ఆపిల్ దాని పేరు

“ఆపిల్ కంపెనీ పేరులో టెక్ పదాలు రాకుండా ఆపిల్ అనే పేరెందుకు పెట్టారంటే …. సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మొదట ఆపిల్ తోటల యజమాని. మంచి లాభాలు వచ్చాక హార్డ్‌వేర్ రంగంలో ప్రవేశించాడు. భాగస్వాములు, ప్రణాళికలు, ఉద్యోగులు .. ఒక్కటి తప్ప అన్నీ రెడీ, అదే కంపెనీ పేరు. సంస్థకు ఏ పేరు పెడితో బాగుంటుందో సూచించాలని స్టీవ్ తన భాగస్వాముల్ని కోరాడు. రోజులు గడుస్తున్నా పేరు కుదరలేదు. ఆఖరికి తనని కుబేరుడిగా మార్చింది ఆపిల్ తోటలే కాబట్టి, ‘ఆపిల్’ అని పెడదామని చెప్పాడు. ఆ ప్రతిపాదనకు భాగస్వాముల ఆమోదమూ లభించింది.”

ఇది, ఘనత వహించిన ‘ఈనాడు’ పేపరు వారు పోయిన ఆదివారం సంచికలో ‘వీరీ వీరీ గుమ్మడి పండు’ శీర్షికన ప్రచురించిన ఆపిల్ సంస్థ పేరు వెనుక కధ! లెక్కపెడితే వాక్యానికో తప్పన్నా ఉందీ కధనంలో. ఆపిల్ పేరు వెనక అసలు కధ ఇది – చదవండి.

స్టీవ్ జాబ్స్ – ఇప్పుడు అపర కుబేరుడే కానీ ఇరవయ్యేళ్ల ప్రాయంలో చేతిలో చిల్లిగవ్వ లేని కుర్రవాడు. ఉండటానికి చోటు లేక స్నేహితుల గదుల్లో తలదాచుకున్నవాడు. అప్పట్లో, వాడి పడేసిన కోకాకోలా సీసాలని ఏరి షాపుల్లో తిరిగిస్తే సీసాకి ఐదు సెంట్ల చిల్లర లభించేది. అలా సంపాదించిన డబ్బుతో భోజనం కొనుక్కున్న రోజులున్నాయతనికి. ప్రతి ఆదివారం రాత్రి హరేకృష్ణ ఆశ్రమంలో ఉచితంగా పెట్టే భోజనం కోసం ఏడు మైళ్లు నడిచి వెళ్లి కడుపు నింపుకునేవాడు. ఆ ఆశ్రమం ఆపిల్ తోటల మధ్యలో ఉండేది.

1976 ఏప్రిల్ ఒకటిన స్టీవ్ జాబ్స్, అతని స్నేహితుడు స్టీవ్ వోజ్నైక్ కలిసి ఆపిల్ కంప్యూటర్స్ సంస్థని నెలకొల్పారు (మూడో భాగస్వామి కూడా ఉండేవాడు కానీ అతను నాలుగే నాలుగు వారాల్లో భాగస్వామ్యం వదులుకుని చక్కా పోయాడు). ఇతర ఉద్యోగులెవరూ లేరు. సంస్థ కార్యాలయం – క్యాలిఫోర్నియా రాష్ట్రం పాలోఆల్టో నగరంలో, ఒక కారు గరాజ్‌లో (1935లో ఇదే నగరంలో ప్రపంచ ప్రసిద్ధ హ్యూలెట్-పాకార్డ్ కంపెనీ సంస్థ ఇలాగే ఒక కారు గరాజ్ లో ప్రారంభమయింది). సంస్థకి ‘ఆపిల్’ అనే పేరు పెట్టటానికి రకరకాల కారణాలున్నాయి. అప్పటికే ఉన్న టెక్ కంపెనీల పేర్లు ఎవరికీ నోరు తిరగని విధంగా ఉండటం, తమ సంస్థ పేరు చాలా తేలికగా ఉండాలనుకోవటం ఒక కారణం. స్టీవ్ జాబ్స్ కి కష్టకాలంలో తిండిపెట్టిన హరేకృష్ణ ఆశ్రమం ఉన్న ఆపిల్ తోట గుర్తుగా ఆ పేరు పెట్టటం జరిగింది. అతనికి ఇష్టమైన బ్రిటిష్ గాయకులు బీటిల్స్ బృందం వారి పాటలు విడుదల చేసే ఆపిల్ రికార్డ్స్ కంపెనీ పేరు కూడా దానితో కలిసి రావటం మరో కారణం. ‘ఆపిల్’ అనే పేరు కంప్యూటర్ సంస్థల క్యాటలాగుల్లో అక్షర క్రమం ప్రకారం మొదట్లో వస్తుందనే ఆలోచనా ఓ కారణమే – సంస్థ ఇంకా ఎవరికి తెలీని రోజుల్లో ఈ చిన్ని కారణమే వీళ్లకి చెప్పుకోదగ్గ వ్యాపారం తెచ్చిపెట్టింది. పేరు వెనుక కధ గురించి మరిన్ని వాదనలు కూడా వున్నాయి. ప్రముఖమైనవి మాత్రం ఇవే. ఆ సంస్థ లోగోలో ఉండే ఆపిల్ ఒకవైపు కొరికినట్లుగా ఉండటం గమనించారా? ఆ ‘బైట్’ (bite) కంప్యూటర్ పరిభాషలోని ‘బైట్’ (byte) కి సూచిక.

ప్రపంచంలో మొట్టమొదటి పర్సనల్ కంప్యూటర్ తయారు చేసింది ఆపిల్ సంస్థ. వాళ్లకి వచ్చిన మొదటి ఆర్డర్ ఐదు వందల పర్సనల్ కంప్యూటర్లు. వీటిని స్టీవ్‌లు ఇద్దరూ కలిసి రేయింబవళ్లూ శ్రమించి ఆ కారు గరాజ్‌లోనే స్వహస్తాలతో ఏభాగానికి ఆ భాగం అమర్చి, సోల్డరింగ్ చేసి తయారు చేశారు. విడిభాగాలు కొనటానికి అవసరమైన డబ్బును నెల రోజుల్లో తిరిగిచ్చే షరతు మీద అప్పుగా తెచ్చుకున్నారు. అలా మొదలయిన ఆపిల్ కంప్యూటర్స్ పదేళ్లలో నాలుగు వేల ఉద్యోగుల సంస్థగా ఎదిగింది. ఇప్పుడు అందులో ఉద్యోగుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 28,000. 2007లో ఆపిల్ కంప్యూటర్స్ అమ్మకాల విలువ ఇరవై నాలుగు బిలియన్ డాలర్లు. అత్యంత విధేయులైన కొనుగోలుదారుల్ని కలిగుండటం ఆపిల్ ప్రత్యేకత. మాకింతోష్, ఐ-మాక్, ఐ-పాడ్, ఐ-ఫోన్, ఐ-ట్యూన్స్, క్విక్‌టైమ్, ఫైనల్ కట్ ప్రో వంటి విశిష్ట ఉత్పత్తులతో ఇది సాధ్యమైంది. ఫార్చ్యూన్ పత్రిక ప్రకారం అమెరికాలో అత్యంత ఆరాధ్యనీయమైన సంస్థ (most admired company) ఆపిల్.

కొసమెరుపు: ఆపిల్ ఆవిర్భవించిన ఏడాదికి సంస్థ కార్యాలయం సమీపంలోని కుపర్టినో నగరానికి మారింది. ఇప్పుడా సంస్థకి ప్రపంచవ్యాప్తంగా బోలెడు కార్యాలయాలున్నా, ప్రధాన కార్యాలయం మాత్రం ఇప్పటికీ కుపర్టినోలోనే ఉంది. దాని చిరునామా గమ్మత్తుగా ఉంటుంది, చూడండి: 1 Infinite Loop, Cupertino, CA.

15 స్పందనలు to “ఆపిల్ దాని పేరు”


 1. 1 venu 10:18 సా. వద్ద అక్టోబర్ 15, 2008

  Good information.. Bagundandi…

  Eenadu vadiki aa story evaru chepparo??

 2. 3 bezawa 11:15 సా. వద్ద అక్టోబర్ 15, 2008

  I have seen a you-tube video where Steve Jobs has explained his story, his struggles as a student and waalking 7 miles everyweekend to get good food at the Hare-Krishna ashrmam. A truly inspiring one.
  But who will tell eenadu and most other telugu papers which are publishing crap news thinking people cant verify facts.

 3. 4 సుజాత 1:53 ఉద. వద్ద అక్టోబర్ 16, 2008

  మాకింటోష్ మీద పని చేసాను గాని చరిత్ర తెలుసుకోలేదు. ఆపిల్ కి ఇంత చరిత్ర ఉందని ఇప్పుడే తెలిసింది.

  మీ టపాలు రాను రాను చాలా బాగుంటున్నాయి! నేను బ్లాగ్ రోల్ పెట్టడానికి వ్యతిరేకిని. పెడితే గనక మీ బ్లాగు తప్పకుండా చేరుస్తాను.

 4. 5 srisatya 3:44 ఉద. వద్ద అక్టోబర్ 16, 2008

  your posting for “APPLE HISTORY” is very interesting.

 5. 6 రాజేంద్ర కుమార్ దేవరపల్లి 4:04 ఉద. వద్ద అక్టోబర్ 16, 2008

  మీరంటే ఓపిక చేసుకుని రాసారు గానీ,ఇలాంటివెన్నో,మొన్నటి ఆంధ్రభూమి దినపత్రిక విశాఖపట్నం సిటీ ఎడిషన్ లో పైన ఈతచెట్టెక్కిన చిరు అభిమానులు అని రాసారు,పైన ఉందేమో తాటి చెట్టు.కాస్త శ్రద్ధగా చదివితే ఇలాంటివి కొల్లలు,తరచూ ఇలాంటి రచనలను అందిస్తారని ఎదురు చూస్తూ…

 6. 7 సిరిసిరిమువ్వ 4:17 ఉద. వద్ద అక్టోబర్ 16, 2008

  ఆపిల్ కంపెనీ పేరు-దాని కథాకమామీషు గురించి ఇంతకుముందు చదివి ఉండటాన ఈనాడులో ఇది చదివి నేనూ ఆశ్చర్యపోయా.

 7. 8 gaddeswarup 5:14 ఉద. వద్ద అక్టోబర్ 16, 2008

  Here is the link to the speech mentioned in the first comment:
  http://au.youtube.com/watch?v=UF8uR6Z6KLc
  Beeing somewhat of dropout myself, I found the speech appealing.

 8. 9 teja 6:06 ఉద. వద్ద అక్టోబర్ 16, 2008

  Because of hare-krishna ashram effect …. he had huge love towards India… once his dream was to earn some money and visit India…He visited India in 1970’s …..

 9. 11 కొత్తపాళీ 4:47 ఉద. వద్ద అక్టోబర్ 17, 2008

  అలాగే ఆపిల్ తయారుచేసే ముఖ్య కంయూటర్ ఉత్పత్తి మేకింటోష్ ఇక్కడ దొరికే ఆపిల్స్లో ఒక వంగడం (వెరైటీ).

 10. 12 Purnima 7:07 ఉద. వద్ద అక్టోబర్ 17, 2008

  bezawa చెప్పిన లెక్చర్ ట్రాన్స్ స్క్రిప్ట్ ఇక్కడ!
  http://news-service.stanford.edu/news/2005/june15/jobs-061505.html

  యూ ట్యూబ్ లంకె ఇది:
  http://in.youtube.com/watch?v=D1R-jKKp3NA

  మంచి టపా అబ్రకదబ్ర గారు!

 11. 13 అబ్రకదబ్ర 2:45 సా. వద్ద అక్టోబర్ 17, 2008

  @వేణు,మనోహర్,బెజవా,శ్రీసత్య,గద్దేస్వరూప్,తేజ,వేణూశ్రీకాంత్,పూర్ణిమ:

  ధన్యవాదాలు.

  @సుజాత:

  అసలు కధ ఆపిల్ స్థాపించినప్పుడు కాదు, ఆ తర్వాత పదకొండేళ్లకి మొదలయింది. 1987లో తను పెట్టి, పెంచి, పోషించిన ఆపిల్ నుండి స్టీవ్ జాబ్స్ వెళ్లగొట్టబడ్డాడు! అదీ అతను ఏరి కోరి సియివో గా తెచ్చుకున్న వ్యక్తి చేత. అలా వెళ్లిపోయాక జాబ్స్ NeXT అనే మరో కంపెనీ స్థాపించాడు. అవతల, జాబ్స్ నిష్క్రమణానంతరం ఆపిల్ పరిస్థితి దారుణంగా తయారయింది. డ్రమటిక్‌గా, 1996లో ఆపిల్ సంస్థ NeXTని కొనుగోలు చేయటం, జాబ్స్ తిరిగి ఆపిల్‌లో అడుగు పెట్టి ఏడాది తిరిగేలోగా దాని సియివోగా బాధ్యతలు స్వీకరించటం, నష్టాల్లో ఉన్న ఆపిల్‌ని మళ్లీ లాభాలబాట పట్టించటం .. కధలా ఉంది కదా. ఫస్టాఫ్‌లో కధానాయకుడు ఏమీ లేని దశనుండి కోటీశ్వరుడు కావటం, తర్వాత అతన్ని సంస్థనుండి వెళ్లగొట్టటం అనే ఇంటర్వల్ బ్యాంగ్, సెకండాఫ్‌లో అతను పోటీగా మరో సంస్థ పెట్టి పైకెదగటం, క్లైమాక్స్‌లో మళ్లీ మొదటి సంస్థకి పగ్గాలు చేపట్టటం.. మన సినిమాలకి అవసరమైన మసాలా ఫార్ములా స్టీవ్ జాబ్స్ జీవితంలో సిద్ధంగా ఉంది. నిర్మాతలింకా గమనించలేదెందుకో!

  @రాజేంద్ర,సిరిసిమువ్వ:

  సమాచారం విరివిగా లభించే ఈ రోజుల్లో తెలిసీ తెలియని విషయాల్ని ఇష్టమొచ్చినట్లు రాసేస్తుంటే వాళ్ల క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఎప్పుడు గుర్తిస్తారో ఏమిటో.

  @కొత్తపాళీ:

  నేను మర్చిపోయిన వివరం తెలియజేశారు. ధన్యవాదాలు.

 12. 14 cbrao 7:41 సా. వద్ద నవంబర్ 4, 2008

  చాలా ఆసక్తికరమైన కథ ఆపిల్ కంప్యూటర్స్‌ది. ప్రకటన , ముద్రణ రంగంలో రారాజిది. కాని ఆపిల్ యొక్క సఫారి బ్రౌసర్ లో తెలుగు దినపత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి చదువలేక పోతున్నా. ఫైర్ఫాక్స్ బ్రౌసర్లో పద్మ కొనసాగింపు తో తెలుగు దిన పత్రికలు చదవవచ్చు. తొలివాక్యం లోని కంప్యూటర్స్‌ది లో ఒక నిలువు గీత గమనించండి. విండోస్ లో ఇలా రాదు. ఈ వ్యాఖ్య నేను ఆపిల్ Mac OS X Leopard వ్యవస్థాపితమైన కంప్యూటర్ పై రాస్తున్నా. ఇందులో ఛాయా చిత్రాలు మనొహరంగా కనిపిస్తాయి. వైరస్ బెడద ఉండదు. సురక్షితం.

  -cbrao

  Mobile: 408-466-5736

 13. 15 కన్నగాడు 8:08 ఉద. వద్ద డిసెంబర్ 23, 2008

  అబ్రకదబ్ర గారు మీ బ్లాగు లోని ఆపిల్ దాని పేరు టపా నేను ముందుగా చదివి ఉంటే నా బ్లాగులో ఆపిల్ కంప్యూటర్ సాధారణ వాడకానికి పనికి రాదా? టపా ప్రచురించకపోయేవాడిని. చాలా బాగా రాసారు. అయినా నా భావాలకు మొదటి సారి అక్షర రూపం ఆ టపా కాబట్టి చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాను. మీతో కలం స్నేహం చేయాలని అభిలాష, ఎంతో మంది స్నేహితులున్నప్పటికిని భాష మీద మక్కువ ఉన్న స్నెహితులు ఎవరు లేక పోవటం విచారకరం. మీ టపా కోసం ఎదురుచూస్తు,
  కన్నగాడు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: