సినిమాలు రకరకాలు. నవ్వించేవి, ఏడిపించేవి, విసిగించేవి, తలనొప్పి తెప్పించేవి, వగైరా. వీటిలో మనం మర్చిపోయేవెన్నో, గుర్తుంచుకునేవి మాత్రం కొన్నే. ‘బెల్లా’ గుర్తుంచుకునే రకం. ఇటువంటి సినిమాలు తీయటం కత్తిమీద సాము. మసాలా దినుసులు ఏవీ లేని ఈ కధని జనరంజకంగా మలచి విజయవంతం చేయటం దర్శక నిర్మాతల ప్రతిభ, ధైర్యం. చిన్న చిన్న సంఘటనలు జీవితాలని ఎలా మలుపు తిప్పుతాయో ఈ చిత్రం చెబుతుంది. చిత్ర కధనం అంతా మూడు విలువల చుట్టూ తిరుగుతుంది: ప్రేమ, దయ, కుటుంబం. హింస, అశ్లీలత, గ్రాపిక్స్ మాయాజాలం, భారీ సెట్టింగుల మూస ఒరివడిలో కొట్టుకు పోతున్న హాలీవుడ్ చిత్రాల మధ్యలో బెల్లా ఓ పిల్లగాలి తెమ్మెర.
పూర్తి పాఠం నవతరంగంలో ..
0 స్పందనలు to “బెల్లా”