కొన్నేళ్ల క్రితం నోస్ట్రడేమస్ పేరుతో ఇంటర్నెట్లో విపరీతంగా చలామణి అయిన ఆంగ్ల పద్యం ఇది.
In the City of God there will be a great thunder
Two Brothers torn apart by Chaos
While the fortress endures, the great leader will succumb
The third big war will begin when the big city is burning
నోస్ట్రడేమస్ – పదహారో శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ ఫ్రెంచ్ కాలజ్ఞాని. మనవాళ్లు ఎక్కడేం జరిగినా ‘బ్రహ్మంగారు అపుడే చెప్పాడోయ్’ అన్నట్లు పాశ్చాత్య ప్రపంచంలో ఏ దారుణం జరిగినా నోస్ట్రడేమస్ దాన్ని శతాబ్దాల క్రితమే కలగన్నాడని చెప్పటం పరిపాటి. దానికి తాజా ఉదాహరణ సెప్టెంబరు 11 దాడులని నోస్ట్రడేమస్ ముందే ఊహించి రాసినట్లు చెప్పబడుతున్న పై పద్యం. నోస్ట్రడేమస్ అభిమానుల ప్రకారం పై పద్యంలోని ‘సిటీ ఆఫ్ గాడ్’ అనేది న్యూయార్క్ నగరం; ‘గ్రేట్ థండర్’ అనేది విమాన దాడి; ‘టు బ్రదర్స్’ అనబడేది ప్రపంచ వాణిజ్య కేంద్ర జంట భవనాలు; ‘ఫోర్ట్రెస్’ అనబడేది పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ కార్యాలయం); ‘గ్రేట్ లీడర్’ మరెవరో కాదు, ప్రెసిడెంట్ బుష్.
ఏడేళ్లనాటి దారుణాన్ని శతాబ్దాల క్రితమే ఊహించగలగటం ఎంత గొప్ప? కాలజ్ఞానమా మజాకా!
* * * *
నీల్ మార్షల్ – కెనడాలోని బ్రాక్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి. ఇతను 1997లో చదువులో భాగంగా, నోస్ట్రడేమస్ వంటి కాలజ్ఞానులు ఎంత తెలివిగా ఎలా వీలయితే అలా మలచుకోవటానికి వీలుగా తమ ప్రవచనాలు (ప్రోఫెసీస్) రాస్తారో వివరిస్తూ ఒక తులనాత్మక వ్యాసం రాశాడు. అందులో, ఒక సమర్ధుడైన రచయిత పదాలతో ఆడుకోవటం ద్వారా ఒకే వాక్యంలో రకరకాల అర్ధాలు స్ఫురించేలా చెయ్యటం ఎలా సాధ్యమో ఉదహరిస్తూ నీల్ మార్షల్ స్వయంగా నోస్ట్రడేమస్ శైలిలో మూడు వాక్యాల పద్యమొకటి రాశాడు. నోస్ట్రడేమస్ ప్రవచనాలు ఎన్ని సంఘటనలకి అన్వయించటానికి వీలుగా ఉంటాయో సోదాహరణంగా తెలియజెప్పాలని అతని ప్రయత్నం.
ఇది సెప్టెంబరు 11 దాడులకి నాలుగేళ్ల క్రితం జరిగిన కధ. నీల్ మార్షల్ వ్యాసం అప్పట్లోనే కొన్ని ఇంటర్నెట్ సైట్లలో ప్రచురితమయ్యింది. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఇంటర్నెట్లో నోస్ట్రడేమస్ ప్రవచనాల కోసం గాలిస్తున్న కొందరు అభిమానుల దృష్టిలో ఈ పద్యం పడింది. వాళ్లు ఎగిరి గంతేసి పూర్వాపరాలు చూసుకోకుండా అది నోస్ట్రడేమస్ రాసిందే అని నమ్మేసి ఇ-మెయిల్ రూపంలో స్నేహితులకి పంపటం మొదలు పెట్టారు. మరెవరో దానికి నాలుగో వాక్యం అదనంగా జోడించారు. కొన్నాళ్లలో ఈ పద్యం అంతర్జాలమంతా అల్లుకుపోయింది. అసలు కధ తెలీనోళ్లంతా అనుకున్నదొకటే: ‘కాలజ్ఞానమా, మజాకా’.
* * * *
‘కాలజ్ఞానంపై నమ్మకం లేని నాలాంటి ఓ సాదా సీదా విద్యార్ధి నాలుగేళ్ల ముందే 9/11 ని ఊహించగలిగితే, నోస్ట్రడేమస్ వంటి మాటల మరాఠీ వేలకొద్దీ ప్రిడిక్షన్స్ చెయ్యటంలో వింత ఏముంది?’. ఇది, తన పద్యం రేపిన దుమారంపై స్పందిస్తూ నీల్ మార్షల్ అన్న మాట.
కాలజ్ఞానుల గుట్టంతా వాళ్ల పదకట్టులోనే ఉంది. అలవోకగా నాలుగైదు సందర్భాలకి సరిపడేలా వాక్యాలు అల్లేస్తారు. వీటిలో స్థల కాలాల ప్రస్తావనుండదు, వ్యక్తుల పేర్లూ ఉండవు. ఉండేదల్లా నిఖార్సైన అస్పష్టత. వేలాది ప్రిడిక్షన్స్ చేసి అవతల పారేస్తే కాకతాళీయంగా వాటిలో ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు ఈ విశాల ప్రపంచంలో ఎక్కడో ఒకచోట జరిగే ఏ బుల్లి సంఘటనకో అతక్కపోతుందా? పై పద్యమే చూడండి. మక్కాలో భూకంపం వచ్చి ఇద్దరు కవల సోదరులు మరణించినా కాలజ్ఞానమే, వాటికన్లో పిడుగులు పడి రెండు చెట్లు కూలినా కాలజ్ఞానమే. సిటీ ఆఫ్ గాడ్ అంటే ఏ నగరమైనా కావచ్చు. టు బ్రదర్స్ ఎవరైనా కావచ్చు. గ్రేట్ రూలర్ ఏ దేశాధినేతయినా కావచ్చు. అన్వయించేవాళ్ల సృజనాత్మకతే హద్దుగా ఇటువంటి ప్రవచనాలని సర్వకాలాల్లోనూ ఏదో ఒక సంఘటనకి అనుసంధానించొచ్చు.
తర్కించేకన్నా తెలీని ఏదో శక్తిని గుడ్డిగా నమ్మటం మిన్న అనుకునే బుద్ధిజీవులు మెండుగా ఉన్న లోకమిది. ఏదైనా ఊహించని ఘోరం జరిగితే ‘బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు’ అనుకుని సమాధానపడటం వీళ్లకలవాటు. వీళ్ల నమ్మకాలతో ఆడుకోవటమంటే కాలజ్ఞానులకి సరదా. లేకపోతే వాళ్లు ఎక్కువగా జరగబోయే చెడునే ఊహిస్తారేం?
Very good essay!
బ్రహ్మం గారి కాలజ్ఞానం ఇలా ఉండదు. ఆయన ఊరి పేర్లతో కూడా చెప్పాడు. ఉదాహరణకు: “యాగంటి బసవయ్య అంతకంతకూ పెరిగి కలియుగాంతాన రంకెలేసేను” లాంటివి.
EXCELLENT ఎందుకో మరి అధుతంగా ఉంది. వాళ్ళకలవాటు కానీ నేను బ్రహ్మం గారిని శాక్తులను బా నమ్ముతాను. అసలు ఎవరన్నా మాలతీ-మాధవీయం అనే పుస్తకం గురించి రాస్తే బావుండు. నా దగ్గరలేదు కానీ దానికోసం తిరగని చోటు లేదు సంస్కృతం లో ఉండే పుస్తకం లో శ్రీకాకులం అడవుల గురించి ఎన్నో రహస్యాలు మన పూర్వీకులు పొందుపరచారు. అని పెద్దల ద్వారా విన్నాను. ఎమైనా మంచి టపా
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb2009/pracheenasahityam.html
meeru adigina book link
re: సుగాత్రి, అశ్విన్ బూదరాజు గార్ల comments …
Hmm!
మీకు లభ్యమయితే ఈ క్రింద వ్యాసం సంపాదించి చదవండి. “బ్రహ్మం గారి కాలజ్ఞానం” గురించి మంచి చర్చ వుంటుంది.
V. నారాయణరావు: “Texture and Authority: Telugu Riddles and Enigmas.”
In: Untying the Knot: On Riddles and other Enigmatic Modes, pp.191-207
Galit-Hasan-Rokem and David Shulman (Eds)
Oxford University Press, 1996
అశ్విన్ గారు: శ్రీకాకుళం అడవుల “రహస్యాలే”మి ఖర్మ మన విజయవాడ కొండల, గుట్టల “రహస్యాలు” కూడా వుంటాయి “మాలతీ మాధవం”లో. ఆ “పెద్దల్నే” అడగండి! కొంపతీసి ఈ మధ్య కాలంలో “మాధవం” కి ఒక “య” జోడించి భవిష్యద్రష్టలెవరూ కొత్తగా ఒక మాహాకావ్యం రాయలేదు కదా!?
అయినా “దానికోసం తిరగని చోటు లేదు” అని కాస్త పొయటిక్ గా మాట్లాడుతున్నారు! ఆ పుస్తకం దొరకకపోవడమేమిటి? తెలుగులో బోలెడు అనువాదాలున్నాయి. ఆంగ్లంలో కూడా. ఇంకా ఆ మాటకొస్తే తెలుగులో (హిందీలో)ఆ కథ సినిమాగా కూడా తీసారు. కాస్త వూళ్ళో బందరు రోడ్డు, బెంజి సర్కిల్ ప్రాంతాల్లో వున్న (మంచి) లైబ్రరీలకు వెళ్ళి చూడండి. “తిరగని చోటు లేదు” అని మాత్రం అనకండే!
— శ్రీనివాస్
This article is eyeopener to so many. I except some more articles like this in future.
ఇంటెరెస్టింగ్! మొన్నా మధ్య హెడ్ లైన్స్ టుడే వాడు స్పెషల్ ప్రోగ్రాములు కూడా ఇచ్చినట్టు గుర్తు నోస్ట్రడేమస్ పై! మీ వ్యాసం బాగుంది.
10000 హిట్ల సందర్భంగా congrats. మూడు వారాల్నించీ వారానికో బ్లాగు 10,000 దాటేస్తంది. మీరు కూడా అద్రుష్ట పాఠకుడికి ప్రైజిస్తున్నారా అబ్రకదబ్ర?
kaani antha easy gaa teesi paareyyakandi sir mana bramham gaarini. he even predicted that there would come a day when men would shave their moustache 🙂 koorchuni aalochisthe ilantivi manaku kooda vasthayemo. but in this fast world who has time to sit for hours together and THINK.