ఏడాదిన్నర క్రితం నేను తీసిన మొదటి హై-డెఫినిషన్ వీడియో; హెచ్డి వీడియో ఎడిటింగ్‌లో నా మొదటి ప్రయత్నం. శాన్ ఫ్రాన్సిస్కో మహానగరంలో ఓ వేసవి సాయంత్రం ఎలా ఉంటుందో చూడండి. మీ కంప్యూటర్ స్పీకర్లు ఆన్ చేయటం మరవొద్దు. (లో-బ్యాండ్‌విడ్త్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవారికి వీడియో చూడటంలో ఇబ్బందులు ఎదురవచ్చు)
1GB పైనున్న అసలు వీడియోని 90% కుదించేసి ఇంతకన్నా గొప్ప క్వాలిటీతో చూపగల వీడియో షేరింగ్ సైట్ మరోటి కనపడలేదు. యూ-ట్యూబ్, గూగుల్ వీడియో వంటివి దండగ. పూర్తి హై-డెఫినిషన్ క్వాలిటీ అయితే లేదు కానీ ఉన్నంతలో ఇది మెరుగు. మీకెవరికన్నా మరో మంచి సైట్ పేరు తెలిస్తే చెప్పగలరు.
పాత కలాపోసనలు: మొదటిది, రెండోది.
శాన్ ఫ్రాన్సిస్కో చూడర బాబు
అబ్రకదబ్ర గారు,
మీలో ఒక మంచి ఎడిటర్ కూడా వున్నారు. చాలా అద్భుతంగా వుంది.
well done!
సకల కళా కోవిదులు శ్రీ అబ్రకదబ్ర గారు. అక్కడక్కడ మచ్చుకి భారతీయుల్ని కూడా చూపించారు. మీ స్నేహితలయ్యుంటారు. బావుంది.
http://joox.net/ ప్రయత్నించండి
మీ co-cameraman చందూ ఎవరు? ఎడిటింగ్ పదునుగా, చక్కటి థీం సాంగ్ తో Pier 39 funky styles తో వీడియో బాగుంది.
@బాబు,కొత్తపాళీ:
ధన్యవాదాలు.
@శ్రీ:
రొంబ నండ్రి 🙂
అక్కడక్కడి భారతీయులు అందరూ స్నేహితులు కారు.
@రాజేంద్ర:
joox.net చూశాను. కానీ అది వీడియో షేరింగ్ సైట్ లా లేదు కదా.
@సిబిరావు:
సహాయకుడు స్నేహితుడు. నాలుగైదు షాట్లు అతను తీసినవి. ఆ రోజు SFO సిటీ హాల్ ఎదురుగా ఏదో జాతర జరుగుతుంది. క్యాలిఫోర్నియాలో గంజాయి సేవనం లీగలైజ్ చెయ్యాలంటూ వాళ్ల గొడవ. అక్కడక్కడా కనపడే funky, freaky జనాలు వాళ్లే. తతిమ్మావాళ్లు మాత్రం Pier 39 సందర్శకులు, వ్యాపారులు మరియు street performers.
good sir.try Divx,veoh player.
Sir,
meeru SAKALA KALA VALLABUDANDI BABU
Great