మిత్ర ప్రలాపం

రాష్ట్ర రాజకీయాల్లో ప్రజారాజ్యం అతి పెద్ద పార్టీ
ప్రరాపా అధికార ప్రతినిధి పి.మిత్రా

—- —-

ఇంత పెద్ద గాలివాన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు
నాలుగు వారాల నాడు పుట్టిన నక్క

**** **** **** ****

రాష్ట్ర రాజకీయాల్లో ప్రజారాజ్యం అతి పెద్ద పార్టీగా అవతరించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి డా. మిత్రా విలేకర్లకి చెప్పారు. ఇది నిన్నటి ‘ఈనాడు’ వార్త. ప్రజారాజ్యం అవతరించి మూడు నెలలు నిండలేదు, అప్పుడే ఎప్పుడు, ఎలా అతి పెద్ద పార్టీ రూపం దాల్చిందో ఆయన వివరించలేదు. అసలు ‘అతి పెద్ద’ అనేదానికి కొలమానమేమిటో కూడా ఆయన చెప్పలేదు. అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెల్చుకోవటమా, మిగతా పార్టీలకన్నా ఎక్కువ ఓట్ల శాతం పొందటమా, లేక ఎక్కువ మంది తమ పార్టీలో సభ్యత్వం స్వీకరించటమా? ఇంకా ఒక్క ఎన్నికనూ ఎదుర్కోకపోవటం వల్ల ప్రరాపా విషయంలో మొదటి రెండూ లెక్కలోకి తీసుకోగలిగే విషయాలు కావు. సభ్యత్వ నమోదు జరిగినట్లు వార్తలు రాకపోవటం వల్ల మూడోదీ ఈ పార్టీకి వర్తించే విషయం కాదు. చిరంజీవి సినిమాలు చూసే వాళ్లంతా ప్రరాపాకే ఓట్లేస్తారన్న నమ్మకం అనుకుందామంటే ఇటీవలి కాలంలో ఆయన చిత్రాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీసు వద్ద కుదేలయినవే. పోనీ, సినిమాల జయాపజయాలకి అతీతంగా ఆయన గ్లామర్ ఓట్ల వర్షం కురిపిస్తుందనుకుందామనుకున్నా – సినీ గ్లామర్ అన్ని సార్లూ పనిచెయ్యదనేది సాక్షాత్తూ ఎన్టీవోడి విషయంలోనే రుజువయిన విషయమామె. మరి ఏ రకంగా ప్రరాపా రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ? బహుశా, ఇతర పార్టీలనుండి ఫిరాయింపుదార్లని చేర్చుకునే విషయంలోనేమో.

పుచ్చలపల్లి మిత్రా గారు పలాసలో భుజాలు చరుచుకునే కార్యక్రమంలో మునిగి తేలుతుండగా, అదే రోజు అరవింద్ బాయ్యా హుటాహుటిన ఢిల్లీలో వాలి ఎర్ర చొక్కాలతో చుట్టరికం కలుపుకునే ప్రయత్నం చేయటం డాక్టరుగారి గాలి తీసేసేదే. అరవింద్ అంత హడావిడిగా ఢిల్లీ లగెత్తటానికి కారణం తెదెపా-సిపిఎం-తెరాస మధ్య బలపడుతున్న బంధం గురించి ఆ ముందు రోజే వార్తలు వెలువడటం, అందాకా ప్రరాపావైపు మొగ్గిన సిపిఐ కూడా కేంద్ర నాయకత్వం వత్తిడితో తెదెపా పక్షానికి మారే సూచనలు మొదలవటం.

అతి పెద్ద పార్టీకి ఇతరులతో పొత్తుల గురించి ఇంత ఆరాటమెందుకో అర్ధం కాని విషయం. అసలు ఎటువంటి పార్టీలతో పొత్తు కుదుర్చుకోవానే విషయంలోనూ ప్రరాపాకి స్థిరమైన అభిప్రాయాలు ఉన్నట్లు లేదు. ప్రస్తుతానికయితే తెదెపా, కాంగ్రెసు కాక ఎవరు తోడొస్తే వారితో వెళ్లే ధోరణే కనిపిస్తుంది. ఒక వైపు కమ్యూనిస్టులతో మంతనాలు, మరోవంక బిజెపి, తెరాసలతోనూ చర్చలు. ఏదీ ఫలించిన సూచనలు లేవు. చిరంజీవి ఇమేజ్ తమకు శ్రీరామరక్ష, అదే తమతో అందరూ జతకట్టేలా చేస్తుంది అనుకున్న ప్రరాపా ‘థింక్ ట్యాంక్’కి ఇది చేదుమాత్రే. ‘ముందు మీ విధానాలేమిటో చెప్పండి, ఆ తర్వాత పొత్తుల గురించి మాట్లాడదాం’ అన్న కేంద్ర కమ్యూనిస్టు నేతల కరకు స్పందన అరవింద్ ప్రభృతులని ఊహాలోకం నుండి బయటకు తెచ్చి ఉంటుందా? ‘మేం మీతో కలవటం కాదు, మీరే మాతో కలవండి’ అన్న సీతారాం ఏచూరి స్పందన, ‘ప్రతి విషయంలోనూ చూస్తాం, నిర్ణయిస్తాం, చర్చిస్తాం లాంటి సమాధానాలే తప్ప ఏ విషయంలోనూ స్పష్టమైన వైఖరి లేకపోతే మీతో ఎలా జట్టు కడతాం’ అన్న ఆయన సూటి ప్రశ్నకి అరవింద్ నుండి మౌనమే సమాధానం.

పొత్తులకై విఫల యత్నాలు, డా.మిత్రా ప్రేలాపనలు ఇలా నడుస్తుండగా విజయనగరంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ‘అందని ద్రాక్ష’ సామెతని గుర్తుకు తెచ్చాయి. ‘మాకు ఎవరితోనూ జట్టు కట్టాల్సిన అవసరం లేదు, వస్తే వారినే రమ్మనండి’ అన్న ఆయన మాటలు అంతకు ముందు రోజే అరవింద్ ఢిల్లీలో నడిపిన రాయబారం నేపధ్యంలో ఉష్ట్రపక్షిని మరపించాయి. ‘మా విధానాలు వేరే పార్టీలకి ఎందుకు చెబుతాం? మేం అవన్నీ ప్రజలకే చెబుతాం’, ‘నేనో తెల్ల కాగితం, ప్రజలే సిరా, వారు ఏది రాస్తే అవే మా విధివిధానాలు’ వంటి మెలోడ్రామా డైలాగులు ధియేటర్లలో చప్పట్లు రాల్చటానికి పనికొస్తాయేమో కానీ రాజకీయ పార్టీ విధానాలు చెప్పకుండా తప్పుకోటానికి కాదు. ‘ప్రజలకే చెబుతాం’ అంటే ఏమిటి? ఆయన ఇంటింటికీ వెళ్లి తలుపులు తట్టి తన విధానాలు వివరిస్తాడా? ‘నీ విధానాలతో మాకు పని లేదు, నువ్వొస్తే చాలు అని ప్రజలంటున్నారు’ అని వెన్వెంటనే మరో చెణుకు కూడా పేల్చాడు చిరంజీవి. ఆయన దృష్టిలో ప్రజలంటే ఎవరో ఇంతకీ? ఆయన కుటుంబమా, వందిమాగధ దళమా? చూడబోతే, తను రాజకీయాల్లోకొచ్చి ఏం చేయదల్చుకున్నాడో ఇప్పటికీ ఓ అవగాహన లేనట్లుందాయనకి. ‘అవినీతిని నిరోధిస్తాం, సమ సమాజం స్థాపిస్తాం, ప్రేమ దేశం సాధిస్తాం’ లాంటి వాగాడంబర వాగ్దానాల మోతే తప్ప ఏ విషయంలోనూ ఓ నిర్దిష్ట ప్రణాళిక లేదు. విధానాల విషయంలో స్పష్టత లేకపోవటం ఒకెత్తయితే అధికార పక్షంపై విరుచుకుపడే తొందరలో చేస్తున్న తమాషా వ్యాఖ్యలు మరో ఎత్తు. ‘అధికార పక్షానికి ఎన్నికల ఏడాదే ప్రజాకర్షక పధకాలు ఎందుకు గుర్తొచ్చాయి’ అనేది ఆయన అమాయకపు ప్రశ్న. ఎన్నికల ఏడాదే తను పార్టీ స్థాపించటం ఎందుకో మరి?

‘మేం మిగతా పార్టీల్లా కాదు, ప్రజా సేవ తప్ప మాకు వేరే పరమావధి లేదు’ అని పదే పదే చెప్పేవారు లోక్‌సత్తా వంటి వారితో చేతులు కలపకుండా ఎన్నో కొన్ని ఓట్లు తెచ్చి పెట్టగల పార్టీల అండ కోసం వెంపర్లాడటం ఎందుకో? మిత్రా మాటలు మార్కెటింగ్ ఉపాయాలే అనుకోవాలేమో. అప్పుడు మిగిలిన పార్టీలకీ ప్రజారాజ్యానికీ తేడా ఏముంది?

14 స్పందనలు to “మిత్ర ప్రలాపం”


 1. 1 కె.మహేష్ కుమార్ 11:58 సా. వద్ద అక్టోబర్ 12, 2008

  చిరంజీవి రోడ్ “షో”లకి వస్తున్న జనం ఆశాజనకంగా ఉన్నా, పార్టీవిధివిధానాలు రొమాంటిక్ స్లోగన్లను మించి ఆసక్తికరంగా ఉండటం లేదు. తనపార్టీ profess చేస్తున్న స్వచ్చతకి జయప్రకాష్ నారాయణ్ లాంటివారి integrity తోడైతేతప్ప నిగారింపురాదనే సత్యాన్ని మిత్రా,అర్వింద్ అండ్ పార్టీ ఎప్పుడు గుర్తిస్తారో తెలియడం లేదు. ఆంధ్రప్రజలు (ప్రేక్షకులు) మార్పుని ఆహ్వానిస్తున్నా, ఆ మార్పులో quality కూడా కోరుకుంటున్నారన్నది, “గమ్యం” చూసైనా చిరంజీవి నేర్చుకోవాలేమో!

 2. 2 బాటసారి 3:22 ఉద. వద్ద అక్టోబర్ 13, 2008

  “మా అమ్మ టీవీల్లో నన్ను చూసి ఫోన్ చేసింది. ఏంట్రా అలా మాడిపోయావు… రాజకీయాలంటే కుళ్ళూ కుతంత్రాలు… అవి మనకు అవసరమా అని ఆడిగింది… నేను మాడిపోవడం కాదమ్మా… ఇక్కడ కోట్లాది మంది జనం మాడిపోతున్నారు. నా చెమట సంగతి తర్వాత… వారి కన్నీరు తుడిచే చెయ్యి కరువయింది. జనం నన్ను రమ్మని పిలిచారు. వారికి సేవ చేసే అవకాశం ఎంతమందికి వస్తుందమ్మా అని అడిగాను. అలాగే బాబూ పేదల జీవితాలు బాగుచేసే అవకాశం నీకోచ్చింది.. వెను దిరగకు అని ఆశీస్సులు అందించింది… ”

  అది ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది… చదివితే మీకు రోతగా అనిపించడం లేదా?? నాకైతే అనిపించింది…

  చిత్తశుద్ధి ఉన్నట్టైతే తను రాజకీయాల్లోకి రాకుండా లోక్ సత్తాకి ఎప్పుడో మద్ధతు ప్రకటించేవాడు. తన కుటుంబం, కులం రాజకీయ పలుకుబడి సాధించాలనే కాంక్షతో మాత్రమే తను బరిలోకి దిగుతున్నాడనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం.
  ఒకవేళ పొరబాటున లోక్ సత్తతో పొత్తు పెట్టుకున్నా, అది లోక్ సత్తాకే నష్టం కానీ లాభం చేకూరదు…

 3. 3 bollojubaba 6:03 ఉద. వద్ద అక్టోబర్ 13, 2008

  గూడ్ క్వస్చన్స్
  బొల్లోజు బాబా

 4. 6 అబ్రకదబ్ర 9:47 ఉద. వద్ద అక్టోబర్ 13, 2008

  @మహేష్:

  ప్రరాపాకి విధానాలేమీ ఉన్నట్లు లేదు. ఈ మాత్రం దానికి జనవరి నుండి ఆగస్టుదాకా కసరత్తు చెయ్యటం దేనికో?

  @బాటసారి:

  నిజమే. చాలా సిల్లీగా ఉంది. రేపు బాలయ్య బాబు ఎలాంటి డైలాగులు చెబుతాడో వినాలని ఉంది 🙂 రామారావుని చూసి సినిమావాళ్లంతా వాతలు పెట్టుకుని రాజకీయాల్లోకి దూకుతున్నట్లుందే కానీ ఆయనకున్న నిబద్ధత వీళ్లకి ఉంటుందనేది సందేహమే.

  @బొల్లోజు బాబా:

  ధన్యవాదాలు.

  @కొత్తపాళీ:

  మిత్రాగారు పుచ్చలపల్లి సుందరయ్యగారి బంధువని ఎప్పుడో ఎక్కడో చదివాను (కింద చదువరిగారిచ్చిన లింకులోనే అనుకుంటా).

  @చదువరి:

  ధన్యవాదాలు.

 5. 7 సుజాత 11:29 సా. వద్ద అక్టోబర్ 13, 2008

  చిరంజీవి డైలాగులు వింటుంటే మూర్చ పోవాలనిపిస్తోంది. జనం గురించి ఆయన ఏమనుకుంటున్నాడో ఏమిటో అర్థం కావడం లేదు. స్క్రిప్ట్ రైటరు ఎవరో తెలిస్తే చంపేయొచ్చు!

  సభకి వచ్చిన వాళ్లంతా వోట్లేసేస్తారని అనుకుంటున్నాడో ఏమిటో ఖర్మ! మొమైత్ ఖాన్ సభ పెడితే ఇంతకంటే ఎక్కువ మందే వస్తారు, అంత మాత్రాన్న ఆవిడ సీ ఎం అయిపోతుందా?

  నిన్నటి ఫ్రెష్షు డైలాగు చూశారా….”నేను రాజకీయాల్లోకి రాకపోతే ప్రజలకు ద్రోహం చేసిన వాడినవుతాను” అట.

  బాలయ్య సభలు పెడితే ఎలాగా అని ఇప్పటినుంచే భయంగా ఉంది! వాళ్ళేమో నోరెత్తితే ‘మా వంశం మా వంశం ” అంటారాయె, వాళ్ల వంశం ఎవరికి ఏమి ఒరగబెట్టిందో తెలియకుండానే!

  దేవుడా రక్షించు నా రాష్ట్రాన్ని, సినిమా నటులనుంచి, నటుల్లోంచి నాయకులుగా మారిన వారి నుంచి!

 6. 8 చదువరి 12:57 ఉద. వద్ద అక్టోబర్ 14, 2008

  చిరంజీవి ఒక వాక్యం మాట్టాడ్డం మొదలుపెట్టాక, మధ్యలో కష్టపడి ఆవేశ కావేషాలు చొప్పించినా, ఏదో రకంగా దాన్నో తీరం చేరుస్తాడు! బాలకృష్ణ అలాక్కాదు.. వాక్యం మొదలెట్టాక అది ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని అంశాలను తాకుతూ ఎక్కడ ముగుస్తుందో, అసలు ముగుస్తుందో లేదో కూడా తెలవదు. వాక్యం ముగిసే లోపు వినేవాళ్ళలో ఇహనేం చెబుతాడోననే మహా ఉత్కంఠ రేపుతాడు. ఆ పరుచూరో, మహారథో, మరొకరో రాసిపెట్టినదాన్ని బట్టీపట్టి లాగించాల్సిందే!

 7. 10 babutou 11:56 సా. వద్ద అక్టోబర్ 14, 2008

  కళ్ళతో కనికట్టు చేసి, రక్తాన్ని రాజకీయం కు వారధి కట్టొచ్చని దశాబ్దం
  కిందే పునాది రాల్లేసి
  అమ్మ సెంటిమెంటు తెరపైనే కాదు రాజకీయాల్లోనూ పండిస్తున్న చిరు నాయకునికి
  రాజకీయాలు తెలీదంటారా?
  మీకు నడక రాక మునుపు మధురాలు గుర్తున్నాయా? కాని అరంగేట్రమప్పుడు
  తెరవేల్పు తేటతెల్లం చేసారు అమ్మసంకనెక్కిన మదురాలు మరచిపొలేదని. మనం
  నమ్మక పోయినా మీడియా నమ్మింది, అందుకే అడగలేదు.
  సజావుగా సభలనే నడపలేక తీసుకురాబడే జనాల సావులకు కారణమవుతున్నరని
  అనుకొంటున్నారా, అక్కడె మీరు తక్కువ అంచనా వేసింది ఎందుకంటారా? మరి
  ఎవరన్నా సస్తేనే గదా ఎంతమందొచ్చారో పబ్లిసిటీ రావడానికి, నిజం కాదంటారా
  ఆయనకూ రాజకీయం తెలుసని.

 8. 11 sreedhar 8:30 ఉద. వద్ద అక్టోబర్ 21, 2008

  Chiranjeevi prajala dabbu tho sabha lu pettadam ledu, prajala aarogyam tho aataladu kovadam ledu, AC rooms megastar status panam ga petti praja madya ki vachadu.
  Prajala dabbu vichhala vidi ga karchu petti, valla basic needs gurinchi kuda pattinchu kokunda, spasta maina vidhi vidhanaalatho paripaalinchina/paripaalisthunna netha lanu vadili petti chiranjeevi tummadu daggadu ani silly comments chese vallalo, yekkada chiranjeevi adhikaaram loki vachhesthado anna bhayam yekkuva vundi.

 9. 12 కొత్తపాళీ 10:09 ఉద. వద్ద అక్టోబర్ 21, 2008

  My new slogan .. “Mumaith Khan for CM of AP!”

  “మన్నేలా తింటివిరా కన్నా” .. నా ఆల్టైం ఫేవరెట్ ఐటం సాంగ్!!

 10. 13 sreedhar 1:43 సా. వద్ద అక్టోబర్ 21, 2008

  Kotta paali garu meeru rasikule, naaku kuda edi favourite song ye nandi.
  Sujatha garu next time meeru mumaith khan sabha/dance/concert ki velle tappudu naaku kuda cheppandi neenu kuda vasthanu, mumaith khan cheppe maatalu chiranjeevi maatalla rotha ga vundavu, manchi ramju ga vuntundi sabha/dance/concert.

 11. 14 sreedhar 2:36 సా. వద్ద అక్టోబర్ 21, 2008

  @Baatasari

  Manalanti valla kosame, enni news channels, news papers vachhindi, meeku antha rotha kaliginche vishayala meeda enduku concentrate chesthunnaru, Mee TV remote paadaipoinda daanni vaadandi mastaru, mee bhadala nundi vimukthi kaliginche saadanam mee chethi lone vundi.Mee adrustam baagundi vere channels lo ye KCR, YSR, CBN janaranjaka maina vyakyalu, vidhaanalu, padhakalu chebuthu vundochhu, mee sudi inko rendu roundlu ekkuva tirigi vunte, ye roja no vijaya santhi no praja samasyala gurinchi cherchisthu vuntaru, Mee remote virigi nethilo padithe, Raja sekhar telugu lo maatladu thu vundochhu, leka pothe YSR amma kadupulo lo nunchi enduku puttana ani bhada paduthu vundochhu….

  Mimmalni vuchhaha pariche vishayalu, vudreka pariche vishayalu, merugaina samaaja kosam, prati khanam pratyaka prasaaram cheyyadaaniki gottalu pattu ready ga vunnaru….

  Naa maata vini meeru remote vaadandi….

  Jayaprakash naarayan gaaru neenu degree chadive kaalam nundi netti noru kottu kuntune vunnaru, aayana yedanna sadinche sariki maa pillalu degree poorthi chesestharu… appati varaku chiranjeevi ki oka chance ichhi chusthe pola…..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: