పాత్రలన్నింటిపై విచారణ
(అజంతపురం, వ్యూస్‌లైవ్) ముఖ్యమంత్రిగా వైనో రాజీవశేఖరరెడ్డి అందిస్తున్న జనరంజక పాలనకి గండి కొట్టాలని ప్రతిపక్ష నేత ఏరా ఇంద్రబాబు రాయుడు, ఏనాడు పత్రికాధిపతి సూమోజీరావు విపరీతంగా, విచ్చలవిడిగా ప్రయత్నిస్తున్నారని, ఎద్దు శీను హత్య కూడా ఆ కుటిల ప్రయత్నాల్లో ఒకటని రాష్ట్ర మంత్రి రఘుశూరారెడ్డి ఆరోపించారు. గండి కొట్టటానికి అవసరమైన తట్టా, బుట్టా, పలుగు, పార, పొక్లైన్లు, బుల్‌డోజర్ల వంటి సాధనాలు వారు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కొనుగోలు చేసిందీ రసీదులతో సహా తన వద్ద ఆధారాలున్నాయని ఆయన ప్రకటించారు. ఆ మధ్య జరిపిన రైతు యాత్రల సందర్భంగా ఇంద్రబాబు రైతు వేషంలో దిగిన ఫొటోల్లో గడ్డపార చేతబూని ఉండటాన్ని దీనికి సాక్ష్యంగా విలేకర్ల ఎదుట ప్రదర్శించారు. ఎద్దు శీను హత్యకు సంబంధించి ఒక్కొక్కటిగా బయటపడుతున్న విషయాలను అరబిందె ఫార్మా వారి ఆధునాతన ప్రయోగశాలల్లో విశ్లేషించగా దీని వెనుక ఉన్నవారి పేర్లు మొత్తం బయట పడ్డాయని ఆయన చెప్పారు.
ఫ్యాక్ష్యన్ పగతో రగిలిపోతున్న పగడాల వినీత; ఈ తరహా సినిమాల కధారచనలో లబ్దప్రతిష్టులైన పడుచూరి సిస్టర్స్; పాయలసీమ, రల్నాడు ఫ్యాక్షన్ కక్షల నేపధ్యంలో అనేక సినిమాలు తీసిన దర్శకులు జి.భోపాల్ మరియు యు.యు.యు.యు.యువనాయక్; అటువంటి చిత్రాల్లో విరివిగా నటించే ప్రముఖ కధానాయకుడు ‘యువవజ్ర’ మందనూరి గోలకృష్ణ, ఆయన అభిమాన ప్రేక్షకులు; వైనో ని అప్రదిష్టపాలు చేయటమే పనిగా పెట్టుకున్న పత్రికాధిపతి సూమోజీరావు; ఆయన పత్రికలో వ్యాసాలు రాసే జల్‌దీప్ డయ్యర్, కేజీ సూరాని, కార్టూనిస్టు శ్రీకర్; ఏనాడు దినపత్రిక చందాదారులు, పాఠకులు, ఏజెంట్లు; ఆ రెండో పత్రికాధిపతి వి.సుధాకృష్ణ మరియు అతని ఉద్యోగుల బృందం; అధికార కాంక్షతో అల్లాడుతున్న ఇంద్రబాబు; వచ్చే ఎన్నికల్లో బాబుతో జట్టు కట్టాలని ఆవురావురుమంటున్న మ్యూకనిస్టు పార్టీ నేత టి.వీర్రాఘవులు – వీరంతా ఎద్దు శీను హత్య వెనుక అసలు సూత్రధారులని ఆయన విశదీకరించారు. ఇన్ని లక్షలమంది కలిసి ఒకరి హత్యకి కుట్ర పన్నిన సందర్భం ప్రపంచ చరిత్రలోనే మరోటి లేదని ఆయన అన్నారు. హత్యలో వీరందరి పాత్రలపైనా విచారణ జరగాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. విచారణ నిమిత్తం వీరందరి పాత్రలను పోలీసులు త్వరలో స్వాధీనం చేసుకోనున్నారని తెలిపారు.
ఈ ఏడాది దసరా నాడు ఇంద్రబాబు, సూమోజీల సమావేశంలో జరిగిన ప్రధాన చర్చ ఎద్దు శీను హత్య గురించే అన్న సమాచారం తమవద్ద ఎప్పటినుండో ఉందని మంత్రి చెప్పారు. ఇదే కాదు, గతంలో ఇంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్ డోర్స్, బిల్ క్వింటన్ వంటి ప్రపంచ ప్రముఖులతో సమావేశాల్లో చర్చించినదీ ఇదే విషయమనేదానికి తనవద్ద రుజువులున్నాయని ఆయన వెల్లడించారు. ముందే తెలిసినా ఎందుకు మిన్నకున్నారన్న ప్రశ్నకి ఆయన సమాధానం దాటవేశారు. అప్పట్లో విశ్వ బ్యాంకు కూడా ఈ కుట్రకవసరమైన మొత్తాన్ని రుణంగా మంజూరు చేసిందని, ఆ ఒప్పంద పత్రాలు తమ పార్టీ ఎంపీ తొండబల్లి తరుణ్ కుమార్ సంపాదించగలిగారని ఆయన వెల్లడించారు. టుంగూరులో ఇటీవల జరిగిన మందనూరి వారసుల యువరంకె సభలో ఇంద్రబాబు ఆమెరక దేశాధ్యక్షురాలు ఓ.భామ ని ప్రశంసించిన నేపధ్యంలో, ఈ హత్య వెనుక విదేశీ హస్తం ఉందేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కుట్రదారుల జాబితాలో ఓ.భామని కూడా చేర్చే విషయం తమ పరిశీలనలో ఉందని ఆయన అన్నారు. అవసరమైతే ఇంటర్‌పోల్‌ని కూడా రంగంలోకి దించుతామని మంత్రి ఓ ప్రశ్నకి బదులుగా చెప్పారు. సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించమంటున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై స్పందిస్తూ ‘మేం ఏ విచారణకైనా సిద్ధం. తప్పకుండా జడ్జిగారు కూర్చుని విచారణ జరిపే ఏర్పాట్లు చేస్తాం’ అని హామీ ఇచ్చారు.
కేవలం ఒక జనరంజక ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయటానికి, దుష్ట తెలుగురాష్ట్రం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావటానికీ బాబు-సూమోజీ శిబిరం ఆడుతున్న నాటకాల్ని ప్రజలు అర్ధం చేసుకోగలరని ఆయన అభిప్రాయపడ్డారు. సదా ప్రజా సంక్షేమమే తమ అభిమతం కాబట్టే తమ హయాంలో జైళ్లని సైతం జనరంజక నాటక ప్రదర్శనలకు అనుగుణంగా రూపుదిద్దామని, అయితే ఇంద్రబాబు పదవీ కాంక్షతో ఆ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మద్దెలదరువు శౌరిని కూడా హత్య చేసి దాన్ని వైనో, ఆయన కుమారుడు గజన్ లకు అంటగడతారేమోనని తనకు భయంగా ఉందని ఆయన గజగజ వణుకుతూ చెప్పారు. ఎద్దు శీను హత్య దానికి రిహార్సల్ మాత్రమేనని, అసలు షోకి తెలుగురాష్ట్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు తమకి సమాచారముందని ఆయన తెలియజేశారు. అయినప్పటికీ, ప్రత్యర్ధులని గౌరవించే సంప్రదాయం తమది కాబట్టి ఇంద్రబాబు తదుపరి షోకి ఎటువంటి ఆటంకాలు కల్పించబోమని ఆయన స్పష్టం చేశారు. తమకు అందరూ సమానులేనని, ఇంద్రబాబు అడిగితే ప్రదర్శన విజయవంతం చేయటానికి తమవంతు సహాయం చేయటానికి కూడా సిద్ధమేనని తెలియజేశారు. డ్రెస్ రిహార్సల్‌కి అవసరమైన కత్తులు, కటార్లు, డంబెల్స్ మరియు ఇతర సెట్టింగులు తామే సమకూర్చిన విషయం, జైలు అధికారులు కూడా సహకరించేలా చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
విలేకర్ల సమావేశాన్ని ముగిస్తూ, ఎద్దు శీను హత్య విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందని మంత్రి చెప్పారు. దానిపై అడిగిన మరో అనుబంధ ప్రశ్నకి బదులిస్తూ – తమ పాలనలో చట్టం పని చట్టం, దొంగల పని దొంగలు చేసుకు పోతారని, అవసరమైతే ఒకరికొకరు సహకరించుకుంటారే కానీ ఒకరి పనిలో ఒకరు తలదూర్చరని వివరించారు.
ఆఖరి పేరాలోని “చట్టంపని” అదిరింది.
emi cheppalo teliyatam ledu..
ఈ లైను దగ్గర నవ్వాగలేదు “కుమారుడు గజన్ లకు అంటగడతారేమోనని తనకు భయంగా ఉందని ఆయన గజగజ వణుకుతూ చెప్పారు”
మంచి వాతలు పెట్టారు అందరికి. నాకు కూడ ఈ మాట బాగా నచ్చింది…”తమ పాలనలో చట్టం పని చట్టం, దొంగల పని దొంగలు చేసుకు పోతారని, అవసరమైతే ఒకరికొకరు సహకరించుకుంటారే కానీ ఒకరి పనిలో ఒకరు తలదూర్చరని వివరించారు.”
chattameppudoo ilaane chesukumtoo potumdani imtanammakamemitabbaa?
“కుట్రదారుల జాబితాలో ఓ.భామని కూడా చేర్చే విషయం తమ పరిశీలనలో ఉందని”
ఇప్పుడే అందిన వార్త. కుట్ర దార్ల జాబితాలో దబ్రకఅబ్ర పేరు కూడా చేర్చటం అయినది 🙂
అరాజకీయాలు ఇంత ప-సందు గా విడ-మడిచి తెలియ-పరిచినందుకు
ధనియ-వాదాలు. ఇటువటి పరభూతవాలాలను మనం అందరం ఓ పోటు
వేసి గేలి పించాలని మనవి.
mahesh gaari maate naadi kooda !
బాల అనే పదం ఈ మధ్య పిల్లలు అనే దానికి వినలేదు … పెళ్లి కళ వచేసిందే బాల అని అమ్మాయి గురించి తప్ప !
బాలలు అంటే మగ పిల్లలు అనే అర్థం ఒస్తుందేమో అని ?
ఇందాకే బాల అంటే అమ్మాయి అనే విన్నాం అన్న statement ఇచ్చి 5 secs కాకుండానే next line lo బాలలు అంటే మగపిల్లలు అని ఎలా అయింది చెప్మా ?
కత్తి ని అర్థం చేస్కోటం కత్తి మీద సామే సుమీ !
బాలలు అంటే మగ పిల్లలు అనే అర్థం ఒస్తుందేమో అని ? బాలబాలికల దినోత్సవం అని మార్చటం అయినది ! మరికొంత sensitive గా ఉండాలని, “బాలబాలికల దినోత్సవం” చేసాను….ఆహా ! ఓహొ ! ఎంత sensitivity ! సాటి లేరు కత్తి కెవ్వరు !
చూపించాల్సిన వాటిల్లో ఉండదు కానీ, అనవసర విషయాల్లో ఎక్కడలేని sensitivity తన్నుకొస్తుంది ! commitments లేని sex తో పుట్టే అనాధలైన బాలలు, లేక single parent తో బతకాల్సి వచ్చే బాలల మీద లేని sensitivity,జాలి etc… బాలలు అంటే మగ పిల్లలే అనే అర్థం ఒస్తుందేమో ? ( అని ఈయనకి ఎవడు చెప్పాడో ? పైన లైన్ లో పాట లో అమ్మాయి అంటే బాల అనే ఉంది గా మరి ? అదేం example ? అతని …. కి చిహ్నం లా ఉంది ? ) అని చెప్పి … గొప్ప సున్నిత హృదయం తనది అని prove చేస్కున్నాడు !
జనులార , జయము జయము కత్తి విశ్లేషణ లకి, జయము జయము అతని sensitivity కి !
@శీను:
కత్తితో మీ గొడవలు పర్ణశాలలోనో, పానశాలలోనో చూసుకోండి. అసందర్భ వ్యాఖ్యానాలు ఇక్కడ చెయ్యటమెందుకు?
Btw, పానశాలలో వస్తున్న వందలాది వ్యాఖ్యలు చూసి సుత్తి నరేష్ కుమార్ గారు మురిసిపోతున్నారేమో. వాటిలో ఎనభై శాతం శీను/ఆనంద్/వీరు/సుమో/దబ్రకఅబ్ర మరియు మరిన్ని పేర్లతో మీరొక్కరే చేస్తున్న సంగతి సుత్తికి తెలీదో, తెలిసీ మిన్నకుంటున్నారో మరి.
మరో విషయం. మీరు ఇంతకు ముందు నా బ్లాగులో రామేశ్వర/సహేతుక వాది/నిర్హేతుక వాది అనే రకరకాల పేర్లతో వ్యాఖ్యలు చేసారు. వాటిలో కొన్నిటిని నేను అప్పుడే తొలగించేశాను, మరి కొన్నిటిని అనుమతించలేదు. You still didn’t get the hint. So I had to turn off commenting on ‘కత్తి, సుత్తి, కొడవలి’.
మీరు తరచూ వాడే మరో పేరు నేనిక్కడ వెల్లడించట్లేదు. మీపై నాకు వ్యక్తిగత కోపమేమీ లేదు, అంతో ఇంతో అభిమానమే ఉంది. మీరు బ్లాగులకి కొత్తై ఉండొచ్చు. దాని వల్ల వచ్చిన అత్యుత్సాహంతో ఇలా చేస్తూ ఉండి ఉండొచ్చు. ఇలా రకరకాల పేర్లతో వ్యాఖ్యానాలు చేస్తూ మీ సమయం వృధా చేసుకోవటమెందుకు?
Abrakadabra gaaru ! This is not related with your post I am asking a question relating to your last comment. Is Mr. Naresh mentioned anything about the no. of comments anywhere? If you have any problem with the commenters you can deal with them, why you are dragging Naresh to here. After his lost post and chages in his blog template it is clearly indicating the attitude of Naresh. He didn’t wrote any post post regarding his hits, comments statics.
And on more thing if it is my name you left in list, I am very sorry you are very much wrong in your analysis. I have more things to worry about them. Why I am mentioned this is you may confused that by seeing my name in these few days, (Until your post on Sutti, Katti, Kodavali I didn’t commented anywhere) to clarify your confusion only I am writing this. No need the publish this comment.
@Sravya:
>> “if it is my name you left in list”
It wasn’t you.
>> “you are very much wrong in your analysis”
I am not doing any guesswork here. I have evidence.
>> “why you are dragging Naresh to here”
I wouldn’t have, had Mr.Naresh removed those comments mocking my ID.
>> “After his lost post and chages in his blog template”
I did not know about those changes – not until now.
అబ్రకదబ్ర గారు,
బ్లాగు లోకంలో వ్యక్తులతో పని లేదు..ఒక విషయం పైన చర్చ్చించేటప్పుడు..అని మీరే చెప్పారు. వ్యక్తులతో నిమిత్తం లేనప్పుడు అతను ఏ పేరు తో కామెంట్ రాస్తే ఏంటి? అతని ఐడెంటిటి ఎందుకు మీకు? చేసిన కామెంట్ లో అసభ్యత వుంటే తప్పక తొలగించండి. అలా కాకుండ ఒక వ్యక్తి పేరు/ఐడెంటిటి కోసం Insist చేస్తుంటే మీరు కూడా ఆ వ్యక్తి చెప్పిన అభిప్రాయం మీద కాకుండా వ్యక్తి మీద దృష్టి నిలిపినట్లు అవుతుందేమో ఒకసారి ఆలొచించండి. తద్వారా ఒకే పేరుతో కామెంట్లు రాసే వాళ్ళ మీద మీరు ఒక అభిప్రాయానికి వచినట్లు అవుతుంది. ఎలా ఐతే మహేష్ విషయంలో జరిగిందో, అలా..
@సత్య: తప్పుడు ఐడెంటిటీలతో mislead చేసేవాళ్ళను ప్రశ్నించడం కూడా తప్పేనంటారా!!! మధ్యలో నా ప్రస్తావన ఎందుకొచ్చిందో అస్సలు అర్థం కావడం లేదు.
మహేష్ గారు,
మిమ్మల్ని ఏమి అనలేదండి. నేను పోల్చింది ఏంటంటే “మీ వ్యాసాల మూలంగా మీరు ఫలాన టైపు అని అనుకోవటం.. తద్వారా కామెంట్లు ఆర్టికల్స్ మీద కాకుండా మీ మీద రావటం” దీన్ని కొందరు బ్లాగర్లు వ్యక్తిగతదాడి గా భావించటం జరిగింది కదా.. ఆ విషయాలని.
అలానే ఎవరిదైనా ఐడెంటిటి అడుగుతుంటే ఫోకస్ అతని కామెంట్ మీద కాకుండా, ఆ వ్యక్తిమీదకి వెళ్ళే అవకాశం వుంది అని మాత్రమే చెప్పా.
ఇంక misleading ni అరికట్టాలంటే అందరూ mail authenticity ని అడగాలి. ఐతే దీనివల్ల కామెంట్లు తగ్గుతాయేమో మరి.. కొన్ని బ్లాగ్స్ కి TRP Ratings కూడా తగ్గుతాయ్ 🙂 పైగా కొన్ని Anonymous కామెంట్లు కూడా బానే ఉంటాయి. అయినా ఎవరో అన్నట్లు కొన్ని ఐటం సాంగ్స్ ఉంటేనే మజా..
@సత్య:
మహేష్ అన్నట్లు – నా వ్యాఖ్య మారుపేర్లతో మిస్‌లీడ్ చేస్తున్నవారికి మాత్రమే పరిమితం. ఆ వ్యాఖ్య ఎవరికి చేరాలో వారికి చేరింది, and that person has taken it in a good sense.
అనానిమస్ వ్యాఖ్యాతల విషయంలో నాకు పట్టింపులేమీ లేవు. మీరు గమనించారో లేదో, నా బ్లాగుకి కామెంట్ మోడరేషన్ కూడా లేదు.
naaku navvukodaike time antaa ayipoindandi baabu ,daarunamaina setirsandi baabu—-hatesoff