అందరి దేవుడు

పర్ణశాల మహేష్ రాసిన సాపేక్ష సిద్ధాంతం – మానవ సంబంధాలు మరియు నాకు దేవుడు కావాలి అనే టపాలకి అన్వయించుకోదగ్గ సంఘటనొకటి నిన్న యధాలాపంగా యాహూ న్యూస్ చదువుతుంటే తారసపడింది.

అమెరికా – ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం. బయటివారికి ఇదో భూతల స్వర్గం, కుబేరుల నిలయం. ఇదంతా నాణానికి ఓవైపు. మరోవైపు – ఇక్కడా నీడ లేని అభాగ్యులెందరో. రాత్రివేళల్లో బస్ షెల్టర్లలోనూ, రైల్వే స్టేషన్లలోనూ, పబ్లిక్ పార్కుల్లోనూ చలికి వణుకుతూ ఆకలి తోడుగా ముడుచుకు పడుకునే నిర్భాగ్యులెందరో. చిత్తు కాగితాలు ఏరుకుని అమ్ముకునేవారు, సేవా సంస్థల దయతో ఏ పూటకా పూట ఆకలి తీర్చుకునేవారు కోకొల్లలు. వీళ్లకి ఇక్కడి సమాజం పెట్టిన పేరు – హోమ్‌లెస్ పీపుల్.

బ్రెండెన్ ఫోస్టర్ – వాషింగ్టన్ రాష్ట్రంలో లుకేమియాతో బాధపడుతూ ఆఖరి ఘడియల్లో ఉన్న ఓ పదకొండేళ్ల పిల్లవాడు. మరో రెండు వారాల్లో చనిపోతాడనగా అతని చివరి కోరిక – కొందరు హోమ్‌లెస్ పీపుల్‌కి భోజనం పెట్టడం. ఆ సంగతి ఆ పిల్లాడి బంధువుల ద్వారా మీడియాకి, అక్కడి నుండి అమెరికా మొత్తం పాకి ఎక్కడెక్కడినుండో వేలాదిమంది ఆ సత్కార్యం కోసం డబ్బు, భోజన పదార్ధాలు పంపటం మొదలు పెట్టారు. అలా పోగైన నిధులు, సరుకులతో బ్రెండెన్ స్వస్థలంలో వందలాదిమంది పేదవారికి ఒక పూట భోజనం ఏర్పాటు చెయ్యబడింది. ఇది జరిగిన రెండు రోజుల్లోనే బ్రెండెన్ కన్నుమూశాడు. బ్రెండెన్ కధ అతనిలాగే లుకేమియాతో బాధపడుతున్న డానియెల్ ఛైరెజ్ అనే పన్నెండేళ్ల క్యాలిఫోర్నియా పిల్లవాడికి ప్రేరణగా నిలిచింది. తను కూడా హోమ్‌లెస్ పీపుల్ కోసం ఏదైనా చేయాలని డానియెల్ నిర్ణయించుకోవటం విశేషం.

వీడియో గేములో, మరే ఇతర వస్తువులో కోరుకునే వయసులోని మనసులకి చివరి రోజుల్లో ఇటువంటి ఉదాత్తమైన కోరిక కలగటం, వాళ్ల ద్వారా వందలాది ఆకలిగొన్న కడుపులకి ఓ పూటైనా భోజనం దొరకటం దేవుడున్నాడనే దానికి సాక్షమా? ఆ మానవత్వం పదకొండేళ్ల ప్రాయంలోనే కొండెక్కనుండటం దేవుడు లేడనే దానికి సంకేతమా? అష్టైశ్వర్యాలతో తులతూగే ప్రజలోవంక, అత్యంత పేదలోవంక; అంతుపట్టని రోగ పీడితులోవంక, ఆరోగ్యవంతులోవంక .. కొందరికున్న దేవుడు అందరికీ ఉండడా? నిన్న బొంబాయిలో బలైన వారికి దేవుడు లేడా? బ్రతికిపోయిన వారికే ఉన్నాడా?

మంచి చెయ్యటానికి, చెయ్యమని నలుగురితో చెప్పటానికి దేవుడే అవసరం లేదు. ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల విచక్షణ, జ్ఞానం ఉంటే చాలు. ఆ జ్ఞానాన్నే దేవుడు అనుకుందాం. ఆ దేవుడు అందరికీ కావాలి – ఆ దేవుడే అందరికీ కావాలి.

ఏటేటా క్రిస్మస్ రోజుల్లో కొంత డబ్బు పేదల కోసం ఖర్చు చేయటం నాకలవాటు. ఈ ఏడాది దాన్ని రెట్టింపు చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఇది బ్రెండెన్ ఫోస్టర్‌కి నా నివాళి. ఈ టపా చదివిన వారికి ఇదో చిన్ని ప్రేరణగా నిలుస్తుందని నా ఆశ.

యూట్యూబ్‌లో బ్రెండెన్ ఫోస్టర్ గురించిన కధనం కోసం ఇక్కడ నొక్కండి.

10 స్పందనలు to “అందరి దేవుడు”


 1. 1 కె.మహేష్ కుమార్ 8:03 సా. వద్ద నవంబర్ 26, 2008

  దేవుడంటే జీవితానికి ఒక అత్యున్నత ఆశయాన్ని కల్పించుకోవడం.విశ్వజనీయమైన ప్రేమ, సర్వమానవసౌభాతృత్వం, కనీస మానవత్వం,కూసింత నిస్వార్థభావనే ఆ ప్రయోజనం అనిపిస్తుంది. అలాంటి దేవుడు కావాలి. అలాంటి దేవుడు అందరిలోనూ వుండాలి. అలాంటి దేవుడు అందరికీ కావాలి.

  మీ భావన,మీరు చేపట్టిన చర్య అభినందనీయం. తమతమ జీవితాల్లో దేవుడ్ని నింపుకుంటున్న అందరికీ నా అభినందనలు.

 2. 2 chaitanya 9:23 సా. వద్ద నవంబర్ 26, 2008

  అబ్రకదబ్ర గారు,

  హృదయానికి హత్తుకునేలా రాసారు ! మీరు చేస్తున్న మంచి పని కి అభినందనలు !
  ఒక సారి, లంచ్ టైం కి తినలేక, ఏదో పన్లో పది టెన్షన్ టెన్షన్ గా ఉంది రోజు … ఏదో డెడ్-లైన్ ! తినకపోతే బుర్ర పంజేసేట్టు లేదు అని చెప్పి ఆఫీసు కి 5 mins దూరం లో భోజనశాల ( subway) కి వెళ్తుంటే, ఒక ముదుసలి … సరిగ్గా నిలబడ లేకపోతున్నాడు కనీసం ! ఒక బోర్డు పట్టుకుని నుంచున్నాడు … హోమేలేస్స్ సహాయం చేయండి అని ! చచ్చే చలి … అక్కడక్కడా చిరిగిన బట్టలు !

  నా చేతిలో రుసుము 20 మాత్రమే ఉంది … ఎందుకో తనని నమ్మ బుద్ధి కాలేదు … ఈ హోమేలేస్స్ పీపుల్ చాల మంది డ్రగ్స్ అనో, మందు అనో ఖర్చు పెట్టేస్తారు అని ! తనకి భోజనం కొని పెట్టి … చేతిలో మిగిలిన 8 ఇచ్చి … మరుసటి రోజు తన కోసమే వెళ్లాను … కనీసం 70 ఏళ్ళు ఉంటాయ్ పాపం ! నా పాత స్వెట్టరు, జీన్స్, చేతిలో హోమేలేస్స్ పీపుల్ ని చేర్చుకునే దగ్గరలో ఉన్న చర్చిల గురించిన సమాచారం తో ! తను కనపడలేదు మళ్ళీ అక్కడ ! చాల రోజులు చూసి … నిట్టూర్చి ఊరుకున్నా !

  అన్నట్టు cry.org కి అప్పట్లో డొనేట్ చేద్దాం అనుకున్నా , మా స్నేహితులు చేసి … వీళ్ళు ఏదో బోగస్ గాళ్ళలా ఉన్నారు … ఎవరో పిల్లలు నుంచి లెటర్స్ పంపిస్తారుటా, గొప్ప ఇంగ్లీష్ పదాల్లో, ఆ పిల్లలు పల్లెటూళ్ళో 6-7 వయసున్న వాళ్ళు ! మీరు ఏ సంస్థ ద్వారా సహాయం చేస్తారు ?

  నాకు http://www.freerice.com/ అనే సైట్ బాగా నచ్చింది … దీన్లో ఇలా వొకాబులరీ గేమ్స్ ఆడే బదులు … డైరెక్ట్ గానే సహాయం చేయోచ్చు డొనేట్ చేసి ! ఇదొక్కటే నాకు genuine గా అనిపించిన సంస్థ !

 3. 3 సుజాత 11:53 సా. వద్ద నవంబర్ 26, 2008

  అభినందనలు మీకు! నేనూ అక్కడ ఉన్నప్పుడు స్నేహితుల ద్వారా ఒక చర్చి లో హోం లెస్ పీపుల్ కి సహాయం చేసే దాన్ని! ఒక హోం లో పని చేసేదాన్ని. ఇలా మన వితరణలు చెప్పుకుంటే “అబ్బో గొప్ప ” అనుకుంటారనే ఫీలింగ్ ఇదివరలో ఉండేది. కానీ ఎంతో మంది ఇలాంటి పనులు చేయడానికి(బ్లాగర్లతో సహా) సిద్ధంగా ఉన్నారని రెండు రోజులుగా నాకొచ్చిన మెయిల్స్ ద్వారా రుజువై చాలా సంతోషం కలిగింది.

  బెంగుళూరు ఇస్కాన్ టెంపుల్ వారు చేపట్టిన ‘అక్షయపాత్ర” లో కూడా ఒక ఏడాది పాటు కొంతమంది పిల్లల భోజనాలకు సరిపడా కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. cry వాళ్ళకు కూడా ప్రతి యేటా ఒక విద్యార్థి చదువుకి డబ్బు ఇస్తాను.

  ఇలాంటి సహాయం చేసినపుడు ఎదుటి వారి మొహంలో కలిగిన భావానికి ప్రతిగా మనసులో కలిగే ఒక అనిర్వచనీయమైన భావానికి నేను “దైవ దర్శనం” అని పేరు పెట్టుకుంటే ఎవరికైనా అభ్యంతరమా?

 4. 4 sravya 3:05 ఉద. వద్ద నవంబర్ 27, 2008

  My sincere applause to you Abakadabra gaaru for the good post, and good thought to do something for poor !

 5. 5 kalyana rama rao 2:19 సా. వద్ద నవంబర్ 29, 2008

  రోడ్డు మీద అడుక్కునే వాళ్ళను చూసి వీళ్ళకు ఇదో పెద్ద వ్యాపారం అయిపొయింది అనుకుంటూ వెళ్ళే వారు ఎక్కువైన ఈ రోజుల్లో మీరు రాసిన ఈ వ్యాసం చాల నచ్చింది. నేను కూడ ఇలా అడపదడపా అనుకుంటాను కాని నాకు చేతనైనప్పుడల్లా నేనూ ఏదో ఒక ఆర్ఫనేజ్ కు వెళ్ళి అక్కడి పిల్లలకు భోజనం స్వయంగా పెట్టి వస్తుంటాను . మీరు ఇలాంటివి రాస్తూ ఉండండి. ఇంకా కొంతమంది మారే అవకాశం ఉంది మరి. మీకు నా ప్రత్యేక అభినందనలు .

 6. 6 KRISHNA RAO JALLIPALLI 3:53 ఉద. వద్ద నవంబర్ 30, 2008

  పని, పాటా లేకుండా అదే వృత్తిగా అడుక్కొనే(అన్ని అవయవాలు బాగుండి కూడా) వారికి ఎటువంటి పరిస్థితుల్లోను సహాయం, దానం చేయవొద్దు. దానం చేయకపోయినా ఫర్వాలేదు కాని అపాత్ర దానం మాత్రం చేయకూడదు. ఇక్కడ గుంటూరులో బోగస్ కుష్టు వాళ్లు ఎక్కువ. 25 years back, వీరందరినీ తెనాలి దగ్గిర కల ఒక క్రిస్టియన్ హోం కి తరలించి అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కలిపించారు. విచిత్రమేమిటంటే.. వీరందరూ పట్టుమని పది రోజులు అక్కడ ఉండ కుండా గోడలు దూకి పారిపోయి గుంటూరు తిరిగొచ్చారు. ఎందుకంటే.. వీరందరికీ మందు, గంజాయి, సినిమాలు, బీడిలు లేకుండా పూట గడవదు. మరి ఆ హోం లో ఇవన్ని దొరకవు కదా. పై పెచ్చు అక్కడ కొద్దో గొప్పో ఏదో ఒక పని చేయాలి. మరి వీళ్ళకి పని చేయడమనేది వారి ఇంటా వంటా లేదు కదా. అందుకనే సహాయం గాని, దానం గాని చేసే ముందు కొంచం ఆలోచించాలి.

 7. 7 శ్రీ 12:16 సా. వద్ద నవంబర్ 30, 2008

  జీవితాంతం ఉపయోగపడె విద్యా దానాం చెయ్యండి / దానికి విరాళాలివ్వండి. Ekal Vidyalaya సంస్థ ఈ విషయంలో నాకు బాగా నచ్చింది.

 8. 8 చైతన్య 9:50 సా. వద్ద నవంబర్ 30, 2008

  శ్రీ గారు, చదువు ‘కొనలేని’ పిల్లలకి రోజుకి రెండు పూట్ల కూడా తిండి ఉండటం లేదండీ ? చాల సార్లు కాలో గంజో తాగి, ముడుచుకుని పడుకుంటారు ఆకలి తో ! వాళ్ళకి చదూకోమని డబ్బులిస్తే, ఆకలితో ఎలా చదూకుంటారు పాపం ? మన ప్రభుత్వం అందుకే మధ్యాన్న భోజన పథకం అంటూ ప్రారంభించింది కానీ, దాని చిత్త శుద్ధి ఎంతో మనకు తెలుసు !
  కనీస అవసరాలు తీరాకే, ఎవరైనా ఏ పని మీదైనా ద్రుష్టి పెట్టగలరు ! కానీ జీవితాంతం మనం అందరికీ కనీస అవసరాలు కల్పిస్తూ కూర్చోలేము గనక, వాళ్ళకి ఆసక్తి ఉన్న చదువో, వ్రుత్తి విద్యలకో డబ్బులిచ్చే ముందు, వాళ్ళకి కనీసం తిండి ఉందా అనేది ఆలోచించి అది కల్పించాలి … ప్రస్తుతం అయితే నాకు freerice.com బాగున్నట్టు తోస్తోంది … ఆకలి చావులు కొన్ని నివారించగలం … చదువు కూడా అందిస్తూనే ! ఇది UNO వాళ్ళ పని కాబట్టి, చిత్త శుద్ధి ఉంటుందనే అనిపిస్తుంది ! మన దేశం లో పిల్లలకి కల్పించవచ్చు కావాలంటే, మీరూ ఒక లుక్కేయండి !

  అబ్రకదబ్ర గారు, మీ టపాలే కాకుండా, మీ వ్యాఖ్యలు కొన్ని కూడా భలే చమత్కారం గా ఉంటాయండీ !

 9. 9 sri 10:28 సా. వద్ద డిసెంబర్ 1, 2008

  Its not appropriate to blame the ALL PERVADING GOD OR UNIVERSAL SELF for the good or bad deeds and their results of an individual.

  As long as the Individuality is retained, every individual(ity) in this creation has to go by the Universal laws that show no partiality whatsoever. When these universal laws are crossed, they incur penalty for crossing the laws nad incur reward for the good deeds. Law of Karma applies to every one irrespective of race, religion, nationality etc material and mind level differences. No exceptions. The SUM TOTAL of all the good and bad deeds that the person have comitted so far is what decides the persons environment. This sumtotal spans across lives as well. This law is affirmed by the saints of all religions. For example, when Lord Jesus Christ says that “Those who live by the Swod shall die by the Sword”, this ALL PERVADING GOD realized saint is affirming the law of karma.

  While GOD has given an irrevocable freedom to act in the world, its UP TO THE INDIVIDUAL WEATHER TO SEEK the all pervadig GOD or the worldly pleasures. The freedom to act or will is given equally to all, but its their misuse of this freedom or proper use of this freedom is what determines the persons situation.

  Just like the way, an ideal father or mother doesnot have any partiality to one particular KID, but want all the kids to follow a uniform law, GOD too, has similar attitude towards everyone in his creation, including animals, plants, humans and every one as well. The level of enlightment is nothing but how much you are able to love others same as self. When you realize that you are no different from other individualities, this is the true enlightment. While occasional donations can help in leading an individual towards this goal, one should strive more and more to realize the universalself instead of sticking to the mean minded individuality or ego or the “I” word. When I is gone, then all that is left is GOD or universal self. This I or ego is nothing but maya or satan or saitan.

 10. 10 sri 10:45 సా. వద్ద డిసెంబర్ 1, 2008

  Chaitanya garu, you are absolutely right. Swami Vivekananda said below thing:

  “What we(India) need is not the religion, but food for our poor ones” when he was approached by some opportunistic people when he was in the west.

  This affirms that an average individual who is stuck in the material bondages cannot look beyond the material bindings, unless the material level basic needs are fulfilled.

  Its always good to do whatever we do with out expectation, weather its giving for foodless ones or giving for education less ones or health less ones, but the intention should be that we are giving it to our greaterself or GOD and should not be having and expectations, be them in the form of name, fame, recognition, satisfying our egos etc.

  When we feel that someone is same as ourown self, then, we will be able to give without expectation. This attitude is very important when doing charity work, otherwise, this charity work will do harm instead of expanding our attitude towards others.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: