ఏకగ్గీవం

అనగనగనగనగనగనగా ఆ కాలంలో రాజుగారుబోతే ఆయన కొడుక్కో, జామాతకో రాజ్జమప్పసెప్పటం ఓ పద్ధతిగా ఉండేది. అరవయ్యేళ్ల కితం గాంధీగారు తెల్లోడి కాణ్నించి సొతంత్రం లాక్కొచ్చి ఇప్పించి ‘పెజలారా, ఇయాల్టి నుండి రాజ్జాలు గీజ్జాలు బోయినయ్యి. ఇగనుండి మీరే ఈ దేశాన్నేలే రాజులు, ఇగనుండీ యాడ జూసినా పెజాసామ్మమే’ అన్నారు. కామోసుననుకున్నాం. ఇదేదో బానే ఉందిలే అనిగూడా అనుకున్నాం.

మరిప్పుడేంది. ఈ కాంగిరేసోళ్లు, తెలుగుదేసపోళ్లు ఎవురన్నా ఎమ్మేల్లేలుబోతే ఆళ్ల కొడుకులకి, పెళ్లాలకీ ఎలచ్చను లేకుండా ఆ పదవిచ్చెయ్యాలని అంటాండారు? రాజ్జాలు గీజ్జాలు బోయినయ్యని గాంధీగారు జెప్పిందంతా ఉత్తుత్తిదేనా? పైగా దీనికేదో పేరుగూడా బెట్టిండ్రు – ఏకగ్గీవమంట. అవతలోళ్ల మీద సానుబూతితో ఆళ్ల సీటు ఆళ్లింటోళ్లకే ఇచ్చెయ్యాలంట.

పైనేడుండో గానీ మారాజు ఎన్టీవోడు మాబోటి జనాలకి రాజకీయం బలే నేర్పిబోయిండు. లేకపోతే ఈళ్లు జెప్పేదంతా నిజమేనని నమ్మేటోళ్లమే. అవతలోళ్ల మీద సానుబూతా పాడా. కైరాతాబాదులో తెలుగుదేసం, తెర్లాంలో కాంగిరేసు ఓడిపోయితీరతారని ఈళ్లకి తెగ నమ్మకం. అందుకే ఈ ఏకగ్గీవం అవిడియా. ఇయన్నీ జూస్తంటే నాకో బెమ్మాండమైన సేవింగ్సు అవిడియా వచ్చింది. వచ్చే జెన్రల్ ఎలచ్చన్ల నాటికి సెంద్రబాబు, రాజ్సేకర్రెడ్డి ఓ తాన కూకొని ఏడేడ వాళ్ల పార్టీలోళ్లు ఓడిపోతారో ముందే ఓ లిస్టేసుకుని ఆడాడ ఏకగ్గీవాలకొప్పుకుంటే బోలా? మిగతా సోట్ల మాత్రమే ఎలచ్చనుబెడితే బోల్డంత సోమ్మాదా గాదా ఏంది? తాప తాపకి ఎలచ్చన్లుబెట్టి ఊకినే జనాల సొమ్ము దుబారా సెయ్యటమెండుకంటా? అహ, నాకు తెలీకడుకుతాండ. సదువుకున్నోడివిగందా. నువ్వు జెప్పు.

2 స్పందనలు to “ఏకగ్గీవం”


 1. 2 రహంతుల్లా 8:08 ఉద. వద్ద మార్చి 22, 2009

  ఏకగ్రీవ ఎన్నిక
  ఈ పద్దతి వలన లాభాలు

  1. ఎన్నికల కోసం అభ్యర్దులు, ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏకగ్రీవ ఎన్నికల ద్వారా మిగులుతుంది.
  2. ఘర్షణలు కొట్లాటలు హత్యలు ఉండవు. సామరస్య వాతావరణం నెలకొంటుంది.
  3. ప్రచారం, సారాయి లాంటి అనుత్పాదక ఖర్చులు తగ్గటమేకాక ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతిని ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించవచ్చు.
  4. అధికారుల యొక్క సమయం ఆదా అవుతుంది.
  5. అభ్యర్థుల ప్రచారం ఉండకపోవుటచే శబ్ద కాలుష్యం బాధ తగ్గుతుంది.
  మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు

  * 1952 : షేక్ షాజహాన్ బేగం పరిగి శాసనసభ నియోజకవర్గం
  * 1952 : కె.వి.పడల్ పాడేరు శాసనసభ నియోజకవర్గం
  * 1952 : ప్రకాశం పంతులు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
  * 1952 : కె.వి.పద్మనాభరాజు ఉత్తరపల్లి
  * 1952 : శ్రీరంగం చిత్తూరు శాసనసభ నియోజకవర్గం
  * 1952 : వీరాస్వామి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం
  * 1952 : పి.వి.జి.రాజు విజయనగరం శాసనసభా నియోజకవర్గం
  * 1952 : గంట్లాన సూర్యనారాయణ విజయనగరం శాసనసభా నియోజకవర్గం
  * 1955 : ఎన్.వెంకటరత్నం బూరుగుపూడి
  * 1955 : రామారావు కామారెడ్డి
  * 1955 : టి.ఎన్.వి.రెడ్డి తంబళ్ళపల్లి
  * 1956 : అల్లం కృష్ణయ్య వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం
  * 1957 : సీతాకుమారి బన్స్ వాడ
  * 1957 : పద్మనాభరెడ్డి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం
  * 1957 : పి.మహేంద్రనాద్ నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం
  * 1957 : భాట్టం శ్రీరామమూర్తి విజయనగరం శాసనసభా నియోజకవర్గం
  * 1960 : జి.డి. నాయుడు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
  * 1962 ,1972 : బి.వి.సుబ్బారెడ్డి కోయిలకుంట్ల
  * 1962 : డి.లక్ష్మీకాంతరెడ్డి ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం
  * 1962 : టి.రంగారెడ్డి ఆర్మూరు
  * 1962 : కె.పున్నయ్య ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం
  * 1962 : కె.రాంభూపాల్ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం
  * 1962 : కే.వి.రెడ్డి బోదన్
  * 1962 : ఎ.రామస్వామి వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
  * 1967 కె.లక్ష్మీనరసింహరావు జగిత్యాల శాసనసభ నియోజకవర్గం
  * 1968 ఎ.సంజీవరెడ్డి రాపూరు
  * 1968 కె.రామయ్య బూర్గుంపహాడ్
  * 1970 ఎం.ఎస్.సంజీవరావు రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం
  * 1972 ఎస్.భూపాల్ అమరచింత
  * 1972 చింతలపాటి వరప్రసాద మూర్తి ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం
  * 1972 ఎమ్.రామమోహనరావు చింతలపూడి శాసనసభ నియోజకవర్గం
  * 1972 ఎన్.రామచంద్రారెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
  * 1972 ఇ.అయ్యపురెడ్డి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం
  * 1972 ఎం.మాణిక్ రావు తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం
  * 1972 కళ్యాణ రామచంద్రరావు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం
  * 1972 జి.గడ్డెన్న ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం
  * 1972 ఎం.సుబ్బారెడ్డి నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం
  * 1972 డి.మునుస్వామి కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం
  * 1972 ఎస్.పి.నాగిరెడ్డి మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
  * 1972 వి.రామకృష్ణచౌదరి అనపర్తి శాసనసభ నియోజకవర్గం
  * 1972 పి.నర్సారెడ్డి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం
  * 1972 : అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం : మండలి వెంకటకృష్ణారావు
  * 1972 : చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం (ఆదిలాబాదు జిల్లా) : కోదాటి రాజమల్లు
  * 1972 : పెనుమత్స సాంబశివరాజు గజపతినగరం శాసనసభా నియోజకవర్గం
  * 1974 ఆర్.సురేందర్ రెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
  * 1975 ఎన్.యతిరాజారావు చెన్నూరు
  * 1981 టి.అంజయ్య రామాయంపేట
  * 2002 : దేవరకొండ శాసనసభ నియోజకవర్గం : రాగ్యానాయక్ భార్య దీరావత్ భారతి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: