నలభై మార్కుల నారాయణులు

బిసి, ఎస్ టి, ఎస్ సి విద్యార్ధులకు రాష్ట్రంలోని ప్రైవేటు ఎం బి బి ఎస్, బిడిఎస్ కళాశాలల్లో ప్రవేశానికి అర్హతా పరీక్షల (ఇంటర్, ఎం సెట్) కనీస మార్కులను 50 నుండి 40 శాతానికి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా తరగతుల అభ్యర్ధుల్లో 50 శాతం మార్కులు వచ్చిన వారు ఎక్కువమంది లేకపోవటంవల్ల కొన్ని కళాశాలల్లో సీట్లు మిగిలిపోవటం దీనికి కారణమట.

ఇదంతా ప్రభుత్వానికి వెనకబడిన వర్గాల మీదున్న ప్రేమకి తార్కాణంలా కనిపిస్తున్నా, అసలు కారణం మాత్రం ఏదోలా ప్రైవేటు కళాశాలల్లో సీట్లన్నీ నింపుకునేలా చెయ్యటమేనన్నది సుస్పష్టం. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల విద్యా వ్యాపారాన్ని మరింత లాభసాటిగా చేయటమే అర్హతా మార్కుల తగ్గింపు వెనుక అసలు రహస్యం. కుప్పలు తెప్పలుగా కళాశాలలకు అనుమతులిస్తూపోతే సీట్లెలా నిండుతాయి? మరి కొన్నేళ్లు పోయాక – ఇప్పుడున్న కాలేజీలకు మరిన్ని తోడయ్యాక – ఇదే వంకతో కనీస మార్కుల శాతాన్ని 40 నుండి 30 కి తగ్గిస్తారేమో.  ఇంటర్ లోనూ, ఎం సెట్ లోనూ నూటికి నలభై మార్కులు కూడా రాని వారు ఏ రకంగా కఠినమైన వైద్య విద్య పూర్తిచేయగలుగుతారు? ఈ సంగతి ఎవరికీ పట్టదు.

మన దేశంలో రిజర్వేషన్లగురించి ప్రశ్నించడమో పాపం. అవెందుకని ఒక గొంతు అడిగితే సామాజిక, ఆర్ధిక కారణాల చిట్టా విప్పుతూ వంద గొంతులు వినిపిస్తాయి. దాదాపు అరవయ్యేళ్లుగా అమల్లో ఉన్నా వెనుకబడినవర్గాలకు రిజర్వేషన్లతో ఒరిగినదెంత? ఆ తాయిలం చూపించి వాళ్లని ఎప్పటికీ వెనుకనే ఉంచటమే తప్ప నిజంగా ఆ వర్గాలని ఉద్ధరించాలనే సంకల్పం ఏ ప్రభుత్వానికుంది? కోటాలు లేని వారికి అవి ఉన్నవారిపై ఆగ్రహావేశాలు, ఆ పేరిట వెనుకబడిన కులాల వారికి మరిన్ని అవహేళనలు. అసలు, కులాల పేరుతో వెనకబాటుతనాన్ని కొలవటమేమిటి? నాలుగు ఓట్లు రాలతాయంటే అడిగిన వారికీ, అడగని వారికీ కూడా ఎంతో కొంత రిజర్వేషన్ ముష్టి విదిలించే ప్రభుత్వాల కాలమిది. కోటాల వల్ల వచ్చిందేమీ లేకపోగా అవి అనుభవించే కులాల మధ్య ఎవరికెంత అనే విషయంలో గొడవలు మొదలై ఉద్యమాలదాకా వెళ్లాయి. ఇప్పటికే ఉన్న గోల చాలనట్లు మతాల పేరిట కూడా రిజర్వేషన్లిచ్చే ఆచారమొకటి కొత్తగా తలెత్తుతుంది.

రిజర్వేషన్ల మీద పిడకల వేట పక్కనబెట్టి అసలు కధలోకొస్తే, ఇలా 40 శాతం మార్కులతో ఎలాగో గట్టెక్కి ఎం సెట్ లో కూడా ఎక్కువ ర్యాంకు తెచ్చుకున్న వారికి బి-కేటగిరీ కింద అధిక ఫీజులు వసూలు చేసి సీట్లిస్తారట. అయ్యా, అదీ సంగతి. అధిక ఫీజులు కట్టగలుగుతున్నారంటే వెనుకబాటుతనం చదువులోనే కానీ డబ్బులో కాదన్నమాట! ఇప్పటికే గొందికొకరుగా ఉన్న డొనేషన్ వైద్యులకి ఈ నలభై శాతం నారాయణులూ తోడయితే రోగుల గతేమిటి హరీ?

5 స్పందనలు to “నలభై మార్కుల నారాయణులు”


 1. 1 మధు గొర్తి 2:01 సా. వద్ద మే 26, 2008

  తెలుగోడి తో నేను ఏకీభవిస్తున్నాను. నేను Government Engineering college చదివేటప్పుడు రిజర్వేషన్ సీట్లలో చేరిన students ఎ౦తమ౦ది దాన్ని సద్వినియోగ౦ చేసుకున్నారో నాకు తెలుసు. ఉచిత హాస్తల్ , ఉచిత భోజనము, ఉచిత పుస్తకాలు మరియు ఇతర సౌకర్యాలను దుర్వినియోగ౦ చేసుకునేవారే ఎక్కువ.

 2. 2 కె.మహేష్ కుమార్ 9:28 సా. వద్ద జూన్ 9, 2008

  మీ వాదనలో చాలా బలముంది. కానీ కొన్ని మరీ sweeping generalisations ఉన్నాయేమో అని నా అనుమానం.

  “అసలు, కులాల పేరుతో వెనకబాటుతనాన్ని కొలవటమేమిటి?”: ఈ కొలమానం అనాదిగా వస్తున్నదే. ఇప్పుడు సోకల్డ్ వెనుక బడిన కులాలలో కుడా అర్థిక ప్రాతిపదికన, అవకాశాలలో చాలా కోతలు ఉన్నట్టు మీకు తెలియదు కాబోలు. అంటే కులం కాకుండా మరికొన్ని (ముఖ్యంగా ఆర్థిక) ప్రాతిపదికలు కొలమానాలుగా తయారవుతున్నాయి.

  “దాదాపు అరవయ్యేళ్లుగా అమల్లో ఉన్నా వెనుకబడినవర్గాలకు రిజర్వేషన్లతో ఒరిగినదెంత?”: మన రాజ్యాంగ నిర్మాతలు అనుకున్నదంతా సాధించలేదుగానీ, మీరు కొన్ని human development reports చదివితే, రిజర్వేషన్ల వల్ల ఇప్పటిదాకా ఒరిగింది కొంత తెలిసే అవకాశం ఉంది.

  “అధిక ఫీజులు కట్టగలుగుతున్నారంటే వెనుకబాటుతనం చదువులోనే కానీ డబ్బులో కాదన్నమాట!”: అధిక ఫీజులు కట్టే అందరూ ఆర్థిక బలిమి కలవారు కారని గమనించగలరు. ఈ విద్య పేరుతో అప్పుల పాలైన కుటుంబాలు చాలా ఉన్నాయ్. ఏదో (ఎదిగే)అవకాశం వచ్చింది కదా అని అప్పోసొప్పోచెసి కాలేజీలో చెరి, తరువాత చదవలేక మానసిక వ్యధకు గురై,పేదరికానికి బలై ఆత్మహత్య చేసుకుంటున్న దళిత విధ్యార్థుల గురించి మీడియా ఎప్పుడైనా తెలియజెప్పిందా? సందేహమే!

  “ఇప్పటికే గొందికొకరుగా ఉన్న డొనేషన్ వైద్యులకి ఈ నలభై శాతం నారాయణులూ తోడయితే రోగుల గతేమిటి హరీ?”: వైద్య విద్యలో ఎంట్రీ కే గానీ ఎగ్సిట్ కు నలభై మార్కులతో సంబంధం లేదుకదా? క్వాలిఫై అయితేనే బయటపడతారు. కాబట్టి రోగుల సంగతి మరీ మీరుచెప్పినంత దారుణం కాకపోవచ్చు. కనీసం ఇలాంటి డాక్టర్ల పుణ్యమా అని గ్రామాలలో వైద్య సేవలు అందగలవేమో!

 3. 3 అబ్రకదబ్ర 12:15 సా. వద్ద జూన్ 10, 2008

  మహేష్,

  నా వ్యాసాలు ఐదారు పేరాలకు మించకూడదని నేనుగా పెట్టుకున్న నియమం వల్ల చాలా సార్లు విషయాలని కూలంకషంగా చర్చించే అవకాశం లేక అలా జెనరలైజ్ చేయాల్సి వస్తుంది. మీరన్న వాటిలో కొన్ని నాకు తెలుసు, కొన్ని తెలియదు. ముఖ్యంగా, ఆర్ధిక ప్రాతిపదికన వెనుకబడిన కులాలవారికి రిజర్వేషన్లలో కోతలున్నాయనేది నాకు వార్త. తెలిజేసినందుకు ధన్యవాదాలు.

  కులాల పేరిట రిజర్వేషన్లనేదానికి నాకు అభ్యంతరాలున్నాయి. సమాజంలో కులాల పేరిట అసమానతలు పోవాలంటే ముందుగా ఇవి ఎత్తేయాలి. విద్య, ఉద్యోగాలకి సంబంధించిన ప్రతి దరఖాస్తులోనూ నీదే కులమని అడుగుతుంటే అవెలా పోతాయి? (ఈ ఒక్క మార్పుతో కుల ప్రస్తావన మన సమాజంలోంచి పూర్తిగా పోతుందని నేననను. కానీ ఎంతో కొంత ప్రభావం ఉండి తీరుతుంది). పూర్తిగా ఆర్ధిక ప్రాతిపదిక రిజర్వేషన్లీయమనండి. అగ్ర కులాల్లో మాత్రం నిరుపేదలు లేరా? వాళ్లకి సహాయం లేకపోతే ఎలా?

  రిజర్వేషన్ల పేరుతో విద్యా ప్రమాణాలు తగ్గించటం నా మరో అభ్యంతరం. ఒకటో తరగతి నుండీ స్కాలర్ షిప్పులో, ఉచిత విద్యో ఏర్పాటు చేయమనండి. వాటిని ఉపయోగించుకుని చదువుకుని మిగతావారి మాదిరిగానే మార్కులు తెచ్చుకుని పై చదువులకి వెళ్లమనండి. అంతేకానీ ప్రతి చోటా అర్హతా మార్కుల శాతాన్ని రిజర్వుడు కేటగిరీల విద్యార్ధులకోసం తగ్గించటమేమిటి?

  “మన రాజ్యాంగ నిర్మాతలు అనుకున్నదంతా సాధించలేదుగానీ, మీరు కొన్ని human development reports చదివితే, రిజర్వేషన్ల వల్ల ఇప్పటిదాకా ఒరిగింది కొంత తెలిసే అవకాశం ఉంది”. సంతోషం. మరి రిజర్వేషన్ల దెబ్బతో అర్హత, ప్రతిభ ఉండీ అవకాశాలు కోల్పోయిన వారి సంగతేమిటి? వీళ్ల సంఖ్య ఎంత? డొనేషన్ కట్టే స్థోమత లేక, మంచి మార్కులొచ్చినా రిజర్వేషన్ లేక అడుగునే ఉండిపోయిన వాళ్ల గురించి ఎవరన్నా పట్టించుకుంటున్నారా? వీళ్లగురించి ఏ రిపోర్టులూ మాట్లాడవేం?

  “వైద్య విద్యలో ఎంట్రీ కే గానీ ఎగ్సిట్ కు నలభై మార్కులతో సంబంధం లేదుకదా? క్వాలిఫై అయితేనే బయటపడతారు”. మన విద్యాలయాల, యూనివర్సిటీల ప్రమాణాలు తెలిసినవాళ్లెవరైనా ఎగ్జిట్ ఎంత తేలికో చెప్పగలుగుతారు. లోపలకి వెళ్లటమే కష్టం – బయటకి రావటం కాదు. ఎంతమంది ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్ధులు కోర్సులు పూర్తి చేయలేకుండా మధ్యలోనే వదిలేస్తున్నారు? చాలా తక్కువమంది. చదువుని అమ్ముకోవటం మొదలయ్యాక కాలేజీలు కూడా ఏదోరకంగా విద్యార్ధులని పాస్ చేయించి బయటకు నెట్టటానికే ప్రయత్నిస్తున్నాయి. లేకపోతే వాళ్ల కాలేజీలో లక్షలు కట్టి ఎవరూ చేరరు కదా!

 4. 4 గీతాచార్య 11:19 ఉద. వద్ద జనవరి 1, 2010

  అందుకే గదండీ వైద్యో నారాయణో హరీ అంది పెద్దలు.

  వైద్యుని చేతిలో పడితే నారాయణుడైనా హరీ అనాల్సిందే.
  అందుకే మనప్పులప్పారావన్నట్టు… అప్పిచ్చు వాడు వైద్యుడు అనుకోవాలి. అలా డొనేషన్లు గట్టే కదా వచ్చారు. బోల్డు డబ్బులుంటాయి. 😀

 5. 5 Shiv 11:35 సా. వద్ద జనవరి 1, 2010

  Abrakadabra garu,

  I want to ask Mr. Katti Mahesh Kumar, a couple of questions through your blog.

  He keeps talking about sweeping generalizations always. But, does not he think this so called idea of Dalit suppression by forward castes itself is a sweeping generalization ? Did everyone of the forward castes suppress everyone of backward castes ? In such cases, how are people like Valmiki (and many more) are reverred by one and all ?

  Also, the aim of reservations is to remove the backwardness from so called backward castes. But, till now, not even a single caste is moved out of this backwardness (as no one from the castes that enjoy reservations have openly said we don’t want reservations anymore). Can’t we treat this as a failure of the reservations concept ?

  – Shiv.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: