్ద డిసెంబర్ 4, 2008

  @Gangabhavani garu – If I’m still vague, you have to find other sources of information. I’m not very good at articulating.

 14. 15 అబ్రకదబ్ర 10:55 సా. వద్ద డిసెంబర్ 4, 2008

  @శ్రీ,మహేష్,వేణూశ్రీకాంత్,సుజాత,వాండరర్:

  ధన్యవాదాలు.

  @కుమార్:

  చెప్పా కదండీ. మనం అల్పసంతోషులం.

  @శ్రావ్య,రవి:

  నేను వేలెత్తి చూపేది మన జవాన్లని కాదండీ. వాళ్లకిచ్చే తూతూమంత్రం శిక్షణని, అరకొర సదుపాయాలని. జవాన్ల ప్రాణత్యాగానికి జైకొట్టటం కన్నా, వాళ్లలా బలిదానాలు చేయాల్సొచ్చిన పరిస్థితిని ప్రశ్నించటం నా ఉద్దేశం. మంత్రులకి హుటాహుటిన విమానాలు, హెలికాప్టర్లు ఏర్పాటు చేసే ప్రభుత్వం వీళ్లని బస్సుల్లో తరలించటం ఏమిటి? తీవ్రవాదులు కలష్నికోవ్ తుపాకులు ఎక్కుపెడుతుంటే పోలీసులు జమానా కాలం నాటి ఎస్ఎల్ఆర్ రైఫిళ్లే ఇంకా వాడటమేంటి? నిన్నటికి నిన్న హైదరాబాదులో ఏం జరిగిందో చూశారు కదా. ఎవడో తీవ్రవాదిని పట్టుకోటానికి పోలీసులు ఉత్తి చేతుల్తో పోతే వాళ్లు కాల్పులు జరిపి పారిపోయారట!! ఇంకేమనమంటారు? ప్రాణాలకి తెగించారని పోలీసుల్ని మెచ్చుకోమంటారా? వాళ్ల మూర్ఖత్వానికి బాధపడమంటారా? వాళ్లకి సరైన తుపాకులూ సమకూర్చలేని ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెట్టమంటారా? నావి ఇవన్నీ కలగలిసిన భావాలు.

  @శివ:

  సైన్యం సరిహద్దుల్లోనే ఉండటం మంచిదనుకుంటాను. డైరెక్ట్ కాంబాట్‌కి మాత్రమే శిక్షణ పొందిన వాళ్లు ఇలా జనాలమధ్య తీవ్రవాదులని ఏరేయటానికి పనికి రాకపోవచ్చు. పంజాబులోనూ, కాశ్మీర్లోనూ తీవ్రవాదుల ఏరివేతలో సైన్యం తెచ్చుకున్న చెడ్డపేరు దృష్టిలో పెట్టుకుని ఆయన అలా అని ఉంటాడు.

  @గంగాభవాని:

  మరీ వివరంగా కాకపోయినా నా ప్రశ్నల్లో సమాధానాలూ దాగున్నాయండీ. వాటిలో రెండింటిని వాండరర్ మీకు ఎత్తి చూపించారు కూడా.

  @బాబా:

  మంచి లింక్ ఇచ్చారు. ధన్యవాదాలు.

 15. 16 sri 5:28 సా. వద్ద డిసెంబర్ 5, 2008

  There is a group is India, and especially in teh Hindu society, where in it lives the life of a hypocrites and insanely selfish animals. They are called SECULARISTS.

  What on earth is more secular than Vedic Hinduism. Infact, there is no other religion that DECLARES affirmatively that GOD is all pervading and is in evyry individuality of the creation and need to treat everyone as same as self.

  BJP or RSS or VHP or Bhajarangdal are merely nothing but originating out of the incapabilities or inabilities of the CONGRESS/NEHRU DYNASTY that ruled India for over 50 years. Whenever CONGRESS sits senselessly silent whenever Hindus are abused, it gives rise to teh anger in Hindus and hence Hindus want a vehicle where their valid concerns of CONGRESS not taking actions are heard and taken care of. That is how BJP,RSS etc came up.

  Remember one thing. Islamic insane animals are the ones who came to the Vast Indian continent, and abused the local people and committed grave human rights violations. It was the Islamic thugs that split vast Indian continent in to PAKISTAN, BANGLADESH & INDIA. It was these thughs who while ruling, forced people by using violence to convert to Islam. If we take a combined India, almost 40% was Islamic population. But after partition, since most muslims went to PAK & BANGLADES, they became so called Minorities with 15%.

  Look at how many temples in the past were tortured, destroyed and deliberately, there were Mosques that were setup next door to a prominent temple to intimidate the Hindu populations when the Islamic rulers ruled India. History tells that major iconic temples of india were being abused by Islamic animals.

  Even now, they are not stopping these insane acts. They are killing people senselessly, they are pumping huge amounts of FAKE INDIAN RUPEES to destabilize the Economy, attacking Financial centers, harboring terrorists and seperatists for the sake of supporting Islamic maniacs.

  Why on earth Hindus cannot have anger against the Islamic people who are involved in these activities?

  Look at how the Islamic world is going against the USA & hating USA for doing just one war in Iraq. But, why cannot Hindus have hate against the islamic people who are causing troubles to others who are non-islamic.

  I guess, the so called SECULARISTS MAY SAY PAST IS PAST. But the thing is that, the same Islamic world doesnot give up the fight in KASHMIR saying that PAST IS PAST. Same islamic world doesnot give up Palestine saying PAST IS PAST. Infact, it is the financially sound Islamic world that is funding the terrorists in Kashmir, PAK, Palestine etc places.

  I guess, the days for violent form of Islam are numbered, since after World War 2, even the Japan came to its senses and started thinking like a good fellow. Similarly, there is a VERY HUGE, really HUGE incident is coming that will make the Islamic world to lick its wounds at that time and do some serious introspection and realize its past violations of Human rights, whihc there by leading it to renounce Violence all together and be in peace terms with outers, and have correct interpretation of hte words like Kafir, Jihad etc.

 16. 17 అబ్రకదబ్ర 10:55 సా. వద్ద డిసెంబర్ 5, 2008

  @శ్రీ:

  మీ బాధ అర్ధమయింది. కానీ మీరు పాలస్తీనా, ఇరాక్, కాశ్మీర్ అన్నిటినీ ఒకటే గాట కట్టేస్తున్నారు. ఈ మధ్య మతం రంగు పులుముకున్నా, పాలస్తీనా అరబ్బు-ఇజ్రాయెలీల గొడవ. ఒకసారి యాభయ్యేళ్లుగా గాజాలో శరణార్ధి శిబిరాల్లోనే పుట్టి పెరిగి మరణిస్తున్న లక్షలాది పాలస్తీనియన్ల గురించి సానుభూతితో ఆలోచించండి.

  సెక్యులరిజం అనేది చెడ్డది కాదు. సెక్యులరిస్టులుగా పోజులిచ్చేవాళ్లందరూ నిజమైన సెక్యులరిస్టులు కాకపోవచ్చు. అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఉద్ధారకులుగా తమని తాము అనుకునేవాళ్లు కూడా కుహనా మతవాదులే. మతం పేరుతో రాజకీయాలు నడిపేవాళ్లని – బిజెపి, కాంగ్రెస్, అకాలీదళ్, ఎమ్ఐఎమ్ .. పార్టీ ఏదైనా – మనం దూరం పెట్టాల్సిందే.

  మొన్నటి బొంబాయి గొడవలు ముస్లిం తీవ్రవాద మూకల పనే అన్నది నిస్సందేహం. కానీ ఆ దాడుల్లో బలయిన వాళ్లందరూ హిందువులేనని మీరు చెప్పగలరా? దానికి ముస్లిములందర్నీ నిందిస్తూ కూర్చోవటం కన్నా భద్రతా వ్యవస్థని పటిష్టపరచుకోవటం ఇప్పుడు చేయాల్సింది.

 17. 18 కె.మహేష్ కుమార్ 11:41 సా. వద్ద డిసెంబర్ 5, 2008

  @శ్రీ: మీరు చెప్పిన కొన్ని కారణాలు Geo-political సమస్యలు.అందులో మతంకన్నా మతలబులెక్కువున్నాయి. మరికొన్ని చారిత్రక సంగతులు. వాటిగురించి తెలుసుకోవడంతప్ప ఇప్పుడు మార్పులు చెయ్యలేము. కానీ ఆ కారణాలనుచూపుతూ విద్వేషాన్ని సృష్టించడంకన్నా, వాటిల్లోంచీ పాఠాలు నేర్చుకుని కనీసం మనుషుల్లాగా బ్రతుకుదామంటేకూడా కుహానా లౌకికవాదులని ముద్రవేసేస్తారు.

  సమస్య లౌకికవాదులదా? లౌకికవాదం పేరుచెప్పి పబ్బంగడుపుకునే కొన్ని రాజకీయపార్టీలదా? లౌకికవాదానికి ‘కుహానా’ అని పేరుపెట్టి తమ మతతత్వరాజకీయాల్ని నడుపుకునే మరో పార్టీదా? సమస్య మనుషులదైనప్పుడు అందరు మనుషులూ సహజంగా లౌకికవాదులే, మతంకన్నా మనుషులు ముఖ్యమనుకునేవాళ్ళే. కాబట్టి ఆకోణంలో మనం ప్రయత్నాలు చెయ్యడం మంచిది.

 18. 19 Dr.Ismail Penukonda 1:13 సా. వద్ద డిసెంబర్ 6, 2008

  అబ్రకదబ్ర, తెలుగోడు రెండూ మీరేనా? ఇంత కాలం తెలియలేదు. I agree with what you said. As always, the burden of proof lies with Indian Muslims,they must raise and condemn the attacks and wear their love for this country on their sleeves so all can see(and they are doing that). I am not trying to be sarcastic here, I mean these sentences.

 19. 20 అబ్రకదబ్ర 2:20 సా. వద్ద డిసెంబర్ 6, 2008

  @డా.ఇస్మాయిల్:

  ‘అబ్రకదబ్ర’ నా కలం/కీ-బోర్డు పేరు, తెలు-గోడు నా బ్లాగు పేరు (గమనించండి: నా బ్లాగు ‘తెలు-గోడు’. ఈ మధ్య ‘తెలుగోడు’ పేరుతో మరో బ్లాగు కూడా వెలిసింది)

  మీ వ్యాఖ్యలో వ్యంగ్యం ఏమీలేదు. చాలా స్పష్టంగా చెప్పారు.

 20. 21 sri 6:30 సా. వద్ద డిసెంబర్ 10, 2008

  Dear Abrakadabra,

  Why cannot we lump together Kashmir, Palestine,Iraq,Chechnya together, when Islamic terorrists and the Islamic nations are supporting these terrorists where ever they need support all over the world irrespect ive of the root causes. All they are looking for is if one of the Involved party is a muslim or not. Those days of the root cause analyses are gone long back.

 21. 22 కె.మహేష్ కుమార్ 12:10 ఉద. వద్ద డిసెంబర్ 11, 2008

  @శ్రీ:”Islamic nations are supporting these terrorists”: ఇస్లామిక్ దేశాలు/ ప్రభుత్వాలు ఈ తీవ్రవాదానికి మద్దత్తు నివ్వడం లేదు.ఆఫ్ఘనిస్తాన్లో ని తాలిబాన్ కూడా ఒక aberration తప్ప ప్రజాస్వామ్య ప్రభుత్వమో లేక రాచరికమో కాదుకదా!

 22. 23 sri 5:42 సా. వద్ద డిసెంబర్ 11, 2008

  Dear Mahesh Kumar,

  First example of a nation that supports Islamic terrorists: PAKISTAN

  Second example of a nation that supports Islamic terrorists: SAUDI ARABIA, with its huge money, its supporting whereever the need is, but silently. Look how much Saudi is giving for the Islamic terror organizations like Hezbollah, Hamas, and those in PAKISTAN as well.

  Third Example of a nation that supports Islamic terrorists:Iran supporting the Anti-American forces in Iraq and in Afghanistan and in Palestine.

  You can get tons of info on these state sponsors of Islamic terrorism and scores of other groups in many other Islamic majority nations like Indonesia, Phillipines, Malaysia, Somalia, Sudan and other African nations etc.

  Looks like oyu need some help in the current affairs of the world.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: