కూచిపూడిలో ప్రపంచ రికార్డు

అమెరికాలోని తెలుగు సంఘాలలో సిలికానాంధ్రకి ఓ విశిష్టత ఉంది. ఎక్కువ సంఘాలు ఏడాదికి రెండు మూడు సార్లు నేపధ్య గాయకుల సంగీత విభావరులు, సినిమా నాట్య ప్రదర్శనలు, క్రికెట్ పోటీల వంటి వాటితో తూతూ మంత్రం కార్యక్రమాలు నిర్వహించి తమ ఉనికిని గుర్తుచేస్తుంటే, సిలికానాంధ్ర దానికి భిన్నంగా ఎప్పటికప్పుడు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలతో ముందుకొస్తుంటుంది. ఇవే కాకుండా వీరు ‘మనబడి’ వంటి వాటితో తెలుగు భాషా సేవ కూడా చేస్తుంటారు.

అయితే, ఈ మధ్య సిలికానాంధ్ర దారి తప్పుతుందా అనిపిస్తుంది వారి కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే. క్యాలిఫోర్నియాలోని కుపర్టినో నగరంలో ఇటీవల సిలికానాంధ్ర వారు మూడు రోజుల పాటు అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో కూచిపూడి నాట్యకారులు ప్రదర్శనలో పాల్గొనటం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పి తద్వారా గిన్నెస్ బుక్ లోకెక్కటం దీని లక్ష్యమట. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కూడా పాలుపంచుకోవటం విశేషం.  దేశ దేశాలనుండి వచ్చిన మూడు వందల ఎనభై మంది కూచిపూడి కళాకారులు కలసికట్టుగా ఎనిమిది నిమిషాల పైచిలుకు గిన్నెస్ బుక్ వారి సమక్షంలో నాట్యమాడి రికార్డు నెలకొల్పారు. వారందరికీ పేరు పేరునా గిన్నెస్ పుస్తకం వారు సర్టిఫికెట్ అందజేస్తారట.

ఈ వార్త మరునాడు స్థానికంగా అత్యధిక సర్క్యులేషన్ గల San Jose Mercury News దిన పత్రికలో ఇలా ప్రచురితమయింది:

Dancers in Cupertino will be memorialized in a book that honors loud burps, long fingernails and large groups of breast-feeding mothers. (పూర్తి వార్త ఇక్కడ)

ఈ వాక్యం ఒకటి చాలు గిన్నెస్ బుక్ రికార్డులకి ఎంత విలువుందో చెప్పటానికి. ఇటువంటి ఫీట్లవల్ల ఆయా కళాకారులకి పేరు దుగ్ధ తీరటమే కానీ కూచిపూడి నాట్య కళకి ఒరిగేదేమిటి? ఈ రికార్డు సాధించటానికి సిలికానాంధ్ర వారు చేసిన కృషి మెచ్చుకుని తీరవలసిందే. దీనికి ఎంత శ్రమ, డబ్బు ఖర్చయ్యాయో తెలియదు. ఈ సమ్మేళనంలో కూచిపూడి నాట్యాన్ని వృద్ధిచేసే దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరిగాయేమో తెలియదు. వార్తలో ప్రపంచ రికార్డు గురించి మాత్రమే ప్రస్తావించటం వల్ల అటువంటి ప్రయత్నాలేమీ జరగలేదనుకోవాలేమో. సాంస్కృతిక సంఘాల దృష్టి రికార్డులవంటి వాటిపై కేంద్రీకృతం కావటం అంత మంచి పరిణామం కాదు. ఈ ఒక్క సారితో వదిలేస్తారేమో దీన్ని అనుకుంటే అదీ జరిగేలా లేదు. ‘వేరే ఎవరైనా మా రికార్డుని ఛేదించవచ్చు, కానీ రెండేళ్ల తరువాత భారత దేశంలో జరగబోయే సమ్మేళనంలో మేము రికార్డులని తిరగరాస్తాం’ అని ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రకటించటం దానికి సూచన. సిలికానాంధ్రలాంటి ప్రజాదరణ కలిగిన సంఘాలు తమ శక్తియుక్తులని రికార్డులని మించిన లక్ష్యాలపై కేంద్రీకరిస్తే బాగుంటుంది.

7 స్పందనలు to “కూచిపూడిలో ప్రపంచ రికార్డు”


 1. 1 కొత్తపాళీ 6:48 సా. వద్ద జూన్ 25, 2008

  తమలాంటీ బ్లాగ్వీరులు ఇలా తెలియదు తెలియదు అని ఒక పక్కన చెబుతూనే సంఘాలకి సలహాలిచ్చే ముందు .. అసలు ఆ సంఘం వాళ్ళ ఉద్దేశం ఏవిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా బహు బాగా ఉంటుంది.

 2. 2 chilamakuru vijayamohan 6:53 సా. వద్ద జూన్ 25, 2008

  నిజమే ఇప్పుడంతా ప్రచారంకోసమే తప్ప ప్రయోజనం చేకూర్చేపనులు చేసే వారు తక్కువయ్యారు.

 3. 3 కె.మహేష్ కుమార్ 8:04 సా. వద్ద జూన్ 25, 2008

  ఏదైనా జరిగిపోయిన తరువాత “రికార్డు” గా మిగిలిపోవడం వేరు. కేవలం రికార్డు కోసమే ఒక పని చెయ్యడం వేరు.ఎవరి పిచ్చి వారిది…

 4. 4 అబ్రకదబ్ర 11:22 ఉద. వద్ద జూన్ 26, 2008

  కొత్తపాళీ,

  మీ శ్లేష అర్ధమయింది 🙂 నాకు తెలియని వాటిని అసలు ప్రస్తావించాల్సిన అవసరమేముందనేది మీరాలోచించారా?

  ఆ మూడొందల ఎనభై మందిలో ఎందరు నిజంగా కూచిపూడిలో నిష్ణాతులు? ‘పాతిక డాలర్లు కట్టి పేరు నమోదు చేయించుకుని, మూడు వారాల పాటు జతిస్వరం సాధన చేస్తే మీకు గిన్నెస్ రికార్డులో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తాం’ అంటూ చేసిన ప్రచారం నాకు తెలుసు. ఇటువంటి వాటి వల్ల కూచిపూడికి జరిగే మంచి ఎంత? సిలికానాంధ్ర కృషిని తక్కువచేయటం నా అభిమతం కాదు. రికార్డులమీద అనవసరమైన మోజు చూపించటం ఎందుకనేదే నా ప్రశ్న.

 5. 5 ఓ ఆమెరికా (ఆ మెరక)తెలుగోడు 9:02 ఉద. వద్ద జూన్ 27, 2008

  500,000 నుండి 750,000 డాలర్ల వరకు ఖర్చు పెట్టారని తెలిసింది. దోవతి కట్టుకుని కండువా కప్పుకుంటెనే తెలుగు దనం అనుకునే ఈ తెలుగు వీరులు సిలికొన్ వ్యాలిలోని బర్కిలీలో ప్రారంబించిన తెలుగు భాషా భోదనకి 100 డాలర్లు కూడ ఎవ్వలేదన్నది మనం గమనించాలి. 3 రోజులలో 500,000 డాలర్లకు పై చిలుకు ఈ కార్యక్రమానికి ఇవ్వగల ఈ తెలుగు కళ/భాషా అభిమానులు గినిస్ బుక్ లొ పెరుపడితేగాని విరాళలివ్వరేమే.

  బావుంది.

 6. 6 రవి 9:55 ఉద. వద్ద జూన్ 27, 2008

  750 కాదండి బాబూ 1మిలియను. పాపం ఇంకా 200కె తక్కువైందట ఎవరన్న ఇచ్చేవాళ్ళున్నారా! అని వాళ్ళు చూస్తున్నారు బర్కిలీ కి ఏమిస్తారు పాపం

 7. 7 Siliconite 12:37 సా. వద్ద జూన్ 28, 2008

  See their blogs
  http://www.siliconandhra.org/sablog/
  Read the blog on April 20, 2007, 5:25 pm – NEVER HAPPENED
  Read the blog on April 20, 2007, 4:46 pm – NEVER HAPPENED
  Read the blog on February 24, 2007, 10:33 am – No one knows what happened to it later.
  Read the blog on February 11, 2007, 11:46 am – They left her on the roards later
  They also announced that they would do World Annamayya Jayanthi in 2008 in all countries around the world. It NEVER happaned.
  They promised money to many cultural organizations across India in 2007 during All India Annamayya Jayanthi and they never paid them.
  They collected money from Public during 2007 August Medasani Program on the pre text of publishing Satakam. It never happened .


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: