ఇండియన్ రికార్డ్ డాన్సింగ్ లీగ్

ఐపిఎల్ కి ప్రత్యేక ఆకర్షణకోసం విదేశాలనుండి ఛీర్ లీడర్స్ ని తెప్పించారట. వీళ్లు లేకుండా క్రికెట్ మనలేదా? అసలు, షాహిద్ ఆఫ్రిది అన్నట్లు, జనాలకు క్రికెట్ కన్నా ఎక్కువ వినోదం ఛీర్ లీడర్స్ ఏమివ్వగలరు?

1990లలో ఆర్ధిక సంస్కరణలు మొదలయ్యాక దేశం ఎందులో పురోగమించినా లేకున్నా ఇలాంటి విషయాల్లో మాత్రం తెగ దూసుకుపోతుంది. గ్లోబలైజేషన్ పేరుచెప్పి ఒక పద్ధతి ప్రకారం జనాల్లో వినిమయ మనస్తత్వాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఒకవంక కడుపునింపుకోటానికి కోటప్పకొండ తిరునాళ్లలోనో మరోచోటో రహస్యంగా రికార్డింగ్ డ్యాన్సుల పేరిట గంతులేసేవాళ్లనీ, వేయించేవాళ్లనీ అశ్లీల నృత్యాలపేరుతో అరెస్టు చేయిస్తారు; మరోవంక బడా వ్యాపారవేత్తల అండతో ఛీర్ లీడింగ్ పేరుతో బహిరంగంగా జరిగే ఈ తంతు మాత్రం వినోదం ప్రోత్సహిస్తారు. వ్యాపారం పేరుతో ఏం చేసినా చెల్లిపోతుంది! రెండు మూడేళ్ల పాటు విదేశీ భామలను అద్దెకు తెచ్చి ఇలా ఆడిస్తారు; ఆ తర్వాత మెల్లిగా మన అమ్మాయిలనే ఇందులోకి దించుతారు. పదేళ్లు గడిచేలోగా ఛీర్ లీడింగ్ పేరుతో బట్టలిప్పి గంతులేయటాన్ని ఓ అద్భుతమయిన ఉపాధి అవకాశంగా భారతీయ టీనేజర్ల మనసుల్లో నాటుతారు. ఎవరాపుతారు దీన్ని?

ఇకపోతే, ఛీర్ లీడర్స్ బాధల గురించి వార్తాపత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వస్తున్న వ్యాసాలు, వాళ్ల మీద సానుభూతి మాటలు హాస్యాస్పదం. రెచ్చగొట్టేలా అర్ధనగ్న నాట్యాలు చేస్తే ఎవరైనా పిచ్చి వేషాలే వేస్తారు. జనాల బలహీతలను సొమ్ము చేసుకునే వృత్తిలో ఉండి అదో గౌరవప్రదమయిన ఉద్యోగమని చెప్పుకోవటం సిగ్గుచేటు. వంటినిండా బట్టలతో నాట్యం చేసే కళాకారిణులను ఎవడూ ఏడిపించటంలేదే? (అలాంటోళ్లు అసలు ఉండరని కాదు) ఇల్లు బార్లా తెరిచిపెట్టి ఊరెళ్లొచ్చి, ఆనక దొంగలు పడి మొత్తం ఊడ్చుకుపోయారని ఏడిస్తే ఉపయోగమేంటి?

కొసమెరుపు: ఈ మధ్య భాగ్యనగరంలో బీచ్ వాలీబాల్ పోటీలు జరిగాయట. ఆటగత్తెలు అతి కురచ దుస్తులు మాత్రమే వేసుకుని ఆడాలనే నిబంధన వల్ల చూడటానికి జనాలు ఎగబడి వచ్చారట. ఏదైతేనేం, టొర్నమెంట్ బ్రహ్మాడంగా విజయవంతమయింది. కాకపోతే ఎవరికీ రాని అనుమానమోటుంది. హైదరాబాద్ లో బీచ్ ఎక్కడినుండి వచ్చింది?

3 Responses to “ఇండియన్ రికార్డ్ డాన్సింగ్ లీగ్”


 1. 1 రాజేంద్ర 7:10 ఉద. వద్ద మే 14, 2008

  మంచి విశ్లేషణ

 2. 2 Wanderer 3:13 సా. వద్ద సెప్టెంబర్ 12, 2012

  ” ఒకవంక కడుపునింపుకోటానికి కోటప్పకొండ తిరునాళ్లలోనో మరోచోటో రహస్యంగా రికార్డింగ్ డ్యాన్సుల పేరిట గంతులేసేవాళ్లనీ, వేయించేవాళ్లనీ అశ్లీల నృత్యాలపేరుతో అరెస్టు చేయిస్తారు; మరోవంక బడా వ్యాపారవేత్తల అండతో ఛీర్ లీడింగ్ పేరుతో బహిరంగంగా జరిగే ఈ తంతు మాత్రం వినోదం ప్రోత్సహిస్తారు. వ్యాపారం పేరుతో ఏం చేసినా చెల్లిపోతుంది! రెండు మూడేళ్ల పాటు విదేశీ భామలను అద్దెకు తెచ్చి ఇలా ఆడిస్తారు; ఆ తర్వాత మెల్లిగా మన అమ్మాయిలనే ఇందులోకి దించుతారు. పదేళ్లు గడిచేలోగా ఛీర్ లీడింగ్ పేరుతో బట్టలిప్పి గంతులేయటాన్ని ఓ అద్భుతమయిన ఉపాధి అవకాశంగా భారతీయ టీనేజర్ల మనసుల్లో నాటుతారు. ఎవరాపుతారు దీన్ని?”

  ఇందులో ఎంతో ఆవేదన కనపడింది. I’m totally on board with you on this.

 3. 3 SNKR 7:13 సా. వద్ద సెప్టెంబర్ 12, 2012

  చాలా బాగా నిగ్గదీశారు.
  —-
  ఇగ పోతే.. /హైదరాబాద్ లో బీచ్ ఎక్కడినుండి వచ్చింది?/
  అదే హుసేన్ సాగర తీరాన, కట్ట మైసమ్మ ఆలయ ప్రాంగణాన, సంజీవయ్య పార్కులో వన్నాయిగా తెలగాన బీచీలు, గోచీలేసుకుని ఆడుడే.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 275,800

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: