నిద్రాయనమః

నిద్ర సుఖమెరుగదన్నది నానుడి. రైళ్లూ బస్సుల్లో ప్రయాణాలప్పుడు - కిటికీలోనుండి పిల్లగాలి తెమ్మెర పలకరిస్తుంటే బాదరబందీలూ బాధలూ మరిపిస్తూ ఓ పక్క ముంచుకొస్తున్న నిద్రా దేవి, మరో పక్క పక్క కుదరక పాట్లు – అందరికీ ఏదో సందర్భంలో అనుభవమయ్యే సంగతే. కాసేపటికి మన ప్రమేయం లేకుండానే పక్క సీట్లో అపరిచిత ప్రయాణీకమ్మన్యుడి భుజమ్మీద తల వాలటం, అతగాడేమో చిరాగ్గా దాన్నవతలికి నెట్టటం, మనమూ తగ్గకుండా గజనీ మహమ్మదులా అయ్యదు భుజానికే గురిపెట్టి దండయాత్రలు చెయ్యటం .. మన తిప్పలెలా ఉన్నా, అవి చూసే మూడో వ్యక్తికి మాత్రం నవ్వాగకపోవటం తధ్యం.

కింది వీడియోలో బుడతడిది ఓ రకంగా అదే పరిస్థితి. అయితే పక్కన అపరిచిత ప్రయాణీకుడి బదులు సొంత సోదరుడే ఉండటం గుడ్డిలో మెల్ల. ఈ మధ్య కాలంలో ఇంత ముద్దొచ్చే వీడియో మరోటి చూడలేదు నేను (ఆల్రెడీ చూసేసినోళ్లు మళ్లీ చూడొచ్చు. తప్పు లేదు). అయ్యస్పీ అడ్మిన్ మార్తాండుడి మోములో సైతం అరనవ్వులు విరబూయించగల దృశ్యమిదని నాదీ హామీ. మరెందుకాలస్యం?

 

7 స్పందనలు నుండి “నిద్రాయనమః” కు


  1. 1 teresa 3:59 అపరాహ్నం వద్ద మార్చి 27, 2009

    ఇంతకు ముందు చూశాను గానీ మీరన్నట్లు ఎన్నిసార్లయినా చూడొచ్చు :)
    Baby videos are my all-time favorites!

  2. 2 Malakpet Rowdy 5:34 అపరాహ్నం వద్ద మార్చి 27, 2009

    Hehehehe thats cute …

    By the way .. this inspires me to post another video

  3. 4 జీడిపప్పు 9:08 అపరాహ్నం వద్ద మార్చి 27, 2009

    బాగుంది బాగుంది.
    ఆ వీడియో ఇదేనా రౌడీ గారు? http://www.youtube.com/watch?v=2T_2C9jSit0

  4. 5 ప్రవీణ్ గార్లపాటి 3:12 పూర్వాహ్నం వద్ద మార్చి 28, 2009

    యూట్యూబులో బ్లూపర్లు, ఫన్నీ వీడియోలు జూడని జనుల్ గలరే దివినన్ :-)

  5. 6 harephala 11:35 పూర్వాహ్నం వద్ద మార్చి 30, 2009

    బుడతడు ఎప్పుడు పడిపోతాడో అని టెన్షన్ తో చచ్చేను.పోన్లెండి.ఎక్కడాపడలేదు. సుఖీప్రాణి !!

  6. 7 Sai Brahmanandam 4:45 అపరాహ్నం వద్ద మార్చి 30, 2009

    “నిద్ర సుఖమెరుగదు – ఆకలి రుచెరగదు”
    బుడతడు భలేవున్నాడు.


ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 200,626

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

Follow

Get every new post delivered to your Inbox.

Join 29 other followers