పన్ను నొప్పి

కొన్నేళ్లుగా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం. నీటిలో సహజంగా ఉండే కాల్షియం ఫ్లోరైడ్ శాతం మోతాదు మించటం వల్ల వచ్చే సమస్య ఇది. ఈ నీటిని తాగటం, వంటల్లో ఉపయోగించటం వల్ల ఎముకల పటుత్వం లోపించటం, బుద్ధిమాంద్యం, కేన్సర్, జన్యు పరమైన లోపాలు, ఇతరత్రా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో ఫ్లోరోసిస్ సమస్యపై పోరాటానికి ప్రభుత్వం ప్రతి ఏటా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అయితే అమెరికాతో సహా కొన్ని పాశ్చాత్య దేశాల్లో మునిసిపాలిటీలు సరఫరా చేసే మంచినీటిలో కాల్షియం ఫ్లోరైడ్ కన్నా రెట్టింపు ప్రమాదకరమైన సిలికో ఫ్లోరైడ్ అనే పదార్ధాన్ని కలపటం తప్పనిసరి చేస్తూ చట్టాలున్నాయన్నది ఓ నమ్మలేని నిజం. అమెరికాలో దశాబ్దాల క్రితం పెట్టుబడిదారీవర్గాల సారధ్యంలో రూపుదిద్దుకున్న ఓ మహానాటకం నేడు ప్రపంచవ్యాప్తంగా దంత వైద్యుల పంట పండిస్తుందన్నది మరో కలవరపరిచే నిజం. ఏ దేశంలో ఉన్నా, మీరూ ఈ మాయవలలో చిక్కిన చేపలే అయ్యుండే అవకాశం మెండు. చదవండి.

                                    * * * *

1909లో అమెరికాలో కొలరాడో రాష్ట్రంలో ఫ్రెడెరిక్ మెకే అనే దంతవైద్యుడు ఓ విషయం గమనించాడు. ఆ రాష్ట్రంలోని కొలరాడో స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో చాలామంది వ్యక్తుల దంతాలు ఇతర ప్రాంతాల వారితో పోలిస్తే ఎక్కువగా గార పట్టి, చాలా పెళుసుగా ఉండేవి. వాటి మీద పసుపు రంగులో మచ్చలు కూడా ఉండేవి. నేటి దంతవైద్యుల పరిభాషలో ఇది డెంటల్ ఫ్లోరోసిస్ అనబడే పళ్ల జబ్బు. అప్పట్లో దాన్ని కొలరాడో బ్రౌన్ స్టెయిన్ గా పిలిచేవారు. కొలరాడో బ్రౌన్ స్టెయిన్ ఉన్నవారి దంతాల్లో కేవిటీ (రంధ్రాలు) సమస్యలు చాలా తక్కువగా ఉండటం ఫ్రెడరిక్ మెకేని ఆశ్చర్యపరచింది. తన పరిశీలనని ఆయన ఇతర దంతవైద్యులతో పంచుకున్నాడు. వార్తా పత్రికల ద్వారా ఈ విషయం ఇతరుల దృష్టిలోకీ వచ్చింది.

తరువాత రెండు దశాబ్దాల పాటు దీని మీద అధ్యయనాలు జరిగాయి. అవి తేల్చినదేమంటే, కొలరాడో బ్రౌన్ స్టెయిన్ కలగటానికి కారణం అక్కడి నీళ్లలో అధిక శాతంలో ఉన్న ఫ్లోరైడ్. ఆ ప్రాంత ప్రజలకి కేవిటీ సమస్యలు లేకపోవటానికీ ఫ్లోరైడే కారణం! ఇటువంటి అధ్యయనాల్లో ఎక్కువవాటికి నిధులు సమకూర్చింది అల్కోవా అనబడే అల్యూమినం కంపెనీ ఆఫ్ అమెరికా. ప్రపంచంలోని అతి పెద్ద అల్యూమినం ఉత్పత్తి సంస్థల్లో ఇది ఒకటి. పంటి జబ్బుల మీద ఒక అల్యూమినం తయారీ సంస్థకి అంత ఆసక్తి ఎందుకు?

                                    * * * *

1930లలో అమెరికాలో పారిశ్రామికీకరణ వెల్లువెత్తింది. ఎక్కడ చూసినా కొత్త రకాల వస్తువులు. పాలిమర్ విప్లవంతో మార్కెట్లని ముంచెత్తిన నైలాన్, లిక్రా, మైలార్, టెఫ్లాన్ వగైరా వింత వస్త్రోత్పత్తులు. అదే సమయంలో అధికమైన రాగి, ఇత్తడి, అల్యూమినం వస్తువుల వినియోగం. జనాలు వేలం వెర్రిగా వీటితో తయారు చేసిన వస్తువులు కొనటానికి ఎగబడేవాళ్లు. ఈ సందడిలో ఎవరూ అంతగా దృష్టి పెట్టని విషయం: పారిశ్రామిక వ్యర్ధాలు.

రాగి, ఇనుము, సత్తు (అల్యూమినం) వగైరా తయారీ పరిశ్రమల్లో ఉత్పత్తయ్యే పారిశ్రామిక వ్యర్ధం ఫ్లోరైడ్. విషపూరితమైన ఈ పదార్ధాన్ని వదిలించుకోటానికి రెండే మార్గాలు. ఒకటి, శుద్ధి చేయటం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని, పైగా దాని వల్ల ఆయా పరిశ్రమలకి వచ్చే లాభమూ లేదు. రెండు, ఎలుకల మందు లాంటి విషపూరిత పదార్ధాల తయారీలో వాడటం. అమెరికాలో ఉన్న ఎలుకలన్నింటినీ సంహరించటానికి ఆ దేశంలో ఉత్పత్తయ్యే ఫ్లోరైడ్‌లో అతి కొద్ది శాతం చాలు. మరి మిగిలిన దాన్ని వదిలించుకోవటమెలా? దాన్నలాగే వదిలేస్తే గాలి, నీరు ద్వారా వ్యాపించి ప్రజల ఆరోగ్యాలకి హాని చేసే ప్రమాదం ఉంది. ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు అనే పేరు పరిశ్రమల మనుగడకి అతి ప్రమాదకరం. మరోవంక ప్రభుత్వమూ ఈ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి. పారిశ్రామికీకరణ వేగాన్ని తగ్గించటమో, ఆయా వస్తువుల ఉత్పత్తినే ఆపేయటమో ప్రభుత్వానికి తలకు మించిన పని. మహా మాంద్యం, మొదటి ప్రపంచయుద్ధం దెబ్బల నుండి అప్పుడే తేరుకుంటున్నఅమెరికా ఆర్ధిక వ్యవస్థని దెబ్బదీసే ఏ చర్యకీ ప్రభుత్వం ఒడికట్టలేదు. ఆ దశలో ఫ్రెడెరిక్ మెకే పరిశీలన పరిశ్రమలకి ఊహించని వరం.

                                    * * * *

డ్యూపాంట్ – రసాయనాల తయారీలో రెండువందల సంవత్సరాల పైబడ్డ చరిత్ర ఉన్న కంపెనీ. ప్రపంచంలో రెండవ అతి పెద్ద కెమికల్స్ తయారీ సంస్థ. వస్త్ర ప్రపంచంలో నైలాన్, టెఫ్లాన్ వంటి విప్లవాత్మక ఆవిష్కరణలు వీరివే. ఇటువంటి వస్త్రాల తయారీకి ఉపయోగించే రసాయనాల్లో ఫ్లోరైడ్ కీలకమైనది. రెఫ్రిజిరేటర్లలో వాడే క్లోరోఫ్లోరోకార్బన్లు కూడా డ్యూపాంట్ ఆవిష్కరణలే. దీని తయారీలోనూ ఫ్లోరైడే కీలకం. ఫ్లోరైడ్ సంబంధిత ఆరోగ్య సమస్యల గురించి కార్మికుల నుండి, ప్రజల నుండీ వస్తున్న వత్తిడి తప్పించుకోవటానికి డ్యూపాంట్ శతవిధాల ప్రయత్నిస్తున్న కాలం అది.

ఫ్లోరైడ్ వల్ల ఉపయోగాలున్నాయంటూ వచ్చిన వార్తలు సహజంగానే వీరి చెవులకి ఇంపు. అల్కోవాకి అల్యూమినం తయారిలో ఉత్పన్నమైన ఫ్లోరైడ్ వ్యర్ధాన్ని తక్కువ ఖర్చుతో, వీలైతే ఎంతో కొంత లాభంతో వదిలించుకోవటం ముఖ్యం. డ్యూపాంట్‌కి ఫ్లోరైడ్ వల్ల మేలే కానీ కీడు లేదని ప్రజల్ని నమ్మించటం ముఖ్యం. ఇలాంటి భారీ సంస్థలు తలచుకుంటే తిమ్మిని బమ్మిని చేయటం ఎంత సేపు? దంత క్షయాన్ని అరికట్టటానికి ప్రతి ఒక్కరూ రోజుకి కొద్ది శాతంలో ఫ్లోరైడ్ తీసుకోవటం మంచిది అని ప్రతిపాదించే అధ్యయనాలు వెను వెంటనే వెలుగు చూశాయి. ఇటువంటి అధ్యయనాలకి నిధులు సమకూర్చిందెవరో చెప్పటానికి పెద్దగా తెలివితేటలక్కరలేదు. గమనించాల్సిన విషయమేమిటంటే, ఇవి కేవలం అధ్యయనాలే –  శాస్త్రీయ పరిశోధనలు కావు. అదే సమయంలో ఫ్లోరైడ్ చేసే హాని గురించి జరుగుతున్న పరిశోధనలు ఆశ్చర్యకరంగా నిధుల లేమితో నిలిచిపోయాయి. దేశరాజధానిలో రాజకీయుల అండదండలు సాధించటమూ ఈ సంస్థలకి కష్టమైన పనేం కాదు. 1945లో దేశమంతటా మునిసిపాలిటీలు సరఫరా చేసే మంచినీటిలో కొంత శాతం ఫ్లోరైడ్ కలపటం తప్పనిసరి చేస్తూ ఓ శాసనం వెలుగు చూసింది. ప్రజల దంతారోగ్యానికి ఇది తప్పనిసరి అని ప్రభుత్వ వివరణ! (ఈ శాసనాన్ని అమలు చేయని మునిసిపాలిటీలూ ఉన్నాయి – అది అమెరికన్ ఫెడరల్ విధానంలోని విశిష్టత). 1955 నాటికి దేశంలో 65 శాతం ప్రజలు ఫ్లోరైడ్ కలిసిన మంచినీటినే తాగసాగారు. అల్కోవా రొట్టె విరిగి నేతిలో పడింది. ఇలా మంచినీటిలో కలిపే ఫ్లోరైడ్ లో అధిక శాతం అల్కోవా వారి కర్మాగారాల్లో ఉత్పత్తయ్యే వ్యర్ధమే మరి! పనిలో పనిగా ఏకంగా టూత్‌పేస్టుల్లోనే ఫ్లోరైడ్ కలిపితే అది మరింత సమర్ధంగా దంతక్షయాన్ని అరికడుతుందనే నివేదికలూ సృష్టించబడ్డాయి. అమెరికన్ డెంటిస్ట్స్ అసోసియేషన్ (అడా) మీద వత్తిడి తెచ్చి టూత్‌పేస్టుల్లో ఫ్లోరైడ్ ఉండటం మంచిది అనే వాదన అంగీకరించేలా చేశారు. అడా సూచనతో టూత్‌పేస్ట్ తయారీ సంస్థలు కేవిటీ ప్రొటెక్షన్ పేరుతో ఫ్లోరైడ్ కలిపిన పేస్టులు అమ్మటం మొదలు పెట్టాయి. అలా అటు మునిసిపాలిటీలకీ, ఇటు టూత్‌పేస్టు తయారీదార్లకీ ఇబ్బడి ముబ్బడిగా ఫ్లోరైడ్ అమ్మి పరిశ్రమలు పారిశ్రామిక వ్యర్ధాల నుండి కూడా సొమ్ములు చేసుకోసాగాయి. ప్రోక్టర్ అండ్ గేంబుల్ (కోల్గేట్ తయారీదారు) వంటి బహుళజాతి సంస్థల ద్వారా ఇటువంటి యాంటీ కేవిటీ టూత్‌పేస్టులు త్వరలోనే ప్రపంచమంతటా వ్యాపించాయి. ఈనాడు ప్రపంచంలో వాడే టూత్‌పేస్టుల్లో ఎనభై ఐదు శాతం పైగా ఫ్లోరైడ్ కలిపినవే – చిన్న పిల్లల టూత్‌పేస్టులతో సహా!

                                    * * * *

అమెరికాలో ‘దంతారోగ్యానికి ఫ్లోరైడ్’ ప్రయోగం మొదలై అరవయ్యేళ్లు గడిచాయి. ఈ మధ్య కాలంలో ఫ్లోరైడ్ గురించి అనేక శాస్త్రీయ పరిశోధనా ఫలితాలు వెలుగు చూశాయి. అవన్నీ తేల్చిన విషయం ఒకటే: దంత క్షయం తగ్గించటంలో ఫ్లోరైడ్ పాత్ర ఏమీ లేదు. అసలు ఈ కధలో కీలకమైన ‘కొలరాడో బ్రౌన్ స్టెయిన్’ బాధితుల దంతాల్లో రంధ్రాలు ఏర్పడకపోవటానికి అక్కడి నీటిలో సమృద్ధిగా ఉన్న మెగ్నీషియం మరియు కాల్షియం కారణమే కానీ ఫ్రెడెరిక్ మెకే అనుకున్నట్లు ఫ్లోరైడ్ కాదు. పైగా, మితిమీరిన ఫ్లోరైడ్ వినిమయం వల్ల ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఇప్పటికే అమెరికన్లకి అనుభవంలోకొచ్చిన విషయం. టూత్‌పేస్టుల్లోని ఫ్లోరైడ్ రంధ్రాలు అరికట్టినా లేకున్నా డెంటల్ ఫ్లోరోసిస్ మాత్రం తెచ్చిపెడుతుంది. దీన్ని వదిలించుకోటానికి  మూడ్నెల్లకో, ఆర్నెల్లకో ఒకసారి క్రమం తప్పకుండా దంతవైద్యులని దర్శించటం తప్పనిసరి. అలా వెళ్లిన ప్రతి సారీ వందలాది డాలర్లు వదిలించుకోవటమూ రివాజు. ఫ్లోరైడ్ వల్ల పచ్చబడ్డ పళ్లని తిరిగి తెల్లగా మెరిసేలా చెయ్యటానికి ప్రత్యేక పేస్టులు, ఇతరేతర ఉత్పత్తుల కోసం మరిన్ని వందలు క్షవరం.

ఫ్లోరైడ్ వ్యతిరేక వర్గాల వత్తిడితో కొన్నేళ్లుగా అమెరికాలో అనేక మునిసిపాలిటీలు మంచినీటి సరఫరాలో ఫ్లోరైడ్ కలపటాన్ని ఆపి వేస్తున్నాయి. అలాగే, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఏ) సూచనతో టూత్‌పేస్టు తయారీదారులు యాంటీ కేవిటీ పేస్టుల మీద ‘ఈ పేస్టుని మింగటం లేదా అవసరమైన దానికన్నా ఎక్కువ మొత్తంలో వాడటం ప్రమాదకరం. అటువంటివి జరిగితే వెంటనే పాయిజన్ కంట్రోల్ శాఖని సంప్రదించండి’ అని ముద్రించటం మొదలు పెట్టారు (మీరు అమెరికాలో ఉన్నట్లయితే మీ టూత్‌పేస్టు మీది ‘వార్నింగ్’ ని ఓ సారి గమనించండి). ఎలుకల మందులో కలిపే విషాన్ని టూత్‌పేస్టుల్లో వాడేసి ‘మేం అప్పుడే చెప్పాం’ అని చేతులు దులుపుకోవటమన్నమాట ఇది!

18 స్పందనలు to “పన్ను నొప్పి”


 1. 1 కె.మహేష్ కుమార్ 8:31 సా. వద్ద సెప్టెంబర్ 4, 2008

  నల్గొండలో ఫ్లోరైడ్ తీవ్రత చాలా అధికం.BSI ప్రకారం desired level 1ppm (mg/l) ఐతే చాలావరకూ 1.5 ppm ఫరవాలేదంటారు. కానీ నల్గొండలో దాదాపు 4 ppm ఉండటం ప్రమాదస్థాయిని దాటింది. గత 15 సంవత్సారులుగా ప్రభుత్వం, ఇతర సంస్థలు చాలా ప్రయత్నాలు చేసినా భూగర్భజలాలలో ఫ్లోరైడ్ ను తగ్గించడానికి ఏమీ చెయ్యలేక, కేవలం ఆ నీటిని త్రాగడానికి అనువుగా చేసే techniques ని అమలు పరిచారు. అదే నల్గోండ టెక్నిక్ గా ప్రపంచవ్యాప్తంగా పిలువబడుతుంది.కాకపోతే ఇప్పటికే దీని ద్వారా జరగవలసిన డ్యామేజ్ ఒక తరానికి జరిగిపోయింది.ఇంకా సమస్య పూర్తిగా తీరనుకూడా లేదు.

 2. 2 రాజేంద్ర కుమార్ దేవరపల్లి 11:08 సా. వద్ద సెప్టెంబర్ 4, 2008

  ఇంత చక్కగా ఈ సమాచారాన్ని అందించినందుకు ఆనందించాలో,ఇటువంటి దాఋణం దశాబ్దాలుగా అంతటి అగ్రరాజ్యం నుంచి మొదలై పట్టిపీడిస్తున్న సంగతిని బయటపెట్టినందుకు బాధపడాలో అర్ధం కాని సంధిగ్ధావస్థలోకి మమ్మల్ని నెట్టారు.మరి అమెరికాలోని వినియోగదారుల చట్టం చాలా శక్తివంతమైనదనీ,ఏళ్ళక్రితం నేరాలనూ ఎంతో సమర్ధవంతంగా విచారించి తీర్పులిస్తుందంటారు,మరి ఈ అకృత్యం పట్ల వాటి స్పందన ఏమిటో చెప్పగలరా?అలాగే అక్కడి గ్రీన్ సంస్థలు,ఇతర ప్రజా సంఘాలు.మీడియా వారి అభిప్రాయాలనూ కాస్త కూలంకషంగా చర్చించండి.

 3. 3 Saraswathi Kumar 11:15 సా. వద్ద సెప్టెంబర్ 4, 2008

  కాపిటలిస్టు స్వార్ధం ఎలా ఉంటుందో బాగా వివరించారు.

 4. 5 సుజాత 6:28 ఉద. వద్ద సెప్టెంబర్ 5, 2008

  మేము ఇండియాలో ఉన్నాం కనుక మా పేస్టుల మీద అటువంటి వార్నింగ్ లేవీ ఉండవు. అందువల్ల మేము, మా పిల్లలు అందరం ఫ్లోరైడ్ కలిపిన టూత్ పేస్టులని ఎటువంటి ఇబ్బందీ లేకుండా వాడుతూ, మింగుతూ ఉంటాము!

  నల్గొండ జిల్లాలోనే కాదు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ ఫ్లోరైడ్ సమస్య ఉంది. వినుకొండ, మార్కాపురం వంటి ప్రాంతాల్లో మనుషులు మెడ వెనక్కి తిప్పి చూడ లేరు. పూర్తిగా వెనక్కి తిరగాల్సిందే! ఆకాశం కేసి చూడాలంటే పడుకుని చూడాల్సిందే! మళ్ళీ ఎప్పుడు ఫ్లోరైడ్ సమస్యల మీద అధ్యయనాలు, క్షేత్ర పర్యటనలు జరుగుతూనే ఉంటాయి. జనానికి ఒరిగేది మాత్రం సున్నా! ముఖ్యంగా వృద్ధుల్ని, పిల్లల్ని ఫ్లోరైడ్ బాధితులుగా చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది.

  టపా చాలా informative గా ఉంది.

  శీర్షిక చూసి tax గొడవ అనుకున్నా!

 5. 7 radhika 8:13 ఉద. వద్ద సెప్టెంబర్ 5, 2008

  ఏంటీ కేవిటీ ప్రొటెక్షన్ అని చూసి మరీ కొంటాము మేము పేస్టుని.ఇండియాలో వున్నంతకాలం నాపళ్ళు బానే వుండేవి.గత ఏడాదిగా పసుపురంగులోకి మారుతున్నాయి.అలా అని మావారికి చెపితే నీకు హడావుడి ఎక్కువైపోయి సరిగా తోముకోవడం లేదని అంటున్నారు.పళ్ళు తెల్లబడే పేస్టులు,మౌత్ వాషనర్స్, స్త్రైప్స్ అవి వాడుతూ కాలం గడుపుతున్నాను.

 6. 8 cbrao 10:07 ఉద. వద్ద సెప్టెంబర్ 5, 2008

  చాలా సమాచారమున్న వ్యాసం అందించారు. నెనర్లు. మీ గురించి కూడా చెప్పండి.

 7. 9 అజిత్ కుమార్ 11:29 ఉద. వద్ద సెప్టెంబర్ 5, 2008

  ఇంతకూ పండ్లు తోముకోమంటారా? వద్దంటారా? భీభత్సరసానికి ఉదాహరణ ఇదేనేమో కదా?

 8. 10 ప్రవీణ్ గార్లపాటి 7:35 ఉద. వద్ద సెప్టెంబర్ 6, 2008

  ఇలాంటి తిమ్మిని బమ్మి చెయ్యడాలు అక్కడ ఎక్కువే!
  ఫ్లోరైడ్ సమస్యను తీవ్రంగా పరిగణించి చర్యలు చేపట్టాల్సిందే. ఆయా ప్రదేశాల ప్రజల మీద ఇది చాలా ప్రభావం చూపుతుంది.

 9. 11 అబ్రకదబ్ర 12:24 సా. వద్ద సెప్టెంబర్ 6, 2008

  @మహేష్

  ఈ 1ppm వరకూ ఓకే అనేది అల్కోవా లాంటి సంస్థల ప్రోద్భలంతో పుట్టిన వాదన. అసలు ఫ్లోరైడే విష పదార్ధమయినప్పుడు కొంత శాతం ఫరవాలేదు అనేది వింతగా లేదూ? 1ppm కలిపితే వచ్చే ఉపయోగాలేవీ లేవని శాస్త్రీయంగా తేలింది కూడా.

  @రాజేంద్ర

  ఎంత గట్టి చట్టాలున్నా, ఇది economyతో ముడిపడ్డ విషయం. ఫ్లోరైడ్ వాడకాన్ని ఆపేస్తే ఇండస్ట్రీకి తగిలే దెబ్బ, తద్వారా ఉద్యోగాలు పోవటం, ఆర్ధిక వ్యవస్థకి దెబ్బ తగలటం, etc ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రభుత్వమూ చూసీ చూడనట్లు పోతుంది.

  @సుజాత,రాధిక,అజిత్

  వీలయినంత వరకూ ఫ్లోరైడ్ లేని టూత్ పేస్టులని వాడండి. అవీ దొరుకుతాయి మార్కెట్లో – ప్రయత్నిస్తే. ముందుగా ఈ విషయంపై మీ డెంటిస్టు సలహా తీసుకోండి. (సమస్యేమిటంటే, వీళ్లు కూడా మీకు నిజం చెప్పకపోవచ్చు. జనాలు ఫ్లోరైడ్ పేస్టులు వాడటం మానేస్తే డెంటిస్టులకి దెబ్బే కదా) ఇంకా ఎక్కువ వివరాలకి ‘ఫ్లోరైడ్ డిసెప్షన్’ కోసం గూగులమ్మనడగండి.

  @ప్రవీణ్,అరుణ,సరస్వతికుమార్

  ధన్యవాదాలు.

  @సిబిరావ్

  నా గురించి చెప్పటానికి పెద్దగా ఏమీ లేదు 🙂 మీకు మెయిల్ పంపిస్తాను త్వరలో.

 10. 12 చదువరి 11:28 సా. వద్ద సెప్టెంబర్ 6, 2008

  ఫ్లోరైడ్ కలిగిన టూత్‌పేస్టుల వెనక కథ తెలిసి ఆశ్చర్యపోయాను. మోసం గురించి చెబుతూ ఉంటారు.. అందరినీ అన్ని వేళలా మోసం చెయ్యలేరు అని. కానీ ఆ కంపెనీలు చెయ్యగలిగాయి. మోసం చేసారని ఇపుడా కంపెనీల్ని అంటానికి కూడా లేదు మనకు.. సైన్సు కొత్త సంగతులను తెలుసుకుంటూ, పాతవాటిని తప్పని చెబుతూ పోతుంది కదా! ప్చ్!

  చాలా విలువైన జాబు రాసారు. నెనరులు

 11. 13 క్రిష్ణ 5:04 సా. వద్ద సెప్టెంబర్ 7, 2008

  ఇలాంటి conspiracy లు ప్రతి industry మీద ఉన్నాయి. మా ఇంటిలో ఇద్దరు పళ్ల డ్రాక్టర్లు, మరో ఇద్దరు మాములు (వాళ్ల భాషలొ అయితే, అసలు) డ్రాక్టర్లు ఉన్నరు. మేము, మా పిల్లలం flouride toothpaste లు regular గా వాడతాము. ఇక conspiracy theories కు వస్తే, మన రోజూ త్రాగే, పాల మీద కూడ ఇంత కంటే ఎక్కువ conspiracy theories ఉన్నయి. ఉదాహరణకు notmilk.com website చూడండి. ఆ conspiracy theory ప్రచారానికి భయపడి, U.S. milk industry ప్రతి magazine లొ GOT MILK అంటూ పాల మీసాలు ఉన్న celebraties తో Ads ఇవ్వటం U.S. లొ ఉన్న వాళ్లు చూసే వుంటారు.

  ఇక ఈ conspiracy విషయానికి వస్తే, ఓ చాట్ రూం లో, ఓ Dentist వ్రాసింది యధాతధం గా క్రింద paste చెస్తున్నాను.

  Sugar has caused immensley more harm to the world than fluoride ever will. But…..

  You can’t be an internet crusader about sugar…

  You can’t be a quasi-scientist about sugar – when millions of pages of research exist

  You can’t be a conspiracist about sugar – when there is a direct connection (not correlation) about the adverse effects

  The bottom line is that with the advent of the internet – everyone has “lateral” internet knowledge. That is a very broad opinion with very little deep scienfic backing. If fluoride and amalgams were off the table – they’d be going after something else. IMO, fighting against the evils of fluoride is an attempt to gain control of their own mortality. If they can find the silver bullet – then they extend their lives.

  The irony is that if you followed their everyday lives – most would rail about fluoride, typing away on their computer while being 50-75 lbs overweight. They charge on while drinking a diet Coke and smoking Marboro reds.

  You can’t debate a conspiracist – as a dentist… I don’t even try.

  Rance Davis
  Sherman, TX

  చివరగా ఇది నాకు తెలిసింది చెప్పటానికే గాని, నాకు తెలిసిందే నిజమనో, లెక ఈ theory ని నమ్మే వాళ్లను ridule చెయటాంకో మాత్రం కాదు.

 12. 14 క్రిష్ణ 10:30 సా. వద్ద సెప్టెంబర్ 7, 2008

  @ముందుగా ఈ విషయంపై మీ డెంటిస్టు సలహా తీసుకోండి. (సమస్యేమిటంటే, వీళ్లు కూడా మీకు నిజం చెప్పకపోవచ్చు. జనాలు ఫ్లోరైడ్ పేస్టులు వాడటం మానేస్తే డెంటిస్టులకి దెబ్బే కదా!

  పైన statement చూసి, మా ఇంట్లో వున్న పళ్ల డాక్టర్ ను, పైన statement గురించి అడిగాను. pasTe లు మనేసినా, వాడినా లాభం కాని, నష్టం కాని, paste తయారి దారులకు కాని, Dentist లకు ఎమిటి ఉపయోగం అన్న సమాదానం వచ్చింది.
  సరే అని, ఇంకొ Dentist ను, flouride treatment మీరు ఇస్తూ charge చేస్తారుగదా అది ఆర్ధిక లాభమే గదా అంటే, If my primary concern is to make more money, I would rather my patient(s) don’t use flouride, thatway I would make more money on their cavities compare to the very small charge we charge for flouride treatment అని వచ్చింది. కాక పొతే ఇద్దరు అన్న మాట ఎమిటి అంటే, flouride too much గా వాడటం, ముక్యం గా తినడం మాత్రం మంచింది కాదు అనే.
  నేను flouride మాట అన గానే, first వాళ్లు ఎక్కడ internet లో నే, చుసావా ఈ గొడవ అంతా అని నవ్వారు. వాళ్ల patients కు మాత్రం వాళ్లు we use on our own children, we believe flouride help to prevent cavities, but it is up to you, to believe it or not అని చెప్తూవుంటాం అని అన్నారు.

  మరి industry lobby మాట ఏమిటి అంటే, వాళ్లు అన్నది ప్రస్తుతం U.S. లో, Defence lobby తరువాత most powerful lobby, insurance companies lobby వాళ్లె flouride treatments కు pay చేస్తున్నారు అంటే, flouride ఉపయొగ పడుతుంది అంటేనే, ఏ మాత్రం అనుమానం వున్నా (evidence లెక పొతే) ముందు వాళ్లె flourde benefit తీసి వేసి వుండే వాళ్లు దబ్బులు ఆదా చేసుకోవటాని ఆ వంక చూపించి అన్నారు.
  ఇంతక ముంది కామెంట్ లో చెప్పినట్లు, నేను ఇది కేవలం, Dentist లు దీని గురించి ఏమనుకుంటున్నరో అన్న కుతూహలం తో కనుకొన్ని వ్రాస్తున్ననే కాని, flouride హాని చేస్తుంది అని నమ్మే వాళ్లను ridicule చేయటాని మాత్రం కాదు. ఇలాంటి విషయాలలో, ఎవరికి వారే, నిర్ణయించుకోవటం మంచిది.

 13. 15 అబ్రకదబ్ర 10:16 ఉద. వద్ద సెప్టెంబర్ 8, 2008

  @క్రిష్ణ

  ఆసక్తిగా వివరాలు తెలుసుకుని రాసినందుకు ధన్యవాదాలు. మీరడిగిన ప్రశ్నలకి నా సమాధానాలు చదవండి.

  >> …. I would rather my patient(s) don’t use flouride, thatway I would make more money on their cavities ….

  ఫ్లోరైడ్ వాడకం వల్ల cavities తగ్గుతాయని శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. పైగా, గత పదేళ్లలో జరిగిన అధ్యయనాలు, పరిశోధనలు ఈ వాదనకి విరుద్ధమయిన ఫలితాలనిచ్చాయి. అమెరికాలో ఫ్లోరైడ్ ప్రయోగం మొదలయిన తర్వాత గత యాభయ్యేళ్లలో కేవిటీ సమస్యలు పెరిగాయే కానీ తగ్గలేదు. మరి దీనికేమంటారు? అసలు ఫ్లోరైడుని నీళ్లలోనూ, పేస్టుల్లోనూ కలపటం మొదలు పెట్టిందే అది రంధ్రాలు తగ్గిస్తుందని. మరి ఇప్పుడు జరిగిందేమిటి? ఒకవేళ కేవిటీలు పెరగటానికి ఫ్లోరైడ్ కారణం కాదనుకున్నా, అది వాటిని తగ్గించటానికి ఏవిధంగానూ పనికిరాలేదని అర్ధమౌతుంది కదా.

  >> …. companies lobby వాళ్లె flouride treatments కు pay చేస్తున్నారు అంటే, flouride ఉపయొగ పడుతుంది అంటేనే, ఏ మాత్రం అనుమానం వున్నా (evidence లెక పొతే) ముందు వాళ్లె flourde benefit తీసి వేసి వుండే వాళ్లు ….

  మంచి ప్రశ్న. నిజానికి డెంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఈ పని ఇప్పటికే చేస్తున్నాయి. అమెరికాలో డెంటల్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఎలా పనిచేస్తుందో చూడండి.

  ఇక్కడ దంత వైద్యానికయ్యే ఖర్చుని పూర్తిగా భరించే పాలసీ ఏ కంపెనీ కూడా ఇవ్వదు. దాదాపు అన్ని పాలసీలూ ‘ఏడాదికి ఇంత మొత్తం’ అనే పద్ధతిలో ఉంటాయి (అత్యధికంగా వెయ్యి డాలర్ల వరకూ). ఉదాహరణకు, మీకు వెయ్యి డాలర్ల వరకూ కవరేజ్ ఉందనుకుందాం. ఒక ఏడాదిలో మీ దంత వైద్యానికి ఎంత ఖర్చు అయినా మీకు వచ్చేది అత్యధికంగా వెయ్యి డాలర్లు మాత్రమే. అది కూడా అనేక పరిమితులతో. దాదాపు ఏ పాలసీ కూడా రూట్ కెనాల్, డీప్ క్లీనింగ్, సర్జరీ వంటి ఖరీదైన వాటిని కవర్ చెయ్యదు. (అంటే, మీకు ఏడాదికి వెయ్యి డాలర్ల కవరేజ్ ఉన్నప్పటికీ, మీకయిన ఖర్చు రూట్ కెనాల్ కోసం అయితే ఇన్స్యూరెన్స్ వాళ్లు ఒక్క డాలర్ కూడా చెల్లించరు. ఆశ్చర్యంగా ఉందా? మీరడిగిన ప్రశ్నకి సమాధానం సగం బోధపడి ఉండాలి ఇప్పటికే) వీళ్లు కవర్ చేసేది ఎక్స్-రే, సాధారణ క్లీనింగ్, పాలిష్ వంటి చిన్నపాటి ఖర్చులకి మాత్రమే. అది కూడా అత్యధికంగా ఎనభై శాతం వరకూ మాత్రమే కవర్ చేస్తారు. మిగతా ఇరవై శాతం మీ జేబులోనుండే పెట్టుకోవాలి.

  ఇప్పుడు ఓ సగటు అమెరికన్‌కి ఏడాదికయ్యే దంత వైద్య వ్యయం చూద్దాం. ఏడాదికి అతను తక్కువలో తక్కువ రెండు సార్లు డెంటిస్టు దగ్గరకెళ్లాల్సిన అవసరం పడుతుంది. వెళ్లిన ప్రతిసారీ చాలామంది డెంటిస్టులు చేసే మొదటి పని ఎక్స్-రే తియ్యటం. సుమారు నూట యాభై డాలర్ల వరకూ అవుతుంది దీనికి. ఇందులో ఎనభై శాతం మాత్రం ఇన్స్యూరెన్స్ కవర్ చేస్తుంది. ఇది కాక cost of examination డెంటిస్టుని బట్టి యాభై నుండి వంద డాలర్లుండొచ్చు. దీన్నీ ఎనభై శాతం వరకూ ఇన్స్యూరెన్స్ కవర్ చేస్తుంది.

  ఓ అమెరికన్ జీవిత కాలంలో రెండు నుండి నాలుగు రూట్ కెనాల్స్ వరకూ చేయించుకుంటాడు. ఒక్కో రూట్ కెనాల్‌కి అయ్యే ఖర్చు సుమారు ఎనిమిది వందల డాలర్లు. తర్వాత క్రౌన్ పెట్టటానికి సుమారు వెయ్యి డాలర్లు. అంటే రూట్ కెనాల్ + క్రౌన్ = $1800. ఇందులో ఇన్స్యూరెన్స్ కవర్ చేసేది సున్నా. ఇక, పన్ను పీకించుకోవలసిన (extraction) అవసరం పడిందనుకోండి, దానికి పన్నుని బట్టి రెండు నుండి ఐదు వందల డాలర్ల ఖర్చు. చాలా ఇన్స్యూరెన్సులు దీన్ని కూడా కవర్ చెయ్యవు. (Baby tooth అయితే ఈ ఖర్చు దాదాపు రెట్టింపు). పన్ను పీకించుకున్న తర్వాత implants చేయించుకోవాలంటే ఆ ఖర్చు తడిసి మోపెడవుతుంది (రకాన్నిబట్టి, వెయ్యి నుండి మూడు వేల డాలర్ల దాకా). దీనికీ ఇన్స్యూరెన్స్ కవరేజ్ సున్నా.

  ఫ్లోరైడ్ వల్ల డెంటల్ ఫ్లోరోసిస్ (దంత క్షయం) వస్తుందని ఎప్పుడో రుజువయ్యింది. దాని విపరిణామాలే పళ్లు పుచ్చి పోవటం, విరిగిపోవటం, పీకించుకోవలసి రావటం (రోజుకు రెండు సార్లు దంతధావనం చేసేవారి విషయంలోనూ తప్పని విషయాలివి). మరి ఆ ఖర్చుల మీద ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఏది? చాలా సందర్భాల్లో పన్నునొప్పి తగ్గినా డెంటిస్టు బిల్లు చూసి రోగికి గుండెనొప్పి రావటం ఖాయం. ఇన్స్యూరెన్స్ కంపెనీల గురించిన మీ ప్రశ్నకి పూర్తి సమాధానం దొరికి ఉండాలి ఇప్పుడు.

  >> …. నేను flouride మాట అన గానే, first వాళ్లు ఎక్కడ internet లో నే, చుసావా ఈ గొడవ అంతా అని నవ్వారు….

  మీ వాదనకి సమర్ధనగా కూడా అదే ఇంటర్నెట్‌లో ఎవరో డెంటిస్టు చెప్పినదాన్ని వెదికి పట్టుకుని వాడుకున్నారు. తమాషాగా లేదూ?

  ఇంతకీ, మీరుదహరించిన డెంటిస్టుగారు ఫ్లోరైడ్ చేసే హాని గురించి అడిగితే పంచదార వల్ల కలిగే నష్టాలతో పోలుస్తాడేమిటి? ఈ రెండింటిలో ఏది ఎక్కువ నష్టం అన్నది కాదు కదా ప్రశ్న. ఒక చెడ్డ పని ఎటూ చేస్తున్నాం కాబట్టి ఇంకోటి కూడా చెయ్యొచ్చనా ఆయనుద్దేశం?

  అమెరికాతో సహా అనేక పాశ్చాత్య దేశాల్లో అనేకమందికి జ్ఞానదంతాలు పూర్తిగా వచ్చీరాక ముందే పీకి పారేస్తారని మీకు తెలుసా? ‘జ్ఞానదంతాల వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య రావచ్చు’ అనేది పీకటానికి వాళ్లు చెప్పే కారణం. ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి (ఇలా పళ్లు పీకటానికి సాధారణ డెంటిస్టులు కాకుండా ప్రత్యేకంగా Oral Surgeons ఉంటారు). ఇండియాలో అదృష్టవశాత్తూ ఇంకా ఈ పద్ధతి అమల్లోకి రాలేదు. దీనివల్ల వృధా ఖర్చు, కొండొకచో ఇతర దంతాలు పాడవటం తప్ప వచ్చే లాభమేమీ లేదు. Wisdom teeth ని అలాగే ఉంచుకోమని చెప్పే డెంటిస్ట్ దొరికాడంటే మీరదృష్టవంతులే.

  ఇంకా, fillings లో వాడే పదార్ధమేమిటో తెలుసా? మెర్క్యురీ! అదెంత విషపూరితమో ఎవరైనా కెమిస్టునడగండి.

  చివరగా, ఇదంతా డెంటిస్టుల కుట్ర అని నేననటం లేదు. రెండు మూడు తరాలుగా డెంటిస్టులు వాళ్లు చదివిన, నమ్మిన పద్ధతులనే పాటిస్తున్నారు. ఫ్లోరైడ్ వల్ల కలిగే నష్టాలు తెలిసిన వాళ్లలో ఎక్కువమంది ఆ సంగతి బహిరంగంగా ఒప్పుకోరు – కారణాలేమయినా. అతి కొద్దిమంది డెంటిస్టులు ఫ్లోరైడ్ చేసే హాని గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీకు చదివే ఓపికుంటే నా వాదనని బలపర్చే డెంటిస్టుల వ్యాసాలని, Dental Journals రిపోర్టులనీ ప్రస్తావించగలను.

 14. 16 క్రిష్ణ 5:13 ఉద. వద్ద సెప్టెంబర్ 9, 2008

  మీ తో, discussion ని నేను enjoy చెస్స్తున్నాను. మీ బ్లాగ్ లో కామెంట్ ఎప్పుడూ పెట్టక పొయినా , నేను మీకు ఫంకా అనుకొవచ్చు.

  ఇక flouride విషయానికి వస్తే majority Dentists అది మంచిదే అని నమ్ముతున్నారు. మా వాళ్లని నేను అదిగితే, ఈ document refer చేసుకో అన్నారు. @http://www.ada.org/public/topics/fluoride/facts/fluoridation_facts.pdf

  కాకపొతే వాళ్లు అనేది ఎమిటి అంటే, flouride హాని చేస్తుంది అని మీరు నమ్మితే, వాడ వద్దు అనే. నావరకు దాని గురించి పెద్ద knowledge లేదు. వాళ్లు Dentist లు కాబట్టి, వాళ్లను నమ్ముతాను కాబట్టి, నీను follow అవుతున్నాను. అలగే flouride వలన కానీయండి, మరి oral hygiene బగా పాటించడం వలన కానీయండి, మా ఇంట్లొ 1996 నుండి ఎవరికీ (పిల్లలు, పెద్దల తో సహా) cavities రాలేదు. దానికి మేము పాటించే మాత్రం చెప్పగలను.
  1. అందరి లాగే రొండు సార్లు brush చేసుకోవటం, ముఖ్యం గా, రాత్రి పడుకోవటానికి ముందు.
  2. Mouth wash (దొరికితే non alchoholic) పడుకోవటానికి ముందు వాడటం.
  3. floss చేసుకోవటం, పిల్లలకు కూడ చేయటం, కనీసం రెండు రోజులకొక సారి.
  4. బద్దకించకుండా ఆరు నెలలకొకసారి, అందరం cleanings కు వెళ్లటం.
  5. వీలయినంత తక్కువుగా sodaalu (coke etc.) త్రాగటం. candies, cookies తిన్న తరువాత విధిగా పుక్కిలించటం. India లొ మన చిన్నప్పుడు అన్నం తినగానే పుక్కిలించావాళ్లం అలగే.

  ఇక insurance గురించి మీరు చెప్పింది చాలా వరకు నిజమే. కాకపొతే flouride treatment comes under routine coverage. General గా routine coverage వాటికి insurance companies goes by evidence base.

  ఇక gnaana దంతాల వరకు మీరు చెప్పింది నిజమే. అవసరం లేకపొయినా future లో trouble వస్తుంది అని తీయమని చేప్పడం joke. మా వాళ్లు మాత్రం, ఈ క్రింది reasons వున్నప్పుడే recommend చేస్తారు.
  1. Impactions, అంటె, ఙ్నాన దంతాలు erupt అయ్యేటప్పుడు చోటు లెకో, మరే కారన్ణాల వల్లొ, angle గా వస్తాయి అల్లాంటప్పుదు. తప్పకుండా వాటి వల్ల మాత్రం ఇబ్బందులే. panoramic x-ray చుస్తే అవి మనం (as non-dentists) కూడ easy గా అర్ధంచేసుకోవచ్చు. Impacted tooth వున్నప్పుడు తీసివేయించుకోవడమే better. ఓ impacted tooth వుండి తీయించుకోకుండా తరువాత ఇబ్బందులు పడిన వాడిగా అది నాకు తెలుసు.
  impacted tooth వుంటే మాత్రం, వాటిని young గా వున్నపుడె తీసివేయించుకోవటం better. Age వచే కొద్దీ, bone dense అయ్యి తీయటం కష్టం అవుతుంది.
  2. ఎత్తు పళ్లు సరి చేసుకోవటాని braces పెట్టించుకొంటుంటె, చోటు కావాలంటె. అది general గా orthodontist suggest చెస్తారు.

  ఇక కొన్ని cases లో (అన్ని cases లో మాత్రం కాదు) oral surgeons తో తీయించుకోవడమే better. Third molar roots nerve కు దగ్గరగా వున్నప్పుడు, తీసేటప్పుడు ఏ మాత్రం nerve cut అయినా అది చాలా danger. ఇప్పుడు India లొ కూడ, complicated cases, Oral Surgeons కే recommend చేస్తున్నారు.

  మొన్నీ మధ్యన Hyderabad లో, మా friend అమ్మగారికి ఇలానే తీస్తూవుంటే, complication అయ్యి కంటి వెంట continue గా, నీరు కారటం, ఆ ప్రక్క న నూరు మూయలేక పోవడం, భయంకరమయిన నెప్పితో, నిద్ర లేకపోవటం జరిగింది. వాళ్లు effort చేయగలి position లో వున్నరు కాబట్టి, వెంటనే, U.S. లొ, ఓ professor తో, surgeries అవి చేయించుకొని fix చేయించుకో గలిగారు.

  మొత్తానికి as a consumer (my assumption) U.S. Dental care మీద frustrate అయినట్లున్నరు. అర్ధంచేసుకోగలను.
  If you find a right Dentist, and follow the oral hygiene guidelines, most of it can be avoided. వీలయినంత వరకూ, group practices (wal-mart type) ను avoid చేయండి. Go to a small independent dentist, whom you believe that he/she won’t recommend unnecessary (over) treatments. Once you find a good one, try to stick to them. .

  ఈ కామెంట్ లో, flouride మీద కాకుండా ఎదో రాసేసినట్లున్నను. అనవసరం అనుకొంటే, తీసివేయండి.

 15. 17 అబ్రకదబ్ర 11:47 ఉద. వద్ద సెప్టెంబర్ 9, 2008

  @కృష్ణ

  ముందు కామెంట్‌లో ‘మా ఇంట్లో డెంటిస్టునడిగి చెబుతున్నా’ అన్నారు …. ఆ డెంటిస్టు మీరేనా? ఇంత వివరంగా రాస్తుంటే అనుమానమొచ్చింది.

  ఏదేమైనా, నాకు తెలియని చాలా విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.

  అమెరికాలో ఇన్స్యూరెన్స్ కవరేజీలు (డెంటల్ అనే కాదు, ఇంకేదయినా) అన్నీ పెద్ద స్కాములే. Peace of mind అనో, మరోటో చెప్పి భయపెట్టేసి రకరకాల ఇన్స్యూరెన్సులు తీసుకునేలా చేస్తారు. సందర్భం వచ్చింది కాబట్టి డెంటల్ ఇన్స్యూరెన్స్ గురించి ప్రస్తావించానే కానీ మీరనుకున్నట్లు నేను frustrated dental consumer కాను. నా జ్ఞాన దంతాలు భేషుగ్గా ఉన్నాయి. డెంటిస్టు దగ్గరికి వెళ్లే అలవాటు లేకపోవటం వల్లనో ఏమో, మిగిలిన దంతాలూ బ్రహ్మాండంగా ఉన్నాయి 😉

 16. 18 క్రిష్ణ 9:24 సా. వద్ద సెప్టెంబర్ 9, 2008

  నేను పళ్ల Doctor ని కాదు లెండి. ఒకళ్లని కట్టుకొన్నాను, ఒకళ్లకు తోడబుట్టాను, అందరమూ కలిసే వుంటున్నాము ప్రస్తుతం, అందుకనే ఇంట్లొ ఇద్దరు ఉన్నారు అన్నాను. వాళ్లతో కలసి వుండటం వల్ల, అప్పుడప్పుడు వాళ్ల కు వాళ్ల systems (software, hardware and interfaces with insurance companies) set చేసి వుండటం వలన అబ్బిన (మిడి, మిడి) జ్ఞానంతో (నా జ్ఞాన దంతాలు వూడగొట్టుకొని మరీ!!) చెప్తున్నాను అంతే.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: