కత్తి, సుత్తి, కొడవలి

బ్లాగరుగా నా వయసు ఆరు నెలలు. ఈ కాలంలో నే రాసిన టపాలు అరవై పైచిలుకు. నాకు నచ్చిన అంశంపై నా తరహాలో నేను రాసుకు పోవటమే కానీ ఇతర బ్లాగర్ల ప్రస్తావన, ఇతరుల టపాలపై ఖండనమండనలు, వివరణలు, సవరణలు, విమర్శలతో టపాయించటం నాకలవాటు లేని పని. తెలుగు బ్లాగ్లోకంలో సగటున నెలకో వివాదం రేగటం, ఒకటో రెండో వారాల తర్వాత సమసిపోవటం ఈ ఆరు నెలల్లో నేను గమనించిన విషయం. బయట ఎంత ఆవేశకావేషాలు రగులుతున్నా నా బ్లాగు వాటికి దూరంగానే ఉంది – ఇప్పటి దాకా. వ్రతం చెడగొట్టుకోవలసిన అవసరం ఇప్పుడేమొచ్చింది? నాలుగైదు రోజులుగా తెలుగు బ్లాగుల్లో రేగుతున్న కల్లోలానికి, వెల్లువెత్తుతున్న పెడధోరణులకి వ్యతిరేకంగా గొంతు విప్పాల్సిన బాధ్యత నాకుందని అనుకోబట్టి.

మతమార్పిడుల నుండీ, నైతిక విలువలు, సమాజపు కట్టుబాట్ల దాకా అనేక వివాదాస్పద అంశాలమీద జరిగిన రసవత్తర చర్చల్లో నేనూ భాగస్వామినే. చదువరి, కత్తి మహేష్ కుమార్, తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం, నాగమురళి, దుర్గేశ్వర వంటి వారెందరితోనో నాకు కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలున్నాయి. ఆ మధ్య మహేష్ కుమార్‌తోనూ, ఇటీవల చదువరి తదుతరులతోనూ నాకు జరిగిన హోరాహోరీ సంవాదాలు ఆయా బ్లాగులు క్రమం తప్పక చదివేవారికి విదితమే. వాళ్ల నమ్మకాలతో నేనెంత విభేదించినా వీరంతా నా బ్లాగులో నే రాసిన విషయాలతో పలుమార్లు ఏకీభవించినవారే, నన్ను అభినందించినవారే. అలాగే వాళ్లతో నా స్పర్ధని ఆయా అంశాలకు మాత్రమే పరిమితం చేస్తూ – నేను కూడా ఇతర విషయాల్లో వాళ్లకి ఊఁకొట్టిన సందర్భాలున్నాయి. మా విభేదాలని వ్యక్తిగత స్థాయికి దిగజారనీయకపోవటం వల్ల వచ్చిన హుందాతనం ఇది.

ఇటీవలదాకా అధిక శాతం బ్లాగర్ల సరళి ఇదే. ఒకరూ అరా అనామకులు వ్యక్తిగత దూషణలు చేస్తూ పిచ్చి వ్యాఖ్యలు రాసినా ఇతరుల మందలింపులతో మారటమో లేక మరలిపోవటమో జరిగేది. వారం రోజుల నుండీ ఈ పరిస్థితిలో తీవ్రమైన మార్పొచ్చింది. ఒక బ్లాగరు రాసిన దాంట్లో తమకు నచ్చనివేమన్నా ఉంటే టపాలోని విషయమ్మీద కాకుండా ఏకంగా ఆ బ్లాగరు మీదనే దాడి చెయ్యటమనేది కొత్తగా వచ్చిపడ్డ పోకడ. వీళ్లు సమాజ రీతులని నిరసిస్తూ సంచలన వ్యాసాలు  రాసే మహేష్ వంటి వారినే కాకుండా, ఆథ్యాత్మిక వ్యాసాలతో నలుగురికి మంచి చెప్పే దుర్గేశ్వర వంటివారినీ వదల్లేదు. మారు పేర్లతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాయటం, ఒకరిపై ఒకరు సభ్యతా సంస్కారాలు మరచి దుమ్మెత్తిపోసుకోవటం .. ఇటువంటివెన్నో. ఇది రెండు రోజుల్లోనే మరింత ముదిరి ఏకంగా ఓ ప్రముఖ బ్లాగుకి పోటీగా మరో బ్లాగు తెరిచి మొదటిదాంట్లో రాసిన ప్రతి టపాకీ ఖండనగా వెంటనే రెండోదాంట్లో మరో టపా ప్రచురించే దశకి వెళ్లింది (ఈ మధ్య పుట్టుకొచ్చిన కొత్త తెలుగు దినపత్రిక చేసే పనిలా లేదూ ఇది?)

ఎవరి భావాలు వారు బ్లాగుల్లో వ్యక్తీకరించుకోవటంలో తప్పు లేదు. ఎవరి బ్లాగుకి వారే సుమన్, భాను చందర్ అంటూ సామెతలు ఉండనే ఉన్నాయి కదా. ఒకరి బ్లాగులో విషయాన్ని మరొక బ్లాగులో ఖండించటం అన్నది కొత్త పద్ధతేమీ కాదు. అది ఎప్పటినుండో ఉన్నదే. అందులో తప్పేమీ లేదు. పైపెచ్చు ఓ విషయమ్మీద విస్తారమైన చర్చకి తెరతీసే మంచి పద్ధతది. అయితే ఇప్పటి సమస్యల్లా – ఆ చర్చ ఆయా బ్లాగర్ల గురించి జరగటం. అవతలి వారూ మనుషులే, మన రాతలు వారిని బాధించకూడదు అన్న ఇంగితం కొరవడితే ఎలా? సాధారణంగా బాధ్యతాయుత వ్యాఖ్యలు చేసే కొందరు, బ్లాగర్లలో గౌరవనీయులుగా పేరొందిన మరి కొందరు కూడా ఇటువంటి పెడధోరణులని ప్రోత్సహించే రకంగా కామెంట్లు రాయటం ఆశ్చర్యకరం! ఈ రోజు కత్తిపై పగబట్టిన సుత్తి. రేపు సుత్తిని చీరేస్తూ మరో కొడవలి రాదనేముంది? ఇది ఎక్కడకు దారి తీయనుంది?

ఎవరో అనామకులు, విషయ జ్ఞానం లేని వారు ఇలాంటి పని చేస్తే పట్టించుకోనవసరం లేదు. ఎదుటివారి వాదంలో లొసుగులున్నప్పుడు మర్యాదగా ఎత్తి చూపే పద్ధతులు అనేకముండగా ఇలా కొట్లాటలు, దొమ్మీల స్థాయికి దిగజారటమే బాధాకరమైన విషయం. ఒక వ్యక్తిపై దాడికి ప్రత్యేకించిన ఇటువంటి బ్లాగులు రేపు ఇతరుల మీదకీ మళ్లవని లేదు. ఏకాంబరం, చిన్నక్క అంటూ ఇద్దరు ప్రముఖ బ్లాగర్లపై వెటకారపు విసుర్లు, వాటికి ఇతరుల జేజేలు .. ఏ మార్పుకిది సంకేతం? ఆంధ్ర దేశంలో వార్తా పత్రికల పుణ్యాన తెలుగు బ్లాగులకి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పెరుగుతున్న తరుణంలో ఇటువంటి తీవ్రవాద పద్ధతులు కొత్తగా వచ్చేవారిని బెదరగొట్టి వెళ్లగొట్టే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. విజ్ఞులైన బ్లాగర్లంతా అభిప్రాయ భేదాలు అవతల పెట్టి ఈ పెడ ధోరణులని తీవ్రంగా అధిక్షేపించి ఆదిలోనే తుంచేయాలి.

43 స్పందనలు to “కత్తి, సుత్తి, కొడవలి”


 1. 1 oosu 6:19 సా. వద్ద నవంబర్ 10, 2008

  అబ్రకదబ్ర గార్కి,
  మీరు చెప్పింది అక్షరాలా నిజం. అవటానికి మధ్య వయస్కుణ్ణైనా, ఈ లోకానికి మాత్రం పసి గుడ్దునే. నేను ఈ లోకం లోకి అడుగు పెట్టే నాటికి ఇక్కడ అతికించబడ్డ టపాలు, వాటికి తగిలించబడ్డ కామెంట్లు చదివి ” ఒహో ,బ్లాగులంటే హాస్టల్లలో ఉండే బాత్రూం గోడలు. ఎవడికి తోచింది వాడు రాసి, పశూత్వాన్ని ప్రదర్శించే చోటు” . అని అనుకున్నాను. (ఇలా నేను మొదట్లో అనుకున్న విషయాన్ని ఈ విధంగా చెప్పటం వల్ల ఎవరైనా నొచ్చుకుంటే సారీ.)ఒక క్షణం లో టాటా చెప్దామనుకున్నాను. కానీ కేవలం కొన్ని రాతల్ని చూసి ఒక నిర్ణయానికి రావటం కరెక్ట్ కాదని ఆగి పోయాను. ఆగినందుకు కొన్ని మంచి వ్యాఖ్యానాల్ని చదివే అవకాశం ఐతే కలిగింది. మంచి విశ్లేషణకు అభినందనలు.

 2. 2 చిలమకూరు విజయమోహన్ 7:04 సా. వద్ద నవంబర్ 10, 2008

  మీరు చెప్పింది అక్షరాలా నిజం.క్రొత్తగా బ్లాగులోకంలోకి ప్రవేశించిన మాకు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అందోళన కలిగిస్తున్నాయు.మీరన్నట్లు ఎవరిబ్లాగుకు వారే సుమన్ అయినా కూడా మనం వ్రాశే విషయాలను ఎంచుకోవడంలో కొంత విజ్ఞత పాటించాలి.

 3. 3 madhu 7:12 సా. వద్ద నవంబర్ 10, 2008

  జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ మంచి టపా వ్రాసారు.

  కాని ఈ పరిణామాలు ఇంత వరకు ఎందుకు లాగబడ్డాయి?
  ఎందుకు ఎప్పుడూ హుందాగా ప్రవర్తించే కొంతమంది మంచి బ్లాగరులు కూడా దీంట్లో పాలు పంచుకున్నారు ?
  ఎటువంటి కారణాలు లేకుండానే ఇంతమంది ఒక బ్లాగుకి, ఆ బ్లాగరుకి వ్యతిరేకంగా స్పందిచారంటార ?

  పైవాటికి మీదగ్గర సమాదానాలు లేవా ?

 4. 4 కె.మహేష్ కుమార్ 7:20 సా. వద్ద నవంబర్ 10, 2008

  అభిప్రాయ బేధాలతో సులువుగా deal చెసే విధానాలు రెండు. ఒకటి వ్యక్తిధూషణ. రెండు వ్యక్తిత్వహననం.కాకపోతే,నాగరికంగా చర్చించగలిగే సత్తావుండీ ఈ సులభతరమైన (ఒకస్థాయిలో హేయమైన)పని చేస్తున్నారంటే దానికి కొన్ని మానసిక కారణాలుండొచ్చు.అందుకే వీరికి పేర్లుండవు.

  అంతర్జాలం, మనుషుల్లో తెలియని రాక్షసత్వాన్నికూడా బయటపెడుతుంది. Invisible/ anonymous గా వుండటంలో గలసత్తా అలాంటిది. వ్యక్తులుగా మనం నిజజీవితంలో ఎదురుపడితే, ఎంతతీవ్రమైన విభేధాలున్నా కనీసమర్యాదల్ని పాటిస్తాం. కానీ అంతర్జాలంలో ఆ అవకాశం లేదు. పైగా అనామకుడిగా వుంటే అదే పెద్ద శక్తి అవుతుంది.You can get away with anything.

  బహుశా, వీరిలో కొంత మంది కొత్తగా బ్లాగులోకంలోకి అడుగుపెట్టినవారుకూడా ఉండొచ్చు. బ్లాగు ఒక personal forum అని. అక్కడ వ్యక్తిగత అభిప్రాయాలూ,ఆలోచనలూ,భావాలూ ఉంటాయని తెలియకపోవచ్చు. రాసే ప్రతి అభిప్రాయానికీ ఒక thesis స్థాయిలో objectivity, proof of reference ఆశిస్తూ, బ్లాగ్ యొక్క అర్థాన్నికూడా మార్చేస్తున్నారు.

  బ్లాగులోకంలో రాసేవాళ్ళందరూ, ప్రతిఒక్కరూ తాము చెప్పింది విని ప్రపంచం మారిపోవాలని రాయటం లేదు. అది బ్లాగులవల్ల సాధ్యమయ్యే విషయంకూడా కాదు. ఈ విషయం ఈ ‘కొత్త అనామకులు’ గ్రహించాలి. సాధ్యాసాధ్యాల చర్చకన్నా అభిప్రాయాలూ,ఆలోచనల్లోని ధృక్కోణాల్ని ideas గా చూసి అర్థవంతమైన చర్చ ఇదివరకు జరిపినట్లుగా జరగకపోవడానికి వీరి తెలియనితనంకూడా కొంత కారణంగా అనిపిస్తుంది.

  ఈ మధ్యకాలంలో బ్లాగుల్లో తయారైన చిత్రమైన ప్రవృత్తి ‘కక్షగట్టడం’. వ్యక్తులుగా ఎవరికీ ఎవరూ తెలీదు. కానీ,భావవైరుధ్యాన్ని వ్యక్తిగతవైరంగా perpetuate చెయ్యడం కొంత హాస్యాస్పదంగానూ చాలా విచారంగానూ ఉంది.నాకు కొన్ని విషయాలలో భేధాభిప్రాయం ఉన్నంతమాత్రానా, మీరు రాసే ప్రతిటపా నాకు అంగీకారం కాకుండాపోతుందా!కొన్ని విషయాలలో మనిద్ధరికీ common ground లేకుండా పోతుందా!! వ్యక్తులుగా మనం కలిసినప్పుడు కత్తులు దూసుకోగలమా!!! ఈ కనీసజ్ఞానం, ఇంగితజ్ఞానం లేకపోవడాన్ని చూసి కలతచెందాలో నవ్విపోవాలో తెలియని పరిస్థితి.

  బ్లాగుల్లో ఈ పరిణామం మన సమాజంలో పెరుగుతున్న అసహనానికి, intolerance కీ ఒక కొనసాగింపుగా మాత్రమే అనిపిస్తోంది.మన మూల ప్రయత్నం to create a better society అయితే, దాని ప్రారంభం బ్లాగుల్లో జరగొచ్చు. కానీ,ఇదీ బాహ్యప్రపంచానికి ఒక extension అనుకుంటే ఈ పోకడలూ ఉండాల్సిందేనేమో!అలాంటప్పుడు నా నిర్ణయాలూ నేను తీసుకోవాలి.

  నాబ్లాగుకి నేనే సుమన్ ని కాబట్టి నా ఆలోచనలు అప్రతిహతంగా కొనసాగుతాయి. కాకపోతే, ఈ రోజునుంచీ “anonymous” అని ఉన్న వ్యాఖ్య ఎంత ఉత్తమమైనదైనా ప్రచురించను.పేరు(అది కలంపెరైనా ఫరవాలేదు) వారికొక బ్లాగు లేని వాళ్ళ వ్యాఖ్యల్ని అనుమతించను. ఒక అస్థిత్వం(పేరు), తమదంటూ ఒక ఆలోచన (బ్లాగు) లేని అనామకులకు నాబ్లాగు(ప్రపంచం)లో చోటులేదు.

 5. 5 Sravya 8:20 సా. వద్ద నవంబర్ 10, 2008

  Hi
  Abrakadabra first time I am seeing this kind post in you blog. What is the wrong with the other blog wrote against Mr. Mahesh. The response to that blog is showing how bogglers are irritated with his writings and ideologies. All the people won’t react to the situations in the same manner, they may have their own styles to show their reaction. As you mentioned one more blog may come with Kodavali name to oppose Sutti, no problem if something wrong with Sutti everybody will welcome Kodavli also. May be you have more patience to bear him but nobody can bear if he write always against the living country, culture and now he added one more thing if India was not ruled by British, no education in India. Like Mahesh has right to write some against to the everything in this country other people will also have right to show their anger against his writings may be their way is something different.

 6. 6 phani 9:06 సా. వద్ద నవంబర్ 10, 2008

  అబ్రకదబ్ర గారు, జరిగిన తంతు మీద మీరు వ్రాసిన టపా ఆరోగ్యకరమైన చర్చకి దారి తీస్తుందని ఆశిద్దాం.

  వివాదాస్పద అంశాలపై ఏదో ఒకటి రాసేసి అనవసర చర్చలకు తావివ్వడం ఎవరి తప్పు ? నలుగురు మనవైపు వేలెత్తి చూపినప్పుడు క్షణకాలం ఆగి ఆత్మవిమర్స చేసుకోవలసిన అవసరం లేదంటారా?

  అంతర్జాలంలో గానీ, బయట సమాజంలో గానీ మన మాటలు చేతలు వివాడాస్పదం అయితే దానికి మనమే కారణం అవుతాం. అందర్కీ విచక్షణా జ్ఞానం ఉండదు, దాని ఫలితం..ఇలాంటి వివాదాస్పద రాతలకు జరిగిన అనుభవం.

  ఎవరేమనుకున్నా సరే నాకు నచ్చిందే రాస్తాను, నచ్చని వారు చూడద్దు అనడం.
  నేను రోడ్డు మీద పిచ్చ్హి గంతులు వేస్తాను..నచ్చని వారు కళ్ళు మూసుకోండి అనడమే.

  చివరగా ఒక్కమాట, దుర్గేస్వర గారి బ్లాగులో ‘శివలింగాల ‘ పై రాసిన టపాలో …ఈ బ్లాగరు ఎక్కడినుంచో కాపీ చేసి తెచ్చిపెట్టిన కామెంట్ చూస్తే మీకు అర్ధమవుతుంది ఎందుకు ఇంతమంది విరక్తి చెందారో.

 7. 7 Chaitanya 9:23 సా. వద్ద నవంబర్ 10, 2008

  I agree with Sravya ! I complimented you once in his blog, and you said you dint know, if I was a girl or a guy, remember ? Lot of frustration has been built up by fellow bloggers, regarding the way Mr.Katti is propaganding against a religion, sexuality without commitments, and now even our country !
  We didnt fight for nothing for freedom for so many years ! Beaten-up, losing lives and treated like 2nd class citizens ! Refer to our independence day videos !

  Regd sexuality, what’s he preaching here? He poses he’s talking on the women’s side, but who loses it all, in the end ? If some youngsters in their 20’s read his blog and practises it? Do you think the damage can be recoverable ?

  Already, the country’s facing enough problems, and everyone knows who’s being the patient religion here, though its a minority ! He’s totally for conversions and writes so -vely about it…why should anyone take lots of anti-social, anti-moral, anti-country’s stands covering it up with sweet words ? What if someone’s really influenced by his writings…after all that’s his purpose !!!

  So, I dont agree with you on opposing the idea of a blog called Sutti ! After all, its Mr.Katti who always never gives in a discussion and says, you may stop visiting or commenting in my blog ! I’ve observed lot of times, you too gave it up sometimes due to that,thinking it’s futile ! He never agrees on anything, and his answers go round-about except the Q asked ! It’s natural people are frustrated and wanted an out-let !

  Someone had to show it, and others who couldn’t are supporting Mr.Sutti ! I dont see anything wrong so far !

  But true, Mr.Sutti’s comments on Mr.Katti in his comments section became over-dosed, which could be condemned or suggested to him ! Apart from that, Mr.Abrakadabra garu … the blog’s not really a bad idea !

  I appreciate your patience and calmness in this, and I see why you’re provoked to write this ! Mr.Kumar was wrong in pointing you out as Mr.Katti’s friend ! My sincere support to you here !

 8. 8 Aanand 9:36 సా. వద్ద నవంబర్ 10, 2008

  Abrakadabra garu … who is “decent” here? See the quality of Mr.Katti’s comments in this link (http://shankharavam.blogspot.com/2008/08/blog-post_25.html )!!! Mee ……. ki chihnam ? Is it the way someone argues or poses a discussion ? And sometimes he answers in his blog saying Neeku ? when he gets irritated ! I would say, he’s just getting what he gives !

  When someone asked him, what this — means, he says moorkhatvam anukovachu kadaa ? So it means, you could say, nee abba, nee ….. raa orey anesi … he could fill it up later ? Idenaa samskaaram ante ? If the —- was moorkhatvam, can’t he dare to fill it up then ? His frustration is understandable as the post’s against him…but again, please refer to Chaitanya’s comment on why the post had to be written !

  No wonder the frustration’s built up to this level ! Why wasn’t therer spoof for any other blog, except his ! Yes, I think the reasons are pretty much evident and valid ( I mean, for the blog !)

  Hats off to your patience in opposing various posts without ever getting personal on anyone ! Its really appreciable, and I’ve always been your secret admirer !

 9. 9 Aanand 9:47 సా. వద్ద నవంబర్ 10, 2008

  And yes, because of people who are being so patient and good like you ( which I really admire)…like how India was before the British invaded us…these kind of ‘katti’s’ go over-board thinking, there’s none to oppose them !

  But this patience is rarely understood right, Abrakadabra garu ! It’s mostly interpreted as inability sometimes by some people !
  Sometimes, someone has to oppose strongly I guess, else some people dont get it, if it’s not in their language !

  If I had 10 hands, I’d raise all of them up for Mr.Sutti’s blog !

 10. 10 KumarN 10:48 సా. వద్ద నవంబర్ 10, 2008

  Chaitanya Gaaru,
  I thank you for your observations. Going by your comments, it looks like I left an impression that Abrakadabra gaaru is a friend of Mahesh gaaru..

  I am sorry..I do not mean that in any way. I don’t believe that for a second.. Please read my explanation that I just posted few minutes in that blog..

  Hopefully I have clarified myself a little better..

  Thank you.

  By the way. as long as people don’t stoop down to ugly levels, satire is perfectly fine. We all have watched Jay Leno, David Letterman, Saturday Night Live..Common Guys.. Cheer Up…Since I haven’t yet noticed Mr Sutti Naresh Kumar being ugly, I do not have any negative feelings toward his blogs. If I were Mahesh, I would probably participate in his blog, in a funnier way. Hey..what better way to present yourself than recognizing others’ feelings and being empathetic to it. Being able to laugh at yourself occassionally is a powerful weapon..A lot of guys/girls do not know this secret esp our Indian Friends.

  If you noticed Manasulo Maata Sujata Gaari response to Mr Sutti Naresh…you would notice it…She just laughed off with ‘Ha Ha..

  If Naresh crosses the line, we are all there to protest anyway.

 11. 11 సుజాత 11:21 సా. వద్ద నవంబర్ 10, 2008

  వ్యక్తిగత దూషణ అనేది వాదనను సహేతుకంగా ఖండించలేని అసహనంలోంచి పుట్టుకొచ్చేదే! అది వారి సంస్కారం స్థాయి. వారి సంస్కారాన్ని మనం ప్రభావితం ఎలాగూ చేయలేం కాబట్టి, కామెంట్ మోడరేషన్ పెట్టుకొవడం, అంతకంటే ముఖ్యగా ఏ బ్లాగరూ కూడా అనామకుల వ్యాఖ్యలకు అనుమతించకపోవడం బ్లాగర్ల చేతిలో ఉన్న పనులు.

 12. 12 yaji 11:35 సా. వద్ద నవంబర్ 10, 2008

  Chaitanya gaaru:
  >>If some youngsters in their 20’s read his blog and practises it? Do you think the damage can be recoverable ?

  >>Already, the country’s facing enough problems, and everyone knows who’s being the patient religion here,

  If we were to question freedom of expression, we would be no different from British Raj. No 20 year old kid is gonna get wasted by reading blogs writings of Mahesh et. al. Certainly I don’t have right to question or condemn one’s viewpoints in an impolite manner as long as the views themselves presented in a civilized fashion.

  Anand gaaru: You probably are right when you said that Mahesh gaaru switches to nee/mee depending on the situation. I have read several comments of his on his own blog and various other blogs. However, he never used foul language. Many a times I noticed the change of (Mahesh’s) tone is only based on the tone of the original comment.

  On a different note, I do not agree with many of his (Mahesh gaari) viewpoints. I have my reservations against the views and I’d rather spend my time on theta geethi or thota ramudu. After all wasn’t that the idea of blogging?

  -yaji
  ఒక్క మాటు కమ్మిట్ అయితే నా బ్లాగు నేనే చదవను

 13. 13 సుత్తి నరేష్ కుమార్ 12:16 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  అబ్రకదబ్రా, మీ టపా, కామెంట్లూ చదివాను. మహేష్ బ్లాగులో ఎవరో నీచంగా అనామక వ్యాఖ్యలు రాయడం నేను చూశాను. అది చాలా తప్పు. నేను కూడా కొన్నిసార్లు మోతాదు మించి ఉండవచ్చు. కానీ ఇదంతా ఎందుకు జరిగింది?
  నా విషయానికొస్తే, నేను బలంగా చెప్పాల్సిన పాయింట్లు ఉన్నాయి. అవి అంత బలంగా చెప్పడానికి కావల్సినంత ఆవేశాన్ని మహేష్ తన రాతల ద్వారా ఇచ్చాడు.
  అనామక వ్యాఖ్యలు రాసినవాడు కూడా మహేష్కి చాలా బలమైన పాయింటు ఒకటి convey చేశాడు. బుర్రపెట్టి ఆలోచిస్తే తెలుస్తుంది. మహేష్ రాతల్లోంచి కొన్ని logical conclusions లాగి, straight గా వాటి గురించి మాట్లాడితే, అవి పచ్చి బూతుల్లాగే ఉంటాయి. ఆ విషయం ఈ దెబ్బతో మహేష్ గ్రహించి ఉండాలి. అయితే అనామకుడు disproportionate force ఉపయోగించడంతొ మొత్తం purpose దెబ్బ తినింది. అందుకే నేను వ్యంగ్యంగా రాశాను.

  మహేష్ తో (ఒక్కోసారి మీరూ, ఇంకా కొందరు మేధావుల్తో) వచ్చిన పెద్ద గొడవేంటంటే, మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళ feelings కి utter disregard చూపించడం. అందరూ మీ అంత తెలివైనవాళ్ళు కారు. ఎవరి సెంటిమెంట్లు వాళ్ళకి ఉంటాయి. వాటిని కెలికేటప్పుడు కొంచం respectful గా ఉండద్దా? అంతకీ చాలాసార్లు ఓపిక పట్టాం. మీకు మతాలు, పవిత్రతలూ, దేశభక్తీ, గర్వకారణాలూ లేకపోతే అవతలివాళ్ళకి ఉండవా? ఇష్టం వచ్చినట్టు రాసేస్తే ఎంతకాలం నోర్మూసుకుని పడి ఉండాలి? మైనారిటీల మనోభావాలు గాయపడతాయి గానీ, మెజారిటీల మనోభావాలు గాయపడవా? నా సొంత అభిప్రాయాలు, సొంత బ్లాగు అంటూనే పబ్లిగ్గా విషప్రచారం చేస్తుంటే ఎవరూరుకుంటారు?

  బ్లాగుల్లో జరిగిన చర్చలు కొన్ని చాలా హుందాగా జరిగాయి. ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి అస్సలు కుదరని రవి, నాగమురళి చాలా స్నేహంగా మాట్లాడుకుంటారు. మహేష్కి తన దేశంలోనో, మతంలోనో గర్వపడాల్సిన విషయం ఒక్కటి కూడా కనపడదు. ఏకపక్షంగ అన్నీ విమర్శిస్తూ, ప్రతిదాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటే ఫలితం ఇలానే ఉంటుంది. ఒకసారి జ్యోతిగారి బ్లాగులో పురాణాల మీద ప్రశ్న జవాబులు రాస్తే, వాటి మీద మహేష్ బూతు వ్యాఖ్యలు రాశాడు. మహేష్ తెలివైనవాడు కాబట్టి పైకి బూతులా కనిపించదు కానీ అతను రాసినదానికీ, అనామక వ్యాఖ్యలు రాసినదానికీ పెద్ద తేడ లేదు.

  చెప్పాల్సింది నా బ్లాగులో చెప్తూనే ఉంటా. అయితే మోతాదు మించనని హామీ ఇస్తున్నా. ఎంతోమందికి నా రాతలవల్ల సంతోషం కలిగిందంటే, ఇంతకాలం మహేష్ ఏకపక్షపు రాతల్ని భరిస్తూ రావడం వల్లే. అది మహేషూ, మీరూ గ్రహిస్తే మంచిది.

 14. 14 కె.మహేష్ కుమార్ 12:35 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  @కుమార్ : నాకు సుత్తిబ్లాగుతో ఏసమస్యాలేదు. నేను తనని అభినందిస్తూ వ్యాఖ్యచేసానుకూడా. కాకపోతే, కొంత misinterpretation కు సంబంధించిన విషయంకూడా చెప్పాల్సివచ్చింది. సుత్తితో సమస్యలేకపోయినా, అక్కడ నా కామెంట్ చూసి మళ్ళీ ఎద్దేవా చేస్తూ,ధూషించే అనామకులతోనే కాస్త చికాకొస్తుంది.

  సెటైర్ అనేది ఒక మహత్తరమైన సాహితీప్రక్రియ.ఆ శైలిని ఆకళించిచేసుకుని మరింతగా పానశాల అభివృద్ధి చెందాలని ఆశిస్తాను.మీలాగా సహేతుకమైన విమర్శ చేసేవాళ్ళతో అంగీకరించకపోయినా,అభినందించే సంస్కృతి నాకుంది.విభేధించినా,వినమ్రతతో ఖండించే సత్తానాకుంది. ఇప్పటివరకూ నాతో సైద్ధాంతికంగా విభేధించిన చాలా మందితో నాకు గౌరవప్రదైన సంబంధాలున్నాయి. కానీ,దాన్నొక reactionary బ్లాగుగా,తమ కుతిని,మానసికరుగ్మతని తీర్చుకునేందుకు వ్యాఖ్యానిస్తున్న అనామకులపై మాత్రం సానుభూతితప్ప మరేమీ చూపించలేను.

 15. 15 Chaitanya 1:01 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  Kumar Garu,

  I didnt “Feel” you felt Abrakadabra garu is Mahesh’s friend ! It’s you who said he almost “paired up” with Mahesh and behaving like “గుడ్ కాప్, బాడ్ కాప్ ” . Even abrakadabra garu, din’t assume things for nothing ! So it was good you cleared it off then!

  There’s a sea change in the ways Mr.katti and abrakadabra garu tackle conflicts, if you can ever see and make out ! Even in Tadepally gari’s blog, after your so called ” churaka”, he dealt it with so much grace and said…is it so? then I must change ! It was not needed that you say ” hey, you got him” blah blah … Though you tell him it’s in a “friendly note” … you were plain insensitive and went over-board ! Mr.abrakadabra already took it, and answered it ! If I was in his place, I’d surely have been hurt ! Please stop your oh-so-good cop, bad cop suggestions to people who are already fine in nature, if you’ve to make them, try making them in a way that wouldn’t hurt them !

  For eg, if I said… you’re being a snob, you feel, as it’s only you noticing who’s pairing up with who, and who’s doing things under the influence of who-so-ever? What would you feel like? Now please dont give me an explanation, and try to laugh it off saying “hahaha “. If you ever give me an explanation, c’mon guys…we Indians should all learn to laugh it off, right ?

  It was again you, who created the wrong notion that Mr.Sutti said “sujatha garu” is that chinnakka ! He might have said he sees her as his sister in her blog.Doesnt mean, he directed it towards her, as he already gave a fore-warning, its not, as intellectuals like you can interpret it that way !

  Now, it could be Jyothakka or who-so-ever it is ! First plain common-sense is that, in radio kaburlu, there’s one akka and one tammudu ! Other than that, there’s no clue as to who that akka is !Please dont create mis-conceptions by your own assumptions and brings hurts which never existed !

  And do us a favour and dont bring “Indians vs americans” or Indians vs germans in taking things light-heartedly. It’s just people like you who are ashamed of your country, and there’s no difference between someone and you !Dont see one american or german say, yeah we feel like snobs, we do that, we do this…only we can find 100000000 faults with us ! ( ie everyone in the country except you ! )

  You too are one, Abrakadabra garu is one, and even Sujatha garu is one ! Even not all americans/germas/portugese( hey I dont know where you live,ok?) dont handle ridicule too well !

  And all by means, I’m not saying you should apologize to him again, as he already said the issue is settled ! Since you directed your response to me, I had to give this response ! ( hey, I got you … hahahaha … on a lighter note 😉 )

 16. 16 Chaitanya 1:12 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  “you too are one, abrakadabra garu is one” … what I meant is, an Indian who can laugh it off ! Even not all germans/russians/chinese/americans can handle ridicule/criticism/affectionate observations well !

  Hey Kumar…this is not criticism at all..that’s just an affectionate observation with all the smile on my face.

 17. 17 రవి 3:35 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  అబ్రకదబ్ర గారు, గౌరవనీయులైన బ్లాగర్లు అలా చేస్తున్నారన్నారు. వాళ్ళెవరో తెలుపడానికి, లేదా ఆ కామెంట్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పడానికి వీలవుతుందా? (ఇది ప్రశ్నే నండీ, అభియోగం కాదు :-))

  కొంతకాలం క్రితం జ్యోతి గారు, అంతకు మునుపు జాన్ హైడ్ గారు అనామకుల బారిన పడ్డారు,ఇప్పుడు మహేశ్ వంతు…ఈ వ్యక్తిగత దూషకులను కూడలి నుండీ బహిష్కరిస్తే బావుంటుంది.

 18. 18 సుత్తి నరేష్ కుమార్ 4:05 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  అబ్రకదబ్రా, చాలా సేపటి క్రితం నేనిక్కడొక కామెంటు పెట్టాను. అది స్పాం లోకి పోయిందేమో ఒకసారి చూడండి.
  ఈ పరిణామాల్ని ‘వ్యక్తిగత దాడి’ గా మాత్రమే చూడడం పక్కదోవ పట్టించడమే. అనామకుడు బూతులు రాయడం – disproportionate force ని ఉపయోగించడం అనుకోవచ్చు. అది ముమ్మాటికీ తప్పే. కానీ మహేష్ రాసిన దాన్లోంచి లాజికల్ గా కంక్లూజన్స్ లాగితే వచ్చేది అటువంటి బూతులే.

  ఇదివరకు జ్యోతిగారు పురాణాలమీద ప్రశ్న జవాబులు రాస్తే మహేష్ వాటిమీద బూతు కామెంట్లు రాశాడు. తెలివిగా పైకి బూతు అని తెలియకుండా రాశాడు. మరొకళ్ళ సెంటిమెంట్లని గాయపరిచే విధంగా అతను ఎన్నోసార్లు రాయడం, provoke చెయ్యడం జరిగింది. అదంతా ఒక అబద్ధపు ముసుగులోంచి రాస్తాడు. ఆ ముసుగు తీసేస్తే అతని ఉద్దేశ్యాలు బూతులు మాట్లాడిన అనామకుడి ఉద్దేశ్యాల కన్నా వేరు కావు.

  ఏదేమైనా నేను మోతాదు మించకుండానే రాయదలచుకున్నాను. మహేష్ కి కానీ, మిగతా మేధావులకి గానీ చెప్పేదేమిటంటే – మీకు మతాలూ, పవిత్రతలూ, సెంటిమెంట్లూ, దేశభక్తీ లేకపోయినంతమాత్రాన మిగతావాళ్ళకి లేకుండా పోవు. అందరూ మీ అంత తెలివైన వాళ్ళూ కారు. మీరు ఇతరుల సెంటిమెంట్లని గౌరవించి రాస్తే,మిమ్మల్ని ఎవరూ తిట్టే పరిస్థితి రాదు. ఈ పరిస్థితికి మీదే బాధ్యత. ఇప్పుడు దీన్ని వ్యక్తి మీద దాడిగా అభివర్ణించడం కూడా తాము చేస్తున్న అతి తెలివి వాదాల్లోకే వస్తుంది.

 19. 19 యన్.సీతారాంరెడ్డి 4:14 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  మీ వేదన బ్లాగు అనే ఈ మాధ్యమం లాగానే కొత్తది. అజ్ఞాత కామెంట్లు వగైరా, వగైరా. సంఘటనము, విఘటనాలకి ఇది వేదిక.

  బ్లాగును కనీసం ఆలోచనాపరులైనా ప్రజాస్వామిక ప్రదేశంగా గుర్తించాలి. ఉబుసుపోలు కబుర్లు ఎలా రాసుకొన్నా ఫర్వాలేదు గానీ సామాజిక విషయాలమీద రాసేటప్పుడు అందరూ కనీస స్పృహతో వ్యవహరించాలి. పరస్పర గౌరవానికి భంగకరంగా ఉండకూడదు. లౌకికతకి భంగకరంగా ఉండకూడదు.

 20. 20 కొత్తపాళీ 6:11 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  @Ravi .. Koodali is a simple aggregator. It is not a moral or policing authority.

  To all .. why don’t you get it? Just because some blog readers (may be even all blog readers) disagree with a certain point of view DOES NOT mean that voice should be shut up. That is precisely the service the blogs are doing that is not found in mainstream media – giving voice to opinions that have no place elsewhere. He has the right to express his opinions ad you have the right to disagree with him. However, getting personal is a different matter altogether.

  And one more thing. The parody blog, parody of a parody blog .. so on ad infinitum .. all these happened before and will continue to happen. Its popularity or lack of it is not a measure of anything. Sane voices will prevail. If they can’t, they will seek shelter somewhere else. That’s all.

 21. 21 వికటకవి 6:35 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  వ్యక్తిగతంగా నాకు మహేష్ గారితో పేచీ లేదు. ఆయన బ్లాగులు చాలావరకు చదువుతాను. కానీ సమస్యల్లా ఆయన భావజాలం, సిద్ధాంతాలు, మతాలు ఏమిటో దాదాపు ప్రతి రెండవ టపాలో మరీ మరీ చెప్తున్నాక, మళ్ళీ ఆవు వ్యాసంలాగా ఏ టాపిక్ మీద రాసినా చివరకి మళ్ళీ ఆయన తన సిద్ధాంతం, నమ్మకాల దగ్గరికే తీసుకొచ్చి పలు విషయాలను వాటితో ముడిపెట్టటం అన్నది చిరాకు తెప్పిస్తుంది. బహుశా అదే ఇతరుల అనుభవమేమో. ముఖ్యంగా ఆయన తాను చెప్పే సాధికారత లేని విషయాన్ని కూడా దాదాపుగా సాధికారత కూడిన స్వరంతో చెప్పినప్పుడు, నాకు అప్పుడప్పుడూ ఓ మాట అది సరికాదని చెప్పాలనిపిస్తుంది. కాంప్లికేటెడ్ విషయాలపై ఎపుడైనా రాసేటప్పుడు నేను రాసినది చదివి ఎవరైనా నన్ను తప్పు అని వాదించగలిగే విషయాలున్నాయా అని నేను ఒకటికి రెండు సార్లు ప్రశ్నించుకుని, అవసరమైతే వాటిని తొలగించి (నేను సమర్ధించుకోలేనేమో అని అనుకున్నప్పుడు) ప్రచురిస్తాను.

  ఇకపోతే ఈ మతాల, కులాల సంబంధ విషయాలపైన రాసేటప్పుడు కొంత స్వీయ నియంత్రణ రచయితలకు అవసరమేమో బయటైనా సరే లేదా బ్లాగుల్లోనైనా సరే, అదీ కామెంట్ మోడరేషన్ లేనప్పుడు. ఇక్కడ రాస్తున్న రాతలు బయట స్వేచ్చగా ఓ సభలో మాట్లాడగలనా అని ప్రశ్నించుకుని రాస్తే మంచిది. మాట్లాడతాను ఏం భయమా అని ఇక్కడ చెప్పచ్చును, కానీ అది ప్రాక్టికల్ కాదు. ఉదా: ఏమన్నాడని చిరంజీవి మీద కోడిగుడ్లు విసిరారు? మన బయటి సమాజం అలా ఉంటుంది. ఇక్కడ రాసినది బయట చెప్పటం అంత సులువు కాదు. అలాంటప్పుడు ఎందుకు వాటి మీద అంత గట్టిగా మాట్లాడటం, వాదించటం. ఇక్కడా కోడిగుడ్లు విసిరే వారుంటారు, మనకెందుకులే అని ఊరకుండే వారూ ఉంటారు లేదా అడపాదడపా రాసిన విషయం నచ్చక ఓ వ్యాఖ్య చేసే నాలాంటి వాళ్ళూ ఉంటారు.

  ఇది కేవలం మహేశ్ గారని కాదు, ఎవరైనా కావచ్చు.

  *** సరదాకే ఇది ***

  కత్తి, సుత్తి, కొడవలి కన్నా కత్తి, సుత్తి, నిప్పు, పెద్ద సుత్తి … అంటే సరేమో.

  సుత్తి కత్తిని సానపెట్టగలదు, లేదా వంచగలదు. కొడవలి సుత్తినేం చేస్తుంది. కానీ సుత్తిని దారిలోకి తేవాలంటే ముందు దానికి వేడి పుట్టించి అప్పుడు మరో పెద్ద సుత్తితో దెబ్బలెయ్యాలి.

  *** సరదాకే ఇది ***

  ఈ గొడవతో సంబంధం లేకుండా, సుత్తి గారికి కూడా మంచి టాలెంట్ ఉంది రాతల్లో అని నా అభిప్రాయం. ఆయనకి కూడా మంచి స్ట్రెయిట్ రచయితకుండే లక్షణాలన్నీ ఉన్నాయి రాతల్లో. అలాంటివి కూడా రాస్తారేమో చూద్దాం.

 22. 22 kumar 8:04 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  Kottapaali gaaru,

  “That is precisely the service the blogs are doing that is not found in mainstream media”

  AMEN

 23. 23 kumar 8:08 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  Mahesh gaaru,

  “సెటైర్ అనేది ఒక మహత్తరమైన సాహితీప్రక్రియ.ఆ శైలిని ఆకళించిచేసుకుని మరింతగా పానశాల అభివృద్ధి చెందాలని ఆశిస్తాను”

  చాలా హృద్యంగా, వార్మ్ గా తడిమింది నన్ను.
  బ్రేవో!

 24. 24 parusuramudu 8:31 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  telugu blogs lo ilaantiovi common dani gurinchi meeru anavasanga O tapaa raasaaru

 25. 25 Chaitanya 8:41 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  Yaji garu,

  I saw a 20+ reader, commenting that Mahesh is right on the sexual preachings ! I dint comment or assume it for nothing !

  I’m a little surprised by your comment though.Freedom of expression is a broadly mis-used term.If some daanayya were to come infront of your home, and talk badly,starting from your ancestors in ofcourse as sweet langugage as Mahesh does, and then repeat it everyday…if you wouldn’t get frustrated by it, or think daanayya is wrong( not ‘coz of his views, or freedom of speech, but he’s hurting your sentiments) and have that “Freedom of expression”…then kudos to you!But, sorry, me and some others here are not so patient !

  But ofcourse, I would agree that, you’ve to make daanayya stop in his language, ie his very decent language ! And I suppose, thats what Sutti is doing !

  I will show you 1000 cases where the tone of the comment was still respectful and Mahesh went to “Neeku”.He just rubs it off saying,its the tone that provoked me, and people buy it ! Not just the tone, if someone opposes him strongly, he even goes to —-‘s and neeku, though the commentator says “meeru” referring to Mahesh and puts it very decently !

  Exactly, thats why( due to his radical? views and agreessive arguing/debating is why I stopped visiting his blog)…but I can surely say,Mr.Sutti’s blog refreshed me !

 26. 26 Chaitanya 8:48 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  And yes, Yaji garu, I never said Mahesh’s voice should be closed, but surely it could be opposed? as the person on the other end has that ” Freedom of expression”. Its just not Mahesh’s property, right? Thats all I said earlier too !

 27. 27 yaji 9:11 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  Chaitanya gaaru:
  Am sorry I touched a raw nerve there. I retreat my comments with respect to my observations (re: nee/mee) as I have been around only for so long (on blogs). Your point about “freedom of expression” is also taken. What I feel about writings is already well said by వికటకవి gaaru:”ముఖ్యంగా ఆయన తాను చెప్పే సాధికారత లేని విషయాన్ని కూడా దాదాపుగా సాధికారత కూడిన స్వరంతో చెప్పినప్పుడు, నాకు అప్పుడప్పుడూ ఓ మాట అది సరికాదని చెప్పాలనిపిస్తుంది. కాంప్లికేటెడ్ విషయాలపై ఎపుడైనా రాసేటప్పుడు నేను రాసినది చదివి ఎవరైనా నన్ను తప్పు అని వాదించగలిగే విషయాలున్నాయా అని నేను ఒకటికి రెండు సార్లు ప్రశ్నించుకుని, అవసరమైతే వాటిని తొలగించి (నేను సమర్ధించుకోలేనేమో అని అనుకున్నప్పుడు) ప్రచురిస్తాను.”

  I am not here to give somebody more importance than necessary. I’d rather ignore 🙂
  Cheers
  -Yaji

 28. 28 Chaitanya 9:36 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  Yaji Garu,

  ROFL for your last sentence ! Kudos to you !

  If you didnt, you should read these posts which have great? info !Hindu matam vs sanathana dharmam, Mahesh’s comments, then Sutti’s post on it ! Also the post ‘Laingikatha Vs.Naitikatha’ … his other stories,views on sexuality ! The next part of this comment isnt for you …

  Day by day, his posts are getting intense…like the mc cauley post and now the current post’s comments ! If you hear something 1000 times, young minds get conditioned, like how young people give in to ads, thats what he does, repeat the same stuff over and over for infinity !

  What surprises/scares me is some people agree with him on the sexuality stuff, if he covers it up as a story! Apart from that, as far as I remember, there’s atleast one 20+ reader/blogger who says ” Right Mahesh garu, somethings just “happen” ” as if humans have no control over ‘animal instincts’ at all, and values should never be “judged” ! If so, why’s he judging the “Values” of anonymous comments which are harsh ? So, only “convenient values” like sexuality should never be seen with “value judgement” and all the rest could be seen? If our value system is erased,the society would be confused with children, like in some western countries!I’ve severe concerns on his posts,perhaps all of them, on our country, a religion,sexuality, and sure there’s no use voicing my concern on him, with him !

  Writing is surely a powerful media, you could write whatever and claim you’re suman for it ! But what about the people who’s brains get washed in the process ? But still,no one’s said,he doesnt have the right to be suman! I really can’t thank Sutti’s blog enough !

 29. 29 కె.మహేష్ కుమార్ 9:46 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  @వికటకవి: ఈ రోజుకి 130 టపాలున్న నా బ్లాగులో మీరన్న ఆవు వ్యాసం తరగా మతం,కులం,ప్రేమ,లైంగికతకు సంబంధించిన టపాలు 18 ఉన్నాయి. మనిషిగా నాకు కొన్ని విషయాలపై నిర్ధుష్ట్యమైన నమ్మకాలు,అభిప్రాయాలుంటాయి. అవి ప్రతి టపాకీ మారవుకదా!అదీ ఇంచుమించు అదేవిషయంపై చర్చ జరుగుతున్నప్పుడు. నాటపాలన్నీ చదివిన మీరే ఇలాంటి అపోహకు లోనవుతున్నారంటే, మిగతావాళ్ళు అలా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు.

  @సుత్తి నరేష్ కుమార్: నేను వేసుకునే “అబద్ధపు ముసుగుని” సంస్కారం అంటారు.తిడతామూ, కొడతామూ అనిబెదిరించి సెంటిమెంట్లను కాపాడుకునే తీరును రౌడీయిజం,గూండాయిజం కాకుండా ఇంకేమటారో నాకు తెలీదు.

  నేను జ్యోతిగారి బ్లాగులో బూతులు రాసానని ఆపాదించబడుతున్న లంకె ఇక్కడ ఇస్తున్నాను.ఇందులో నేను రాసింది బూతో, ఆక్రింద మీలాంటి అనామకుడు రాసింది అసహ్యమో చదివినవారికి తెలుస్తుంది.
  http://jyothiv.blogspot.com/2008/08/blog-post_27.html

 30. 30 Chaitanya 10:03 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  mahesh garu, nijame mee “Sahetukamaina” prasna laki, anamakudu “nirhetuka maina ” samadhanaalu ichaadu ! Asalu meeru edaina sahetukam gane chestaaru ! Sandehame ledu evarikee ikkada !

 31. 31 durgeswara 10:04 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  బ్లాగ్లోకమిత్రులకు ఈచర్చలో నాగురించి సానుభూతిచూపిన మిత్రులందరకు ధన్యవాదములు.

  ఇక్కడ ప్రవేశించడమంటే ,మనభావాన్ని పదిమందిముందుంచటమంటె అది వ్యక్తిగత విషయం కాదు. మనలోదాచుకున్నంతసేపే వ్యక్తిగతం.దాన్ని పదిమంది ముందుంచినప్పుడు అది సామాజికపరమైనదే అన్నభావనవెల్లబుచ్చిన వారివాదనకు నేను అంగీకరిస్తున్నాను. మేమెప్పుడూ నిత్యవిద్యార్ధులమేకనుకనేర్చుకోవడానికి ,తప్పులుంటే సరిదిద్దుకోవడానికి మావృత్తి,ప్రవృత్తి రెండూవలసినంత శిక్షణ నిచ్చివున్నాయి. కాకుంటె సభ్యత సంస్కారాలను కోల్పోకుండా వ్రాసేవారినుంచి అవి ఆరోపణలైనా తప్పుకోవలసిన అవసరం నాకులేదు. నాకుతెలిసిన పరిధిలో వివరించడానికే ప్రయత్నిస్తాను.ఇక సభ్యత సంస్కారాలు లేకుండా ,ఇతరుల మనోభావాలు,మనస్సు గాయపర్చేలా వ్రాసేవారు మానసిక రోగులలాంటి వారని మహేష గారన్నట్లు వారిగురించి మనం చింతపడాల్సిన అవసరం లేదు ఇప్పటిదాకా అలాంటివి తొలగిద్దామనుకున్నాను,కాని అలా చేయను.ఎందుకంటె మనం సత్యము నుమాట్లాడేటప్పుడు ఆసత్యం గిట్టనివ్యక్తి ఒక్కరు మాట్లాడితే ఇంతమంది మంచిమనుషుల నుంచి మనపట్ల అభిమానం ఎమ్తవున్నదో తెలుసుకునే అవకాశాన్నిచ్చిన వ్యక్తి వ్యాఖ్యలు తొలగిస్తే లాభం ఏమిటి? కనుక అతను కూడా మనకు హితుడే,తిట్టేవాన్నీ,పొగిడేవాన్నీ సమానంగా చూడలేనప్పుడు నేను నడచే దారిలోనుంచి పక్కకు తొలగినట్లవుతుంది.

  ఇక ఆధ్యాత్మికంగా ఒక రహస్యమున్నది.మనలను దూషించి బాధించిన వ్యక్తి నిజానికి మనకు మేలే చేస్తున్నవాడు.మనం తెలియకో తెలిసో చేసిన దోషాల పాపాన్ని అతను పంచుకుంటున్నాడని గ్రహించాలని పరమగురువులు ప్రతివారూ బోధిస్తూనేవున్నారు. ఇతరులగురించి వ్యక్తిగత దూషన చేస్తున్న ఒకరిని చూపుతూ సాయిబాబా ఇలాఅంటారు, వాడుచూడండి మలాన్ని ప్రీతిగా తినే పందిలా ఎమ్త ప్రీతిగా ఎదుటివానిలో దోషాలను స్వీకరిస్తున్నాడో అని.జయముజయము జగద్గురుపరంపరకు.

 32. 32 సుత్తి నరేష్ కుమార్ 10:12 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  మహేష్, జ్యోతిగారి బ్లాగులో చర్చిమ్చబడుతున్న విషయాలమీద నీకు నమ్మకం, గౌరవం లేదు. అవి ఏమిటో నిజంగా తెలుసుకుందామనే ఉద్దేశ్యం అంతకన్నా లేదు. మరి అక్కడ నీ కామెంట్లెందుకు రాశావు? వ్యంగ్యంగా రాశావు. వెక్కిరిద్దామని రాశావు. మీ మతంలో ఉన్నది చెత్త అని చెప్పడానికి రాశావు. శివలింగం అంటే నీకు తెలిసి penis అని అర్థం. అటువంటి అసభ్యకరమైన అర్థం అక్కడ చర్చిస్తున్నవాళ్ళ మనసుల్లో గానీ, మెజారిటీ హిందువుల్లో గానీ లేదు. అసలు లింగమంటే ‘ఆ’ అర్థాన్ని వ్యాపింపచెయ్యడంలోనే పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్రదారుల ప్రచారాలు నీకు నచ్చుతాయి. లింగం అంటే చిహ్నం అని అసలు అర్థంట.
  నీకు ఏదో చెత్త అర్థం తెలిస్తే అక్కడికొచ్చి, గౌరవనీయులైన వ్యక్తుల మధ్యలో బూతు అర్థం తీశావంటే – దాని వెనక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? పదిమందిలో గుడ్డలిప్పుకునే streakers కీ నీకూ తేడా ఏమిటి?

  నీకున్న బూతు అభిప్రాయాల్ని పదిమందిలోనూ ప్రచారం చేసి వాళ్ళని వాళ్ళ మతం పట్ల విముఖుల్ని చేద్దమనే అజెండా నీకు ఉంది. నువ్వు వ్యక్తి, వాక్ స్వాతంత్ర్యాల్ని అడ్డుపెట్టుకుని బ్రెయిన్ వాషింగ్ చెయ్యడానికి చూసే మత ప్రచారకుడివి. దానికి ఒక ’నాగరిక’ ముసుగు వేసి నీకన్నా తెలివితక్కువ వాళ్ళుగా కనపడేవాళ్ళని షాక్ కి గురి చేసి, వాళ్ళ నమ్మకాల్ని దెబ్బకొట్తడమే నీ లక్ష్యం. జ్యోతిగారి బ్లాగులో నీమీద అనామకుడు కామెంటు చేసిన దానిలో ఏ తప్పూ లేదు.

  నీకు నమ్మకం, గౌరవం లేని వాటి గురించి – నమ్మకం , గౌరవం ఉన్న వాళ్ళ మధ్యలో దూరి కామెంట్లు చెయ్యడం ఎందుకు? రాయడం ఎందుకు? కనీసం అవతలివాళ్ళ అభిప్రాయాలకీ, నమ్మకాలకీ గౌరవం ఇస్తున్నట్టుగా కూడా ఉండదు నీ రాసే పద్ధతి.

 33. 33 Chaitanya 10:22 ఉద. వద్ద నవంబర్ 11, 2008

  Thanks for your “Nirhetukamaina” reply Naresh Garu ! Anything that opposes Katti is always that, ” nirhetukam” ! No one here,has doubts on it !

  And thanks to Mr.Katti for giving the link, now my respect on him has further increased ! I somewhere read in an “Arya samajam” book which gives the meaning of “lingam” in just the way Mr.Katti said it ! Now I see the source for his “sahetukatha” !

 34. 35 అబ్రకదబ్ర 12:24 సా. వద్ద నవంబర్ 11, 2008

  ఈ వాదోపవాదాల తర్వాత ఎవరికి చేరవలసిన సందేశాలు వారికి చేరి ఉంటాయని నా నమ్మకం. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. ఒకరి మీదనే దాడులెందుకు జరుగుతున్నాయన్నది ఆలోచించదగ్గ ప్రశ్నే. ఆ దాడిని అభిప్రాయాలు, ఆలోచనల మీద కాకుండా వ్యక్తుల మీద కేంద్రీకరించటం సహేతుకమా అన్నది ఈ చర్చకి మూలం. మన విలువైన సమయాన్ని వెచ్చించి రాస్తున్నప్పుడు – వికటకవి గారన్నట్లు – హడావిడిగా ఏదో ఒకటి రాసేయకుండా ఒకటికి రెండుసార్లు సరి చూసుకుని రాయటం మంచిదన్నది నా అభిప్రాయం. వేడివేడిగా చర్చలు జరిగినప్పుడు అప్పుడప్పుడూ హద్దు మీరటం సహజం. వెనువెంటనే దాన్ని దిద్దుకోవటం సంస్కారం. అంతేకానీ అదే పనిగా వ్యక్తిగత దాడులే అజెండాగా పెట్టుకోవటం తగని పని. మనందరం బయట ఎంతో సభ్యతాయుతంగా ప్రవర్తించేవాళ్లమే. ఆ హుందాతనాన్ని ఇక్కడా చూపిద్దాం.

  ఈ చర్చని రచ్చ, రసాభాస కానీకుండా ఆరోగ్యవంతంగా కొనసాగించిన అందరికీ ధన్యవాదాలు (ఇద్దరూ ఒకే పక్షానుండి కూడా – రామాయణంలో పిడకలవేట లాగా – మధ్యలో కాసేపు నా గురించి వాదులాడుకున్న కుమార్, చైతన్య గార్లకి ప్రత్యేక ధన్యవాదాలు 😉 )

  ఇప్పుడిప్పుడే చర్చ దారి తప్పుతున్న సూచనలు మొదలయ్యాయి. కనుక ఈ చర్చకి ఇంతటితో స్వస్తి పలుకుదాం.

 35. 36 yaji 12:56 సా. వద్ద నవంబర్ 11, 2008

  abracadabra gaaru:
  If this blog is closed for commenting you may ignore. But from the same sources that were provided by Mr. Mahesh gaaru:

  “Swami Vivekananda gave a lecture at the Paris Congress of the History of Religions[18][2] in 1900 during which he refuted the statements of some Western scholars..”
  Another book was written by westerners.

  “Various interpretations on the origin and symbolism of the Shiva lingam obtain. While the Tantras and Purana Puranas
  s deem the Shiva lingam a phallic symbol representing the regenerative aspect of the material universe,
  the Agamas and Shastras do not elaborate on this interpretation, and the Vedas fail altogether to mention the Lingam.”

  “The linga was originally understood as a representation of the phallus, as sculptures from the early centuries of the Common Era make clear, but many—probably most—modern Hindus do not think of the linga in these terms”

  There was no authoritative conclusion anywhere that it has traces to phallicism.

  Looks like another concept borrowed from west.

  I am glad Mr. Mahesh pointed me in the right direction as I was another soul that had the same misconception (Probably by reading taapi dharma rao gaari – devaalayallo boothu bommalu long time back)

  I have not gone through all the sources. It appears neither the provider. I certainly take Swami Vivekananda gaari word over any blogger on the planet earth.
  I would try to post the same on paanashaala just in case you choose not to post for diplomatic(Please mind, am not using this word in a derogatory manner).

 36. 37 సుత్తి నరేష్ కుమార్ 12:59 సా. వద్ద నవంబర్ 11, 2008

  మహేష్, నీ తెలివితేటలు నాదగ్గర చూపించకు. జ్యోతిగారి టపాలో నీ కామెంట్ల వెనక ఉన్న ఉద్దేశ్యమేమిటో చెప్పు ముందు. శివలింగం గురించి నువ్వేమీ చెప్పక్కర్లేదు. ఇంటర్నెట్ లో సెర్చి చేసుకుని అందరూ తెలుసుకోగల్రు. నీకు ఏదో ప్రువ్ చెయ్యాల్సిన అవసరం నాకు లేదు. ఆ టపాలో మల్లాదివారు చెప్పినది ఒప్పుకునే/తెలుసుకునే ఉద్దేశం నీకెలా లేదో, నువ్వు చెప్పే బూతు కబుర్లు ఒప్పుకునే ఉద్దేశం మాకు కూడా లేదు. మతానికి సంబంధించి మాకు ఎవరు ప్రమాణమో వాళ్ళ దగ్గర తెలుసుకుంటాం. నువ్వొచ్చి మమ్మల్ని educate చెయ్యాల్సిన అవసరం లేదు. నీకసలు నమ్మకం లేని విషయాల గురించి నువ్వెందుకు మాకు బోధలు చేస్తున్నావో చెప్పు ముందు.

  నీ ఉద్దేశ్యాల గురించి నేను చేసిన ఆరోపణలు ఏమైనా తప్పని నువ్వు ఒక్కసారి అని ఉన్నా నేను నీగురించి మరోరకంగా ఆలోచించడానికి ప్రయత్నించేవాణ్ణి. నువ్వు అనవు, ఎందుకంటే నీ ఉద్దేశాలు అవే కాబట్టి. అలాంటి ఉద్దేశాలు ఉన్నవాళ్ళు నిజాలు చెప్పినా వాళ్ళ motive ని బట్టి వాళ్ళు ఎందుకు చెప్తున్నారో సందేహించాల్సి వస్తుంది.

 37. 38 Chaitanya 12:59 సా. వద్ద నవంబర్ 11, 2008

  😀 abrakadabra garu, ee ramayanam lo pidakala veta sametha meaning enti chepmaa ? Iddaram oke pakshaana unnaamaa ? Nenu khandistunnaa ! 😐 Nenu mari konchem takkuvagaa mee pakshaana unna 😉 without ‘smiles on my face’ or ‘affectionate observations’ on you!

  Thanks for kumar garu for giving this opportunity, to make my point ! 😉

  last thing, I want to stress is … oka vyakthi meeda daadi ki intha significance ela aithe undo,oka value system,oka culture,oka society,oka(mana) country, oka religion kooda sensitive things ye, they represent lot of vyakthulu ! mari vaatni nirlajja gaa, lesa matram samsayam lekunda…vaati meeda daadi chese vallaki ‘vyakthi gatha daadulu’ eduraithe labo,dibo manatame viddoram ! Idi mana Sahanaaniki? paraakaastha ! Just the way, we took the british with such patience ?, daniki deeniki teda emi ledu, as far as I think ! I rest my case !

 38. 39 సుత్తి నరేష్ కుమార్ 1:02 సా. వద్ద నవంబర్ 11, 2008

  మహేష్ చేసే దుష్ప్రచారాల్ని ఖండించడానికి ఎవరైనా నా బ్లాగులో రాయదలచుకుంటే స్వాగతం. నాకో మెయిల్ పంపండి: naresh.sutti@gmail.com

 39. 41 Nirhetuka Vaadi 1:19 సా. వద్ద నవంబర్ 11, 2008

  Nenu 1000000 mandini fools anta,mee culture/value-system ki meaning ledu anta, mee values paniki maalinavi/krutrima kanche antaa, mee religion sanatanam kadu, ippudu unnadi religion ye kadu, mottam cheekate antaa,migitha matalu matram perfect gaa unnayi…so conversions tappu kaadu antaa… nannu fool annaava tirigi? Vyakthi gatha daadi idi !

  ilaa anatam …Niyantrutvam antaaru, naku telsinantha varaku ! Ee niyanthalani kondaru ‘avunu vyakthi swecha,vyathi ki gouravam ivvaali’ peru tho support cheyatam maree badhaakaram !

  And one more humorous thing is… Anonymous gaa vyakhyalu chese vallaki “values” levu ! If people can choose to express themselves “freeeeely” without commitments sexually, why the heck cant they choose to express themselves without committing to a name? This part is very hilarious when katti stresses it ! There are so many people like ‘chaduvari’, ‘abrakadabra’, ‘vikatakavi’,who I know are pretty decent people ! Now are all these really names? What the heck difference does it make, if someone doesnt want to name themselves as ‘bikari’ or ‘nirhetuka vaadi’ etc ! Its better to stress if they’re making the so called ‘vyakthigatha daadulu’ or not, than if they choose a name or not !

  After all, they too have the ‘freedom of expression’ to remain anonymous ! veelaithe nee peru tho raa,neeku pere ledu, neetho nakenti? ane katti lanti comments chusthe naku navvostundi ! “neeku” ki digajaarina … Aayana veedhi poraata tatvaaniki !

 40. 42 అబ్రకదబ్ర 1:26 సా. వద్ద నవంబర్ 11, 2008

  @చైతన్య:

  రణ వాతావరణాన్ని తేలిక పర్చటానికి మధ్యలో ఊరికే మీ ఇద్దరి గురించి జోకాను. అంతకంటే ఏమీ లేదు. మీరిద్దరూ ఒకే పక్షాన ఉన్నారన్నది – ఇక్కడ జరుగుతున్న అసలు చర్చలో మీ ఇద్దరి అభిప్రాయాలూ ఒకటే అన్న అర్ధంలో (ఇక్కడో స్మైలీ పెట్టి మళ్లీ తీసేశా).

  @సుత్తి:

  మీ సత్తాని మరింత విస్తృతంగా రాయటానికి వాడొచ్చు కదా. మీ బ్లాగులో నే రాసిన మొదటి కామెంట్ అదే. ఆలోచించండి.

  @అందరూ:

  ఇప్పుడిక నిఝంగా ఈ గొడవ ఆపేద్దాం.

 41. 43 Chaitanya 1:42 సా. వద్ద నవంబర్ 11, 2008

  Hahaha…shankham oka vaipu kouravulu pooristhe, vachedi vaadu phalgunudu ainacho ranam tappadu kadaa, abrakadabra garu !

  ee ranam lo raktha paatham ledu ! cricket match anukuni, oka coke tho veekshinchandi ! 🙂

  paiga ikkada comments batti tapaala/blogger la “value” “judge” cheyatam ane krutrima kanche elago undane undaaye ! 50 comments reach aithe, mimmalni satkaristaam ! 😉


Comments are currently closed.ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: