ఆఁ రండి బాబూ ర్రండి. వరల్డు ఫేమస్ హాలీచెక్క నిర్మాణ సంస్థ గత శతాబ్దపు నక్క నూట పదహారు కోట్లు తగలేసి మొట్టమొదటిసారి తెలుగులో అత్యంత భారీ ఎత్తున నిర్మించిన ఈస్ట్‌మన్ కలర్ పూర్తి రంగుల సాంఘిక, సామాన్య, గణిత, తెలుగు పిక్చర్; ఆంధ్రా సీడెడ్ నైజాముల్లో నమ్మశక్యంగాని రేట్లకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించిన చిత్రరాజం; మొదటి ఆటకే కనీవినీ ఎరగని కలెక్షన్ల తుప్పరతో బాక్సాఫీసు బూజు దులిపి, చిమ్మి, అలికి, ముగ్గేసి మూడొందల ఆరు కోట్ల షేర్‌తో ముగ్గురు మూర్ఖుల రికార్డు బద్దలు కొట్టిన సూపర్ డూపర్ హిట్ సినిమా; విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయఢంకా, డప్పు, డోలు, డ్రమ్ము, ఎట్సెట్రా, ఎట్సెట్రా మోగిస్తూ శరవేగంగా జతదినోత్సవంకేసి పరుగులు తీస్తున్నటువంటి పరమాద్భుత చిత్రం ‘చేపల తొట్టి’ – నేడే విడుదల మీ అభిమాన సిన్మా హాల్లో. చూడండి. చూసి తరించండి.
ఆరంభం
08 మే 08
వీక్షణలు
- 200,679
ఇటీవలి గోడులు
పాత గోడులు
- సెప్టెంబరు 2011 (1)
- ఆగష్టు 2011 (1)
- జులై 2011 (2)
- జూన్ 2011 (1)
- మే 2011 (2)
- ఏప్రియల్ 2011 (1)
- ఫిబ్రవరి 2011 (1)
- జనవరి 2011 (1)
- డిసెంబరు 2010 (1)
- ఆగష్టు 2010 (2)
- జులై 2010 (4)
- జూన్ 2010 (1)
- మే 2010 (4)
- ఏప్రియల్ 2010 (1)
- మార్చి 2010 (4)
- ఫిబ్రవరి 2010 (4)
- జనవరి 2010 (7)
- డిసెంబరు 2009 (6)
- నవంబరు 2009 (4)
- అక్టోబర్ 2009 (6)
- సెప్టెంబరు 2009 (8)
- ఆగష్టు 2009 (10)
- జులై 2009 (3)
- జూన్ 2009 (6)
- మే 2009 (5)
- ఏప్రియల్ 2009 (3)
- మార్చి 2009 (5)
- ఫిబ్రవరి 2009 (8)
- జనవరి 2009 (5)
- డిసెంబరు 2008 (11)
- నవంబరు 2008 (9)
- అక్టోబర్ 2008 (11)
- సెప్టెంబరు 2008 (9)
- ఆగష్టు 2008 (4)
- జులై 2008 (9)
- జూన్ 2008 (11)
- మే 2008 (17)
వేడి వేడి గోడులు
వర్గ వివక్ష
మీ మాట
- Giridhar Duggirala on పసలేని కథలు
- తెలుగు భావాలు on పసలేని కథలు
- anuroop reddy on కల్కి – 2
- రామ on స్పందన
- oorodu on పసలేని కథలు
- సూటిగా > on తన్నేరు, తరిమేరు
- srinivas reddy gopireddy on పసలేని కథలు
- G on పసలేని కథలు
- సూటిగా > on శ్రీ ఏసుక్రీస్తుడు
- Diwakar Venkata on పసలేని కథలు
నా మాట
నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.




హాలీచెక్క నిర్మాణ సంస్థ గత శతాబ్దపు నక్క …..
సాంఘిక, సామాన్య, గణిత, తెలుగు ……:-))
ఎక్కడిది ఇంతకీ?
మా జన్మ ధన్యమయ్యింది కదా! చూసి తరించినందుకు…
అత్యధ్బుతం
ఏ సినిమా, ఎక్కడ? నాకేమీ అర్థం కాలేదు
> బాక్సాఫీసు బూజు దులిపి, చిమ్మి, అలికి, ముగ్గేసి…
> శరవేగంగా జతదినోత్సవంకేసి పరుగులు తీస్తున్న…
… భలే రాశారు!
Wah ! wounderful.
fantastic and wonderfully hilarious
keep going with ur “kalaaposana”…
Nice video. I wonder how you did that. Is it using the T2i video mode? I tried that last time when we went to Disney, but it came out with lot of shaking and also some scenes are really dark. I should sit with you to learn some of these tricks. I did try last weekend some natures pictures using T2i. They came out really good, but still no match to your skill level with video shooting.
ఇది మాంటరీ బే అక్వేరియం కదా. ఈ మధ్యనే చూసాం .. అక్కడకంటే మీరు షూట్ చేసినదే బావుంది. జెల్లీ ఫిష్ ఒక్కటి మాత్రం అక్కడ ఇంకా బావుంది.
ఏ క్యాం వాడారో కూడా చెబితే బావుంటుంది.
ఔను ఆ పాట పెట్టడానికి ప్రత్యేక కారణం ఏదన్నా ఉందా ?
అదే .. మాంటెరేనే. జెల్లీ ఫిష్ సెక్షన్ ఇంతకు ముందు (రెండు మూడేళ్ల క్రితం దాకా) ఇంకా బాగుండేది. ఈ మధ్య దాన్ని కుదించి ఆ జాగాలో సీ హార్సెస్ విభాగం ఏర్పాటు చేశారు.
ఆ పాటే పెట్టటానికి పెద్ద కారణమేమీ లేదు. రెహమాన్ నేపధ్య సంగీతంలో ప్రవాహంలా సాగుతుండే గుణముంటుందే .. అది జలచరాలకి సంబంధించిన ఈ వీడియోకి బాగా సూటవుతుందనిపించింది. అంతే. పాట మొత్తం పెట్టటానికి సరిపడా ఫుటేజ్ నా దగ్గర లేకపోయేసరికి ఆడియోని నిమిషం పైగా కత్తిరించాల్సొచ్చింది. రెండో చరణం మొత్తం ఎత్తేశాను – గమనించారో లేదో.
వాడింది కేనన్ టీటూఐ, మూడు లెన్సులు మార్చి మార్చి.