ఇందిరా ప్రదేశ్!

ఐదేళ్లుగా స్వదేశమెళ్లకుండా అమెరికాలోనే దాక్కున్న నా హైదరాబాదీ మితృడిని కారణమేంటని ఆరా తీస్తే ‘హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగ్గానే నా పేరుని రాజీవ్ గా మార్చేస్తారేమోనని భయంగా ఉందిరా. అందుకే ..’ అన్నాడు దిగులుగా. వాడి అసలు పేరు అంత గొప్పగా ఏమీ ఉండదు, కానీ ఎవరి పేరుపై వాళ్లకి మమకారమే కదా. అసలు విషయానికొస్తే ..

‘ఇండియాయే ఇందిర, ఇందిరే ఇండియా’ అని పార్లమెంటులో ఎలుగెత్తి చాటిన పాతతరం కాంగిరేసు కేతిగాళ్ల గురించి కేవలం వినున్నాం. ఇప్పుడు వాళ్ల తలదన్నే భజన సామ్రాట్టులని మన రాష్ట్రంలోనే ప్రత్యక్షంగా చూస్తున్నాం. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రకటించిన పధకాలు ఎంత నత్తనడకలు నడుస్తున్నా, ప్రతిదానికీ రాజీవుడిదో లేక ఇందిరమ్మదో పేరు తగిలించే కార్యక్రమం మాత్రం శరవేగంగా అమలవుతోంది. తాము అధికారంలోకొస్తే ఇలా అన్నిటికీ వాళ్లిద్దరి పేర్లు తగిలిస్తామని పాదయాత్ర సందర్భంగా వైఎస్సార్ వాగ్దానమేమన్నా చేశాడేమో మరి. ఒక లెక్క ప్రకారం ఇప్పటికే దాదాపు పాతిక ప్రభుత్వ పధకాలకు, నిర్మాణాలకు ఈ రెండు పేర్లు తగిలించేశారు. కె.పి.హెచ్.బి. కి కూడా ఆ పని చెయ్యబోతే అక్కడి జనాలడ్డుపడటంతో ఎలాగో ఆగిపోయింది. ఉప్పల్ లో హెచ్.సి.ఎ. వాళ్లు కోట్లు పోసి కట్టించుకున్న క్రికెట్ స్టేడియానిక్కూడా రాజీవ్ పేరు తగిలించాలని ముఖ్యమంత్రి ముచ్చటపడితే స్టేడియం నిర్మాణానికయిన ఖర్చు స్పాన్సర్ చేసిన సంస్థ ఒప్పుకోలేదు. అప్పుడు ఆ ఖర్చు (5 కోట్లట) ప్రభుత్వ పద్దులోంచి విశాకా అనబడే సదరు సంస్థకి రాసిచ్చి మొత్తమ్మీద ముఖ్యమంత్రిగారి ముద్దు తీర్చారు సర్కారువారు – ఇది రెండేళ్ల క్రితం సంగతి. సోనియామ్మ దయాదాక్షిణ్యాలకోసం ఐదు కోట్ల రూపాయల జనం సొమ్ము తగలేసి ఒక క్రీడాంగణానికి రాజీవుడి పేరు కొని పెట్టారన్నమాట!

ఈ క్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిణి నేదురుమల్లి రాజ్యలక్ష్మికి అసలు రాష్ట్రం పేరే ఇందిరమ్మ రాష్త్రంగా మారిస్తే పోతుందన్న మహత్తరమైన ఆలోచనొచ్చింది. పధకానికోసారి పేరు పెట్టటం, ఉన్న వాటికి పేర్లు మార్చటం వృధా ప్రయాస అనుకున్నారేమో మరి, ఏకంగా టోకున రాష్ట్రానికే పేరుమార్చేస్తే బావుంటుందనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం, నిన్న గుంటూరులో ఆ సంగతి కడు తన్మయం చెందుతూ ప్రకటించేశారు. పైగా, ‘ప్రజలు కోరితే చేస్తాం’ అంటూ ఈ బృహత్పధకంలో అడగకున్నా ప్రజలకూ భాగస్వామ్యం కల్పించారు మంత్రివర్యులు. ఆ మాటలో ‘మేం చేస్తే మీరు కోరినట్లే’ అన్న నిగూఢార్ధమేమన్నా దాగుందేమో తెలీదు. దీని తర్వాత రాష్ట్రంలో మగవాళ్లందరి పేరు ముందరా ‘రాజీవ్’, ఆడవాళ్లందరి పేరు ముందరా ‘ఇందిర’ అని తప్పనిసరిగా చేర్చాలని శాసనం కూడా చేస్తారు కాబోలు.

అసలు, అంత స్వామి భక్తి పరాయణులైతే తమ పిల్లలకో మనవలకో ఇందిరా రాజీవుల పేర్లు పెట్టుకుని తరించొచ్చుగదా. రాజశేఖరరెడ్డి గారిని రాజీవ్ శేఖర రెడ్డిగా మారిపొమ్మనండి. ఎవరొద్దంటారు? వాళ్ల ఇష్టాయిష్టాలను రాష్ట్రం నెత్తిన రుద్దటమేంటి? ప్రతిదానికీ కాంగ్రెస్ నేతల పేర్లే పెట్టదలచుకుంటే పి.వి., జలగం, కాసు, కోట్ల, చెన్నా లాంటి ఎందరు నాయకులు లేరు? మరే కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనూ చూడమీ చోద్యం. జనాలకు విసుగొచ్చేదాకా ఈ భజన వ్యవహారాలు సాగదీస్తే ఏలినవారికెప్పుడో ఎదురుదెబ్బ తగలడం ఖాయం.

8 స్పందనలు to “ఇందిరా ప్రదేశ్!”


 1. 1 Arun Kumar 4:13 ఉద. వద్ద మే 14, 2008

  రాజీవ్ గారూ.. బాగా మొట్టారు. యెట్లా… ప్రతిఒక్కరీ పేరు ముందరా రాజీవ్/ఇందిర తగిలించాలా మంచి ఆలోచన. మీకు ఈ సారి ఇందిర అవార్డు ఖాయం. మీరన్నది నిజం అంత ప్రేమ వుంటే వార్తా పత్రికకి రాజీవ్/ఇందిర పేరు పెట్టవచ్చుకదా. అబ్బే అది కురదు. చూద్దాం తెలుగు దేశం వాళ్ళు అన్నట్లు “అందరికీ మద్యం పధకానికి” సోనియా సుజలధార అని పేరు పెడతారేమో.
  ఇట్లు
  మీ రాజీవుడు

 2. 3 రాజేంద్ర 6:48 ఉద. వద్ద మే 14, 2008

  నిజమే,తెగేదాకా లాగటం దేనికీ మంచిది కాదు.అసలు ఎక్కడ యన్.టి.ఆర్ కు పేరెక్కడ వచ్చి పడుతుందో అన్న దుగ్ధవల్ల ఆగాడు కానీ అసలు చంద్రబాబు అన్ని పధకాలకూ ఆయన పేరు పెట్టేవాడె.భారతరత్నకు కాలడ్దం పెట్టిన పెద్దమనిషి ఇలా పధకాలకు పెర్లు పెడతాడా ఇప్పుడు ఈ ఇందిరా రాజీవుల హడావుడి చూసి అడ్డెడ్డె అంటున్నాడు గానీ

 3. 4 Sri 11:14 ఉద. వద్ద మే 14, 2008

  Rajiv/Indira peruto E padhakam pettina congress vaallake gaani prajalaki E maatram achchi radu. “Chachichi” saadhinchatam ante ide nemo. Munduga “Rajya Lakshmi” gaari peru “Raajeva Lakshmi” ani pedite bavuntundemo. Ee swami bhakti anedi banisatvam ani veellu eppatiki telusukuntaro.

 4. 5 vijayawada 11:21 ఉద. వద్ద మే 14, 2008

  I am not sleeping from yesterday where if Vijayawada names changed to Indirawada then where will I stay.

 5. 6 surender parupalli 4:13 ఉద. వద్ద మే 15, 2008

  నిజంగా ఇది మనల్ని మనం ఆత్మ హత్య చేసుకొవటమే! ఈ దరిద్రపు పార్టీల వల్ల తెలుగు వాడు అన్న గుర్తింపే లెకుండా పోయింది.

  ఇన్ని పేర్లు పెట్టి, ఇంత భజన చేస్తే మన రాష్త్రానికి వచే ఫంద్స్ ఏమన్నా ఎక్స్త్రా ఉంటాయా అనుకుంటె అసలుకే గతి లెదు. లాలూ ఒక్క రైలు కూడ మనకి ఇవ్వడు. మన వాల్లు అడిగితె వెల్లి పిఎం కి చెప్పుకోండి అంతాడు. దగ్గర దగ్గర 35 ఎంపిలు ఉండి కుద మన ఎయింస్ దిరెచ్తొర్ (తెలుగు వాడు) ని ఎదో చెత్త రూల్ తెచ్చి దిస్మిస్ చేస్తే పార్లమెంట్ లొ ఒక్కడు మాత్లాడిన పాపాన పోలేదు. ఒక్క తమిళనాడు ఎంపి ఒత్తిడి వల్ల వాల్లు ఎయింస్ చట్టానికే మార్పు చేసారు. ఇలా అన్ని చొట్లా భంగపాటే మన తెలుగు సోదరులకి.
  మళ్లి ఎన్ టీఅర్ లాగ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం అనే నినాదం తో ఎవరు వస్తారో అని ఆశ గా ఉంది

 6. 7 Srinivas Vangala 10:56 సా. వద్ద జూన్ 10, 2008

  We are shameless and gutless.Just,imagine.If someone attempts to change the name of Chatrapati Chivaji airport in Mumbai or Anna Airport in Chennai to that of Rajiv or Indira Gandhi,there would have been Mayhem on the roads.Maharashtrians would have driven out all Congressmen from Maharashtra and Tamilians would have insisted that the Delhi airport name be changed to Kalainyar airport in reciprocation.

  We happily watched when P.V.Narasimharao was being insulted in very possible manner by Sonia and co and NTR airport name was changed.

  By the way,if Chiranjeevi becomes the chief minsited,I hope that he dones not name our airports nad roads after his movies.If he does,we will have Adavi Donga internation airport, Rikshavodu rahadari etc,Unthinkable!!!

 7. 8 గీతాచార్య 3:36 ఉద. వద్ద డిసెంబర్ 22, 2010

  అప్పుడెప్పుడో మీది చూశానని ఇప్పుడు “G” అన్న నా వ్యాఖ్య చూశాక గుర్తొచ్చింది కానీ, ఇల్లాంటిదే ఒహటీమధ్య వ్రాసితిని.

  http://thinkquisistor.blogspot.com/2010/11/d.html

  నేను ఇంకొంఅం ముందుకు కథని నడిపించాను 😀


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: