కలాపోసన – 2

ఇది నా యాభయ్యో టపా .. (నిశ్శబ్దం)

ఇద్దీ, నా యాభయ్యో ఠఫా …. (.. చప్పట్లు)

థ్యాంక్యూ, థ్యాంక్యూ. ఈ సందర్భంగా ఎప్పుడూ ఉండే గోడులకి సెలవిచ్చి, మరొక్కసారి మదీయ కలాపోసన జనాలక్కూసింత రుచి చూపిద్దామనుకుంటున్నాను – రొటీన్‌కి కుంచెం భిన్నంగా. (మొదటి కలాపోసన ఇక్కడ)

బంధుమిత్రపరివారంలో పెయింటింగు రంగడిగా నాక్కాస్త పేరుంది. అయితే మొదలెట్టిన దేన్నీ పూర్తి చేయకపోవటం నా విశిష్టత. ఒకటి తొంభై శాతం పూర్తయ్యేసరికి మన దృష్టి మరోదాని మీద పడుతుంది. ఈ విషయంలో పెద్దాయన లియొనార్డో డావించీ నాకు స్ఫూర్తి – ఆయన్లా సర్వంబొచ్చు అనిపించుకోవాలనే కోరికతో రకరకాల రంగాల్లో వేళ్లు పెట్టి తరిస్తుండటం నా ప్రవృత్తి. అంచాత ఇన్నేళ్లలో నేను గీసింది కొన్ని పదుల కళాఖండాలు మాత్రమే. కిందవన్నీ జమానా కాలంలో – అంటే కనీసం పదేళ్ల క్రితం – నేను గిలికిన గీతలు. చూసినోళ్లకి వాటిలో మనుషుల ఆకారాలు కనపడ్డాయట, సరే ఇదేదో బాగానే ఉంది అని దాచి పెట్టుకున్నా. ఈ మధ్య తీసి చూస్తే అవన్నీ దుమ్ము కొట్టుకుని, వెలిసిపోయి ఆకారాలు కనిపించకుండా పోయాయి. ఈ కాలపు టెకణాళజీ వాడి వాటిని కంప్యూటరుకెక్కించి దుమ్ము, ధూళి, బూజు దులిపితే మళ్లీ ఓ ఆకారానికొచ్చాయి. ఈ దులుపుడు ప్రక్రియని స్టైలుగా రిస్టోరేషన్ అంటారట. దాన్నేమంటేనేం, బొమ్మలు తిరిగి గుర్తుపట్టేలా తయారయ్యాయిగానీ పూర్వస్థితికైతే రాలేదు. వాటిలో నాలుగు బ్లాగ్మిత్రుల దర్శనార్ధం ఇక్కడ పెట్టా. మొదటి మూడూ పెన్సిలు గీతలు, చివరాఖరిది పెన్నుతో చుక్కలు పెడుతూ వేసింది. (ఈ చుక్కలు పొడిచే పద్ధతిని pointillism అంటారని ఈ మధ్యనే తెలిసింది. అద్తెల్వకముందు నేనే ఈ టెక్కునిక్కుకాద్యుడ్నంటూ ఎగస్ట్రా పాత్రలు వేస్తుండేవాడ్ని)

ఉపోద్ఘాతమనబడే సోది, సొంతడబ్బా ఐపోయాయి. ఇక చిత్రాలు చూసెయ్యండి.

28 స్పందనలు to “కలాపోసన – 2”


 1. 1 కె.మహేష్ కుమార్ 6:31 సా. వద్ద సెప్టెంబర్ 25, 2008

  మీరు మంచి కళాకారులేనండోయ్! ఒప్పేసుకున్నామ్..చప్పట్లు కొట్టేసుకున్నాం. అర్థ సెంచరీకి అభినందలను.

 2. 3 teresa 6:36 సా. వద్ద సెప్టెంబర్ 25, 2008

  WOW! I am dumbstruck!!
  ఈ చుక్కల బొమ్మ ఎన్నేళ్ళు పట్టిందీ?

 3. 4 Narahara C Dingari 7:22 సా. వద్ద సెప్టెంబర్ 25, 2008

  Very Good Paintings…can you paint them bigger, Can we buy them?

 4. 6 laxmi 8:32 సా. వద్ద సెప్టెంబర్ 25, 2008

  Congratulations andi. Paintings adurs, kani oka chinna doubt… idi kodi guddu meeda eekalu peekatam anukokakandi… andaru sannaga rivatalla unde bommallu (bhamalu) ne ishtabadataru kada, mari meerenti koncham variety ga boddu bhamalanu chitrincharu… out of curiosity.. emanukokande ila adiginanduku

 5. 7 lachhimi 8:46 సా. వద్ద సెప్టెంబర్ 25, 2008

  Nice work
  keeep going u need to complete centuries
  all d best :):)

 6. 9 వేణూ శ్రీకాంత్ 9:14 సా. వద్ద సెప్టెంబర్ 25, 2008

  బొమ్మలు బాగున్నాయండి. 50 వ పోస్ట్ కు అభినందనలు.

 7. 10 phani 10:01 సా. వద్ద సెప్టెంబర్ 25, 2008

  బొమ్మలు అద్భుతంగా ఉన్నాయండీ!

 8. 11 శశాంక 11:12 సా. వద్ద సెప్టెంబర్ 25, 2008

  బొమ్మలు చాలా బాగున్నాయండీ

 9. 12 ramya 11:17 సా. వద్ద సెప్టెంబర్ 25, 2008

  పెన్సిల్ తో గీసినవా!
  చాలా బాగా గీసారు,
  దేనికదే బాగుంది,ఆ పెన్ను చుక్కల బొమ్మ ఇంకొంచెం ఎక్కువ బావుందనిపించింది నాకు.
  కళాపోసన కంటిన్యూ చేయండి, మరిన్ని బొమ్మలు వేస్తూఉండండి.

 10. 13 Phani 1:04 ఉద. వద్ద సెప్టెంబర్ 26, 2008

  చాలా చాలా చాలా బాగున్నాయి.

 11. 14 బ్లాగాగ్ని 1:04 ఉద. వద్ద సెప్టెంబర్ 26, 2008

  మీరు మరీ మోడెస్ట్ అండీ. బొమ్మలు నిజంగా బాగున్నాయి.
  -ఫణి

 12. 15 nagaprasad 2:35 ఉద. వద్ద సెప్టెంబర్ 26, 2008

  బొమ్మలు బాగున్నాయి. అర్థ సెంచరీకి అభినందనలు.

 13. 16 కొత్తపాళీ 3:45 ఉద. వద్ద సెప్టెంబర్ 26, 2008

  wow! YOu should keep a separate blog for your art .. or at least post each picture individually in its own post. I demand it. The pictures demand it.
  There was a Telugu dude in the lodge I stayed at in Pune, circa 1990, who used to “paint” B&W protraits in the pointillism tradition. Is that you by any chance?
  Congratulations on the 50th.

 14. 17 జ్యోతి 4:28 ఉద. వద్ద సెప్టెంబర్ 26, 2008

  50వ పోస్టుకు అభినందనలు.

  ఇంతమంచి బొమ్మలేసి, ఇలా కథల్లల్లేసారేంటండి.. సూపర్‍గా ఉన్నయై. ఇలాగే కంటిన్యూ ఐపోండి. అంటే పాతబొమ్మలు దులపడం కాదు. కొత్త బొమ్మలు . మొదలెట్టండి మరి….

 15. 18 బ్రహ్మి-సాప్ట్ వేర్ ఇంజినీర్ 4:29 ఉద. వద్ద సెప్టెంబర్ 26, 2008

  బొమ్మలు చాలా బాగున్నాయి.

  మీ కళాపోసన కి మీరు వేరు బ్లాగు మొదలు పెట్టాల్సిందే.

 16. 19 సుజాత 5:00 ఉద. వద్ద సెప్టెంబర్ 26, 2008

  బొమ్మలు బాగా వేసారు!
  మీరీ మధ్య రెగ్యులర్ గా రాస్తుంటే కుళ్ళుకున్నాను మీరే ముందు యాభయ్యో పోస్టు రాసేస్తారని! అనుకున్నదే అయింది!
  అభినందనలు! వందో పోస్టు కి పరుగు మొదలెట్టండి మరి!

 17. 20 ramani 6:56 ఉద. వద్ద సెప్టెంబర్ 26, 2008

  50 వ పోస్ట్ శుభాకాంక్షలు.
  నిజంగా కళా పోషణ ఉండాలే కాని, మీరు వేసిన చిత్రాలు మటుకు దేనికవే సాటి. చుక్కల బొమ్మ చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది. నాకెందుకో ఈ వ్యాఖ్య కూడాపోవడంలేదు అనిపిస్తోంది. చాలా బాగున్నాయి మీరు గీసిన, దాచుకొన్న, కళా ఖండాలు. సింప్లీ సుపర్బ్.

 18. 21 నరేంద్ర భాస్కర్ S.P 7:09 ఉద. వద్ద సెప్టెంబర్ 26, 2008

  వామ్మో! మీరేసిన బొమ్మలను అనిమేటర్ ఐన మా తమ్మునికి చూపిస్తే, రెండరింగ్ (అంటే ఎంటో నాకు తెలిదు) చాలాబాగా చేసారు అన్నాడు , అన్ని బొమ్మలూ బాగున్నాయి మరీ ముఖ్యంగా మీసాల పెద్దాయన బాగున్నాడు. పంచుకున్నందుకు ధన్యవాదాలు.

 19. 22 రానారె 8:31 ఉద. వద్ద సెప్టెంబర్ 26, 2008

  మీరు నాలుగు బొమ్మలూ ఒకేసారి చూపించారుగనుక నాలుగోది ఫస్టుక్లాసుగా వుందంటున్నానుగానీ …

 20. 23 రానారె 8:33 ఉద. వద్ద సెప్టెంబర్ 26, 2008

  ఇవి మీ ఊహల్లోనివా లేక ఏదైనా ఫోటోను చూస్తూ వేశారా … చిన్న కుతూహలం.

 21. 25 radhika 11:58 ఉద. వద్ద సెప్టెంబర్ 26, 2008

  అమ్మో…అసలు ఎంతబాగా గీసారండి.ఇంత టేలంటు పెట్టుకునీ అలా మరుగున పెట్టేసారా?ఇప్పటికన్నా పెన్సిలు విదిలించండి.

 22. 26 అబ్రకదబ్ర 2:55 సా. వద్ద సెప్టెంబర్ 26, 2008

  @మహేష్,బొల్లోజుబాబా,పూర్ణిమ,లచ్చిమి,వంశీ,వేణుశ్రీకాంత్,ఫణి,శశాంక,ఇంకో ఫణి,బ్లాగాగ్ని,నాగ ప్రసాద్,బ్రహ్మి,నెటిజన్:

  చాలా చాలా ధన్యవాదాలు.

  @తెరెసా:

  చుక్కలబొమ్మ ఏళ్లు కాదండీ, గంటలే పట్టింది. ఐదో ఆరు గంటలు. నిమిషానికి సుమారు రెండొందల చుక్కలు.

  @నరహర:

  Never thought of selling my work dude. But thank you for asking 🙂 That’s a great compliment.

  @లక్ష్మి:

  పదేళ్ల క్రితం నే గీసినప్పుడు ఈ భామలూ రివటలేనండీ. ఇన్నేళ్లలో కాస్త ఒళ్లు చేశారు 🙂

  @రమ్య,నరేంద్ర భాస్కర్:

  నాకూ చుక్కలబొమ్మే ఎక్కువ నచ్చింది. కానీ ఎక్కువ కష్టపడింది మాత్రం మొదటి బొమ్మకోసం – ముఖంలో ఉండీ లేనట్లుగా ఉన్న వెలుగు నీడలు చూపటానికి.

  @కొత్తపాళీ:

  ఆ తెలుగు డ్యూడ్ నేను కాదండీ. పూనే ఎప్పుడూ రాలేదు నేను. మీ సూచనకి ధన్యవాదాలు. వేరే బ్లాగులో కాదుగానీ, అప్పుడప్పుడూ ఇక్కడే ప్రదర్శిస్తాను.

  @జ్యోతి,రాధిక:

  గత పదేళ్లలో నేను మూడు ఆయిల్ పెయింటింగ్స్ మొదలు పెడితే ఒకటి 90 శాతం, మిగతావి రెండూ 50 శాతమే పూర్తయ్యాయండీ. అవి తప్ప నేను గీసిన స్కెచ్‌లు కూడా ఏవీ లేవీ దశాబ్దంలో. అసలు నేను బొమ్మలేస్తాననే సంగతే మర్చిపోయినట్లున్నాను. మొన్నెందుకో పాత గీతల పుస్తకం తిరగేస్తుంటే వాటి ఆకారం చూసి దిగులేసింది. అందుకే దుమ్ము దులిపి కొన్నిటిని ఇక్కడ పెట్టాను.

  మీరంతా చెప్పారని కాకున్నా, కొన్నాళ్ల నుండీ మళ్లీ చిత్రలేఖనమ్మీదకి దృష్టి మళ్లుతుంది. కొత్త చిత్రాలు మొదలు పెడతాను త్వరలోనే.

  @సుజాత:

  రాతల విషయంలో ఇకనుండీ స్లో ఐపోబోతున్నాలెండి. ఈ సారి వందో టపా సందర్భంలో మీ ఈ కామెంటు కత్తిరించి మీ బ్లాగులోనే అంటిస్తా.

  @రమణి:

  మీ అందరి వ్యాఖ్యల ధాటికి నాలోని రాతగాడు వెనక్కెళ్లిపోయి గీతగాడు బయటికొచ్చేస్తున్నాడు. కొన్నాళ్లపాటు బ్లాగటం ఆపేసి బొమ్మలమీద పడాల్సిందే ఇక.

  @రానారె:

  ఊహలు కాదండీ. ఎక్కువగా ఫొటోలనుండే గీస్తుంటాను. కాకపోతే మక్కీకి మక్కీ దించెయ్యటం కాకుండా నా క్రియేటివిటీ కాస్త జోడిస్తుంటాను. ట్రేసింగ్ లాంటివేవీ ఉండవు – ఫ్రీహ్యాండ్ అన్నమాట.

 23. 27 venkat 5:24 ఉద. వద్ద జనవరి 27, 2010

  chala bagunnavi,
  modahati photo chala baga nachidi naku
  nice painting


 1. 1 కలాపోసన - 3 « తెలు-గోడు 7:10 సా. వద్ద డిసెంబర్ 1, 2008 పై ట్రాక్ బ్యాకు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 303,010

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: