క్రికెట్టాటలో ప్రతిదీ రికార్డే. పరుగులు చేసినా, యకపోయినా, వికెట్లు తీసినా, యకపోయినా, బాగా ఆడినా, డకపోయినా, వరసగా వంద టెస్టులాడినా, ఓవర్‌కి ఆరు సిక్సులు కొట్టినా, ఆరు ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వకపోయినా .. అబ్బో ఎన్నని చెబ్తాం. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేస్తే రికార్డు, ఎక్కువ బంతుల్లో తక్కువ పరుగులు తీసినా రికార్డే. వరసగా నాలుగు సెంచరీలు చేస్తే రికార్డు, నాలుగు సార్లు సున్నాకే అవుటైనా రికార్డే. ఒకే ఒక అంతర్జాతీయ పోటీతో తెరమరుగైపోయిన ఆటగాడికి కూడా ఏదో ఒక రికార్డు ఉండి తీరుతుంది. ఇంత వింత ఆట మరోటి లేదేమో. ఇవన్నీ చాలనట్లు, ఈ మధ్య మీడియావాళ్ల అత్యుత్సాహంతో మరికొన్ని చిత్ర విచిత్రమైన రికార్డులూ పుట్టుకొస్తున్నాయి.
నిన్న మొహాలీలో ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ పోటీలో క్రికెట్ దేవుడు అత్యధిక పరుగులు సాధించి అప్పటిదాకా బ్రియాన్ లారా పేరు మీదున్న రికార్డును తుడిచి పెట్టాడు. టెండూల్కర్ ఈ ఘనత ఎప్పుడు సాధిస్తాడా అని కాచుక్కూచున్న అభిమానుల ఆనందానికి అంతు లేదు. స్టేడియం మూడు నిమిషాల పాటు బాణాసంచా మోతతో దద్దరిల్లి పోయింది. ఇతర ప్రాంతాల్లో కూడా అభిమానులు టపాసులు కాల్చి సంతోషం పంచుకున్నారు. కొన్ని ప్రాంతాల్లోనయితే దీపావళి ముందే వచ్చేసినంత సందడి!
అభిమానుల సందడి ఇలాగుంటే, మీడియా వారి మోత మరింత ఘనంగా ఉంది. ‘రెండో టెస్టు మొదటి రోజు బద్దలైన రికార్డులు’ – ఇది కొన్ని వార్తా పత్రికల్లో కనిపించిన వాక్యం. ‘రికార్డులు’? ఒకటి కంటే ఎక్కువున్నాయా!?! సచిన్ యాభయ్యో అర్ధ శతక్కొట్టుడు, పన్నెండు వేల పరుగుల మైలురాయి చేరటం కూడా రికార్డులేనట! ఇక్కడి నుండీ సచిన్ చేసే ప్రతి పరుగూ ఒక రికార్డే కాబోలు. ‘పన్నెండు వేల ఒక పరుగు సాధించిన మొదటి ఆటగాడు, పన్నెండు వేల రెండు పరుగులు … ‘, మీకర్ధమయ్యే ఉంటుంది. ఇంతకంటే వింత, గంగూలీ ఏడువేల పరుగులు సాధించిన నాలుగవ భారత ఆటగాడిగా ఘనత సాధించటం కూడా ఇదే టెస్టులో మరో రికార్డట! త్వరలో ‘రెండు వేల పరుగులు చేసిన నూట ముప్పై నాలుగో భారత బ్యాట్స్‌మన్’ లాంటి రికార్డులు కూడా వస్తాయేమో. ఇంకా వీటిలో స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి – ఫలానా పని చేసిన పదహారో లెఫ్ట్‌హ్యాండర్ .. ఇలా. ఆటలో అరటిపండుల్లాంటి విశేషాలకీ, అసలు సిసలు రికార్డులకీ తేడా తెలియని క్రీడా విలేకర్ల బారిన పడటం మనం చేసుకున్న పుణ్యం.
మీడియావారి రికార్డుల యావ గురించి వ్యాఖ్యానిస్తూ ఎవరో ‘ఇదే టెస్టులో ఇషాంత్ శర్మ కూడా ఓ బ్యాటింగ్ రికార్డ్ సృష్టించాడు’ అన్నారు.. ‘ఎలా?’ అంటే, ‘ఏముందీ. అంత బక్కగా, పొడుగ్గా, జులపాలు పెంచుకున్న ఆటగాడు ఓ టెస్టులో ఆస్ట్రేలియా మీద నైట్ వాచ్‌మన్‌గా వచ్చి తన నూరో పరుగు చెయ్యటం ఇంతకు ముందెన్నడూ జరిగుండదు కాబట్టి’ అన్నది సమాధానం. మీడియా బాబులూ, వింటున్నారా? ఇషాంత్ రికార్డునీ ఎక్కడో ఓ చోట రాసెయ్యండి.
(క్రికెట్ గురించి నా మరో టపా ఇక్కడ)
మీరు చెప్పిన ఇషాంత్ రికార్డు రాసినా రాసేవుంటారు. క్రికెట్ ఆటలో ఉన్న మహత్తే రికార్డులుకదా!
నిజమే, క్రికెట్లో ప్రతి బంతీ రికార్డే! పేపర్లలో మొదటి వార్త ఇదే ఇవ్వాళ. (నిప్పులు చిమ్ముకుంటూ నిగికెగసిన సచిన్, నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిన సెన్సెక్సు- ఈ రెండే ఇవ్వాళ పతాక శీర్షికలు) మనాళ్ళ రికార్డుల యావను బట్టి చూస్తే.. ఆ చివరి పేరా వ్యాఖ్య ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదని తెలుస్తుంది.
క్రికెట్ మీడియా అన్న విషయం తర్వాత తీరుబడిగా చర్చిద్దాం కానీ,times of india వాడు ఇచ్చిన
ఈ లంకెనోసారి చదవండి
http://epaper.timesofindia.com/Default/Scripting/ArticleWin.asp?From=Archive&Source=Page&Skin=TOI&BaseHref=TOIH/2008/10/18&PageLabel=16&EntityId=Ar01600&ViewMode=HTML&GZ=T
అన్నట్టు నాకో రికార్డు గుర్తొస్తోంది.. తుమ్మల శిరీష్ కుమార్ అనే ఆటగాడు ఇంతవరకూ క్రికెట్ ఆడలేదు. ఇకముందు ఆడితే అది మరో రికార్డు! 🙂
SACHIN … SACHIN
మీరు ఈ టపాలో ఓ చోట దేవుడన్నారు అదే పది వేలు.
నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది సచిన్ నిజంగా దేవుడేమో అని
nice post
చదువరీ .. పేలింది!:)
Nice Post.
@chadavari. kEka 🙂
hi..
i m unable to c the fonts..
i m using firefox on ubuntu linux
can u tell me the font which i have to download..
thanQ..
మీ వుద్దేశ్యం నా మట్టి బుర్ర కి సరిగా అర్థం కాలేదు..
అసలు రికార్డ్స్ వుండకూడదంటారా..లేకపోతే మీడియా వాళ్ళు మరీ ఓవర్ చేస్తున్నారంటారా..
12,౦౦౦ runs సాధించడం అనేది గొప్ప విషయమే కదా..12,001 12,002 సాధించిన అనేది ఎవరు లెక్క వేస్తున్నారు..మీడియా వాళ్ళని వదిలెయ్యండి..వాళ్ళకి న్యూస్ కావాలి మంచి టైటిల్స్ కావాలి వాటికి కాప్షన్స్ కావాలి..వాళ్ళు చేసినదానికి మీరు వేరే వాళ్ళని అవమానించడం అంత బాగోలేదు..మీ వుద్దేశ్యం వేరేదయితే ఈ వ్యాఖ్య ని డిలీట్ చెయ్యండి.
ముందు దీని సంగతేమిటో చూడండి,ఈ టపా మీద నొక్కగానే కనిపిస్తుంది….
404 దోషము – కనిపించలేదు
Oh no! You’re looking for something which just isn’t here! Fear not however, errors are to be expected, and luckily there are tools on the sidebar for you to use in your search for what you need.
@మహేష్,అశ్విన్,శ్రీసత్య,కొత్తపాళీ,నాగప్రసాద్:
ధన్యవాదాలు.
@చదువరి:
మీ రికార్డు సూపరు 🙂
@రాజేంద్ర:
అప్పటికే పబ్లిష్ చేసిన టపాకి మార్పులు చేసి సేవ్ చేసినప్పుడు అలా అవటం గమనించాను. కొన్ని సార్లు అవుతుంది, కొన్ని సార్లు కాదు. ఎందుకో తెలుసుకునే తీరిక లేక వదిలేశా 🙂
@వినోద్/007 (ఇద్దరూ ఒకరే కదా):
రికార్డ్స్ తప్పకుండా ఉండాలి. మీడియావాళ్లు అతి చేస్తున్నారనేది నా ఉద్దేశం. ఆ అతినే ఎత్తి చూపాను కానీ నేను ఏ ఆటగాడినీ అవమానించలేదు కదా. నేనూ క్రికెట్ ఆటగాడినేనండీ. ఇరవయ్యేళ్లకి పైగా క్రికెట్ ఆడుతున్నాను, రకరకాల స్థాయిల్లో రాణించాను. ఆ ఆటనీ, ఆటగాళ్లనీ తక్కువ చెయ్యటం నా అభిమతం కాదు.
అబ్రకదబ్ర గారు, మీరు Cricinfo commentary బాగా ఫాలో అవుతూ ఉంటారని ఈ టపా వలన బాగా అర్థం అయింది. కాకపోతే ఒక విషయం. ఇశాంత్ శర్మ రికార్డు గురించి ఎవరో (తమ వంటి) అభిమానులే ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించారని, Cricinfo commentator వాళ్ల పేర్లు కూడా అక్కడే ఇచ్చాడని, ఆ transcript పూర్తిగా చదివితే అర్థం అవుతుంది. దీన్ని బట్టి తెలిసిన నీతి ఏమిటంటే, ఒక మీడియా వాళ్ళే కాదు, మన బ్లాగరులు కూడా ఒక విషయాన్ని ఎటు కావాలంటే అటు వంచి sensationalize చెయ్యడంలో సిద్ధహస్తులేనని !!
– Shiv.
@శివ:
గొప్ప రహస్యం కనిపెట్టారు. అయితే, నేను క్రిక్ఇన్ఫోతో పాటు మరిన్ని మూలాలనూ ఫాలో అవుతాను. మీరేమో దాన్ని, నన్ను మాత్రమే ఫాలో అవుతున్నట్లున్నారు. నాకింత ఫాలోయింగ్ ఉన్నట్లు ఇప్పుడే తెలిసింది.
నేటి ‘ఈనాడు’ ఓసారి తిరగెయ్యండి. ‘తొలి టెస్టులోనే ఐదు వికెట్లు సాధించిన ఆరో భారతీయుడిగా రికార్డు సృష్టించిన అమిత్ మిశ్రా’ అట. నా ఎత్తిపొడుపు మీడియావారి ఈ యావ మీద.
నేను సంచలనం కోసం టపాలు రాయననేది నాకు తెలుసు, నా టపాలు తరచూ చదివే వారికీ తెలుసు. మీరూ తెలుసుకుంటే బాగుంటుంది.
ఇషాంత్ రికార్డు గురించి నేనాడింది హాస్యం. దాన్నలాగే అర్ధం చేసుకుంటే సంతోషం. ఈకలు పీకటాన్ని నే సహిస్తాను, తాటాకులు కట్టటాన్ని కాదు. ఎంత ఘాటుదైనా, విమర్శకి స్వాగతం. కానీ దాన్లో వెటకారంతో కూడిన వ్యక్తిగత దాడిని మిళాయించాలనే ఉబలాటం తగ్గించుకోకుంటే ఆ విద్యలో నేనెంత ఘటికుడినో చూపించాల్సొస్తుంది.
అబ్రకదబ్ర గారు,
నా వ్యాఖ్య ద్వారా మీ బ్లాగ్ కి ఫాలోయింగ్ ఉందని మీకు అర్థమైనందుకు సంతోషం.
నిజం చెప్పాలంటే, తెలుగు బ్లాగ్లోకంలో ఎంతో కొంత వాసి ఉన్నవాటిలో మీ బ్లాగ్ కూడా ఒకటి అని నా అభిప్రాయం. మీతో, మీరు ఇతర బ్లాగులలో రాసే కొన్ని వ్యాఖ్యల విషయంలో నాకు అభిప్రాయ భేదాలున్నా, ఈ బ్లాగులో మీరు టపాలు రాయడానికి ఎంచుకునే అంశాలు, మీ రచనా శైలి నాకు నచ్చడం వలన మీ బ్లాగ్ తరచుగా చదువుతుంటాను (మీకు ఇది నచ్చినా, నచ్చక పోయినా). ఈ మధ్య వస్తున్న చాల బ్లాగుల లాగానే మీ బ్లాగులోనూ వాసి తగ్గి రాశి పెరుగుతున్నదేమోనన్న అభిప్రాయానికి, అనుమానానికి ఫలితమే, నా వ్యంగ్యం. మీ టపాలో కూడా మీడియా పై ఇలాంటి వ్యంగ్యమే కనబడుతుంది అని అంటే కాదంటారా ? ఇలాంటి వ్యాఖ్యలు మీకు నచ్చకపోతే ఒక disclaimer పెడితే ఇక రాయకుండా ఉంటాను.
ఇక వ్యక్తిగత విమర్శలు, దాడులు, వెటకారాలు, బెదిరింపులు అంటారా, మీరు వీటిలో ఎంత ఘటికులో నాకు ప్రత్యేకంగా చూపించనక్కరలేదు. ఇతర బ్లాగులలో మీరు చేసే వ్యాఖ్యలు (పై వ్యాఖ్యతో కలిపి) నేను చూస్తూనే ఉన్నాను. ధన్యవాదాలు.
– Shiv.
@శివ:
మీకు నా రాతల్లో రాశి పెరిగి వాసి తరిగినట్లనిపిస్తే ఆ సంగతి సూటిగా, నిర్మొహమాటంగా చెప్పెయ్యండి. విమర్శలు, వాటిలో వ్యంగ్యం నాకు అభ్యంతరకరం కాదు. ‘(తమవంటి) అభిమానులే’ లాంటి వ్యక్తిగత విమర్శలతోనే సమస్య. నేను ఇతర బ్లాగుల్లో ఘాటుగా వ్యాఖ్యానిస్తానే కానీ ఎవరినీ ఎగతాళి చెయ్యను.
నా టపాలగురించి వ్యంగ్యపూరితమైన వ్యాఖ్యలు ఇంతకు ముందు కూడా కొందరు చేసి ఉన్నారు. వారెకెవరికీ నేను సమాధానమీయలేదు. తెలిసీ తెలియకుండా ఏదో ఒకటి రాసేసే వారికి నేను సమాధానమీయను. మీరు అలా కాదని నా నమ్మకం (ఇతర బ్లాగుల్లో మీ వ్యాఖ్యల ద్వారా). అందుకే మీ వెటకారపు వ్యాఖ్య నాకు ఆశ్చర్యాన్ని కలిగించి, నేను అలా ప్రతిస్పందించేలా చేసింది.
Hi..
I m unable to c the telugu fonts on this blog..
can u tell me the font i have to use..
Vinod,
these are Unicode fonts. If you’re using IE/FireFox/Chrome on Windows, seeing the text shoudn’t be a problem (you may need to tweak your settings a bit). If you’re using Linux or some other *nix OS, I don’t know the solution unfortunately. My Linux machine had been down for a while, and I need to bring it up before finding an answer.
Now I am able to:)